Nuvvu Nenu prema: నిన్నటి ఎపిసోడ్ లో,విక్కీ పద్మావతి అనువార్యాలు ఇంటికి తిరిగి వచ్చేస్తారు. పద్మావతి వికీల మధ్య ఏదో గొడవ జరిగినట్టు చిలకమ్మ పార్వతి తో చెబుతుంది. పార్వతీ విషయం మన మధ్యనే ఉండాలని చిలకమ్మ దగ్గర మాట తీసుకుంటుంది. విక్కీ వాళ్ళు ఇంటికి వచ్చేలోపు కృష్ణా ఇంటి నుండి బయటికి వెళ్లాలి అని అనుకుంటాడు.

ఈరోజు 404 వ ఎపిసోడ్ లో,కృష్ణ ప్రయాణానికి విక్కీ అడ్డుపడతాడు. మా అక్క కన్నా నీకు ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి బావ డబ్బులు కోసమే నువ్వు విడిగా బిజినెస్ పెట్టాలనుకుంటే అది నేనే ఇస్తాను మా అక్కని చూసుకుంటూ ఇక్కడే ఉండు అని అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ నచ్చ చెప్పడంతో కృష్ణ మరీ దీన్ని ఎక్కువగా నేను ముందుకు తీసుకెళ్తే అసలుకే మోసం వస్తుంది అని మనసులో అనుకొని సరే అని ప్రయాణాన్ని ఆపేసుకుంటాడు.

పద్మావతిని కాపాడిన విక్కీ..
నారాయణ విక్కీని చూస్తూ ఇద్దరు ఎట్లా ఉన్నారు అని పలకరిస్తారు.బాగున్నాము అని చెప్తాడు ఆర్య.వెంటనే కుచలఏం బాగుంటాడు చూడండి విక్కీని ఆర్య ని ఎలా సన్నబడిపోయారో అందుకే లేని వాళ్ళింట్లో పెళ్లి సంబంధం చేసుకోవద్దు అని అన్నాను అని అంటుంది. వెంటనే నారాయణ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు నువ్వు సైలెంట్ గా ఉండు వాళ్ళు బానే ఉన్నారు సంతోషంగానే ఉన్నారు. మీరిద్దరూ వెళ్లి ఫ్రెష్ అవ్వండి రా మీ అమ్మ అలానే అంటుంది అని అంటాడు నారాయణ. విక్కీ పద్మావతి ఇద్దరు రూమ్ లోకి వెళ్లబోతూ ఉండగా పద్మావతి మెట్లమీద కాల్ జారి పడబోతుంది వెంటనే అరవింద పద్మావతి అని అరుస్తుంది అప్పుడే అక్కడే ఉన్న విక్కీ పద్మావతిని పట్టుకుంటాడు పడిపోకుండా, ఇదంతా కృష్ణ చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటాడు. మిగిలిన అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కృష్ణ మనసులో, ఇది చూడలేక నేను ఇకనుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ కుదరలేదు అని అనుకుంటాడు.విక్కీ పద్మావతి ఇద్దరి ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టుగా ఉంది.అవును బాబాయ్ మీరన్నది కరెక్టే వాళ్ళ ప్రేమను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని అంటుంది అరవింద.
Nuvvu Nenu prema: కుచులని చూసి భయపడిన నారాయణ,అరవింద.. కృష్ణ ప్లాన్ కి అడ్డుపడిన విక్కీ..

పార్వతి బాధ..
పార్వతి బాధపడుతూ ఉంటుంది చిలకమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది.విక్కి పద్మావతి ఇద్దరూ, వేరువేరుగా ఉంటున్నారు వాళ్ళ మధ్య ఏదో జరిగింది అని చిలకమ్మ చెప్పిన మాటలు విని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది పార్వతి. ఆండాలు పార్వతి దగ్గరికి వచ్చి ఏంటి ఏడుస్తున్నావు అని అడుగుతుంది. నిజం చెప్తే మీరిద్దరూ తట్టుకోలేరు అని మనసులో అనుకొని ఏం లేదండిఅని అంటుంది పార్వతి.మనసులో ఏదో చెప్పుకోలేని బాధ ఉన్నది అదేందో నాకు చెప్పు పార్వతి అంటాడు భక్త. అందరూ ఉండి కూడా పద్మావతి మళ్లీ ఒంటరిదైపోయిండేది. తన బాధను విని ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ తన బాధను పట్టించుకునే వారు లేరు అక్కడ లేరు అని, తను ఒక్కతే తనకొచ్చిన కష్టాన్ని తలుచుకొని ఎంత కుమిలి పోతుందో ఏంటో అని అంటుంది. పార్వతి నీకు ఇంతకు ముందే చెప్పానుమనకి అను మాత్రమే కూతురు అని,అట్లా అంటావేంటి పద్మావతి కూడా మన కూతురే అంటుంది.ఎప్పుడైతే మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుందో అప్పుడే అది నా కూతురు కాదు ఒక్కొక్కసారి నేను అను కన్నా పద్మావతిని ఎక్కువ గారాబంగా పెంచాను కానీ అది చేసిన పనికి నేను తనని మర్చిపోవాల్సి వచ్చింది ఇది నేను చచ్చేదాకా ఈ బాధ పోదు పార్వతి అంటాడు భర్త. కనీసం తనకి ఒక అవకాశం ఇచ్చి తను ఏం జరిగిందో చెప్పే, అవకాశాన్ని కూడా మీరు ఇవ్వట్లేదు అని అంటుంది. అది ఎప్పటికీ జరగదు పార్వతి అంటాడు భక్త. ఎప్పటికైనా నేను తనతో మాట్లాడతాను అని నువ్వు అనుకుంటే తనే కాదు నువ్వు కూడా నా నన్ను బాధ పెట్టిన దానివి అవుతావు. మర్చిపోయిన వాళ్ళని మళ్లీ గుర్తు చేయాలని చూడమాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భక్త. నిజం చెప్పలేక పార్వతీ పద్మావతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాస మా పద్మావతి కి నువ్వే అండగా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఆండాలు వాడి ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా వాడి ముందు ఎప్పుడూ పద్మావతి గురించి మాట్లాడకు అని అంటుంది.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

విక్కీ పద్మావతి, గొడవ..
విక్కీ పద్మావతి ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వస్తారు. స్నానానికి వెళ్దామని విక్కీ బయలుదేరగా అప్పుడే పద్మావతి కూడా బయలుదేరుతుంది. నేను ముందు స్నానం చేస్తాను అని అంటుంది కాదు నేనే స్నానం చేయాలి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. అర్జెంటుగా రెడీ అవ్వాలి అని అంటాడు. అయినా ఇప్పుడు మీరు చెప్పింది వినాలా, నేను చెప్పినట్టు కూడా వినొచ్చు అని అంటుంది పద్మావతి ఒకసారి రూమ్ లో ఏం చెప్పావో గుర్తు చేసుకో అని అంటాడు విక్కీ. పద్మావతి వాళ్ళింట్లో ఇది మా ఇల్లు కాబట్టి నేను చెప్పిన తినాలి అని అంటుంది ఆ మాటకి విక్కీ ఇది మా ఇల్లు కాబట్టి నువ్వు కూడా నేను చెప్పినట్టు వినాలి అని అంటాడు. పద్మావతి ఇది మీ ఇల్లు కాబట్టి మీరు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మా అమ్మ నాయన లేరు నేను ఏం చేసినా ఇక్కడ బాధపడే వాళ్ళు లేరు, ఉంటే గింటే మీ వాళ్ళు మళ్లీ ఎందుకు పద్మావతి అలా ఉంది అని అడుగుతారు అప్పుడు మీరే నిజం చెప్పాల్సి ఉంటుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని, విక్కీ అనగానే,నాకు అంత అవసరం ఏముంది స్వామి మీ ఇష్టం మీరు నాకు నచ్చినట్టు ఉండమంటారా లేదంటే మీరు నేను చెప్పినట్టు వింటారా? చాయ్స్ యువర్ అని అంటుంది. ఏమంటున్నావ్ అని విక్కీ కట్టబోగా ఎందుకు ఆవేశపడుతున్నారు. మీరంతా ఆవేశపడ్డ నేను చెప్పాలనుకున్నది చెప్పాను. విక్కీ మనసులో పద్మావతి గురించి నిజం తెలిస్తే అక్క తట్టుకోలేదు ఈ పద్మావతి అన్నంత పని చేస్తుంది. ఎందుకు తని చెప్పినట్టుగానే విందాము అని మనసులో అనుకుంటాడు. స్నానానికి నువ్వే వెళ్లి ముందు నేను వెయిట్ చేస్తాను అని అంటాడు.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

అను నీ అవమానించిన కుచల..
కుశల వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. గొప్పలు చెప్పుకుంటూ పారని మాత్రమే వాడతాను ఇండియా బ్రాండ్స్ వాడను అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వాళ్ళ పని అమ్మాయి వచ్చి నాకు రెండు రోజులు సెలవు కావాలమ్మా అని అడుగుతుంది. నీకు ఇప్పుడు లీవ్ కావాలా అని అనుకుంటూ ఉండగా అను కాఫీ తీసుకొని వస్తుంది. అనుకి చుక్కలు చూపించి నా చెప్పు చేతుల్లో పెట్టుకోడానికి ఇదే మంచి సమయం అని పనమ్మాయికి, రెండు రోజులు ఏం కర్మ 10 రోజులు వెళ్లి ఊరికి అని పంపించేస్తుంది. ఇంకా నువ్వు తో ఇప్పుడు చెప్తా నేను ఈ పని అని మనసులో అనుకుంటుంది. వెంటనే అనుని ఇట్లా రా అని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. పనిమనిషి 10 రోజులు పనిలో రాదు ఈ క్షణం నుంచి ఇంట్లో పని వంటింట్లో పని నా పనులు కూడా నువ్వే చేయాలి. అలాగే అత్తయ్య అని అంటుంది అను. రాత్రి డిన్నర్ కి ఎవరెవరికి ఏం కావాలో చెప్తాను రాసుకో అని అంటుంది. కావాలని కుచలా అనుని ఏడిపించడానికి ఇంట్లో ఒక్కొక్కళ్ళకి రెండు రెండు రకాలు చొప్పున వంట చేయమని చెప్తుంది.నీకు మీ చెల్లికి అన్నం పప్పు సరిపోతాయిలే మీకు రిచ్ ఫుడ్ తిని అలవాటు లేదు కదా అని అంటుంది వెంటనే అని చాలా ఫీల్ అవుతుంది. నేను చెప్పిన ఐటమ్స్ అన్ని ఫాస్ట్ గా చేసి నన్ను పిలువు అని అంటుంది అను అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యకపోతే అప్పుడు చెప్తాను అను గురించి అని అనుకుంటుంది.

పద్మావతి దగ్గర నిజం రాబట్టాలనుకున్న అరవింద..
పద్మావతి దగ్గరకు అరవింద వచ్చి ఇప్పుడు మీరంతా హ్యాపీగానే ఉన్నారు కదా అని అంటుంది. పద్మావతి ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అదే విక్కీ నువ్వు సంతోషంగానే ఉన్నారు కదా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది అరవింద. అరవింద బాధపడకూడదని అనుమానం రాకుండా ఉండాలని పద్మావతిమేము బానే ఉన్నాము అని చెప్తుంది.అయినా అలా ఎలా అడుగుతున్నారు అరవింద్ గారు మేము చాలా బాగున్నాము. మా ఆయన మీ తమ్ముడు విక్కీమన్నను బాగా చూసుకుంటున్నాడు. నా కంట్లో చిన్ని కన్నీటి చుక్క వచ్చిన తల్లడిల్లిపోతాడు. నిజం చెప్తున్నాను అరవింద్ గారు మీరేం అనుమానం పెట్టుకోకండి నేను మా ఆయన సంతోషంగానే ఉన్నాము మా మధ్య ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు, నేను కనిపించకపోతే పద్మావతి పద్మావతిని వెతుకుతూనే ఉంటాడు. అని పద్మావతి అంటుంది.
Krishna Mukunda Murari: స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన గగన్ చిన్నప్ప(మురారి )
అరవింద కు థాంక్స్ చెప్పిన పద్మావతి..
పద్మావతి విక్కి గురించి ఎలా చెబుతూ ఉండగానే మధ్యలోనే అరవిందా ఆపుతుంది.అరవిందా నువ్వేం మాట్లాడుతున్నావ్ పద్మావతి నేను ఏమి అడిగాను నువ్వు ఏం చెప్తున్నావు నేను మీ నాన్నగారు 16 రోజులు పండక్కి వెళ్లారు కదా నీతో మాట్లాడారా బానే ఉన్నారా అని అడుగుతున్నాను అని అంటుంది. అనవసరంగా నేను విక్కీ గురించి మాట్లాడాను అని అనుకుంటుంది పద్మావతి. నిన్నే పద్మావతి అడుగుతుంది మీ నాన్నగారు నీతో మాట్లాడారా అని అంటుంది. ఇదంతా మీ వల్లే అరవింద్ గారు మీకు చాలా థాంక్స్ మీ వల్లే మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్లారు. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అని అంటుంది. మా అమ్మ మా అత్త ఇప్పుడు నాతో బాగా మాట్లాడుతున్నారు మా నాన్న కొంచెం కోపంగా ఉన్నారు. కానీ ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది మనసులో ఏదో ఒక రోజు మా నాయన నన్ను అర్థం చేసుకుంటాడు ఇదంతా మీ వల్ల అరవింద్ గారు అని అంటుంది పద్మావతి. మీకు చాలా థాంక్స్ అండి అని అంటుంది సరే పద్మావతి నువ్వు మీ నాన్న గారితో మాట్లాడడమే నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా విక్కీ కూడా సంతోషంగా ఉంటాడు. సరే లోపల పని ఉన్నది నేను వెళ్తున్నాను అని వెళ్తుంది అరవింద అప్పుడే ఇదంతా దూరం నుంచి కృష్ణ గమనిస్తూ ఉంటాడు. పద్మావతి మనసులో అరవింద్ గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను మా నాయన బాగుండాలి అని మీరు అనుకుంటున్నారు. మీరు చల్లగా ఉండాలి అని అనుకుంటుంది.
పద్మావతి నిలదీసిన కృష్ణ..
పద్మావతి అరవింద్ వెళ్లిపోయిన తర్వాత కిందకి వెళ్దాం అనుకునేటప్పుడు కృష్ణ ఎదురుగా వచ్చి నిలబడతాడు. అరవింద్ తో మాట్లాడిందంతా అప్పటికే కృష్ణ విని ఉంటాడు. నా దారి కార్డు తప్పుగా ఉంటుంది పద్మావతి తప్పకుండా లే కానీ నేను అడిగే దానికి సమాధానం చెప్పు, నీకు వికీ కి మధ్య ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని అంటాడు నటించక పద్మావతి. ఒకరంటే ఒకరికి పడని మీరు ప్రేమతో అన్యోన్యంగా ఉన్నారంటే నేను నమ్మాలా, అరవింద్ నమ్మించినంత తెలివి కాదు నన్ను నమ్మించడం నేను లాయర్ ని, విక్కీనిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు.హరే కృష్ణ పద్మావతిని అడుగుతాడు. నీకు అసలు బుద్ధుందా నువ్వు ఇంకా మారవా మేము ఒకలకు ఒకలం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని నీకు తెలియదా ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతావు అని అంటుంది పద్మావతి. నా దగ్గర నాటకాలు ఎందుకు పద్మావతి మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది అలాంటిది మీరిద్దరూ అగ్నిసాక్షిగా ఒకటయ్యారు అంటే నేనెలా నమ్ముతాను,అని అంటాడు కృష్ణ.
రేపటి ఎపిసోడ్ లో,ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మీ ఆయనకి ఏమి ఇష్టమో మీరే వడ్డించండి అంటుంది అరవింద పద్మావతి తో, మీకు పన్నీర్ బటర్ మసాలా అంటే ఇష్టం కదా అని అది వడ్డిస్తుంది పద్మావతి. వ్యక్తికి అసలు పన్నీర్ అంటేనే ఇష్టం ఉండదు అని అంటుంది కుచల. అయితే గుత్తి వంకాయ కూర ఉంది వేసుకోండి అంటుంది పద్మావతి. విక్కీకి వంకాయ అంటే పడదు అని అంటుంది అరవింద. ఇదే అతను చూసుకొని కృష్ణ మీరిద్దరూ ఒకరికొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నారు ఒకరి ఇష్టాలు ఏంటో ఒకళ్ళకు తెలియవా అని అంటాడు. దీంతో ఇంట్లో వాళ్ళందరూ అనుమానంగా చూస్తారు. ఇక పద్మావతి వికీ ఎలా కవర్ చేస్తారో రేపు ఎపిసోడ్ లో చూద్దాం..