Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 324 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

నిన్నటి ఎపిసోడ్ లో అను ఆర్యాల పెళ్లికి పందిరి గుంజ నాటడం. బక్త కి రికవరీ అయినందుకు అందరూ సంతోషపడటం జరుగుతుంది. కృష్ణ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తానని భక్త అనడం పద్మావతి ఆపడం జరుగుతుంది.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో, అనుకి పద్మావతి ఏ ఏ టైం కి పెళ్లిలో ఏ, ఏ చీర కట్టుకోవాలి అని సెలెక్ట్ చేసి అనుకి చూపిస్తూ ఉంటుంది. అను సంతోషంతో కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి అక్క నేను చూపించాను చీర నీకు నచ్చలేదా,అని ఇవి బాధ కాదు పద్మావతి ఆనందభాష్పాలు అని అంటుంది అను. నన్ను అమ్మలా చూసుకుటున్న నిన్ను వదిలి వెళ్ళిపోవాలి కదా అందుకని అంటుంది. అక్క అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళ ప్రేమలో నువ్వు మమ్మల్ని అందరినీ మర్చిపోతావు అంటుంది పద్మావతి.నా ప్రాణం పోయినా అది జరగదని అంటుంది అను. అక్కడికి పద్మావతి వాళ్ళ నాన్న వస్తారు. అవ్వడానికి అక్క చెల్లెలు అయినా మీ ఇద్దరి ప్రాణం ఒకటే అమ్మా మీరు ఎప్పటికీ ఇట్లానే ప్రేమగా ఉంటారు అని చెప్తాడు. పద్మావతి ఇంత ప్రేమ పంచింది నువ్వే కదా నాన్న అని అంటుంది. ఇక ఆండాలు ఈ క్షణం కోసమే నేను ఆ శ్రీరామచంద్రునికి దండం పెట్టుకున్నాను. ఇలాంటి రోజు ఇంత తొందరగా వస్తుంది అని అనుకోలేదు అని అంటుంది,అండల్.

పద్మావతి వాళ్ళ నాన్న ప్రేమ
పద్మావతి నాన్న పద్మావతికి, అనుకి ఇద్దరికీ భోజనం తీసుకొస్తాడు. కొత్త ఆవకాయ వేసి తీసుకొచ్చానమ్మ అన్నం నేనే పెడతాను అని అంటాడు. ఇక పద్మావతి,అను అన్నం తింటూ ఉంటారు. అత్త ఏనాడైనా నువ్వు తినడమే కానీ ఇట్లా కొత్తవి కలిపి పెట్టావా అంటుంది పద్మావతి. ఆండాలు నేను కాదే పెట్టాల్సింది నువ్వు నేర్చుకో రేపు పెళ్లయి అత్తారింటికి వెళ్ళేది నువ్వు. నీకు ఎన్ని సార్లు చెప్పాను అత్త నేను పెళ్లి చేసుకోను చేసుకున్న ఇల్లరికం, వచ్చేయాలి నేను చేసుకుంటాను మా అమ్మ నాన్న వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అండల్ చూదాం అని అంటుంది. పద్మావతి మనసులో ఈ సంతోషాన్ని ఇలానే నిలుపు శ్రీనివాసా ఇక ఏ కష్టాలు మా ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటుంది.

కృష్ణ మరో ప్లాన్
అరవింద పద్మావతి ఇంటికి తీసుకెళ్లడానికి, గోరింటాకు రెడీ చేసి పెడుతుంది. ఆ మెహందీ ప్లేస్ లో కృష్ణ వచ్చి తను, మందు కలిపిన మెహందీలను ఉంచుతాడు. పద్మావతి నన్నే పెళ్లి చేసుకోను అన్నావు కదా ఇప్పుడు చూడు, అను పెళ్లి ఎలా ఆగిపోతుందో, నేను కలిపిన ఈ మందుకొండ్లు అనుకి పెట్టగానే అని చెయ్యి కాలిపోతుంది పెళ్లి ఆగిపోతుంది. అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి అరవింద్ వస్తుంది. మీరేంటండీ ఈ రూమ్ లో ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదురా అమ్మ నువ్వు అను వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, అంతసేపు అక్కడ కూర్చోవాలి కదా దాని గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య వాళ్ళు వెళ్తారు లే రానమ్మ నువ్వు నాతోనే ఉండు అని అంటాడు. ఈ మధ్య మీకు నా మీద ప్రేమ ఎక్కువ అవుతుంది అండి. నేనొక్కదాన్నే తల్లిని కావట్లేదు ప్రపంచంలో, ఏమీ కాదు నేను వెళ్లి వస్తాను అని అంటుంది అరవింద. ఇప్పుడు ఈ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది.పద్మావతి నీ సంగతి అప్పుడు చెప్తా అని అనుకుంటాడు కృష్ణ.

విక్కీని ఒప్పించిన సిద్దు ఆర్య
అరవింద అందరూ రెడీనా వెళ్దామా అని అడుగుతుంది. అప్పటికే తాను కృష్ణ తయారు చేసిన మెహందీ ని తీసుకొని కిందకి వస్తుంది. కుచల రెడీనే అరవింద వెళ్దామా అని అంటుంది. అప్పుడే అక్కడికి ఆర్య సిద్దు వస్తారు. అక్క మేము రెడీ వెళ్దాం పద అని అంటాడు ఆర్య. మీరు ఎక్కడికి రా ఇది మెహందీ ఫంక్షన్ మీరు రాకూడదు అని అంటుంది అరవింద. అక్క నేను కూడా వస్తా అని అంటాడు సిద్దు. అరవింద సిద్దు ని ఒక దెబ్బ కొట్టి చెప్తున్నాను వినండి ఇక మీ ఇద్దరూ రాకూడదు అక్కడికి. మ్యారేజ్ కొడుకు లేకుండా ఫంక్షన్ ఏంటి అక్క అని అంటాడు సిద్దు. రూల్స్ అంటే రూల్స్ మీరు మాత్రం రావద్దు అని అంటుంది అరవింద. విక్కీ వచ్చి పోనీ లె అక్క తీసుకెళ్ళు అని అంటాడు. ఏంట్రా ప్రేమకి సపోర్ట్ చేశావు కదా అని ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా. రాకూడదు అంటే రాకూడదు వీళ్ళిద్దరిని నువ్వే చూసుకో మేము బయలుదేరుతున్నాం అని అంటుంది అరవింద.ఆర్య నేను అనునిచున్నాడు అనుకుంటే ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. సిద్దు నా దగ్గర ఒక ఐడియా ఉంది మనము ఫంక్షన్ కి వెళ్లొచ్చు అని అంటాడు. ఏం ఐడియా అని అడుగుతాడు ఆర్య, మనం లేడీస్ గెటప్ వేసుకుని వెళ్లొచ్చు, ఫంక్షన్ కి, నిన్నే పెళ్లాడుతా సినిమాలో నాగార్జున గారి లాగా మనం కూడా, చీర చుట్టుకొని అక్కడికి వెళ్దాం అని అంటాడు సిద్దు.దానికి విక్కీ ఒప్పుకోడు, నేను రాను అని అంటాడు.
మనమేమన్నా జెంట్స్ గెటప్ లో వెళ్తున్నామా, లేడీస్ గెటప్ లోనే కదా మనం ఎవరు అక్కడ గుర్తుపట్టరు అని సిద్దు అంటాడు. అయినా నువ్వొస్తే మాకేమైనా నువ్వు కాపాడతావు అని అంటాడు ఆర్య. మీరు అని చెప్పిన నేను రాను రా అని అంటాడు విక్కీ. ఇద్దరు కలిసి విక్కీని బాగా ఇబ్బంది పెడతారు. నువ్వు రావాల్సిందే లేదంటే ఇంకేం లేదు అని ఆర్య బతిమిలాడుతాడు. ఇక విక్కీ చేసేదేం లేక సరే అని అంటాడు. సిద్దు వెంటనే నువ్వు భార్యని చూసుకో నేను పద్దు చూసుకుంటా అని అంటాడు. ఏమన్నావ్ అని అంటాడు విక్కీ. అదే ఎవరికీ కంట పడకుండా జాగ్రత్త పడదాం అని అంటున్నా. ఎట్లా వెళ్లాలి దానికి డ్రెస్ ఏది అని అడుగుతాడు ఆర్యా. దానికి అన్ని రెడీ బ్రో అంటాడు సిద్దు.

మెహందీ ఫంక్షన్
పద్మావతి వాళ్ళింట్లో, పార్వతి అన్ని ఏర్పాట్లు చేసినట్టే కదా పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని అంటుంది. ఆండాలు అన్ని పూర్తయినాయి మన ఇంట్లో వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు అని అంటుంది.పద్మావతి రెండు పీటలు తీసుకొని వస్తుంది. ఏంది అని అడుగుతుంది అండల్. అరవింద గారికి కింద కూర్చోలేరు కదా అందుకని తెచ్చాను అని చెప్తుంది. ఆండాలు పెళ్లి నీకా మీ అక్కక ఎంత బాగా రెడీ అయ్యావు అని అంటుంది. పంతంలోనే కాదు అందంలో కూడా తగ్గేదే పద్మావతి,పద్మావతి ఇక్కడ అని అంటుంది.ఇంతకీ అను ఎక్కడే అంటుంది పార్వతి. అప్పుడే అక్కడికి అందంగా రెడీ అయినా అని వస్తుంది. పద్మావతి ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి అక్క, నాకే ముద్దొస్తున్నావు ఇక బావ చూస్తే అంతే అంటుంది. పోనీ అని అను సిగ్గుపడుతుంది. ఏంటి ఇదంతా సిగ్గే అంటుంది పద్మావతి.మీ మాటలకే నచ్చలేదు మీ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అంటుంది పార్వతి. అప్పుడే అక్కడికి అరవింద వాళ్ళు వస్తారు. లోపలికి రాగానే కుచలకి అను కాళ్ళకి దండం పెడుతుంది. ఇలా ఉండాలి అని అంటుంది కుచల. పద్మావతి అబ్బో ఈమె కొద్దిగా ఎక్కువ చేస్తుంది అని అనుకుంటుంది. అరవింద అన్ని ఏర్పాట్లు చేద్దాం పదండి అని వెళుతుంది…

రేపటి ఎపిసోడ్ లో
ఫంక్షన్ కి ఆడవాళ్లు మాత్రమే అనడంతో విక్కీ,ఆర్య, సిద్దు చీరలు చుట్టుకొని ఎవరికీ తెలియకుండా కిటికీ దగ్గర నిలబడి ఫంక్షన్ చూస్తూ ఉంటారు.. ఫంక్షన్లో పద్మావతిని నీ లవ్ స్టోరీ చెప్పమని అరవింద అడుగుతుంది. పద్మావతి నేను ఒకరిని ప్రేమించాను అతను అంటే నాకు చాలా ఇష్టం అతను నా పక్కన ఉంటే అన్ని విషయాలు తోడుగా ఉంటాడు అని అంటుంది. అది ఎవరు అని అడుగుతుంది అరవింద.. పద్మావతి కిటికీ వైపు చూపించి అతను అని చెబుతుంది… ఇక రేపు చూడాలి పద్మావతి విక్కీ ని చూపించి చెప్పిందా, లేదా….