Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీ దగ్గర పాతికవేలు తీసుకొని అరవింద్ కి గిఫ్టుగా చీర ఇస్తుంది ఆ చీరని తీసుకొని అరవింద్ చాలా సంతోషపడుతుంది. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మీకు చాలా థాంక్స్ అని అరవిందా, అను పద్మావతులకు థాంక్స్ చెప్తుంది ఇక వాళ్లని అరవిందా అని పిలవకుండా వదిన అని పిలవాలని చెప్తుంది. పద్మావతి విక్కీ ని ఆట పట్టిస్తుంది. ఆ క్రమంలో విక్కీకి మెడ పట్టేస్తుంది.

ఈరోజు434 వ ఎపిసోడ్ లో పద్మావతి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సర్దుతూ ఉంటుంది. ఎర్రటి గులాబీలను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటే అప్పుడే, అక్కడికి అరబిందో వచ్చి ఏమిటి ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అంటుంది వెంటనే మా టెంపర్ ఓన్లీ దారికి తెచ్చుకున్నాను కదా అందుకని అని అంటుంది పద్మావతి వెంటనే అను అరవింద ఇద్దరు షాక్ అవుతారు. ఏమన్నావ్ పద్మావతి అంటుంది అరవింద వెంటనే పద్మావతి అదే టెన్షన్ ఏం లేదు కదా అందుకని అని కవర్ చేస్తుంది.

డాక్టర్ అయిన పద్మావతి..
నాకు ఈ ఎర్రటి గులాబీలు అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు వీటిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అని పద్మావతి అనగానే అరవింద నాక్కూడా ఈ గులాబీలు అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. ఏంటి విక్కీ మెడ అలా పట్టేసుకొని తిరుగుతున్నావు అని అంటుంది కుచల.అది నేను చెప్తాను అని పద్మావతి మెడ పట్టేసింది అని అంటుంది వెంటనే శాంతాదేవి మెడ పట్టేసిందా లేక అని అనే లోపు పద్మావతి నేను చెప్తా నేను చెప్తాను అని అంటుంది వెంటనే విక్కీ కోపంగా ఏం అవసరం లేదు ఆపు అని అంటాడు ఇక సరే అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి పద్మావతికి ఎర్ర గులాబీలు అంటే ఇష్టం అన్న సంగతి అర్థమై, నేను ఇప్పుడే వస్తాను రానమ్మ నాకు చిన్న పని ఉంది అని చెప్తాడు.ఇక అందరూ మెడ పట్టేసింది కదా పద్మావతికి చెప్తే బాగు చేస్తుంది కదా అని అంటారు వెంటనే విక్కీ వామ్మో నాకొద్దు అని అంటాడు నేనే మీ భార్యను అండి మీకు అపాయం కలిగేటట్టు ఎందుకు చేస్తాను చక్కగా సరిచేస్తాను రండి అని అంటుంది పద్మావతి. విక్కీ ఏం అవసరం లేదు నేను చూసుకోగలను అని అంటాడు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నచ్చ చెప్పడంతో వికీసరే అని ఒప్పుకుంటాడు ఇక పద్మావతి విక్కీ మెడ సరి చేయడానికి కూర్చోమని చెప్తుంది.

పద్మావతి ప్రేమ..
విక్కీ అందరూ చెప్పింది ఒప్పుకొని పద్మావతి దోమల సరి చేయించుకోవడానికి కూర్చుంటాడు అందరూ ఏదో ఒక పని ఉన్నట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక పద్మావతి వికీ మాత్రమే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు పద్మావతి తో వికీ కోపంగా ఏంటి అందరి ముందు తగినటిస్తున్నావు నువ్వు నాకు ఎంత దగ్గర అవుదామని చూసినా నేను మాత్రం నిన్ను దూరం పెడతాను నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని అంటాడు. పద్మావతి ఎందుకు సారు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటారు. కోపంతో మనం ఏమి సాధించలేము మీకు ప్రేమతో ఏదైనా సాధించగలము మీరు ఒకసారి ప్రేమగా ఆలోచించి చూడండి ఏ పెద్ద తప్పులైనా చిన్నవిగా కనిపిస్తాయి ఎవరినైనా మాట్లాడితే దగ్గరవుతారు. అని పద్మావతి తను ప్రేమ గురించి చెబుతూ విక్కీ కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటుంది విక్కీ పద్మావతి చెప్పే మాటలకి మెస్మరైజ్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి వికీమడని పక్కకు తిప్పేస్తుంది వెంటనే ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఇక అందరూ పద్మావతిని పొగడ్డం మొదలుపెడతారు మా పద్మావతి కాబట్టి ఇలా చేసింది తను చేయపడంగానే ఏదైనా తగ్గిపోతుందని చెప్పాము కదా అని ఇంట్లో అందరూ పద్మావతిని పొగుడుతూ ఉంటారు ఇక పద్మావతి గురించి విక్కి కూడా పాజిటివ్ గా ఆలోచించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు.

