Nindu Noorella Saavasam October 28 Episode 66: ఇప్పుడు చెప్పరా పొద్దున నన్ను ఎందుకు కొట్టావురా అందుకే ఇప్పుడు నిన్ను కొట్టాను అని గుప్తా అంటాడు. అయినా నిన్ను ఇంటి దగ్గరే ఉండి పని చూసుకోమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని రాథోడ్ అంటాడు. నేనెక్కడ వచ్చాను రా నువ్వు భ్రమ పడుతున్నావు అంతే ఒకసారి కళ్ళు మూసుకొని చూడు అని అంటాడు గుప్తా. అవునా అని రాథోడ్ కళ్ళు మూసుకొని రెండు నిమిషాల తర్వాత చూసేసరికి గుప్తా కనిపించడు నిజంగానే ఇదంతా బ్రహ్మాన మాట ఇంకెవరైనా చూశారా పరువు పోతుంది అనుకుంటూ రాథోడ్ వెళ్లిపోతాడు. రేయ్ ఇప్పుడు ఈరోజు అంతా నేను కనిపించిన బ్రహ్మ నే అనుకుంటావు ఇక నిర్భయంగా తిరుగుతూ ఇంటికి వెళ్లినా సరే నన్ను ఏమీ అనవురా అని గుప్తా తన మనసులో అనుకుంటాడు.స్కై కాప్స్ అంటే నాకు ఇష్టం పిల్లలు అది ఎక్కువ అని భాగమతి అంటుంది. అదే ముసలి వాళ్లు నీలాంటి వాళ్ళు ఎక్కేదమ్మా మాలాంటి ఏంజల్స్ ఎక్కేది కాదు అని అంజు అంటుంది.

ఇప్పుడు ఎలా నేను ఎక్కాలి అనుకుంటున్నాను అదేఎక్కితే మా నాన్నగారితో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని భాగమతి అనుకుంటూ ఉండగా అరుంధతి అక్కడికి వస్తుంది. అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు అని భాగమతి అంటుంది. నేను వద్దామనుకునేసరికి మీరు వెళ్ళిపోయారు చెల్లి అందుకే మీ వెనకాల వచ్చాను అని అరుంధతి అంటుంది. నువ్వు బాయ్ చెప్పడానికి వచ్చావేమో అనుకొని వెళ్లిపోయాం అక్క సారీ అని భాగమతి అంటుంది. పర్వాలేదులే చెల్లి ఎలాగైతేనే నేను కూడా వచ్చాను కదా అని అరుంధతి అంటుంది. అక్క నాకు స్కై క్యాప్ అంటే నాకు ఇష్టం అది ఎక్కుదాం పద అక్క నాకు తోడుగా ఉంటావు అని భాగమతి అంటుంది. అమ్మో చెల్లి నేను రాను అందులో కూర్చోలేను ఎందుకంటే చిన్నప్పుడు నేను అది ఎక్కి జారి కిందపడి మూతి పళ్ళు రాలగొట్టుకున్నాను అందుకే నేను అది అక్కను అని అరుంధతి అంటుంది. ఇప్పుడు ఎలా ఎప్పుడో చిన్నప్పుడు నాన్నతో ఎక్కాను అది ఎక్కితే నాన్నతో ఎక్కిన రోజులు గుర్తుకు వస్తాయని అనుకున్నాను కానీ వీళ్ళు ఏమో రావట్లేదు ఏం చేయను అని భాగమతి తన మనసులో అనుకుంటుంది.

ఇంతలో అమరేంద్ర వచ్చి నీకు ఇష్టం అన్నావు కదా పదా ఎక్కుదాం అని అంటాడు. అమరేంద్ర అలా అనగానే చాకై నిలబడి చూస్తుంది భాగమతి. ఏంటి త్వరగా పద అని అమరేంద్ర అంటాడు. వస్తున్నాను సార్ అని భాగమతి స్కై క్యాప్స్ ఎక్కుతారు వాళ్ళిద్దరూ అది పైకి వెళ్తున్నప్పుడు బాగమతి కళ్ళు తిరిగి అమరేంద్ర మీద పడుతుంది. అమరేంద్ర కోపంగా చూస్తాడు. సారీ సార్ ఏదో కళ్ళు తిరిగినట్టు అయి పడిపోయాను అని అంటుంది భాగమతి. సరే అది ఆగింది పద అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. అక్కడ భాగమతి తన మీద పడడం చూసినా అరుంధతి పరిగెత్తుకొచ్చి ఏమండీ మీరు ఇలా చేసి ఉండాల్సింది కాదు ఎందుకు ఆ అమ్మాయితోఎక్కారు తను మీద పడిన ఏమీ అనకుండా ఊరుకున్నారు ఇది నాకు నచ్చట్లేదు అని అరుంధతి అంటుంది. అమరేంద్రకు ఏమి వినపడదు కాబట్టి వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే ఏవండీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడే కూర్చోండి మనం పెద్దవాళ్ళం అండి పిల్లలు లాగా పరిగెత్తలేం కదా కిందపడితే దెబ్బలు తగులుతాయి అప్పుడు ఎవరికండి నష్టం అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. రోజు ఇంట్లో కూర్చునేదే కదా మరి అలాంటప్పుడు పిక్నిక్ రావడం దేనికి దెబ్బలు తగులుతాయి అని భయపడి అలాగే కూర్చోమంటావా అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. ఏమండీ మీరు అబ్బాయితో ఆ విషయం మాట్లాడండి అని వాళ్ళ అమ్మ అంటుంది. నన్నాడుగమంటావు ఏంటి నువ్వే అడుగు అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. ఏమండీ మీరు తండ్రి కాబట్టి మీరు అడగండి ఎందుకు వాడిని చూస్తే భయపడతారు అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది.వాడికంటే ముందు నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను వాడే నన్ను చూసి నేర్చుకున్నాడు డిస్ప్లేనంత వాడిని చూసి నేను భయపడడమేంటి వాడితో ఈరోజు ఎలాగైనా పెళ్లి విషయం మాట్లాడుతాను అని అమరేంద్ర వాళ్ల నాన్న అంటాడు.

అత్తయ్య మామయ్య మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ టైంలో ఆయనకు పెళ్లి ఏంటి అసలు మీకేమైనా కొంచమైనా మనస్తత్వం అనేది ఉందా ఇప్పుడు ఆయనకి పెళ్లి చేయాల్సిన అంత తొందర ఏమి వచ్చింది అని భాగమతి అంటుంది. కట్ చేస్తే నీలా ఆ మిస్సమ్మని చంపడానికి ప్రయత్నించాలి కదా ఆ పనిలో ఉందాం పదా అది ఎక్కడ ఉందో వెతుకుదాము అని మనోహరి అంటుంది. అమ్మగారు ఇక్కడ మనము అలాంటి పనులు చేస్తే దొరికిపోతామేమో అని నీలా అంటుంది. చంప లేకపోయినా గాయాలైన చేయాలి అది భయపడి జాబ్ మానేసి వెళ్లిపోవాలి అని మనోహరి అంటుంది. ఇంతలో అటుగా వాళ్ళ మామయ్య నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు అతన్ని చూసిన నీలా అమ్మగారు అటు ఒకసారి చూడండి మన ఇంటికి పని కోసం అని వచ్చిన అతను ఇక్కడికి వచ్చాడు ఏంటి ఎవరిని కలవడానికి వచ్చాడు అని నీలా అంటుంది. వాడు ఎందుకు వచ్చాడు మనకేం తెలిసే మన పని ఏదో మనం చేసుకుందాం పద ఆ మిస్సమ్మని వెళ్లగొట్టే ప్రయత్నం చేద్దాము అని మనోహరి అంటుంది.

అది కాదమ్మా గారు ఒక్కసారి మీరు మనసుపెట్టి ఆలోచించండి ఆరోజు మన ఇంటికి వచ్చినప్పుడు మిస్సమ్మ అనే కోపంగా చూస్తూ వెళ్లిపోయారు అంటే వీళ్ళకి ఆవిడకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని నీలా అంటుంది. పనిలో పనిగా వాడి మీద కూడా ఒక కన్నీస్ ఉంచే ఏమైనా ఉపయోగపడుతుందేమో అని మనోహరి అంటుంది. కట్ చేస్తే పిల్లలు పడిపోతారు జాగ్రత్తగా పట్టుకోండి అని భాగమతి అంటుంది. మిస్సమ్మ మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము పడతమేమో అని భయపడడానికి ఇంట్లోనే ఉండొచ్చు కదా రేపటి నుంచి ఎలాగూ స్కూలు హోమ్ వర్క్ అవన్నీ ఉండని ఉంటాయి ఈ రోజైనా మమ్మల్ని వదిలేయ్ అమ్మ అని అంజు అంటుంది. ముగ్గురు పిల్లలకి ఏదో ఒకటి సరి చెప్పొచ్చు గాని ఈ అంజుతోనే ఉంది అంతా తలనొప్పి అని భాగమతి అనుకుంటూ ఉండగా వాళ్ళ మామయ్య వచ్చి ఏంటి భాగమతి అని అంటాడు. మావయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను చూస్తే నా జాబ్ పోతుంది అని భాగమతి అంటుంది.

ఇంతలో అమరేంద్ర వచ్చి పిల్లలు మిమ్మల్ని చూసుకోమని మిస్సమ్మని పెడితే తను ఎక్కడికి వెళ్ళింది అని అమరేంద్ర అంటాడు. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది డాడీ ఎక్కడికి వెళ్ళిందో అని అమృత అంటుంది. అసలు ఈ మిస్సమ్మకి బుద్ధుందా అని అటు ఇటు చూస్తే ఒక వ్యక్తితో మాట్లాడినట్టు కనిపిస్తుంది అక్కడికి వెళ్లి అతని ఎక్స్ క్లూస్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటాడు అమరేంద్ర.ఏ రాకూడదా ఇదేమన్నా మీ ఇల్లా టికెట్ కొనుక్కొని వచ్చాను అని అతడు అంటాడు.వాళ్ళ మామయ్య తో మాట్లాడుతూ ఉండగా భాగమతి చెట్టు చాటు నుండి పారిపోతుంది అమరేంద్ర చూడకుండా.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది