Nindu Noorella Savasam September 18th: పల్లవి గౌడ..అందానికి అందం, మంచి శరీర సౌష్ఠవము గల కన్నడ నటి. TV సీరియల్స్ చూసేవారు పల్లవిని ఠక్కున గుర్తుపడతారు మొదట కన్నడ ఈటీవీ లో ప్రసారం అయిన మనే ఒండు మూర్ అని నాటికలో 2010వ సంవత్సరంలో కథానాయికగా నటించడానికి అడుగుపెట్టింది. ఈమె బుల్లితెర ప్రేక్షకుల అభిమాన నటి .

పసుపు కుంకుమ సీరియల్‌లో బాగా యాక్ట్ చేసింది ఈ అందాల నటి. ఆ తర్వాత ‘సావిత్రి’ సీరియల్‌తో వచ్చి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయింది. .. ప సుపు కుంకుమ, సావిత్రి సీరియల్స్ చేసిన తర్వాత కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో చదరంగం, సూర్యకాంతం సీరియల్స్ లో నటించింది పల్లవి గౌడ. అయితే సీరియల్స్ తో పాటు పలు కన్నడ సినిమాలలో నటించిన పల్లవి గౌడ.. రెండు రాష్ట్రాలు, అమ్మ ఆవకాయ అంజలి లాంటి తెలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ‘నిండు నూరేళ్ళ సావాసం’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది పల్లవి గౌడ.

రెండు సీరియల్స్‌లో అమాయకంగా కనిపించిన పల్లవి ‘చదరంగం’ ధారావాహికతో విలన్ రోల్‌లో కూడా మెప్పించింది. అటు అందం ఇటు అభినయం రెండూ ఉన్న పల్లవి కి పసుపు కుంకుమ, సావిత్రి మొదలైన సీరియల్స్ చాలా పేరు తెచ్చాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా రెస్ట్ తీసుకున్న పల్లవి గౌడ.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా చేసిన సీరియల్… ‘నిండు నూరేళ్ళ సావాసం’.

పల్లవి గౌడ 20 సెప్టెంబర్ 1993 న పుట్టింది. దక్షిణ భారత సినిమాలలో బాగా ప్రసిద్ధికెక్కింది. కన్నడ, మలయాళ, తెలుగు సినిమాలలో నటించింది. అల్లియంబాల్, జోడి హక్కి మొదలైన వాటిల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

ఈమెను అప్పట్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు బ్యాన్ చేశారనే వార్తలు వినిపించాయి. వీటిపై ఈమె స్వయంగా స్పందించింది. 2011 సంవత్సరంలో తెలుగులో సావిత్రి సీరియల్ నటించడానికి పల్లవి గౌడను ఎంపిక చేసుకున్నప్పుడు, ఒక అగ్రిమెంట్లో సైన్ కూడా తీసుకున్నారట.. అగ్రిమెంట్ లో ఏముందంటే.. సావిత్రి సీరియల్ నటించేటప్పుడు వేరే ఏ ఇతర సీరియల్స్లో కూడా నటించకూడదు అన్నట్టుగా అగ్రిమెంట్ ఉంది. పల్లవి కూడా అందుకు ఒప్పుకొని సైన్ చేసింది. అయితే ఆ సీరియల్ నిర్మాతలు కూడా అదే అదునుగా తీసుకుని ఆమెకు రెమ్యునరేషన్ కూడా తక్కువగా ఇచ్చేవారట. ఇక దీంతో ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ,వేరే సీరియల్ లో నటించడానికి ఒప్పుకుంది..ఆ కారణంగా తెలుగు టీవీ ఇండస్ట్రీ బ్యాన్స్ చేసింది. ఈ విషయాల గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

“ఆ షూటింగ్‌కి వెళ్లిన తర్వాత నాకు రావాల్సిన పేమెంట్ సీరియల్ వాళ్లు ఇవ్వలేదు. దీంతో ఏంటి సర్.. ఎందుకు డబ్బులు పంపలేదు? అని అడిగాను. అయినా రోజూ అడగటానికి కూడా ఏదోలా ఉంటుంది. అందుకే అలా చేయలేదు. పేమెంట్ ఇవ్వకపోయినా 2 నెలలపాటు పని చేశాను. తర్వాత అడిగితే ఈరోజు రేపు అనేవాళ్లు. సో ఇది వర్కవుట్ అయ్యేలే లేదని చెప్పి.. మీరు ఎలాగూ నాకు పేమెంట్ ఇవ్వడం లేదు.. సో నేను వేరే సీరియల్ అయినా చేస్తాను అని చెప్పాను. దీనికి వాళ్లు ఒప్పుకోలేదు. లేదు లేదు అలా చేయడానికి లేదు.. నువ్వు అగ్రిమెంట్ సైన్ చేశావ్ కదా అన్నారు. అవును.. చేశాను కానీ మీరు పేమెంట్ ఇవ్వలేదు కదా అన్నాను.”

“ఇలా జరిగిన కొద్ది రోజుల తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. నన్ను తెలుగులో బ్యాన్ చేశారని.. అయితే పెద్దగా మాటామాటా అనుకోవడం ఏం లేదు. మెసేజ్‌లో ఇలా మాట్లాడాను.. కొద్ది రోజులకు నన్ను బ్యాన్ చేశారని ఒక మెసేజ్ వచ్చింది. ఆరు నెలలో లేక ఒక సంవత్సరమో అనుకుంట బ్యాన్.. అది కూడా సరిగా గుర్తులేదు. ఆ తర్వాత నాకు మంచి ఆఫర్ వచ్చింది. కానీ ఈ లోపు కరోనా సంక్షోభం వచ్చింది. దాని తర్వాత నేను మలయాళంలోకి వెళ్లిపోయాను. అది అయిపోయాకా కన్నడలో సినిమాలు కంటిన్యూ చేశాను. ఒక మంచి స్టోరీ వస్తే కచ్చితంగా తెలుగుకి వస్తాను అని చెప్పాను. అప్పుడే ‘చదరంగం’ సీరియల్ వచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది.” అని తన పై వచ్చిన బాన్ గురించి వివరించింది పల్లవి గౌడ. మంచి అందం అభినయం ఉన్న పల్లవికి మంచి పాత్రలు వచ్చి పెద్ద నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాము.