NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: కూతుర్ల కోసం, భక్త బాధ.. అభయమిచ్చిన అరవింద.. ఆర్య నిజాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పనున్నాడా?

Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, ఆర్య, కృష్ణ గురించి నిజాన్ని తెలుసుకుంటాడు. పద్మావతిని ప్రేమించినట్టు మోసం చేయడం ఇంట్లో వాళ్ళ దగ్గర మంచిగా నటించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం విక్కీతో పద్మావతికి పెళ్లి ఒప్పందం పెళ్లి చేసుకోవడం ఇంకొన్ని రోజుల్లో పద్మావతి వికీ విడిపోవడం ఇదంతా ఫోన్లో కృష్ణ వేరే వాళ్ళతో చెప్పడం ఆర్య వింటాడు. కృష్ణ మీద తిరగబడతాడు కృష్ణ ని బెదిరిస్తాడు. కృష్ణ మాత్రం కొంచెం కూడా చెల్లించకుండా, నా గురించి నిజం తెలిసి పద్మావతి వికీ ఇద్దరి వల్లే ఏమీ చేయడం కాలేదు ఇప్పుడు నువ్వు పిల్లగాడివి ఏం చేయలేవు అని ఆర్యాతో అంటాడు. ఆర్య నేను వాళ్లంతా మంచి వాడిని కాదు ఎప్పటికైనా నీ నిజం నేనే బయట పెడతాను అని అంటాడు. ఆ టైంలో అక్కడికి వచ్చిన అరవింద్ కి నిజం తెలియకుండా ఆర్య జాగ్రత్త పడతాడు. ఇక కృష్ణ మీద రివేంజ్ తీర్చుకోవాలని ఆర్యా అనుకుంటాడు.

Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights
Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights

Krishna Mukunda Murari: నిజం తెలుసుకున్న మురారి పయనం ఎటు.? రేపటికి సూపర్ ట్విస్ట్

ఈరోజు ఎపిసోడ్ లో పూజ పూర్తయిపోయిందని, పంతులు గారు చెప్పడంతో విక్కీ సంతోషంగా ఇంకా ఇంటికి వెళ్లొచ్చు అని అనుకుంటాడు. ఇక పంతులుగారు ప్రసాదం తీసుకొని మీ ఉపవాసాన్ని విరమించండి అని అంటాడు. విక్కీ ప్రసాదం తీసుకొని తిందాం అనుకుంటాడు అప్పుడే పంతులుగారు నువ్వు ఒక్కడివే తినడం కాదు బాబు అమ్మాయి నువ్వు కలిసి తినాలి అని అంటాడు. ఇక కుజులా ప్రసాదం చూసి వ్రతం అయిపోంగానే భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారా అని అంటుంది లేదు అదే పిల్లలు ఇద్దరు ఉపవాసం విరమించడానికి తెచ్చిన భోజనం మాత్రమే అని అంటుంది అండాలు.

Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights
Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights

కూతుర్ల అత్తారింటికి పయనం..

ఇక పద్మావతి విక్కీ ఇద్దరు ప్రసాదం తింటూ ఉంటారు. ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు అక్కడే ఉండి కృష్ణ అదంతా చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రం సంతోషపడతారు. తొందరగా తింటే ఇంటికి వెళ్దాం అని అంటుంది కుచల. ఇక సరే అని ఇద్దరూ అలా తింటూ ఉంటారు. మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నా నేను మాత్రం మిమ్మల్ని విడగొట్టి తీరుతాను. ఈసారి నేను కొట్టే దెబ్బ మీరు జీవితంలో కోలుకోలేరు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఇక అందరూ ఇంటికి వెళ్లడానికి బయటకు వస్తారు. పద్మావతిని చూసి భక్తా బాధపడతాడు. నిన్ను ఈ పరిస్థితుల్లో అక్కడికి పంపించడం మాకు బాధగానే ఉందమ్మా కానీ నువ్వు ఆ మురళీకృష్ణ గాడితో జాగ్రత్తగా ఉండు అని అంటాడు భక్త. ఇంతలో అక్కడికి వచ్చిన అను మీరేం కంగారు పడకండి నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి మేము జాగ్రత్తగా ఉంటాము అని అంటుంది. కానీ పార్వతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడ మురళి నిన్నేం చేస్తాడో ఇప్పటికే విక్కీ బాబు నిన్ను అర్థం చేసుకోవట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో వాడు తలపెట్టే అపాయాన్ని నుండి నువ్వు తప్పించుకొని అక్కడ ఉండాలి అని పార్వతి పద్మావతి తో అంటుంది.

Brahmamudi December 08 2023 Episode 274: ఊహించని ట్విస్టులతో కళ్యాణ్ అనామికల నిమ్మ మొక్క.. ఇంతకీ పెళ్లి జరుగుతుందా.?

Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights
Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights

అంతా తానే చూసుకుంటానన్న అరవింద..

ఇక భక్త మా పిల్లలు ఇద్దరినీ ఇప్పటిదాకా మీరు చాలా బాగా చూసుకున్నారు ఇకముందు కూడా మీరే చూసుకోవాలమ్మా అని అంటాడు. మీరు ఎన్నిసార్లు ఆ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విక్కీ ఆర్య నాకు ఎలాగో అను, పద్మావతి కూడా నాకు అలా అని అంటుంది అరవింద. మీరు లేని లోటు నేను తీర్చలేను కానీ ఏ కష్టం రాకుండా మాత్రం మా ఇంట్లో నేను చూసుకుంటాను అని అరవింద అభయమిస్తుంది. ఈ మాత్రం చాలా మీరు మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం మాకుంది. కానీ తల్లిగా ఒక మాట చెప్పాలని చెప్తున్నాను అని అంటుంది పార్వతి. ఇక అందరూ సరే అని అక్కడ నుంచి కారికి బయలుదేరుతారు ఇంటికి ఇక పద్మావతి వెనక్కి వచ్చి వాళ్ళ నాన్నని పట్టుకొని బాధపడుతుంది. ఆండాలు నువ్వు అక్కడ ఎన్ని కష్టాలు పడతావో ఏంటో అయినా దేవుడు నీకెందుకు ఎన్ని కష్టాలు పెట్టాడు అని అంటుంది పద్మావతి తో, మీరంతా ఎందుకు ఏదో జరిగిపోయింది అన్నట్టుగా బాధపడుతున్నారు ఏమీ జరగలేదు. విక్కీ మనసులో నాకు ఇంకా స్థానం ఉంది. ఆ స్థానాన్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. మీరందరూ దీని గురించి బాధపడొద్దు అని చెప్తుంది పద్మావతి. విక్కీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని నేను తీసేస్తాను ఆయనే త్వరలో మార్చుకొని మళ్లీ జంటగా మీ ఇంటి దగ్గరికి వస్తాను. నా మీద నమ్మకం పెట్టుకోండి అని అంటుంది పద్మావతి నీకే కష్టం వచ్చినా కానీ మీకు నేనున్నాను అని మర్చిపోవద్దు అని అంటారు కుటుంబ సభ్యులు. అండాలు నువ్వు మురళి ఆట కట్టించైనా సరే మీ ఆయన మనసును గెలుచుకోవాలి అని అంటుంది. బంగారం లాంటి మా ఆయన్ని నేను ఎలా విడిచిపెడతానని మీరందరూ అనుకుంటున్నారు సరే మీరేం బాధపడొద్దు నేను ఇంటికి వెళ్లొస్తాను అని చెప్పి అత్తారింటికి బయలుదేరుతుంది పద్మావతి.

Madhuranagarilo December 07 2023 Episode 229: శిరీషను ఇంటికి తీసుకు రావడంతో టెన్షన్ పడుతున్న ధనంజయ్..

Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights
Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights

కుచల వెటకారం.. భక్తా బాధ..

