21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News సినిమా

`ఎన్టీఆర్ 30`లో తార‌క్ పాత్ర అదేనట‌.. వైర‌ల్‌గా మారిన క్రేజీ న్యూస్‌!

Share

ఈ ఏడాది ఆరంభంలో `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న‌ట్లు ఎప్ప‌డో ప్ర‌క‌టించారు. తార‌క్‌కు ఇది 30వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌బోతున్నారు. ఎప్పుడో ఈ సినిమాను ప్ర‌క‌టించినా.. ఇప్ప‌టివ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు. కానీ, వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ntr 30 movie update
ntr 30 movie update

పైగా ఈ సినిమాకు రోజుకో వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ మూవీలోని తార‌క్ పాత్ర‌పై ఓ క్రేజీ న్యూస్ వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో తార‌క్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నాడ‌ట‌. అలాగే ఆయ‌న పాత్ర‌ను కొర‌టాల ఎంతో స్పెష‌ల్‌గా డిజైన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది కూడా ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే ర‌ష్మిక, కీర్తి సురేష్‌, మృణాల్ ఠాకూర్ పేర్లు రేసులో ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రిని కొర‌టాల ఫైన‌ల్ చేయానున్నార‌నే టాక్ ఉంది.


Share

Related posts

Vijay : విజయ్ రంగంలోకి దిగితే.. అవుట్ పుట్ ఇలాగే ఉంటుంది..!

Teja

హీరోలకంటే మేమేందులో తక్కువ .. రష్మిక సెన్షేనల్ కామెంట్స్ ..?

GRK

 పూజా హెగ్డే రోజులు లెక్కపెడుతుందా .. బాలీవుడ్ సినిమాలకోసమేనా ..?

GRK