Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 308 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.
నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి మనసు తెలిసిన మనిషిని భర్తగా తీసుకురమ్మని పద్మావతి కుటుంబ సభ్యులకు విక్కీ చెబుతాడు . తన మీద ఉన్న ప్రేమని బయట పెట్టాలని విక్కీ ఆశ పడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema: ప్రాణాలతో బయటపడిన పద్మావతి. కృష్ణ నిజస్వరూపం విక్కీకి తెలిసిపోయిందా..
ఈరోజు ఎపిసోడ్లో విక్కీ మనసులోనేపద్మావతి మన మధ్య ఉన్న ఈ దూరం తరిగేది ఎప్పుడు? నా మీద ఉన్న ప్రేమ నువ్వు బయటపడేది ఎప్పుడు అని మనసులో బాధపడుతూ ఉంటాడు పద్మావతి కూడా తన ఇంట్లో కూర్చుని మనసులో బాధపడుతూ ఉంటుంది నువ్వు లేని ప్రతిక్షణం నాకు ఒక యుగంలో అనిపిస్తుంది అని విక్కీ మనసులోనే అనుకుంటాడు పద్మావతి కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మన మనసులు కలిసిన మనం దూరంగా ఉండటమే మంచిది సారు.. అని మనసులో బాధపడుతూ ఉంటుంది. మరి నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడూ అని విక్కీ అనుకోగానే పద్మావతి మీ మనసుని బాధ పెట్టే సమాధానం నేను ఎప్పటికీ చెప్పలేను సారు.. అని, విక్కీ నువ్వు దాచే కొద్ది నీ మీద నాకున్న ప్రేమ ఎక్కువగానే ఉంటుంది అనిఅనుకుంటాడు పద్మావతి కూడా నేను అదే తట్టుకోలేకుండా ఉన్నాను.

ఏది ఏమైనా మీరు బాగుండాలి సారు దానికోసం నేను ఏమైనా పర్వాలేదు అని మనసులోనే బాధపడుతూ ఉంటుంది.(బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇదివరకు అలవాటు లేనిది) ఇక ఉదయమే పద్మావతి అత్త అను వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇంటికి వస్తారని చాలా కంగారుపడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది పద్మావతి నేనున్నాను కదా అని నేను చూసుకుంటాను కంగారు పడకు అని వాళ్ళు వస్తే ఏమంటలు చేయాలి వెళ్లేటప్పుడు ఏ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అని మొత్తం తనే చెప్పి అలసిపోతోంది. పద్మావతి చెప్పినా రిటన్ గిఫ్ట్ ఐడియా ఇంట్లో అందరికీ నచ్చడంతో ఓకే అనే ఇస్తారు.

Brahmamudi: రాహుల్ – స్వప్న కుట్రలను కళ్లారా చూసిన రాజ్..తర్వాత ఏమైందంటే!
ఈలోగా ఆర్య,విక్కీ వాళ్ళ కుటుంబ సభ్యులతో పద్మావతి ఇంటికి వస్తారు. వస్తూనే కుచల అను ఇల్లు బాగోలేదని తన కొడుకుకి ఇంతకన్నా గొప్ప సంబంధం వచ్చి ఉండేదని అందరి ముందు అను ఫ్యామిలీని అవమానిస్తూ ఉంటుంది. మర్యాదలు కూడా చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్తారు.దానికి అను చాలా బాధపడి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుందివెనకాలే ఆర్య కూడా బయటికి వచ్చి నీ ప్రేమతో అవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు అని సర్ది చెప్పి నీకు తోడుగా ఆ ఇంట్లో నేను వున్నాను, పద్మావతి లాగే నిన్ను కూడా ఆ ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నువ్వు ధైర్యంగావుండు అని లోపలికి తీసుకు వెళ్తాడు.
ఇక్కడే అసలు వ్యక్తి కృష్ణ తన భార్యతో గుడి నుంచి పద్మావతి ఇంటికి వస్తాడు వస్తూ వస్తూనే తన మనసులో నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు కదా ఇప్పుడు నేనేంటో మీ అందరికీ చూపిస్తాను అని పద్మావతి కుటుంబ సభ్యుల మీద కోపాన్ని మనసులోని చూపిస్తూ ఉంటాడు. అరవిందతో ఏమీ తెలియని వాడిలాగా పద్మావతి అరవింద్ తో కలిసి పద్మావతి ఇంట్లోకి అడుగు పెడతాడు.
ఇక పద్మావతి కుటుంబ సభ్యులు కృష్ణం చూసి అతని చేసిన మోసం గుర్తుకు వచ్చి అరవింద ముఖం చూసి ఏమీ అనకుండా మౌనంగా ఉంటారు కృష్ణ మాటలకి పద్మావతి ఫ్యామిలీ అతనికి మర్యాద చేయాల్సి వచ్చినందుకు,కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ అక్క అరవింద స్వీట్ తినాలనిపిస్తుంది అటక మీద ఉన్న బాక్స్ కోసం పైకి ఎగురుతూ ఉంటుంది, విక్కీ వెనక నుండి వచ్చి పద్మావతిని పైకి ఎత్తుకుంటాడు వీరిద్దరిని బయట నుండి కృష్ణ కోపంగా చూస్తూ ఉంటాడు.
చూడాలి మరి కృష్ణ కోపంతోపద్మావతికి ఏం చేస్తాడు లేక పద్మావతి ఇంట్లో కృష్ణ నిజ స్వరూపం అరవింద ఎదుట బయటపడుతుందో..