ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చిందట. ఈ విషయాన్ని నిత్యా మీనన్ పరోక్షంగా వెల్లడించింది. ఇప్పుడు ఈ విషయం అటు ప్రధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే.. పాజిటివ్ వచ్చిన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోను తాజాగా నిత్యా మీనన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
`అద్భుతం మొదలైంది` అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే నిత్యా మీనన్ తల్లి కాబోతోందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు..? అంటూ రకరకాల కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేయడం షురూ చేసేశారు.
అయితే మరోవైపు నిత్యా మీనన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రమోషన్ లో భాగంగానే ఈ పోస్ట్ పెట్టిందని టాక్ నడుస్తోంది. అసలు ఇంతకీ ఏది నిజం..? ఏది అబద్దం..? నిత్యా మీనన్ గర్భం దాల్చిందా..? లేక సినిమా ప్రమోషన్స్‌లో భాంగా అలాంటి పోస్ట్ పెట్టిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నిత్యా మీనన్ నోరు విప్పాల్సిందే.
కాగా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ మలయాళ సోయగం.. ఆ తర్వాత హీరోయిన్గా మారింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా సహజ నటనతోనే సౌత్‌లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. అయితే గతంలో ఈ అమ్మడు కన్నడకు చెందిన హీరోలతో ప్రేమాయణం నడిపించిందనే ప్రచారం జరిగింది. కానీ, ఎవరితోనూ ఈ బ్యూటీ పెళ్లి వరకు వెళ్లేదు.
https://www.instagram.com/p/CkP8JJyBGb4/?utm_source=ig_web_copy_link