Nindu Noorella Saavasam October 25 Episode 63: ఏంటే పొద్దు పొద్దున్నే నన్ను మోసే చేస్తున్నావ్ నీకేం కావాలి అని మనోహరి అంటుంది. అమ్మగారు మీరు నన్ను అనుమానిస్తున్నారా అని నీలా అంటుంది. ఏమీ లేదే పొద్దున్నే నువ్వు వచ్చి హీరోయిన్ లా ఉన్నావు అది ఇదని పొగుడుతుంటే నీకు ఏం కావాలో నన్ను మోసేస్తున్నావని అడుగుతున్నాను అంతే అని మనోహరీ అంటుంది. అమ్మగారు ఎందుకో నా కుడి కన్ను కొట్టుకుంటుంది ఏం జరుగుతుందో ఏమో అని నీలా అంటుంది. ఎప్పుడు చూసినా కుడి కన్ను కొట్టుకుంటుంది ఎడమ కన్ను కొట్టుకుంటుంది అని అంటూ ఉంటావు ఆ రెండు కళ్ళు పీకి పక్కన పెట్టేసేవే అని మనోహరి అంటుంది.

ఇంతకుముందు మీకు కన్ను కొట్టుకున్నప్పుడు పిల్లలు మిమ్మల్ని ముక్కు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు ఇప్పుడు నాకు కుడి కన్ను కొట్టుకుంటుంది కాబట్టి నన్నేం చేస్తారు అని భయమేస్తుంది అమ్మ అని నీలా అంటుంది.ఏమి చేయరు లేవే ఈరోజు ఆ మిస్సమ్మని ఎలాగైనా బయటికి పంపించేయాలి నువ్వు వెళ్లి పిక్నిక్ పోయి ఏర్పాట్లు చూడు అని మనోహరి అంటుంది. అమ్మగారు మీరు ఆ మిస్సమ్మని ఎలా వెళ్లగొడతారో చూస్తాను రేపు ఒక్కరోజే ఉంది అని నీలా వెళ్ళిపోతుంది. నీలా వెళ్ళగానే మనోహరి అద్దంలో చూసుకుంటూ నిజంగానే నువ్వు నీలా చెప్పినట్టు హీరోయిన్ లాగా ఉన్నావు నిన్ను చూసి అమర్ పడిపోవాల్సిందే అని తనలో తాను మురిసిపోతూ ఉంటుంది మనోహరి. కట్ చేస్తే అమరేంద్ర తల దువ్వుకుంటూ ఉండగా అరుంధతి అక్కడికి వెళ్లి ఏవండీ అంజు నిద్దట్లో నడుచుకుంటూ వెళ్లి మిస్సమ్మ దగ్గర పడుకుంటుంది నువ్వే అనుకొని తెల్లవారి గట్ల లేచి చూస్తే మిస్సమ్మ దగ్గర ఉన్నా ఏంటి అని బిత్తర పోయి చూస్తుంది మిస్సమ్మని ఎంత తిట్టుకుంటుందో తన పక్కనే వెళ్లి పడుకుంది చూశారా అని అరుంధతి నవ్వుకుంటుంది. అమరేంద్ర తన పని తను చేసుకుంటూ ఉంటాడు.

అవునులే నాకు నేను చెప్పుకోవాలి నాకు నేనే నవ్వుకోవాలి ఏమైనా వినపడుతుందా కనపడతానా అని అరుంధతి అనుకుంటుంది. తల దువ్వుకునే అమరేంద్ర కబోర్డ్ తీసి వాచి పెట్టుకుందామని చూసేసరికి అందులో ఒక బ్యాగు కనిపిస్తుంది ఆ బ్యాగు తీసి చూస్తే అందులో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో చూసి అమరేంద్ర బాధపడుతూ ఉంటాడు. ఆ బాధని చూడలేని అరుంధతి ఏమండీ నేను కింద ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది తనకేదో ఇనపడినట్టు. కట్ చేస్తే ఒరేయ్ కారు తుడవమని చెప్పాను కదరా ఇక్కడ ఏం చేస్తున్నావు అని రాథోడ్ అంటాడు. గుప్తా గారు మాత్రం ఏమి విననట్టు తన పని తను చేసుకుంటాడు. రేయ్ నిన్నేరా పిలిచేది మాట్లాడుతుంటే వినపడట్లేదా అని రాథోడ్ గట్టిగా అరుస్తాడు.ఏంటండీ అరుస్తున్నారు ఎవరిని ఒరే అని అంటున్నారు అని గుప్తా అంటాడు. నిన్నేరా కారు తుడవమని చెప్పాను కదా నీళ్లు పడుతున్నావేంటి అని రాథోడ్ అంటాడు. నన్ను రా అంటున్నావా చిత్రవిచిత్ర గుప్తుని అయిన నన్ను నువ్వు రా అంటున్నావా అని అంటాడు గుప్తా.

అవున్రా నిన్ను కాకపోతే ఇంకెవరినంటాను రా అని మీదకి వెళ్తాడు రాథోడ్. ఏంటి కారు తుడిచేది నువ్వే తుడుచుకో అని గుప్తా గారు కాళ్ళ మీద నీళ్లు పోస్తాడు. కాళ్ళ మీద నీళ్లు పోయగానే ఆచంప ఈ చెంప వాయిస్తాడు రాథోడ్. నన్ను కొడుతున్నావా మానవా అని గుప్తా అంటాడు. ఏంటి డౌటా అని మళ్లీ కొడతాడు రాథోడ్. ఈ మానవులకు కృతజ్ఞత అనేది లేదు మా లోకమునకు రారా ని సంగతి చూసుకుంటాను అని గుప్త అనుకుంటాడు. రేయ్ నేను వచ్చేసరికి కారు తల తల మెరిసిపోవాలి లేదంటే నా చేయి నీ చెంప మీద ఉండును అని రాథోడ్ వెళ్ళిపోతాడు.దూరంగా వాళ్ళనే గమనిస్తున్న అరుంధతి గుప్తా నీ కొట్టడం చూసి నవ్వుతుంది. ఏమియు పగలబడి నవ్వుతుంటివి బాలిక చెప్పొచ్చు కదా ఆ మానవుడికి అని గుప్తా అంటాడు. మళ్లీ రాథోడ్ వచ్చి ఏంట్రా ఎవరిని అంటున్నావు మానవుడని ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరు ఉన్నారా గాలిలో మాట్లాడుతున్నావా ఆత్మలతో మాట్లాడుతున్నావా ఏదిరా ఎక్కడరా ఆత్మ అని రాథోడ్ అంటాడు.

ఏమిటి నీ దంతములు బయటపెట్టి అలా వెకిలిగా నవ్వుతుంటివి నువ్వు కూడా వెళ్లుము లేదంటే ఆ రత్తయ్య వచ్చి మళ్ళీ చేయి చేసుకొను అని గుప్తా అంటాడు. అవును కానివ్వు పిక్నిక్ కి వెళ్లడానికి టైం అవుతుంది లేదంటే మళ్లీ వచ్చి తిడతాడు అని అరుంధతి అంటుంది. ఏమిటి నువ్వ వెలుతునవ అని గుప్తా అంటాడు. ఇప్పుడు కారుకు ఎదురు వస్తాను ఆ తరువాత వెళ్తాను అవును నువ్వు రావట్లేదా అక్కడ చాలా బాగుంటుంది అని అరుంధతి అంటుంది. నాకు అంతటి అదృష్టం ఎక్కడిది బాలిక అని గుప్తా అంటాడు. అవునులే నువ్వు ఎలా వస్తావు ఇక్కడ పనులు చూసుకోవాలి కదా అని అరుంధతి వెళ్ళిపోతుంది. వస్తా బాలిక వచ్చి నువ్వు ఆనందంలో ఆదమరిచి ఉన్నప్పుడు అంగుళీకము తస్కరించద నిన్ను మాయలోకమునకు తీసుకువెళ్లదా ఇది తథ్యం అని గుప్త అనుకుంటాడు.కట్ చేస్తే ఆకాష్ అన్ని సర్దుకున్నట్టేనా లేట్ అయిపోతుంది పిక్నిక్ కి వెళ్ళాలి కదా అని అమృత అంటుంది.అన్ని సర్దుకున్నాం అక్క ఇంకా ఏమీ లేవు అని ఆకాష్ అంటాడు.

ఆనంద్ ఎక్స్ట్రా బాటిల్ ఎక్స్ట్రా టవల్ బిస్కెట్స్ చాక్లెట్ ఇంకా ఇవన్నీ పెట్టుకున్నట్టేనా ఏమైనా మర్చిపోయారా అని అమృత అంటుంది. లేదక్కా అన్ని సర్దుకున్నాను అని ఆనంద్ అంటాడు. అయితే ఇక కిందికి వెళ్దామా అని అమృత ఆకాష్ ఆనంద్ బయలుదేరుతారు. వాళ్లు వెళ్లిపోతుంటే అక్కడే నిలబడి ఉండి అంజు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది. ఏంటి ఏం కావాలి అని అమృత అంటుంది. ఆ మాట నేను అడగాలి మీకు మీరే సర్దేసుకొని మీకు మీరే వెళ్ళిపోతున్నారు నేననే దాన్ని ఉన్నానని మీకు గుర్తులేదా అని అంజు అంటుంది. మా ముందేమో మిస్సమ్మ మీద కోపం ఉన్నట్టు కస్సుబుస్సు అంటావు ఆ తర్వాత వెళ్లి గట్టిగా పట్టుకొని పడుకుంటావు ఇదంతా యాక్టింగ్ చేస్తున్నావా అని అమృత అంటుంది. అయ్యో నేను అక్కడికి ఎలా వెళ్లి పడుకున్నాను నాకే అర్థం కావట్లేదు ఒకవేళ ఆ మిస్సమ్మ మీ దగ్గర నన్ను ఇరికించాలని నిద్ర పోయినప్పుడు తీసుకువెళ్లి తన దగ్గర పడుకోబెట్టుకుందేమో అని అంజు అంటుంది. ఏంటి మా దగ్గర నిన్ను ఇరికించడానికి మిస్సమ్మ అలా చేసింది అని అంటావా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి అని ఆకాష్ అంటాడు.