కృష్ణ ప్లాన్..
గులాబీలని ఆర్డర్ చేస్తాడు అవి ఇంటికి వస్తాయి అవి బొకే తీసుకొని లోపలికి వస్తూ ఉండగా విక్కీ ఎదురవుతాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను పద్మావతి జోలి రావద్దని ఇప్పుడు పద్మావతికి ఇష్టం అని గులాబీలు తెప్పించావు కదా అని విక్కీ కోపంగా కృష్ణతో అంటాడు కృష్ణ ఏంటివికి ప్రతిదానికి అనుమానిస్తున్నావు నేను ఎప్పుడూ పద్మావతి గురించి ఆలోచిస్తానా ఏంటి? నాతో రా నీకు ఒకటి చూపిస్తాను అని విక్కిని బలవంతంగా,తన రూమ్ కి తీసుకువెళ్తాడు అక్కడ రూమ్ మొత్తం గులాబీలతో డెకరేట్ చేయబడి ఉంటాయి. అక్కడ ఒక పెద్ద ఉయ్యాల ఉంటుంది ఆ ఉయ్యాల చుట్టూ గులాబీలు ఉంటాయి. మధ్యలో కొన్ని గులాబీలు తగిలి అని నేను ఇప్పుడు ఈ గులాబీలు ఆర్డర్ చేసి తెప్పించాను అంతేకానీ నువ్వు ప్రతిదీ అనుమానంతో ఆలోచిస్తావు కాబట్టి నేను వీటిని పద్మావతి కోసం తెప్పించాను అని అనుకున్నావు. కానీ నేను తెప్పించింది అరవింద కోసం అరవింద్ అని సప్రైజ్ చేయడానికి ఇలా ప్లాన్ చేశాను నీకు ఎప్పుడు అనుమానమే కాస్త మారువికే నువ్వు నేను కాదు మారాల్సింది అని విక్కీ క్లాస్ పీకుతాడు కృష్ణ విక్కీ కొంచెం ఆలోచనలో పడతాడు వెంటనే కృష్ణ మనసులో ఇదే నాకు కావాల్సింది నేను మిమ్మల్ని విడగొడుతున్నాను అని మీకు కూడా అర్థమవ్వనట్టుగా నేను మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టబోతున్నాను అని మనసులో అనుకుంటాడు.

పద్మావతి కొత్త అవతారం..
ఇక పద్మావతి ఒక్కతే బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ పద్మావతి తో ముందు నువ్వు నా అప్పు తీర్చు లేదంటే నాతో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండు అని, నువ్వు ఎప్పటికీ అప్పు తీర్చలేవు కదా అలాంటప్పుడు ఎందుకు మాట్లాడతావు అని తన ఇగో మీద దెబ్బ కొట్టి ఆఫీస్ కి వెళ్తాడు ఆ మాట విని వెంటనే పద్మావతి నేను ఎలాగైనా అప్పు తీర్చాలి అనుకుంటుంది కానీ ఎలా తీర్చాలో దానికి తెలియదు బయటకు వచ్చి కూర్చొని అక్కడే ఉన్న బండితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ బండిలో నుంచి ఒక వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా అప్పు తీర్చాలి అని అంటుంది వెంటనే ఆ బండిలో నుంచి వాయిస్ నీకు అంతా మంచే జరుగుతుంది ఆ శ్రీనివాసుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అని అంటాడు సరే అని పద్మావతి అక్కడి నుంచి అను పిలుస్తుందని లోపలికి వెళ్తుంది.ఏంటి అక్క పిలిచావు అని పద్మావతి అంటే ఈరోజు ఆఫీస్ లో క్యాంటీన్ లేదంట అమ్మి మనల్ని వంట చేసి పంపించమన్నారు ఆర్య ఆర్య గారు అని చెప్తుంది వెంటనే పద్మావతికి ఒక ఐడియా వస్తుంది. అక్క మనం బావగారికి విక్కీ సార్ కోసం కాకుండా ఆఫీసులో ఉన్న అందరికీ వంట చేసి పంపిద్దాము అని అంటుంది. వద్దులే మనం చెప్పింది చేద్దాము అంటుంది అను. కాదు కానీ తప్పుకో నాకు ఒక ఐడియా వచ్చింది అని పద్మావతి ఆఫీస్ లో ఉన్న అందరికీ వంట చేస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన అరవిందా ఏంటి ఇంత పెద్ద క్యారేజీ కట్టారు అని అంటుంది. మనకోసం కష్టపడి పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఆకలితో పనిచేయడం బాగోదు కదా అందుకే వాళ్ళందరి కోసం కూడా క్యారేజీ కట్టాను అని అంటుంది పద్మావతి అరవిందం మెచ్చుకుంటుంది. ఇక పద్మావతి తనే సొంతంగా బండేసుకుని ఆఫీస్లో అందరికీ భోజనం తీసుకుని వెళుతుంది అలాగే ఆర్యకి ఒక సెపరేట్ బాక్సు విక్కీకి ఒక సపరేట్ బాక్సు తీసుకొని వెళుతుంది.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి క్యారేజీస్ మీ అందరి కోసం కూడా తీసుకొచ్చాను అని చెప్పడంతో ఆఫీస్ లో అందరూ సంతోషపడతారు ఇక వ్యక్తి నాకేం అవసరం లేదు నేను తినను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఆర్య చేత వికీ బాక్స్ ఇచ్చి పంపిస్తుంది పద్మావతి. అందరూ తింటున్నారు నేను పంపించాను అన్న కోపంతో విక్కీ భోజనం చేయట్లేదేమో అనుకొని పద్మావతి అయినా ఒకసారి చూద్దామని క్యాబిన్ లోకి వెళ్లి చూస్తుంది చూసేసరికి అప్పుడే విక్కీ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. పద్మావతి నాకు తెలిసి సారు నేనంటే మీకు ఇష్టం ఉంది కానీ బయటపడట్లేదు ఎట్లాగైనా బయటపడేలా చేస్తాను అని అనుకుంటుంది.