SDT15: యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “RRR” తో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమా రాకముందు వరకు సౌత్ లో తారక్ హవ కొనసాగేది. కానీ “RRR”తో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించాడు. ఒకపక్క మంచి పేరు వస్తున్నా గానీ మరోపక్క తోటి హీరోల సినిమాల విషయంలో తన వంతు సహాయం అందిస్తూ.. ప్రమోషన్ కార్యక్రమాలలో తారక్ జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ రీతిగానే తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ … కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న…SDT15 టైటిల్ గ్లింప్స్ ఈనెల 7వ తారీకు ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వీడియోకి యంగ్ టైగర్ వాయిస్ ఇచ్చాడని తారక్ రిలీజ్ చేయనున్నట్లు.. స్పష్టం చేసింది. గతంలో ఇదే రీతిగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా “ఉప్పెన” ట్రైలర్ తారక్ రిలీజ్ చేశాడు. 2021 స్టార్టింగ్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
మెగా హీరోలలో ఫస్ట్ సినిమాతో వైష్ణవ తేజ్ మాదిరిగా హిట్టు కొట్టిన వారు ఒక్కడు కూడా లేదు. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయిధరమ్ తేజ్ సినిమాకి.. సంబంధించి ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వటంతో.. కచ్చితంగా ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని సెంటిమెంట్ గా మెగా ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. ఏదిఏమైన “RRR” తర్వాత తారక్ మెగా అభిమానులకు బాగా దగరావడం విశేషం.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!