ఎన్నిసార్లు మమ్మల్ని బెదిరించావు ఆ మిస్సమ్మ మీద నాకు రివేంజ్ ఉంది తీర్చుకోవాలి అని మమ్మల్ని అన్నావు కానీ నువ్వే మిస్సమ్మ వెనకాల తిరుగుతున్నావు అని ఆనంద్ అంటాడు. సరే అయితే రండి వెళ్దాం ఇంకా మీకు కోపం తగ్గినట్టు లేదు అని అంజు వెళ్లిపోతుంది. అక్క పొట్టిది ఫీలైందంటావా అని ఆనంద్ అంటాడు. దాని బొంద ఏం ఫీల్ అవ్వదు లేరా అని అమృత అంటుంది. అన్నలము పెద్దవాళ్ళము అని చూడకుండా ఎన్నెన్ని మాటలు అన్నది అక్క ఏమైనా సరే పిక్నిక్ లో దాన్ని ఏడిపించాల్సిందే అని ఆకాష్ అంటాడు. కట్ చేస్తే భాగమతి నడుచుకుంటూ వస్తుంది అటుగా అమరేంద్ర కూడా వస్తాడు చూసుకోకుండా డాష్ ఇస్తుంది భాగమతి. అమరేంద్ర పడిపోకుండా భాగమతిని పట్టుకుంటాడు తను మాత్రం చున్నీ కింద పడిందని గొంగి తీసుకోబోతుంటే ఎక్స్క్యూజ్మీ అని గట్టిగా లాగుతాడు భాగమతిని అప్పుడు చున్ని పైకి ఎగిరి వాళ్ళిద్దరి ముఖాల మీద పడుతుంది.

అప్పుడు మనోహరి నడుచుకుంటూ వస్తూ ఉండగా చున్ని కప్పుకొని వాళ్ళిద్దరూ నిలబడటం చూసి ఎంత చేసినా దాన్ని అమరేంద్ర నుంచి దూరం చేయలేకపోతున్నానే అని గోడకేసి చేయి గుద్దుకుంటుంది. కోపంతో అమరేంద్ర ఆ చూని ని లాగేస్తాడు. సారీ సార్ చూసుకోలేదు తప్పైపోయింది అని భాగమతి అంటుంది. తప్పైపోయిందని ఒప్పుకునేది నువ్వేనా ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని అమరేంద్ర అంటాడు. నేనే సార్ అని చేతులు కట్టుకొని వంగి నిలబడుతుంది భాగమతి. ఇదంతా యాక్టింగ్ గా లేకపోతే నిజంగానే మారిపోయావా అని అమరేంద్ర అంటాడు. ఏంటండీ మనుషులులాన్నప్పుడు మార్పు ఉండదా రాదా ఎప్పుడు ఒకేలా ఉంటారా అని భాగమతి అంటుంది. సరేలే అని వెళ్ళిపోతూ అమరేంద్ర ఒక్కసారి తల గుద్దుకుందని కొమ్ములు వస్తాయి అని రెండోసారి అడగవు కదా అని అమరేంద్ర అంటాడు. అది తల అండి గోడ ఒక్కసారి గుద్దినఅందుకే తలలో పాట్లు ఉన్నాయో ఏవి పోయాయో అర్థం కావట్లేదు రెండోసారి అడిగిమరీ గుద్దిచ్చుకుంటానా అని భాగమతి తన మనసులో అనుకుంటుంది. ఏంటి ఏమో అన్నట్టు వినపడుతుంది అని అమరేంద్ర అంటాడు. ఏమీ లేదండి మీరు ముందు వెళ్తుంటే మీ అడుగుజాడల్లో వెనక వద్దమని అనుకుంటున్నాను అని వినయంగా అంటుంది భాగమతి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది