నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `బింబిసార`. వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె నిర్మించారు. ఇందులో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.
వెన్నెల కిశోర్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో తెరకెక్కుతున్న తొలి ఫాంటసీ అండ్ అడ్వెంచర్ చిత్రమిది ఇది. ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
ఎన్టీఆర్‌కు పోటీగా నన్ను దింపారు.. ఆ విషయంపై నోరు విప్పిన తారకరత్న
అయితే మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేయబోతున్నారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. `బింబిసార` ప్రివ్యూను తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీక్షించారట. ఈ మూవీ చూసిన అనంతరం అన్న కళ్యాణ్ రామ్‌ను మరియు చిత్ర యూనిట్‌పై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారట.
ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని, వైవిధ్యమైన కథతో వస్తోన్న తన అన్న కళ్యాణ్ రామ్ సక్సెస్ అవ్వడం ఖాయమని ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశాడట. తమ్ముడి మాటలతో కళ్యాణ్ రామ్‌లో మరియు మూవీ టీమ్‌తో ఉత్సాహం మరింత పెరిగిందని తాజాగా ఓ టాక్ బటయకు వచ్చింది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!