Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 309 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి ఇంటికి కృష్ణా తన భార్య అరవింద్ తో కలిసి వస్తాడు. అరవింద ముందు ఏమీ తెలియని వాడిలా పద్మావతి కుటుంబ సభ్యులతో మాట్లాడుతాడు. పద్మావతి ఫ్యామిలీకి కృష్ణ మీద చాలా కోపం వస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో కృష్ణ కి మర్యాదలు చేయమని, అతని మా ఇంటి అల్లుడని తక్కువ చేయకూడదని కనీస గౌరవం, కృష్ణకి ఇవ్వండి అని పద్మావతిని కుచుల అరుస్తుంది.

చేసేదేమి లేక పద్మావతి కృష్ణకు మర్యాదలు చేస్తుంది పద్మావతి అత్త కోపంతో మర్యాదలతో పాటు బడితపూజ చేస్తాము అంటుంది. అర్థం కానట్టు కుచల చూస్తుంది, (కృష్ణకు గతంలో పద్మావతి ఫ్యామిలీ చేతిలో తన్నులు తిన్న సంగతి గుర్తొస్తుంది) పద్మావతి బడిత పూజ అంటే, మర్యాద అని కవర్ చేస్తుంది. పద్మావతి నాన్నను చూసి కృష్ణ ఏమీ తెలియని వాడిలా ఇతను ఎవరు అని అడుగుతాడు. అరవింద పద్మావతి నాన్న అని చెప్పడంతో కృష్ణ వెంటనే అయ్యో మంచి వాళ్ళకే ఇలా జరుగుతుంది అని బాధపడినట్లు నటిస్తాడు. కృష్ణ ని చూసి పద్మావతి నాన్న నాకు ఇలా కావడానికి కారణం నువ్వే కదా అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

అను ఆర్యాల పెళ్లికి లగ్నపత్రికను రాయిస్తారు. లగ్నపత్రికను కుటుంబ సభ్యులందరూ కలిసి పూజా మందిరంలో పెట్టి పూజ చేసి సంతోషంగా ఈ పెళ్లి జరగాలని వేడుకుంటారు. ( కృష్ణ తన మనసులో అరవింద పద్మావతి నిన్ను కాపాడింది ఈసారి మాత్రం నిన్ను అడ్డు తొలగించి పద్మావతిని పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటాడు)
అరవింద ఈ సంతోషంలో స్వీట్ తినాలనిపిస్తుంది అని అడుగుతుంది. పద్మావతి నేను తీసుకు వస్తాను అని వంటగదిలోనికి వెళ్తుంది. పద్మావతికి లడ్డు డబ్బా అందకపోవడంతో విక్కి వంటగది లోనికి వచ్చి పద్మావతి ఎత్తుకొని డబ్బాని తీసుకోమంటాడు, విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు,. విక్కీ పద్మావతిని వంటగదిలో ఉండడం కృష్ణ బయట నుంచి చూస్తాడు.
పద్మావతి విక్కి నీ బావ అని పిలవడం, వాళ్ళిద్దరూ, వంట గదిలో సంతోషంగా, సరదాగా మాట్లాడుకోవడం, చూసి కృష్ణ భరించలేక పోతాడు. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉండడం కృష్ణ చూసి కోపంతో లగ్న పత్రికను తగలబెడతాడు ఏమీ తెలియనట్లు వెళ్లి అందరిలో కలిసిపోతాడు.

Brahmamudi: కావ్య కి చివరి అవకాశం ఇచ్చిన రాజ్.. రాహుల్ మోసగాడు అని నిరూపిస్తుందా?
రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వాళ్ళు లగ్నపత్రిక కాలిపోయినందుకు బాధపడుతూ, కంగారుపడుతూ ఉంటారు. దీన్నే అలుసుగా చేసుకొని కుచల ఈ పెళ్లిని ఎలా అయిన ఆపాలని ప్రయత్నిస్తుంది. పద్మావతికి ఇదంతా చేసింది కృష్ణ ఏమో అని అనుమానం వస్తుంది . చూడాలి కృష్ణ లగ్నపత్రిక తగలబెట్టింది పద్మావతి బయట పెడుతుందో, లేదంటే అను, అర్యాల పెళ్లి ఆగిపోతుందో…