Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 307 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాము.నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి అరవింద్ ని కాపాడడం పద్మావతిని విక్కి కాపాడడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ లో సృహ లో కి వచ్చిన పద్మావతి తో విక్కీ తన మనసులో మాట అడుగుతాడు. నీకు నేను నచ్చలేదా పద్మావతి అని , పద్మావతి ఏం సమాధానం చెప్పలేక తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సిద్ధార్థ రావడంతో పద్మావతి ఏమి చెప్పకుండా ఉంటుంది.ఉదయం అవుతుంది అందరూ హాల్లో కూర్చుని ఉండగా కుటుంబ సభ్యులందరూ అరవింద్ ను ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు అరవింద ఇప్పుడు తనకి బానే ఉందని చెప్తుంది.

పద్మావతి కోసం చూస్తూ ఉంటారు ఈలోపు పద్మావతి రూమ్ లో నుంచి ఫ్రెష్ అయి వస్తుంది. విక్కీ పద్మావతిని చూసి నీకు అంతా బానే ఉంది కదా ఇప్పుడు ఓకే కదా లేదంటే చెప్పు హాస్పిటల్ తీసుకెళ్తాను అని అడుగుతాడు దానికి పద్మావతి ఇప్పుడు నేను బానే ఉన్నాను సార్ అని చెప్పి పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. ఇంట్లో అందరూ పద్మావతి చేసిన మంచి పనికి థాంక్స్ చెప్తూ వుంటారు. కుచల పద్మావతిని అంత పొగడాల్సిన పని ఏముంది ఉంది అక్క తన పని తాను చేసిందిఅని అరవింద ను ఎందుకు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళావ్ అని అడుగుతుంది దానికి అరవిందా ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. విక్కీ తన బావని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎందుకు వెళ్లారు అక్కడికి ఎప్పుడు వెళ్లారు కదా ఇప్పుడు ఎందుకు వెళ్లారు అని ఆరా తీస్తాడు. కృష్ణ ఇప్పుడు నేను దొరికిపోతానేమో అని భయపడుతూ ఉంటాడు. విక్కీ అనుమానంగానే కృష్ణను అడుగుతాడు. ఎప్పుడు వెళ్ళరు మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎందుకు అక్కని తీసుకెళ్లారు అని దీంతో పద్మావతికి కచ్చితంగా ఈరోజు కృష్ణ దొరికిపోతాడు అని అనిపిస్తుందిఅని మనసులో అనుకుంటుంది. కుటుంబ సభ్యులంతా ఈ పని ఎవరో కావాలని చేసి ఉంటారు అని అనుమానిస్తూ ఉంటారు. కానీ ఈ లోపు కుచలే విక్కీ తో బావని అనుమానంగా అడుగుతున్నావ్ అంటుంది. వెంటనే అరవింద కూడా మేము సరదాగా వెళ్ళాము అని చెప్తుంది దీంతో కృష్ణ గండం నుండి బయట పడతాడు.

ఇక పద్మావతి ఇంటికి బయలుదేరుతుంది డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఇక కారులో విక్కి,పద్మావతి ఇంటికి వెళుతూ వుంటారు. విక్కీ పద్మావతి బాధపడడం చూసి అక్కకి ఏమీ కాలేదు కదా నువ్వు ఇంక దాని గురించి ఆలోచించకు అక్కకి ఏమీ కాదు అని అంటాడు, పద్మావతి సారు అరవింద్ గారు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతుంది. దానికి విక్కీ చాలా సంతోష పడతాడు మా అక్క గురించి నాలాగా నువ్వు ఆలోచిస్తున్నావు పద్మావతి అని తప్పకుండా పద్మావతి మా అక్క నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. నువ్వేమీ భయపడకు పద్మావతి మా అక్క నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని మాట ఇస్తాడు మనసులో మాత్రం పద్మావతి ఎందుకు అక్క గురించి ఇంత ఆలోచిస్తుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతిని విక్కీ ఇంటిదగ్గర వదిలిపెడతాడు.

విక్కీని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లోపలికి రమ్మంటే వెళ్తాడు.విక్కీకి పద్మావతి కాఫీ తీసుకొస్తుంది. పార్టీకి మేము అందరం రాలేకపోయాం బాబు అని పద్మావతి ఇంట్లో వాళ్ళందరూ చెబుతారు. పద్మావతి కుటుంబ సభ్యులందరూ అనూకి మంచి సంబంధం దొరికింది అని, ఇక పద్మావతి కూడా మంచి సంబంధం దొరికితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని విక్కి తో చెప్తారు దానికి విక్కీ ఇంతకుముందు చేసినట్టుగా కాకుండా మీరు తన మనసులో మాట తెలుసుకుని పెళ్లి చేయండి ఎందుకంటే పెళ్లితో తన బాధ్యత మీకు తీరిపోయిన తనకి ఒక ఆనందం తోడు నీడ తనని కష్టపెట్టకుండా చూసుకునేటటువంటి భర్త తనకి రావాలి అని తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకొని తనకి పెళ్లి చేయండి అని చెప్తాడు. ఇక పద్మావతి కుటుంబ సభ్యులంతా పద్మావతి ఏ కష్టం రాకుండా అనులాగ సంతోషంగా ఒక ఉండడమే మాకు కావాలి అలానే చేస్తాము. రేపు మంచి రోజు బాబు లగ్నపత్రిక రాయిద్దామని పంతులుగారు చెప్పారు దేవుడి దయవల్ల మా అని మీలాంటి మంచి వాళ్ళ కుటుంబానికి వెళ్తుంది కోడలిగా అని చెప్తారు. విక్కీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ముందు పద్మావతి తో నీ మనసు చెప్పిన మాట విని నీ మనసులో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకో, అప్పుడే నీ జీవితంతో పాటు మీ వాళ్ళు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు.
విక్కీ తన మనసులో పద్మావతి నీ మనసులో మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకుంటాడు పద్మావతి కూడా తన మనసులో మీరు ఎంత అడిగినా నేను ఈ పరిస్థితుల్లో బయటకు చెప్పలేను సార్ అని అనుకుంటుంది.
విక్కీ బయలుదేరుతాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి పద్మావతిని దానికి పద్మావతి కూడా చాలా బాధపడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అరవింద, కృష్ణ ఇద్దరు పద్మావతి ఇంటికి వస్తారు. అను, ఆర్య ల పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తారు పద్మావతి ఇంట్లో వాళ్ళు కృష్ణ గురించి అరవింద్ కి చెప్తారా చూడాలి రేపు ఏం జరుగుతుందో..