Nuvvu Nenu prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అందరి ముందు నటిస్తూ ఉంటారు. పద్మావతి చిలకమ్మతో, అబద్ధం చెప్తుంది. అను ఆర్యాలు, సంతోషంగా గడుపుతారు. చిలకమ్మ కి పద్మావతి మీద అనుమానం వస్తుంది. చిలకమ్మ కనిపెట్టిన నిజాన్ని పార్వతి తో చెబుతుంది.

ఈరోజు 403 వ ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీ అను ఆర్యాలు ఇంటికి బయలుదేరుతారు. చిలకమ్మా పార్వతితోవిక్కీ పద్మావతి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, వారికీ శోభనం జరగలేదు అని, వాళ్లు గదిలో ఒకలాగా, వుంటూ బయట అందరి ముందు నటిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో గొడవ జరిగిందమ్మా అని చెప్తుంది చిలకమ్మ పార్వతి తో, అసలే పెద్దయ్య గారితో గొడవపడి పెద్దమ్మ గారు ఏడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఆయన గారితో కూడా ఏదో గొడవ జరిగినట్టు ఉండాలి ఇక అక్కడ కూడా ఆమె బాధ పడుతూనే ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పుడే నేను పెద్దయ్య గారితో చెప్తాను అని అంటుంది చిలకమ్మా. పార్వతి ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి ఎవరికి తెలియడానికి వీల్లేదు అసలు ఈ విషయం మొత్తం నేను కనుక్కున్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని అంటుంది చిలకమ్మతో, చిలకమ్మ సరే అంటుంది.
Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ అక్క గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పద్మావతి విక్కీ ఇద్దరినీ కలపాలనుకున్న ఆర్య..
పద్మావతి విక్కీ ఇద్దరు కారెక్కినప్పటి నుంచి ఏదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉంటారు. ఆర్య వాళ్ళిద్దరిని చూసి, వీళ్ళిద్దరూమళ్లీ ఏదో గొడవ పడినట్టు ఉన్నారు అని అంటాడు. ఆర్య కారుని సైడ్ కి తిప్పగానే పద్మావతి వికీ మీద పడుతుంది. విక్కి ఒకసారి గా అరుస్తాడు పద్మావతిని. నేనేమన్నా కావాలని మీ మీద పడ్డానా ఏంటి అని అంటుంది పద్మావతి. సరిగ్గా కూర్చోడం రాదా అని అంటాడు విక్కీ. పద్మావతి ఆర్య ని పాటలు పెట్టమని అడుగుతుంది. ఆర్య ఒక పాట ప్లే చేయగానే వెంటనే, పద్మావతి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది అది చూసి విక్కీ, కావాలనే ఫోజ్ కొడుతుంది చెప్తా ఉండు నీ పని అని ఆర్య అని పాటలు ఆపేయమంటాడు. పద్మావతి టెంపర నువ్వు కావాలనే చేస్తున్నావు కదా అని అంటుంది మనసులో, ఆర్య ఇద్దరి మధ్య గొడవని ఎలాగైనా సత్యమని ఎలా చేయాలని కారుని యూటర్న్సు తిప్పుతూ ఉంటాడు. పద్మావతి వికీకి తగిలినప్పుడల్లా ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. ఆర్య రోడ్డు ఎలా ఉందో చూసి పోనివ్వురా అని అంటాడు విక్కీ. కార్ ఎలా నడపాలో తెలియదా అని అంటాడు. వానలికి రోడ్డంతా పాడైపోయింది రా అందుకని అని అంటాడు ఆర్య. విన్నారు కదా అందుకని నేనేం కావాలని మీ మీద పడట్లేదు అంటుంది పద్మావతి. నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది హరియా తొందరగా వేరే రూట్ లో అయినా పోనీవ్వు అని అంటాడు విక్కీ. ఇప్పుడు కార్ ఆగిపోతే బాగుండు అని అనుకుంటుంది పద్మావతి అది విక్కీకి వినపడేలా అంటుంది.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

విక్కీ వాచీ దానం చేసిన పద్మావతి..
