Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ మెడ పట్టేస్తే సరిచేస్తుంది. కృష్ణ ఎవరికి అనుమానం రాకుండా, విక్కీ పద్మావతిని విడగొట్టాలి అనుకుంటాడు. అందుకు తగ్గట్టుగానేపద్మావతి ఎర్ర గులాబీలు అంటే ఇష్టమని చెప్పడం వాటిని కృష్ణ తెప్పించడం,అదంతా విక్కీ చూసి కృష్ణ మీద అనుమాన పడతాడు కానీ కృష్ణ ఏమీ తెలియనట్టు అవన్నీ అరవింద కోసం తెప్పించాను అని చెప్తాడు.

ఈరోజు 435 ఎపిసోడ్ లో పద్మావతి ఆఫీస్ లో అందరికీ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అరవిందా ఏంటి పద్మావతి ఇంత పెద్ద క్యారేజీ కడుతున్నారు అని అంటుంది. ఈరోజు ఆఫీసులో క్యాంటీన్ లేదంట కదా, మా ఆయనకి బావగారికి క్యారేజీ కట్టడంతోపాటు ఆఫీసులో అందరికీ కూడా క్యారేజ్ కడదాం అనుకొని, అందరి కోసం వంట చేశాను వదిన అని చెప్తుంది అరవింద తో పద్మావతి. చాలా మంచి పని చేశావు పద్మావతి మీరు చాలా మంచి మనసు అని, పద్మావతిని పొగుడుతుంది అరవింద.
Nuvvu Nenu Prema: విక్కీ పద్మావతిని విడగొట్టడానికి కృష్ణ ప్లాన్..కొత్త అవతారం ఎత్తిన పద్మావతి..

విక్కీ అప్పు తీర్చే ఐడియా..
పద్మావతి బండిమీద పెట్టుకొని అవన్నీ ఆఫీస్ కి తీసుకు వెళ్తూ ఉంటుంది.పద్మావతి తన బండి గరుడతో నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని అంటుంది.గరుడ ఏంటమ్మా ఇవాళ సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటాడు. ఆ శ్రీనివాసుడు నాకు ఒక సహాయం చేశాడు నేను విక్కీ సార్ అప్పు తీర్చే మార్గం ఒకటి నాకు కనిపించింది. ఆఫీసులో అందరికీ భోజనం తీసుకొని వెళ్తున్నాను ఈ భోజనం అందరికీ నచ్చితే అక్కడ క్యాంటీన్ కి నేనే కాంట్రాక్ట్ తీసుకొని విక్కీ అప్పు తీర్చేయొచ్చు. భలే మంచి ఐడియా అమ్మి అని గరుడ అంటాడు. ఇంకెందుకు నీకు వచ్చిన ఐడియాతో ఇక ముందుకు దూసుకెళ్లిపోవడమే అంటాడు కానీ ఏదో ఒక మూల ఇది సక్సెస్ అవుతుందో లేదో అని భయమేస్తుంది గరుడ అని అంటుంది పద్మావతి. నువ్వు పద్మావతి మమ్మీ అలా ఎప్పుడూ భయపడకూడదు ధైర్యంగా ఉండి ముందుకెళ్లాలి అని అంటాడు గరుడ. సరే అని పద్మావతి కూడా అలానే అంటూ బండి మీద ఆఫీస్ కి చేరుకుంటుంది.

ఎంప్లాయిస్ మీద విక్కీ కోపం..
ఇక విక్కీ ఆఫీస్ లో టెన్షన్ గా ఉంటాడు. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రాజెక్టు ఈరోజు అయిపోతుందని చెప్తూ ఉంటాడు. ఇవాళే ప్రాజెక్టు డెలివరీ ఇవ్వాలి అని బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఎంప్లాయిస్ వస్తారు. అసలే ప్రాజెక్టు డిలే అవుతుందన్న టెన్షన్లో ఉన్న విక్కీ ఏంటి అందరూ ఇలా వచ్చారు అని అడుగుతాడు ఎంప్లాయిస్ని, వాళ్ళు చెప్పేది వినకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళందరూ ఏంటి కనీసం పట్టించుకోవట్లేదు అని అనుకుంటారు. ఇక ఆఫీసులో వాళ్లు సరి మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు క్యాంటీన్ లేదు.మేము ఎవరు కుడా బాక్సులు తెచ్చుకోలేదు. విక్కీ వాట్ అని లేస్తాడు. అవును సార్ ఈరోజు క్యాంటీన్ క్లోజ్ అయిన విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత గాని తెలియలేదు మాకు ఆ విషయం ఇంటి దగ్గర తెలియక మేము బాక్సులు ప్రిపేర్ చేసి తీసుకురాలేదు ఇప్పుడు మాకు లంచ్ టైం అయింది కాబట్టి మేము బయటికి వెళ్లి తినేసి వస్తాము అని అంటారు. మీరందరూ ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థమవుతుందా ఇప్పుడు మనకి ప్రతి మినిట్ కూడా చాలా వాల్యుబుల్. ఇలా మీరు బయటకు వెళ్లి తిని వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అవన్నీ ఏం కుదరదు ముందు వర్క్ చేయండి అని అంటాడు. సార్ వర్క చేయాలంటే ఎనర్జీ ఉండాలి కదా అందుకని మేము వెళ్లి తిని వస్తాము అని అంటారు కానీ అందుకు విక్కీ ఒప్పుకోడు ఆర్య అప్పుడే అక్కడికి వస్తాడు ఆర్యాతో చెప్తారు ఎంప్లాయిస్. ఆర్య విక్కి తో ఒప్పుకోరా బయటికి వెళ్లి తినేసి వెంటనే వచ్చేస్తారు అని అంటాడు అలాంటివేమి కుదరదు అని గట్టిగా చెప్తాడు విక్కి ఇక చేసేదేం లేక అందరూ బయటకు వస్తారు.

పద్మావతి కొత్త అవతారం..
ఇక విక్కి అన్న మాటలకి ఆ ఎంప్లాయిస్ అందరూ ఫీల్ అవుతూ బయటికి వస్తారు. ఆర్య తో సార్ ఏంటండీ బాస్ ఇలా మాట్లాడుతున్నారు. వర్క్ ఇంపార్టెంట్ అంటాడు ముందు మాకు కడుపు నిండితేనే కదా, పనిచేయగలుగుతాము లేదంటే నీరసంతో పని మీద ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు వర్క్ నిజంగానే డిలీట్ అవుతుంది ఈరోజు డెలివరీ ఉంది కానీ అందుకు మా కడుపులు మార్చుకొని మరీ పనిచేయాలంటే ఎలాగూమీరేనా ఆలోచించండి అని అడుగుతారు. బాస్ ఆజ్ఞను మనందరం పాటించాల్సిందే నేను కూడా చేసేదేం లేదు మీ అందరికీ నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అది డెలివరీ అవుతుంది ఈ లోపు మీరు పని చేసుకోండి అని అంటూ ఉంటాడు ఆర్య. అవసరం లేదు బావగారు అంటూ పద్మావతి ఎంట్రీ ఇస్తుంది. అప్పటికే పద్మావతి బాక్సులన్నీ తీసుకొని వస్తుంది. ఏంటి పద్మావతి ఇన్ని బాక్సులు తీసుకొచ్చావు అని ఆర్య అడుగుతాడు. ఈరోజు క్యాంటీన్ లేదు కదా బావగారు అందుకనే వీళ్ళందరూ కూడా నేనే వంట చేసి తీసుకొచ్చాను అని చెప్తుంది. ఈ విషయం నీకు ఎలా తెలిసింది పద్మావతి అని అడుగుతాడు. పద్మావతి అంటేనే అట్లనే అని, ఇట్టే అని తెలిసిపోతుంటాయి అని ఆర్యతో అంటుంది.ఇక అప్పుడే అక్కడికి విక్కీ కూడా వస్తాడు. ఏంటి మీ అందరూ ఇక్కడ ఉప్పర్ మీటింగ్ వేసుకొని కూర్చున్నారు నేనేం చెప్పాను మీకు వర్క్ డిలే అవ్వకూడదన్నాను కదా అని అంటాడు. అక్కడ ఉన్న పద్మావతిని చూసి ఏంటి పద్మావతి నువ్వు ఇక్కడ గెట్ అవుట్ మై ఆఫీస్ అని అంటాడు. వెంటనే పద్మావతి ఆగంటి సారూ నేను ఒక విషయం చెప్తాను మీకు మీ అందరికీ నేను భోజనం తీసుకు వచ్చాను అని అంటుంది. వాట్ అంటాడు విక్కీ అవును సారూ మీకు బావగారికి భోజనం తయారు చేసి తీసుకు రమ్మంది అక్క. ఆఫీస్ లో ఈరోజు క్యాంటీన్ లేదు అని చెప్పింది ఆఫీస్ లో క్యాంటీన్ లేకపోతే వీళ్ళందరికీ భోజనం ఎవరిస్తారు అందుకని నేను తీసుకొచ్చాను అని అంటుంది.ఎందుకు వాలి బయటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు అని అంటాడు విక్కీ లేదు సారు ఇంటి భోజనం చేస్తే మంచిది కదా బయట భోజనం చేస్తే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే మళ్లీ మనకే నష్టం జరుగుతుంది వర్క్ తొందరగా అవ్వాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా అందుకే ఇంటి భోజనం తీసుకొచ్చాను ఇంత మంచి భోజనం ఉండగా బయట భోజనం ఎందుకు అని అంటుంది పద్మావతి. ఇక విక్కీసరే అని లోపలికి వెళ్తాడు మీకు కూడా భోజనం తీసుకొచ్చాను సారు అని అంటుంది నాకేం ఆకలిగా లేదు అక్కర్లేదు అని అంటాడు.

