యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత `ఆర్ఆర్ఆర్` మూవీతో ప్రేక్షకులను పలకరించారీయన. రాజమౌళి రూపొందించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాదు.. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ను సైతం తెచ్చిపెట్టింది. ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.
ఎన్టీఆర్ కెరీర్లో తెరకెక్కబోయే 30వ చిత్రం కావడంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాదే అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ మూవీ నిర్మితం కాబోతోంది. కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం.. ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉంది. కానీ, అది జరగలేదు. అప్పుడు, ఇప్పుడు అని వార్తలు వస్తున్నాయి. అయినా ఈ మూవీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట.
జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా వేయబడిన సెట్లో ఫస్టు షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. ఇదే ఫైనల్ అని బలంగా టాక్ వినిపిస్తోంది. కాగా, హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో అలరించబోతున్నారు. హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…