Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 350ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 351 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, అను ఆర్యాల పెళ్లి కోసం, పద్మావతి కుటుంబం ఆర్య వాళ్ళ ఇంటికి వస్తుంది. పద్మావతి వికీ ఇద్దరు, డాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి అలా ఉండడానికి కృష్ణ చూసి తట్టుకోలేక పోతాడు. ఈరోజు ఎపిసోడ్ లో, కృష్ణ పద్మావతి ని, నీకెన్నిసార్లు చెప్పాను పద్మావతి విక్కీ తో అలా ఉండదు అని అయినా నువ్వు నా మాట లెక్క చేయకుండా అట్లానే ఉంటున్నావ్. ఎప్పటికైనా నేనే నీ భర్తని అని అంటాడు.

Nuvvu Nenu Prema: తన మనసులోని ప్రేమని విక్కికి చెప్పేయడానికి సిద్దమైన పద్మావతి
పద్మావతి వార్నింగ్..
దేవత లాంటి అరవింద గారిని పెట్టుకొని, నీకు ఇవేం పాడు మాటలు అని అంటుంది. నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు అరవింద గురించి మాట్లాడతావ్ ఏంటి నాకు ముఖ్య నువ్వే, ఎట్లాగైనా నేను నిన్ను పెళ్లి చేసుకొని తిడతాను పద్మావతి కావాలంటే అరవింద్ అని చంపైనా సరే, పిచ్చిపిచ్చిగా ఉందా నీకు ఎన్ని సార్లు చెప్పాలి, నేను నిన్ను పెళ్లి చేసుకోను అలాంటి ఆశలు పెట్టుకోకు అని, నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను అని తేల్చి చెబుతోంది. ఏంటి పద్మావతి ఉండే కొద్ది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్, అను ఆర్యాల పెళ్లయిపోయిన తర్వాత ఇక నీకు అడ్డం లేదు విక్కీతో రాసుకుని తిరగచ్చు అనుకుంటున్నావా నేను ఉండగా అది జరగని పని, నేను ఎందుకైనా తెగిస్తాను పద్మావతి నీకు ఆ విషయం తెలుసు కదా అని అంటాడు.

విక్కీని ప్రేమిస్తున్నట్లు చెప్పిన.. పద్మావతి
విక్కీ సారు ఎన్నిసార్లు తన మనసులో మాట చెప్పిన, నేను ఇంత వాడికి బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను విక్కీ సార్ ని ప్రేమిస్తున్నాను. నేను విక్కీ సార్ ని పెళ్లి చేసుకుంటాను. ఆయన ప్రేమ ముందు నేను, అబద్ధాలు చెప్పలేకపోతున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను నీకు గుర్తు వచ్చింది చూసుకో అని అంటుంది పద్మావతి. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. రూమ్ లోపల పద్మావతి వాళ్లు ఎవరితోనో మాట్లాడుతుంది అని అనుకుంటాడు. అది ఎవరన్నది క్లారిటీగా విక్కీకి వినిపించదు. తను ప్రేమిస్తున్న అబ్బాయి ఏమన్నా ఇక్కడికి వచ్చాడేమోనని రూమ్ బయట నుండి చూస్తూ ఉంటాడు.లేదంటే పద్మావతిని ఎప్పుడూ వేదించేవాడు వచ్చాడా అని అనుకుంటాడు.

డోర్ బద్దలు కొడతానన్న విక్కీ..
పద్మావతి కృష్ణ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టి గట్టిగా పద్మావతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా రూమ్ బయట ఉన్నటువంటి విక్కీకి వినపడుతుంది. పద్మావతి ఎవరున్నారు లోపల అని అరుస్తూ ఉంటాడు. కృష్ణ మాత్రం పద్మావతిని బెదిరిస్తూనే ఉంటాడు. నీకు ఇంకో ఆప్షన్ లేదు పద్మావతి కచ్చితంగా నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. నన్ను కాదని విక్కిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో అందరినీ చంపేస్తాను అని బెదిరిస్తాడు.

నీకు దిక్కున చోట చెప్పుకో నేను మాత్రం విక్కీ సార్ ని పెళ్లి చేసుకుంటాను అని కూడా పద్మావతి చెప్పేస్తుంది. విక్కీ గట్టిగా బద్దలు కొట్టేస్తూ ఉంటాడు పద్మావతి తలుపు తీస్తావా డోర్ పగలగొట్టిన అని అడుగుతాడు. విక్కీ డోర్ పగలగొట్టుకొని లోపలికి వెళ్లే టయానికి కృష్ణ అక్కడి నుండి మాయమవుతాడు. హమ్మయ్య తృటిలో తప్పించుకున్నాను అని, విశాఖ నుండి వెళ్ళిపోతాడు. విక్కీ పద్మావతిని ఎవరు పద్మావతి ఇప్పటిదాకా నీతో మాట్లాడింది అని అడుగుతాడు. నిజం చెప్తే అరవింద్ గారికి ఎక్కడ అపాయం చేస్తాడో, అని పద్మావతి ఏమీ చెప్పకుండా ఉంటుంది. పద్మావతి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు నేనెవరు బెదిరిస్తున్నారు ఎవరు అని విక్కీ ఎంత అడిగినా, ఇప్పుడు నన్నేం అడక్కండి సారు అని అక్కడనుండి వెళ్ళిపోతుంది.విక్కీకి కృష్ణ బ్రాస్లైట్ దొరుకుతుంది. ఈ బ్రాస్లెట్ ఎవరిది అని దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు.

అను ఆర్యాల పెళ్లి మొదలు..
ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లికూతురుని తీసుకురండి అని అంటారు పంతులుగారు. పద్మావతి ఎక్కడికి పోయినది ఈ టైంలో అని అంటుందిపార్వతి. అప్పుడే అక్కడికి మొహం అంతా డల్ గా పెట్టుకొని పద్మావతి వస్తుంది. ఏందమ్మి ఎక్కడికిపోయినావ్ ఇప్పుడు దాకా అని అడుగుతుంది పార్వతి. ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పద్మావతి. ఏందమ్మి నిన్నే అడుగుతుంది అని గట్టిగా అరిచేటప్పటికీ ఏం లేదు అని అంటుంది పద్మావతి. సరే వెళ్లి అక్కని తీసుకొని వద్దాం కదా అని అందరూ వెళ్లి అను ని తీసుకొని వస్తారు. పంతులుగారు పెళ్లి మొదలు పెడతారు. ఆండాలు నా మేనకోడలు పెళ్లి బాగా జరిపిస్తున్నందుకు, శ్రీరామచంద్రా నీకు కృతజ్ఞతలు అని అంటుంది. పద్మావతి శ్రీనివాసా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అయ్యా, అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి జరుగుతూ ఉంటుంది పంతులుగారు పెళ్ళికొడుకుని తీసుకురండి అని అంటారు. అరవింద ఆర్య ఎక్కడ అని అంటుంది. సిద్దు భుజముల మీద తీసుకొని వస్తూ ఉంటాడు. అరే నన్ను వదలరా బాబు నాకు పెళ్లి అవుతుంది అని ఆర్యా అరుస్తూ ఉంటాడు. ఇక సిద్దు స్టేజి ముందుకు తీసుకొచ్చి దింపుతాడు ఆర్య ని, శాంతాదేవి ఆర్య వెళ్లి పీటల మీద కూర్చొని అన్న అత్తయ్య గారి వాళ్ళు నీకు కాలు కడుగుతారు అని అంటుంది సిద్దు ఎందుకు గ్రానీ ఆల్రెడీ కాలు కడుక్కునే ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ కాళ్ళు కడగడం ఎందుకు అని అంటాడు.ఆర్య కాళ్ల ఏమన్నా గట్టిగా ఉన్నాయా అని అంటాడు. శాంతాదేవి అదంతా మన సాంప్రదాయం నీకు తెలియదు కదా అని అంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పద్మావతి డల్లుగా ఉండడాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. నేను మామూలుగా లేకపోతే అందరికీ డౌట్ వచ్చేలా ఉంది అని పద్మావతి నవ్వుతుంది.

పంతులుగారు ఆర్య, కాళ్లు కడిగిస్తూ ఉంటారు. భక్త ఆర్య కార్మిక దిగుతూ ఉంటారు. కుచల కాలు కడగడమే కాదు అల్లుడి ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అని అంటుంది. అలాగే అమ్మ అని అంటారు భక్త. అనుని రెడీ చేస్తూ ఉంటారు. పద్మావతి ఆర్య చెప్పులు తీసి దాచిపెడుతుంది. కాలి కడగడం అయిపోగానే పంతులుగారు మీరు కాసే ప్రశ్న తీసుకోండి అయ్యా అని అంటాడు. ఆర్య స్టేజి నుండి దిగి కిందకి వచ్చి చెప్పులు కోసం వెతుకుతూ ఉంటాడు. నా చెప్పులు ఇక్కడే విప్పాను కదరా ఏమైంది అని సిద్దు అని అడుగుతాడు. ఏమో బ్రో నాకేం తెలుసు అని అంటాడు సిద్దు. పద్మావతి చెప్పులు కనపడట్లేదా బావగారు, అది మీకు కనపడాలంటే కొంచెం ఖర్చవుతుంది అని అంటుంది. అంటే నువ్వే తీసావ్ అన్నమాట అని అంటాడు ఆర్య. వెంటనే సిద్దు ఆర్య సైజుని సరిపోదు. నా సైజు అయితే నీకు సరిపోతుంది పద్మావతి అని అంటాడు. నారాయణ వెంటనే సిద్దుతో, నీకు సిద్దు అని కాకుండా మొద్దు అని పేరు పెట్టాల్సింది రా, నువ్వు మీ పిన్నిలానే ఆలోచిస్తావు అని అంటాడు. డబ్బులు ఇస్తేనే చెప్పులు ఇస్తాను అని అంటుంది పద్మావతి. వెంటనే నారాయణ డబ్బులు ఇప్పిస్తుంది పద్మావతికి, వేళల్లో కాదండి లక్షల ఇవ్వాలి అని అంటుంది.అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి,విక్కీకి తన మనసులో మాట చెప్పాలని ఒక లెటర్ రాస్తుంది. విక్కీ పేరు బదులు కృష్ణ అని మార్చి లెటర్ రాసి అక్కడ పెడతాడు కృష్ణ. విక్కీ ఆ లెటర్ ని చూసి షాక్ అవుతాడు. అంటే పద్మావతి కృష్ణుని ప్రేమిస్తుంది అని అర్థం చేసుకుంటాడు. ఇక రేపు విక్కీ ఏం చేయనున్నాడో..