Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి నిజం చెప్పడం విక్కి అరవిందతో నిజం చెప్పనా అరవింద చనిపోయినట్టుగా కలగంటాడు. దాంతో పద్మావతి నిజం చెప్పబోయేటప్పుడు పద్మావతిని ఆపేసి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అయితే ఏంటి ఇప్పుడు అందులో ఏముంది అని ఇంట్లో వాళ్ళ ముందు అంటాడు. కృష్ణ విక్కీ తో గొడవ పడతాడు. పద్మావతి ఇంటికి వస్తున్న అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పద్మావతి నాన్న పద్మావతి అను లను తీసుకువెళ్లడానికి వస్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి వికీ ఇద్దరూ రెడీ అయ్యాయి బ్యాగ్స్ అద్దుకోవడానికి పైకి వెళ్తారు.పద్మావతి విక్కీ లోపలికి వచ్చే టయానికి బాక్ సర్ద్దకుండా ఉంటుంది.ఇదేంటి పడుకున్నావు కింద అక్క పిలుస్తుంది వినపడడం లేదా అని అంటాడు విక్కీ. నా బ్యాగ్ నేను ఎప్పుడో చదువుకున్నాను మీ బ్యాగ్ నేను సర్దు లేదు,నేనైనా అక్కడికి రావట్లేదు అని అంటుంది.అదేంటి మొన్న మీ నాన్నగారు రాలేదని ఇచ్చావు ఇప్పుడు వస్తే తీసుకెళ్లడానికి రానంటున్నావు ఏంటి అని అంటాడు విక్కి, అది నా ఇష్టం అప్పుడు, మీరు ఇప్పుడు వేరు. నేను రాను అంటే రాను అని అంటుంది.

విక్కీని బెదిరించాలని చూసిన పద్మావతి
ఎందుకు రావు అని అడుగుతాడు విక్కి.ఎందుకంటే మా అమ్మ నా ఇల్లుకి నేను ఏదో తప్పు చేసినట్టుగా మిమ్మల్ని చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు నాతో మాట్లాడటం మానేశారు, మళ్లీ మళ్లీ తిరిగి మామూలుగా ఉండాలంటే జరిగింది వాళ్ళకి చెప్పాలి. మీరు నన్ను బలవంతంగా మా అక్క పెళ్లి జరగాలి అని బెదిరించి ఆరు నెలలు మాత్రమే నేను మీతో ఉండేలాగా నా మెలో తాళి కట్టిన విషయం మీరే మా నాయకు చెప్పాలి అని అంటుంది పద్మావతి. నేను చెప్పను అని అంటాడు విక్కీ. అయితే నేనే వెళ్లి మా నాయనతో నేను రావట్లేదు అని చెప్తాను ఎందుకు అని అడుగుతాడు అప్పుడు నన్ను మీరు పెళ్లి చేసుకున్నది బెదిరించింది ఇవన్నీ చెప్తాను మీరు చెప్పిన పర్లేదు నేను చెప్పిన పర్లేదు అని ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అంటాడు. నేను జరిగింది చెప్పమన్నాను అంతే మిమ్మల్ని నేనేం బెదిరించట్లేదు మీరు నన్ను బెదిరించిన విషయం మా ఇంట్లో చెప్తే చాలు అని అంటుంది.

Nuvvu Nenu Prema: విక్కి కాలర్ పట్టుకున్న కృష్ణ.. పద్మావతి కండిషన్..
పద్మావతికి వార్నింగ్ ఇచ్చిన విక్కీ..
ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావ్, నేను మీ నాన్నతో ఏది చెప్పను అని అంటాడు. సరే అయితే నేను చెప్తాను అని పద్మావతి ఎందుకు చేయి పట్టుకుని, చూడు నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నారు అది జరగదు.నువ్వు వెళ్లి మీ నాన్నతో చెప్పాలంటే నేను చూస్తూ ఊరుకుంటాను నేను కూడా చేయాల్సింది చేస్తాను. అను భార్య ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు నేను వెళ్లి అను నీకు కరెక్ట్ కాదు ఆర్య విడాకుల మీద సంతకం పెట్టు అని అనగానే నేను చెప్పిన చోట సంతకం పెట్టేస్తాడు.వాడికి నేనంటే అంత ప్రేమ అది మీకు తెలుసు వెళ్లి చెప్పమంటావా, లేదంటే నేను చెప్పినట్టు వింటావా అని అంటాడు విక్కీ.. సీతారాములు లాంటి వాళ్ళిద్దర్నీ విడదీయాలనుకుంటావో అసలు నీకు నోరెట్టు వచ్చింది ఆ మాట అనడానికి అని అంటుంది పద్మావతి. స్టాపిట్ పద్మావతి నీకు అసలు మాట లేదు ఓన్లీ చూపులు మాత్రమే అని కొన్ని బట్టలు తీసుకొచ్చి పద్మావతికి ఇచ్చి ఇవన్నీ సర్ది బ్యాగ్ లో పెట్టుకొని తీసుకుని రా నా బట్టలు కూడా సర్దు అని అంటాడు. ఇష్టం లేకపోయినా పద్మావతి విక్కి చెప్పినట్టే చేస్తుంది.

అందరూ పుట్టింటికి బయలుదేరడం..
పద్మావతి విక్కి అను ఆర్య అందరు కిందకి రాగానే అంటాడు,భక్త. ఇంతలో సిద్దు వీళ్ళ లాగా నాకు పెళ్లయి ఉంటే నేను కూడా వీళ్ళతో, 16 రోజుల పండగకి వెళ్ళేవాన్ని అని అంటారు. సరేలేరా నీకు కూడా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేద్దాము అప్పుడు వెళ్దువు గాని అని అంటుంది అరవింద. వీళ్ళందరూ ఒకటే మనమే ఎవరికి వారుగా ఉంటున్నాము అని అంటుంది కుచల, శాంతాదేవి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా కొంచెం అని అంటుంది. అవును అత్తయ్య నేను ఉన్నదాంట్లో తప్పేముంది వాళ్ళు ఇద్దరు చేసిన పని బానే ఉంది వాళ్ళిద్దరి వల్ల మనందరం చూడండి ఎలా ఉన్నాము ఇక ఈ చిన్న అమ్మాయి చేసిన పనికైతే మనమే అంతా ఖర్చు పెట్టుకుని మరీ చేశాము ఇప్పుడు ఈ 16 రోజులు పండగ అయినా కొంచెం గ్రాండ్గా చేయమని చెప్పండి అని అంటుంది. తల తాకట్టు పెట్టైనా నా స్థాయికి మించి చేస్తాను అని అంటాడు భక్త. మీరు సరే అంటే నేను వాళ్ళని తీసుకొని మా ఇంటికి వెళ్తాను అని అంటాడు భక్త శాంత దేవి అలాగే అండి అని అంటుంది.

అరవింద్ ను చంపాలని చూసిన కృష్ణ..
అరవింద ఒక్కతే రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి చూస్తాడు. నేను చాలా ఫీల్ అవుతుంటే నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న అరవింద అసలు నిన్నే చంపేస్తే ఈ 16 రోజులు పండగ ఎలా జరుగుతుంది వాళ్లంతా అంత సంతోషంగా ఎలా ఉంటారు అని అరవింద పడుకో నిద్రపోతూ ఉండగా కృష్ణ కావాలని వచ్చి అరవింద్ అని చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే అరవింద్ నిద్రలో నుంచి బయటికి వెళుతుంది అని అడుగుతుంది. ఏం లేదు అరవింద నువ్వు టాబ్లెట్స్ టయానికి వేసుకోలేదు కదా గుర్తు చేద్దామని లేపుతామని దగ్గరికి వచ్చాను అని అంటాడు కృష్ణ. ఏంటి రానమ్మ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావ్ అని అంటాడు కృష్ణ. ఇంకెవరి గురించి ఆలోచిస్తాను. విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా, అలా ఎవరికి వారుగా ఉంటుంటే విక్కీ ఎక్కడ బాధపడిపోతాడో అని ఆలోచించాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి 16 రోజులు పండక్కి వెళ్లారు నాకు చాలా సంతోషంగా వుంది అని అంటుంది అరవింద. వెంటనే కృష్ణ నువ్వు సంతోషంగా ఉంటే సరిపోతుందా నేను సంతోషంగా ఉండొద్దు నాకు చాలా కోపంగా ఉంది అసలు ఎలాగైనా సరే 16 రోజులు పండగ మీ ఆపేయాలి అని అనుకుంటాడు. ఈ 16 రోజుల పండుగ సవ్యంగా జరగాలి మనం కూడా నల్లపూసలు ధరించే రోజు వెళ్లాలి అని అంటుంది. నేనెందుకు లే రానమ్మ నువ్వు వెళ్లి రా అని అంటాడు లేదండి మీరు కూడా రావాలి మీరు కూడా విక్కీ పద్మావతి గురించి నాలాగే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి మీరు కచ్చితంగా అక్కడికి రావాల్సిందే అని అంటుంది అరవింద్ సరే అంటాడు కృష్ణ. నువ్వు ఆ ఫంక్షన్ కి వెళ్లే లోపు నేను నిన్ను పైకి పంపించేస్తాను అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Krishna Mukunda Murari: ముకుందకి నిజం చెప్పేసిన కృష్ణ.. మురారికి దూరమవుతుందా.!?
పద్మావతి విక్కీ అను ఆర్య అందరూ ఇంటికి రావడం
లక్ష్మి ఒకసారి ఫోన్ చెయ్ అని ఆండాలతో అంటుంది ఆండాలు అfక్కర్లేదు వాళ్ళు దారిలోనే ఉండి ఉంటారు వచ్చేస్తారులే అని అనే లోపే అందరూ వచ్చేస్తారు. అందరూ కాళీ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వమంటాడు వస్తా అప్పుడే అక్కడికి చిలకమ్మా వచ్చి అందరికీ దిష్టి తీస్తుంది. అందరినీ లోపలికి రమ్మని ఆండాలని కాసేపు అందరు ఏమిటి అని, మీకు బంగారం లాంటి మా పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశాను కాబట్టి మీరు కూడా మాకు ఒక మాట ఇచ్చి లోపలికి రావాలి అని ఉంటుంది చిలకమ్మ. సంవత్సరం తిరిగే లోపల ఇద్దరు కమల పిల్లల్ని మీరు మా చేతిలో పెట్టాలి ఆ మాట చెప్పి లోపలికి రండి అని అంటుంది చిలకమ్మా. ఆర్య ఇద్దరు సరిపోతారా క్రికెట్ టీం నే దిన్ చేయాలా నాకేం ప్రాబ్లం లేదు అని అంటాడు. విక్కీ మాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే చిలకమ్మా ఏంటి బాబు మీరు ఏం మాట్లాడట్లేదు, ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు ఏదో ఒకటి చెప్పండి అని అంటుంది చిలకమ్మా. అసలు మీ ఆయన అంటే నీకు భయం ఉందా పట్టిందా అని అడుగుతుంది చిలకమ్మ పద్మావతిని ఈ పద్మావతి ఎవరికి భయపడదు, పద్మావతి పద్మావతి ఇక్కడ అని అంటుంది చిలకమ్మతో, ఇక భక్తా అందరం లోపలికి వెళ్దాం పదండి అని అంటాడు, సరే అని అందరూ లోపలికి వెళ్తారు.పద్మావతి ఆండాలతో మాట్లాడదాం అనుకున్నా సరికి పద్మావతిని తప్పించుకొని ఆండాలు పనిచేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది.

ఆండాలతో మాట్లాడాలనుకున్న పద్మావతి..
ఆండాలు పనిచేస్తూ, నడుం పట్టేస్తుంది వెంటనే లక్ష్మి అని కేకేస్తుంది ఆండాలు కానీ లక్ష్మీ రాదు పద్మావతి వచ్చి ఏమైందో తనడం పట్టేసిందా నేను చూస్తాను ఉండు అని అంటుంది. పద్మావతి నడుము నొప్పి ఇప్పుడు తగ్గిందా అని అంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయొద్దని నేను ఉన్నాను కదా నాతో చెప్పొచ్చు కదా నాకు నువ్వంటే చాలా ఇష్టం నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. పద్మావతి ఎన్ని మాట్లాడినా ఆన్లైన్లో మాత్రం మాట్లాడకుండా అట్లానే ఉండిపోతుంది. చిన్నప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే నన్ను కొట్టేదానివి ఇప్పుడు కూడా నేను చేసిన తప్పే నన్ను కొట్టు అని చెప్పి ఆండాళ్లను చేతిని తీసుకొని తను చంపల మీద కొట్టుకుంటూ ఉంటుంది పద్మావతి. ఆండాలు ఏమి మాట్లాడకుండా ఉంటుంది ఎందుకట్లా నాతో మాట్లాడటం ఇష్టం లేదా నాకు అమ్మ తర్వాత అమ్మంటే దానికి నువ్వే నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటుంది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను అక్క నేనైతే కావాలని తప్పు చేయలేదు అని అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి వికీ అనువార్య అందరూ భోజనం చేస్తూ ఉండగా చిలకమ్మ వచ్చి ఒకరినట్లు ఒకలి తినిపించుకోండి కొత్తగా పెళ్లైన వాళ్ళు కదా, ఇలా ఎవరికి వారు తినటం నేను ఇక్కడ చూడలేదు అని అంటుంది. వెంటనే వికీ కోపంతో పద్మావతికి చాలా పెద్ద అన్న ముద్దను తీసుకొని పద్మావతికి నోట్లో పెట్టమంటే గట్టిగా పెట్టేస్తాడు. వెంటనే చిలకమ్మా ఇప్పుడు మీరు పెట్టండి అమ్మా అని అంటుంది పద్మావతి తన కలిపే ముద్ద లో పచ్చిమిరపకాయ పెట్టి విక్కీకి పెడుతుంది. వెంటనే విక్కీ కారం అని పెద్దగా అరుస్తాడు.