పద్మావతి కా రాగిపోతే బాగుండు అనుకోగానే ఒకసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు ఆర్య. ఏమైందిరా కార్ ఆపావని అంటాడు విక్కీ. నేను ఆపలేదు రాదే ఆగింది అని అంటాడు ఆర్య. కిందకి దిగి చూస్తాను ఉండు అని కారు దిగి ఆర్య చూస్తూ ఉంటాడు విక్కీ పద్మావతి అను అందరూ కార్తీకి కార్ బాగవుతుందా లేదా అని చూస్తూ ఉంటారు. పద్మావతి మిరపకాయల బజ్జి వాసన వస్తుంది వెంటనే దగ్గరలో ఎక్కడో బండి ఉంది అనుకొని వెతుక్కొని అక్కడికి వెళుతుంది. మిరపకాయలు బజ్జీలు తింటూ ఉంటుంది. ఈలోగా ఆర్య కార్ స్టార్ట్ అయింది అని చెప్తాడు. విక్కీ పద్మావతి ఎక్కడ అని అంటాడు. అను ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అని అందరూ పద్మావతి కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే ఆర్య పద్మావతి మిరపకాయలు బజ్జీలు తింటుంది అని చూపిస్తాడు వెంటనే అందరూ అక్కడికి వెళ్తారు. నువ్వెక్కడున్నావా పద్మావతి నీకోసం చాలా వెతికాము. మిరపకాయలు బజ్జీలు కనపడితే తిందామని వచ్చాను బావగారు మీరు కూడా తినండి చాలా బాగున్నాయి అని అంటుంది. మా వాళ్లందరికీ కూడా మిరపకాయలు బజ్జీలు ఇవ్వు అని చెప్తుంది. అందరూ మిరపకాయలు బజ్జీలు తింటారు విక్కీ నాకు ఆఫీస్ కి టైం అవుతుంది అర్జెంటు మీటింగ్ ఉందని చెప్పాను కదా అని అంటాడు. బాగా ఆకలిగా వేస్తుంది అయినా మిరపకాయ బజ్జీలు కనపడితే తినకుండా వెళ్ళకూడదు అందుకే తింటున్నాను అని అంటుంది పద్మావతి. అను ఆర్య తినేసి మేము కారు దగ్గర వెయిట్ చేస్తుంటాం మీరు రండి అని, అంటారు. పద్మావతిని డబ్బులు అడుగుతాడు బండి వాడు. మా ఆయన పక్కనే ఉంటే నన్ను డబ్బులు అడుగుతున్నావేంటి అని,శివ స్వామి ఆయనకి డబ్బులు ఇవ్వాలి దుడ్లు ఇచ్చేసేయ్ అని అంటుంది.పరిస్థితి చూస్తే విక్కీ పర్స్ లో డబ్బులు ఉండవు కార్డు ఉంది అని అంటాడు కార్డులు మాకు ఎందుకయ్యా డబ్బులు ఇవ్వండి అంటాడు బండి వాడు. ఇప్పుడెలాగో నా దగ్గర డబ్బులు లేవే అని అంటాడు విక్కీ. మీ వాచి ఇటు ఇవ్వండి ఒకసారి అని పద్మావతి వాచీ తీసుకొని ఆ బండి వాడికి ఇచ్చేస్తుంది అది చాలా కాస్ట్లీ వాచీ అని అంటాడు ఇట్లాంటి మీరు చాలా కొనుక్కోగలరు అని అంటుంది పద్మావతి ఆ బండి వాడు చాలా సంతోషపడతాడు.

కుచలని దయ్యం అన్న నారాయణ..
కుచల ఫుల్లుగా మేకప్ వేసుకొని, హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ నా గ్లామర్ ని ఎంతగానో పెంచుతుంది. అని అనుకుంటూ వచ్చి హాల్లో ఉంటుంది. అరవింద పూలు కోసుకొని వస్తుంది. నారాయణ అరవిందను చూసి నీకు ఎందుకమ్మా ఈ పనులన్నీ ఎవరో కళ్ళు చేస్తారు కదా న్యూ రెస్ట్ తీసుకో అని అంటాడు పర్వాలేదు బాబాయ్ మన పని మనం చేసుకుంటే ఏముంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుండగా అప్పుడే కూచలను చూసి ఇద్దరు ఒక్కసారిగా అరుస్తారు. కుచేల కూడా వాళ్ళని చూసి అరుస్తుంది ఏంటే పొద్దున్నే ఈ అవతారం దయ్యంలాగా, నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటే దయ్యం అంటారు ఏంటి అని అంటుంది. సడన్ గా చూస్తే భయమేసింది పిన్ని అని అంటుంది అరవింద. అయినా ముఖానికి పేడ పూసుకోపోతే కాస్తంత పసుపు రాసుకోవచ్చు కదా అంటాడు నారాయణ. నువ్వు ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ లోనే ఉన్నావు ఇది ఇప్పుడు న్యూ ట్రెండ్, మీరు కూడా వస్తే మీకు కూడా రాస్తాను అంటుంది ఇద్దరూ మాకొద్దంటే మాకొద్దని తప్పించుకుంటారు. అయినా పిల్లలు ఎక్కడ దాక వచ్చారు ఫోన్ చేసావా అని అంటాడు నారాయణ. కుచల నేనేం కనుక్కోలేదు అని అంటుంది పెద్ద దానివి ఇంట్లో అలాంటివి కనుక్కోవాలి అని తెలియకుండా ఇలా మేకప్ వేసుకొని తిరుగుతున్నావా అని అంటాడు అప్పుడే అరవిందా నేను కనుక్కున్నాను బాబాయ్ వాళ్ళు ఇంకో అరగంటలో వచ్చేస్తారు అని అంటుంది చూసావా నువ్వు ఇలా మేకప్ వేసుకోబట్టే చిన్న పిల్లలు నీ పని చేస్తున్నారు. తను కనుక్కుంటుందని నేను కనుక్కోలేదు అని అంటుంది కుచల. సరే పదమ్మా అరవిందా దీంతో మనకెందుకు అని అరవింద్ అని లోపలికి తీసుకెళ్తాడు నారాయణ.

కృష్ణ మరో ప్లాన్..
కృష్ణ బట్టలు సర్దుకుంటూ ఉంటాడు అరవింద వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది. కృష్ణ మనసులో ఇక్కడ ఉంటే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను. దూరంగా ఉండి నా చేతికి మట్టి అంటకుండా అనుకున్నవన్నీ చేయాలి. అని మనసులో అనుకోని అరవిందతో బయటకు వెళ్తున్నాను నాలుగు రోజులు ఊరికి అని అంటాడు. అర్జెంటు పని ఉంది రానమ్మ హైదరాబాదు వెళ్లాలి. చాలా ఇంపార్టెంట్ పని అయిపోగానే వస్తాను అని అంటాడు. దగ్గర్లో వరలక్ష్మీ వ్రతం ఉంది ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళిపోతే ఎలాగో అని అంటుంది.నన్ను ఆపాలని చూడకు రానమ్మ అని కిందకు వస్తాడు బ్యాక్ తీసుకొని, అది కాదు నేను చెప్పేది వినండి అంటుంది అరవింద నారాయణ ఏంటమ్మా అల్లుడు ఎక్కడికి బయలుదేరారు అని అంటాడు. హైదరాబాద్ వెళ్తున్నారు బాబాయ్ పనిమీద నేను వద్దన్నా వినడం లేదు అని అంటుంది అరవింద. చెప్పాను కదరానమ్మ నువ్వు చెప్పినా నేను ఆగేటట్టు లేను వెళ్లాల్సిందే అని అంటాడు. అప్పుడే విక్కీ ఆర్య ఇద్దరు లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇదేంటి వీళ్ళు వచ్చేలోపు వెళదాం అనుకుంటే వీళ్ళు వచ్చేశారు అని మనసులో అనుకుంటాడుకృష్ణ.విక్కీ మా అక్క వద్దు అని చెప్తున్నా బయలుదేరుతున్నారు ఎక్కడికి అని అంటాడు. నాకు అర్జెంటు పని ఉంది వెళ్తున్నాను అంటాడు కృష్ణ. మా అక్క కంటే ఇంపార్టెంట్ పనా, నిన్నే బావ అడుగుతుంది మా అక్క కన్నా ఇంపార్టెంట్ పని ఉందా అని అంటాడు. ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాను నాకు సొంతంగా ఎదగాలని పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా, ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ పెడదామనుకుంటున్నాను అని అంటాడు కృష్ణ. నారాయణ సడన్గా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అల్లుడుగారు మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అంటాడు. నిన్ను ఎప్పుడైనా పరాయిని వాళ్ళ చూసామా మాకన్నా ఎక్కువగానే చూసాం కదా అంటుంది కుచల. నిన్ను వదిలి అక్క అసలు ఉండలేదు బావ నువ్వు వెళ్లడానికి వీలు లేదు అంటాడు ఆర్య. నేను వెళ్లాలనుకుంటుంది మీ అక్క ఆనందం కోసమే అంటాడు కృష్ణ. మాకు కాదు నీకు సరిగ్గా అర్థం కావట్లేదు. నీకు ఆలోచన ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్లాలనుకుంటున్నావో నాకు అనవసరం. నాకు మా అక్క సంతోషం మాత్రమే ముఖ్యం. అయినా నువ్వు బయటికి వెళ్లి బిజినెస్ చేసి ఎంత సంపాదిస్తావ్, లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఎంత సంపాదిస్తావు, నీకు డబ్బులే కావాలనుకుంటే నేను ఇస్తాను బావ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు మా అక్క దగ్గరే ఉండి మా అక్కను చూసుకోవాలి. అవును అల్లుడుగారు మీరు మా దగ్గర ఉండడమే ముఖ్యం, విక్కి చెప్పింది బావుంది అని అంటాడు నారాయణ. నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు బావ అంటాడు ఆర్య. అరవింద నువ్వేం కంగారు పడకు కృష్ణ ఎక్కడికి వెళ్లట్లేదు అంటుంది కుచల. ఈ విషయాన్ని తెగేవరకు కాకపోవడమే మంచిది అనుకొని మనసులో కృష్ణ సరే నేను ఎక్కడికి వెళ్ళనులే రానమ్మ అని అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో, అరవింద పద్మావతి దగ్గరికి వస్తుంది. మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారా అని అడుగుతుంది. అవును సంతోషంగానే ఉన్నాము ప్రేమించి పెండ్లి చేసుకున్నాం కదా సంతోషంగానే ఉన్నాం అని అంటుంది పద్మావతి. మేము ఒకరి వదిలిపెట్టి ఒకరం ఉండలేము అని అంటుంది. దూరం నుంచి కృష్ణ విని పద్మావతి దగ్గరికి వచ్చి నటించక పద్మావతి నువ్వు విక్కీ అసలు పడదు అట్లాంటిది మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటారు అని అంటాడు. అది మీరు ఎలా చెప్పగలరు నేను ఆయన ప్రేమించాను పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు సంతోషంగానే ఉన్నాము, అని కృష్ణతో అంటుంది పద్మావతి.