పద్మావతి మెచ్చుకున్న ఎంప్లాయిస్..
ఇక పద్మావతి తీసుకొచ్చిన భోజనాన్ని ఎంప్లాయిస్ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది మీరు తొందరగా తినేసి తొందరగా వర్క్ చేయండి అని. వాళ్లతో పాటు ఆర్య కూడా క్యారేజీ ఇస్తుంది అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. పద్మావతి తీసుకొచ్చిన భోజనం ఆఫీస్ లో అందరికీ బాగా నచ్చుతుంది అందరూ భోజనం చేసి పద్మావతిని పొగుడుతూ ఉంటారు. ఇక పద్మావతి మీకు భోజనం నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మాకు రేపు కూడా ఇదే భోజనం కావాలి మేడం అని అంటారు అయితే మీకు ఎవరెవరికి ఏమేం కర్రీస్ కావాలో నాకు చెప్పండి నేను రాసుకొని రేపొద్దున అవే చేసుకుని తీసుకొస్తాను అని పద్మావతి ఎంప్లాయిస్ దగ్గర నుంచి మెను తీసుకుంటుంది. ఇక ఆర్యతో వీళ్ళందరి కడుపు అయితే నింపగలిగాను కానీ,విక్కీ సారు మాత్రం భోజనం చేయలేదు ఆయన తినకపోతే నాకు బాధగా ఉంది ఎలాగైనా ఆయన చేత తిట్లు తినైనా సరే ఈ క్యారేజీ బాక్స్ ఆయనకి ఇస్తాను అని అంటుంది ఆర్యతో పద్మావతి. వెంటనే ఆర్య నేను అటువైపే వెళుతున్నాను విక్కీ క్యాబిన్ వైపు నాకు ఇవ్వు నేను ఇస్తాను అని తీసుకొని వెళ్తాడు. విక్కీ ఆర్య దగ్గరికి వెళ్లి ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతాడు అప్పటికే విక్కీకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది మంచినీళ్లు తాగి వర్క్ చేసుకుంటూ ఉంటాడు పద్మావతి అన్న మాటలు గుర్తుకు వచ్చినా కూడా భోజనానికి వెళ్లకుండా మంచినీళ్లు తాగి పని చేసుకుంటూ ఉంటాడు అక్కడికి వచ్చిన ఆర్య అది గమనించి ఏంట్రా భోజనం కావాలా ఆకలి వేస్తుందా అని అంటాడు. నాకేం ఆకలి అవట్లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు డిస్టర్బ్ కాదురా పద్మావతి భోజనం చేసింది ఎంత రుచిగా ఉందో తెలుసా ఎంప్లాయిస్ అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా అని అంటాడు. అసలు వాళ్లు మెచ్చుకున్నారని కాదులే కానీ నేను కూడా తిన్నాను కదా చాలా టేస్ట్ గా ఉంది అసలు వంకాయ కూర గోంగూర పచ్చడి అని వర్ణిస్తుంటాడు. విక్కీకి ఇంకా ఆకలి ఎక్కువవుతుంది. సరే నీకు భోజనం ఆకలి వేస్తే తిను లేదంటే లేదు అని పద్మావతి కోసమైనా తింటావని అనుకుంటున్నాను తను నీకోసమే ఈ భోజనం చేసి వచ్చింది అని క్యారేజీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఆర్య.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి తో విక్కీ గొడవ పడుతూ ఉంటాడు. నువ్వు మా అక్కని మాయ చేసినట్టుగా నన్ను మాయ చేయాలనుకోకు మా అక్క అమాయకురాలు నువ్వు చేసిన మోసం తనకు తెలియదు. అని అంటూ ఉండగా పద్మావతి సారు మీరు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారు ఆరోజు జరిగింది ఏమిటో నేనొక్కసారి చెప్తాను వినండి మీరు చూసిందంతా నిజం కాదు అని అంటుంది. స్టాప్ ఇట్ పద్మావతి అని పూలకుండీ పద్మావతి మీదకి విసురుతాడు పద్మావతి చేతికి పూల కుండీ తగులుతుంది.అప్పుడే అక్కడకి అరవింద కృష్ణ ఇద్దరి వస్తారు అదంతా వాళ్ళిద్దరూ చూస్తారు మరి అరవింద ఏం చేయనుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం