Sudheer Babu: ఆ ఆమ్మాయి గురించి చెప్ప‌డానికి సుధీర్ బాబు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నాడు?

Share

Sudheer Babu: సూప‌ర్ స్టార్ కృష్ణ చిన్న‌ల్లుడు, మ‌హేశ్ బాబు బావ‌, ప్ర‌ముఖ హీరో సుధీర్ బాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే`లో స‌మంత‌కు అన్న‌గా న‌టించి తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సుధీర్ బాబు.. `ప్రేమకథా చిత్రమ్`తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ఈయ‌న‌.. చివ‌ర‌గా `శ్రీదేవి సోడా సెంట‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రించ‌గా.. ప్ర‌స్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ష‌న్‌లో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమా చేస్తున్నాడు.

ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అవసరాల శ్రీనివాస్, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ల‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ రావ‌డం లేదు.

అప్పుడెప్పుడో జ‌న‌వ‌రిలో టీజ‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఆ త‌ర్వాత సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఆ ఆమ్మాయి గురించి చెప్ప‌డానికి సుధీర్ బాబు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నాడు..? అస‌లు సినిమాను ఇప్ప‌ట్లో రిలీజ్ చేస్తారా..? లేదా..? అన్న అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. మ‌రి ఇప్ప‌టికే మేక‌ర్స్ కాస్త మేల్కొని సినిమాపై ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

21 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

30 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago