Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 306 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాము. పార్టీ లో అరవింద తో మురళి ఇంత ప్రేమగా ఉన్నదేంటి అని గమనించిన పద్మావతి, కచ్చితంగా ఎదో ఉంది అని అనుమానిస్తుంది. అప్పుడు అరవింద గురించి మురళి గతం లో చెప్పిన ఒక విషయం గురించి గుర్తు చేసుకుంటుంది పద్మావతి. మాటికొస్తే అరవింద కి అన్యాయం చేస్తున్నాను అంటున్నావ్, అసలే అరవిందే లేకపోతే అని మురళి అన్న మాటలను గుర్తు చేసుకుంటుంది పద్మావతి. అప్పుడు పద్మావతి కి విషయం మొత్తం అర్థం అయిపోతుంది, అరవింద గారిని చంపాలని చూస్తున్నాడా అని గ్రహిస్తుంది.

Nuvvu nenu prema: అరవిందను చంపబోయిన కృష్ణ.. పద్మావతిని కాపాడిన విక్కీ..
అలా జరగడానికి వీలు లేదు, ఎలా అయినా అరవింద గారిని కాపాడాలని అనుకుంటుంది పద్మావతి. పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో మురళి నీళ్లలో కరెంటు వైర్లను దింపి ఉండడాన్ని గమనిస్తుంది పద్మావతి. మురళి అరవిందని స్విమ్మింగ్ పూల్ దగ్గరకి తీసుకొని వెళ్లి తోసేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు పద్మావతి అరవింద ని పక్కకి తోసి తాను కాలు జారీ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి కరెంటు షాక్ కి గురి అవుతుంది. పద్మావతి స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడం చూసి అరవింద ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. ఇలా రివర్స్ అయ్యింది ఏంటి రా దేవుడా అని మురళి తలపట్టుకుంటాడు. ఇక పద్మావతి స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడాన్ని చూసి ఆర్య , కరెంటు షాక్ తగిలింది అనే విషయాన్నీ గమనించిన ఆర్య , కరెంటు ని పీకేసి, స్విమ్మింగ్ పూల్ లోకి దూకి పద్మావతి ని పైకి తీసుకొస్తాడు. స్పృహ కోల్పోయి పడిఉన్న పద్మావతి ని చూసి అరవింద ఆర్య ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు, పద్మావతి ని ఇంటి లోపలకు తీసుకెళ్లారు.

Krishna Mukunda Murari: ముకుంద ఎత్తుగడకి చిత్తు కానున్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్
కుటుంబం లో అందరూ పద్మావతి కి ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉంటారు. సంతోషం గా గడపాలి అనుకుంటున్న ఈ సమయం లో ఇలా జరిగిందేంటి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఇక ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అనుకుంటున్న సమయం లో పద్మావతి స్పృహలో నుండి కోలుకుంటుంది. స్పృహలోకి రాగానే అరవింద ని కౌగలించుకొని మీకు ఏమి కాలేదు కదా అని ఆందోళన చెందుతూ అడుగుతుంది పద్మావతి. అప్పుడు అరవింద నాకేమి అవుతుంది, నీ ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడావు కదా అని అంటుంది. నాకేమైనా పర్వాలేదు, మీరు బాగుండాలి, సంతోషం గా ఉండాలి , మీ కడుపులో ఉన్న మీ అమ్మగారు బాగుండాలి అని ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అలా ఇద్దరు ఎంతో ఎమోషనల్ అయిపోతారు.

Brahmamudi: రాహుల్ – స్వప్న కుట్రలను కళ్లారా చూసిన రాజ్..తర్వాత ఏమైందంటే!
ఇక ఆ తర్వాత అరవింద ఆర్య తో మాట్లాడుతూ ‘పద్మావతి కి ఎప్పుడు కష్టం వచ్చినా నువ్వే కాపాడుతున్నావ్, నాకు చాలా సంతోషం గా ఉందిరా’ అని అంటుంది. ఇక కాసేపటి తర్వాత అందరూ ఎప్పుడు బాగుండాలి అని కోరుకునే మా అరవింద కి అన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదని బాధపడుతుంది పద్మావతి చెల్లెలు. ఇక ఆ తర్వాత ఆర్య పద్మావతి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు, నాకు మరోసారి ప్రాణభిక్ష పెట్టారు,మీకేమి ఇచ్చి నా ఋణం తీర్చుకోవాలి అని ఆర్య తో అంటుంది పద్మావతి, అప్పుడు ఆర్య ఆ మాట నేను అనాలి, నన్ను ప్రాణం లా చూసుకుంటున్న మా అక్కని కాపాడావు అని బదులిస్తాడు. అలా ఈ ఎపిసోడ్ మొత్తం గడిచిపోతుంది.