ఇక పద్మావతి వాళ్ళు వెళ్లిన తర్వాత ఆర్య అను, కుచల ఇక అక్కడి నుంచి బయలుదేరడానికి, రెడీ అవుతారు. అను వాళ్ళ నాన్న దగ్గర, వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతుంది అప్పుడు అక్కడే ఉన్న కుర్చీల భక్తాతో ఇలాంటివన్నీ బానే చెప్తారు జరగాల్సింది మాత్రం చూడరు అని అంటుంది. దేని గురించి మాట్లాడుతుందా అని అనుకుంటాడు భక్త. మీ అమ్మాయికి పెళ్లి అయ్యి ఇంతకాలం అయ్యింది ఇంత బడికి పిల్లలు పుట్టలేదు అని అంటుంది. అక్కడే ఉన్న ఆండాలు దేనికైనా ఒక టైం రావాలి. ఒక చెట్టుకైనా పండు రావాలంటే కొంత టైం పడుతుంది వాళ్లకి పెళ్లి అయ్యి పది సంవత్సరాలు ఏమి అవ్వలేదు కదా అని అంటుంది మీ అందరికీ తొందరగా ఉండకపోవచ్చు నాకు తొందరగా మనవన్నో మనవరాలు ఎత్తుకోవాలని ఉంది. నేను మీలాగా ఎక్కువ రోజులు ఆగలేను ఇంకొన్నాళ్ళే చూస్తాను ఆ తర్వాత నా నిర్ణయం వేరేలా ఉంటుంది అని బెదిరిస్తుంది కుచల. అంత మాట్లాడద్దు చెల్లెమ్మ అని అంటాడు భక్త. మా అమ్మాయి జాతకంలో ఏ దోషాలు లేవు తనకి సంతానయోగం ఉంది అని అంటుంది పార్వతి, అయినా మీరు ఇలా ఆలోచిస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఇంకోలా ఆలోచిస్తారు వాళ్లకి పెళ్లి రోజులే కదా అయింది అని అంటుంది అండాలి మాటకి మాట సమాధానం చెప్పడం కాదు ముందు మీ అమ్మాయి జాతకం రేపు ఎలా ఉంటుందో నేనే చేసేది ఎలా చేస్తానో మీరే చూస్తారు నేనైతే మాట పడను. వేరే వాళ్ళు వచ్చి నన్ను మాట అనే లాగా నేను చేసుకోను అని అంటుంది. ఇక అంతలో ఆర్య అమ్మ ఇంకా చాలు ఆపుతావా ఇంటికి వెళ్దాం అని అంటాడు. పెళ్ళాన్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ ఒక్క మాట కూడా అననీయవు, నన్ను మాత్రం ఏమి మాట్లాడనీయు అని అంటుంది కుచల ఇక వెళ్దామా అని అంటుంది ఇక అందరూ ఇంటికి వెళ్తారు. ఎందుకు పార్వతి ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఎన్ని కష్టాలు పెడతాడు భగవంతుడు వాళ్లు కష్టపడకూడదని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసి మనకంటే బాగా చూసుకుంటాడు అని నమ్మకంతో ఒక అయ్యే చేతిలో పెడితే, అత్తారింటికి పంపిస్తే అక్కడ కూడా వాళ్ళకి ఏదో ఒక కష్టం ఇస్తున్నాడు ఆ తల్లిదండ్రుల గుండా ఎలా తట్టుకుంటుంది పార్వతి అని అంటాడు. తన అర్థం చేసుకున్న భర్తతో సంతోషంగా ఉండాల్సిన ఆనుయేమో వాళ్ళ తల్లి వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉంది. తనని బాగా చూసుకున్న ఆడపడుచు ఉన్న తనని అపార్థం చేసుకునే భర్తతో పద్మావతి బాధపడుతూ ఉంది. ఇద్దరు కూతుర్లు జరక సమస్యలు ఉన్నారు వాళ్ళని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అని భక్తా బాధపడుతుంటే పార్వతీ కష్టాలు ఇచ్చింది దేవుడు సంతోషం కూడా ఇస్తాడు అని అంటుంది. అయినా మాకు ధైర్యం చెప్పకుండా, నువ్వే ఇలా బాధపడితే ఎలాగు అని అంటుంది ఆండాలు. అప్పుడే అక్కడికి వచ్చిన చిలకమ్మా తల్లిదండ్రులు ఇలా బాధపడితే ఎలాగో ఆడపిల్లన్న తర్వాత అత్తగారింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటమ్మా ఈసారి వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు చేరొక పిల్లని ఎత్తుకొని వస్తారు చూడండి అని అంటుంది. అలా జరిగితే సంతోషపడేది మేమే కదా అని అంటుంది పార్వతి.

మరోసారి తన ప్రేమను బయటపెట్టిన పద్మావతి..

ఇక పద్మావతి, విక్కీ ఇద్దరు గదిలోకి వస్తారు. విక్కీకి పద్మావతి దిష్టి తీస్తాను అని అంటుంది దానికి విక్కీ నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు అని అంటాడు. మీకు లేకపోయినా నాకుంది అని పద్మావతి విక్కీకి దిష్టి తీస్తుంది. చూశారా మీకెంత దిష్టి ఉందో అని అంటుంది చెప్పాను కదా ఇలాంటివి నేను నమ్మను అంటాడు విక్కి. మనం ప్రేమించిన వాళ్ళు బాగుంటే, అంతకన్నా సంతోషాన్ని ఇచ్చేది ఏది ఉండదు సార్ అని అంటుంది. మీరు ఎప్పుడూ ఇట్లానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది. దానికి విక్కీ, ఎందుకు పద్మావతి మనసులో లేని మాటలను పైకి చెప్తున్నావు అని అంటాడు. నిజం చెప్తున్నాను సారు మీరు అర్థం చేసుకోవట్లేదు అంతే నాకు మీరు అంటే ఎప్పుడు ఇష్టమే మీ మీద నా ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది మీతో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విక్కీ వింటూ ఉంటాడు. మీ మీద నాకున్న ప్రేమ నీ పెళ్లికి ముందే చెప్తాం అనుకున్నాను అప్పుడు చెప్పలేని పరిస్థితి నాది, ఇప్పుడు చెప్పిన నమ్మలేని పరిస్థితి మీది స్వచ్ఛమైన ప్రేమకి, నమ్మకం అవసరం లేదు అర్థం చేసుకునే మనసుంటే చాలు, ఇప్పుడు మీ మనసంతా నా మీద అపార్థాలతో నిండిపోయింది అది పోతే తప్ప, మీలో దాగి ఉన్న నిజమైన ప్రేమ బయటికి రాదు. పర్వాలేదు సారు మీ ప్రేమ కోసం ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నేను ఎదురు చూస్తూనే ఉంటాను. అంతేకానీ మీ ప్రేమని మాత్రం వదులుకోలేను అని అంటుంది పద్మావతి. ఉదయం నుండి మీరు ఏమి తినలేదు తొందరగా కిందకి రండి అన్నం తిందురు గాని అని చెప్పేసి వెళ్ళిపోతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights
Nuvvu Nenu Prema 08 December 2023 today 488 episode highlights
కృష్ణని టార్గెట్ చేసిన ఆర్య..

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. విక్కీ పద్మావతి ఎక్కడ అని అడుగుతుంది అరవింద. అప్పుడే మేడ మీద నుంచి ఇద్దరు దిగి వస్తూ ఉంటారు. వాళ్ళని కృష్ణ అలానే చూస్తూ ఉంటాడు ఆర్య కావాలని ఏంటి బావ వాళ్ళిద్దరిని అలా చూస్తున్నావు. మా విక్కీ పద్మావతి లకి దిష్టి తగులుతుంది అని అంటాడు. ఇక కృష్ణ మనసులో ఆర్య కి నిజం తెలిసినప్పటినుండి నన్ను టార్గెట్ చేయాలని చూస్తున్నాడు వీడికి చెక్ పెట్టాలి అని అనుకుంటాడు. ఇక కుచల మీకేమో ఇక్కడ రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు మాకేమో అక్కడ కనీసం మర్యాద ఇచ్చేవాళ్లే ఉండరు అని అంటుంది. ఆ మాటలకి నారాయణ కోపంతో కుచ్చులని అరుస్తాడు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు ఇక అరవకొండ తిను అని అంటాడు. పద్మావతి అన్నం తినబోతుంటే చేయి నొప్పి చేస్తుంది. హారతి ఇచ్చినప్పుడు చెయ్యి కాలి ఉంటుంది దాంతో పద్మావతి కారం తినలేక పోతుంది. అందరూ ఏమైంది అని అడుగుతారు. పద్మావతి చెప్పదు. ఆర్య నిజం ఎంతో కాలం దాగదు పద్మావతి ఎప్పటికైనా బయట పడాల్సిందే అని అంటాడు. ఏమైంది అని అడగగానే, వ్రతంలో పద్మావతి చేతిలో కర్పూరం వెలిగించుకుంది ఆ గాయం ఇప్పుడు నొప్పి చేస్తుంది అన్నం తినలేక పోతుంది అని ఆర్య చెప్తాడు. ఇక అందరూ పద్మావతి వైపు చూస్తారు.

రేపటి ఎపిసోడ్ లో అరవింద విక్కీ దగ్గరికి వచ్చి, ఈ వెన్నపూస పద్మావతి చేతికి రాయి కొంచెం చల్లబడుతుంది అని అంటుంది. వెన్నపూస పద్మావతి చేతికి రాస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి చూసి, నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది సారు అని మనసులో అనుకుంటుంది పద్మావతి నిద్రపోతుందని విక్కీ వెళుతూ ఉండగా పద్మావతి విక్కీని, పిలుస్తుంది ఏంటా అని విక్కీ వెనక్కి తిరిగేసరికి పద్మావతి నేనంటే మీకు ఎంత ప్రేమ సారు అని ముద్దు పెడుతుంది. విక్కీ అలానే చూస్తూ ఉంటాడు.

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri