Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 333 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 334 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

ఆండాళ్ళు బ్యాగ్ లో దొరికిన కుచేల నెక్లెస్ :
కుచేల ఆండాళ్ళు పరువు తీసేందుకు తన నెక్లెస్ ని ఆమె బ్యాగ్ లో వేసి, నా నెక్లెస్ పొయ్యింది అంటూ సంగీత్ లో రచ్చ చేస్తుంది. పద్మావతి కుటుంబం లో ఉన్న అందరి బ్యాగ్స్ ని చెక్ చెయ్యాలి అంటుంది. ఆత్మాభిమానం తో బ్రతికే మమల్ని అవమానించాలని అనుకుంటున్నారా అని పద్మావతి అడగగా, ఏ తప్పు చెయ్యకపోతే బ్యాగ్స్ చూపించండి అని అంటుంది. తమ నిజాయితీని నిరూపించుకోవడానికి పద్మావతి ఆండాళ్ళు బ్యాగ్ టేబుల్ మీదకి ఒంపగా, అందులో ఉన్న కుచేలా నెక్లెస్ బయటపడుతుంది. ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ కి గురి అవుతారు.

నిండని తనపైన వేసుకున్న ఆర్య :
అప్పుడు ఆండాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ‘ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ నెక్లెస్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు’ అని అంటుంది. అప్పుడు కుచేలా దొంగ దొరికిపోయిన తర్వాత చెప్పే మాటలు ఇవే అని అనగా, కుచేల భర్త మేము మిమ్మల్ని నమ్ముతున్నాము, ఎక్కడో ఎదో పొరపాటు జరిగి ఈ నెక్లెస్ ఆ బ్యాగ్ లోకి వచ్చి ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు కృష్ణ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాము అని బదులిస్తాడు. అందుకు విక్రమాదిత్య సాక్ష్యాలను చూసి నమ్మడం కాదు, మనసాక్షిని చూసి నమ్మాలి, నాకు పద్మావతి కుటుంబం పై అపారమైన నమ్మకం ఉంది అని అనగా, అప్పుడు కుచేలా మరి ఎవరూ దొంగతనం చెయ్యకుండా ఈ నెక్లెస్ ఆ బ్యాగులోకి ఎలా వచ్చింది అని అంటుంది. అప్పుడు ఆర్య కుచేలా కుట్రని పసిగట్టి నిందని తన వైపు వేసుకోవడానికి వస్తాడు.

అరవింద ని చంపాలని మురళి వేసిన ప్లాన్ ఫెయిల్:
ఆ నెక్లెస్ అను కి ఇవ్వాలని అనిపించింది, నిన్ను అడిగితె నువ్వు గొడవ చేస్తావు కాబట్టి నేనే నొక్కేసి , ఎలాగో అనుకి ఇవ్వబోతున్నాను కదా అని ఆండాళ్ళు గారి బ్యాగ్ లో పెట్టాను అని అంటాడు. అప్పుడు కుచేల ఇదేంటి నా ప్లాన్ మొత్తం రివర్స్ చేసాడు ఈడు, ఇప్పుడు నేనే పెట్టాను అనే నిజం ఒప్పుకుంటే నా పరువు మొత్తం పోతుంది, సైలెంట్ గా ఫ్లో ఫాలో అయిపోదాం అని మనసులో అనుకోని, ఇంకెప్పుడు అలా చెయ్యకురా అని ఆర్య ని అంటుంది. ఇక ఆర్య తో అను ఏకాంతంగా మాట్లాడుతూ మీరు చెయ్యని తప్పుని మీ మీద వేసుకున్నారు, మా కుటుంబ పరువు ని మొత్తం కాపాడారు,

మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చెప్తుంది అను. కుచేల అత్తయ్య కి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తుంది అని అనగా, నీ ప్రేమకి ఎవరైనా మారిపోతారు, రేపు మా అమ్మ కూడా మారిపోయి మీరిద్దరూ ఒక్కటై నన్ను దూరం పెట్టేస్తారేమో అని అంటాడు ఆర్య. మరోపక్క కుచేలా ఆండాళ్ళు ని దెబ్బ కొట్టడానికి మ్యాంగో జ్యూస్ లో మందు కలుపుతుంది. మరో పక్క మురళి అరవింద ని చంపడానికి స్వీట్ బాక్స్ లో పెట్టిన తేలు మిస్ అవుతుంది,ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.