Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, అను, ఆర్యా, పద్మావతి విక్కీ అందరూ 16 రోజుల పండక్కి వస్తారు. పద్మావతి వాళ్ళ అత్త ఆండాలని, తనతో మాట్లాడేటట్టు చేసుకుంటుంది.
తన తండ్రి భక్తా మాత్రం పద్మావతి చేసింది మర్చిపోలేను అని చెప్తాడు. పద్మావతి, విక్కి,లు గొడవ పడుతూ ఉంటారు.

ఈరోజు 388 వ ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి లను భోజనానికి రమ్మని పిలుస్తారు. భోజనానికి కూర్చున్న తర్వాత చిలకమ్మా ఒకరికొకరు తినిపించుకోండి అని అంటుంది. పద్మావతి విక్కీ ఇద్దరుఆ మాటకి షాక్ అవుతారు. అను ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఒకరికి ఒకరు మొదటి ముద్ద తినిపించుకోవాలమ్మా మీరు కూడా తినిపించుకోండి అని చిలకమ్మ పద్మావతి అంటుంది. పద్మావతి సరే అని ఒక ముద్ద విక్కీ పెడుతుంది విక్కీ కూడా పద్మావతికి ఒక ముద్ద పెడతాడు కావాలని బలవంతంగా పద్మావతి నోట్లో విక్కీ పెద్ద ముద్ద పెడతాడు. పద్మావతి చెప్తా నీ సంగతి అని కావాలని పచ్చిమిరపకాయని అన్నంలో కలిపి విక్కి నోట్లో పెడుతుంది. వెంటనే విక్కీ కారం కారం అని అరుస్తాడు. ఏమైంది అని అందరూ అడుగుతారు. నీళ్లు తాగండి తగ్గుతుంది అని అంటారు. నెమ్మదిగా తినండి అని అంటుంది పద్మావతి కావాలని, అది చూసి పద్మమ్మ గారికి వాళ్ళ ఆయన ఉంటే ఎంత ప్రేమ ఉంటుంది చిలకమ్మ. కొంచెం నెమ్మదిగా తినండి అని అంటుంది పద్మావతి. విక్కీ చాలా కోపంగా చూస్తాడు చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా చెప్తున్నావా అని.

లక్ష్మి, రేపటి కార్యక్రమాల గురించి చెప్పడం
పద్మావతి పిన్ని లక్ష్మి రేపు ఉదయం నల్లపూసలు గుచ్చే కార్యక్రమం ఉంది అరవింద్ గారికి చెప్పాలి అని అంటుంది. వెంటనే శోభనానికి కూడా ముహూర్తం పెట్టించాలి అరవింద గారితో మాట్లాడాలి రేపు ఉదయం అని అంటుంది లక్ష్మి. వెంటనే వికీ కురబోతుంది శోభనం అనగానే అయ్యగారి కి కొరబోయింది అని అంటుంది చిలకమ్మా. ఆర్య అదేదో మనకి చేయొచ్చు కదా అని అంటాడు. ముందు అన్నం తిను అని అంటుంది అను. ఏంటి బాబు గారు అంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది చిలకమ్మా. మా వారు అంతేలే అప్పుడప్పుడు కంగారు పడుతుంటారు అని అంటుంది పద్మావతి. చిలకమ్మా మా పద్మావతికి ఎలాంటి భర్త వస్తాడు అనుకునే వాళ్ళం చాలా మంచిది మా పెద్దమ్మ అలాంటి పెద్దమ్మకి ఇలాంటి మంచి భర్త వచ్చాడు ఏమంటారు పెద్దయ్య గారు అని అంటుంది భక్త వైపు చూస్తూ, బత్తాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు.

అరవింద అను కి ఫోన్ చేయడం
అరవింద్ కి ఫోన్ చేసి పద్మావతి బానే ఉంది కదా, ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా మీ నాన్నగారు ఏమి అనలేదు కదా తనని అని అంటుంది.విక్కీ ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాడు బానే ఉన్నాడా అని అడుగుతుంది అరవింద. అందరం బానే ఉన్నామండి, పద్మావతి కూడా మా నాన్నగారు ఏమీ అనలేదు మీకు కూడా చాలా బాగున్నారు అందరం బానే ఉన్నాము. మీరు రేపు ఉదయం వస్తున్నారు కదా అని అంటుంది అను. వస్తున్నాను తప్పకుండా వస్తాను నా వాళ్ళని చూడడానికి నేను ఎందుకు రాకుండా ఉంటాను అని అంటుంది. సరే అని ఫోన్ పెట్టేస్తుంది.

Nuvvu Nenu Prema : పుట్టింట్లో పద్మావతి హడావిడి.. భక్త ఆండాళ్ పద్మావతిని క్షమించనున్నారా?
అరవింద్ ని చంపాలని, ప్రమాదంలో పడిన కృష్ణ
అరవింద ఫోన్ మాట్లాడుతుండగా, కృష్ణ అరవింద ని చూసి ఎలాగైనా అరవింద్ అని చంపాలనుకుంటాడు. ఈ 16 రోజుల పండుగ క్యాన్సిల్ చేయించాలి అనుకుంటాడు. అరవింద మాట్లాడుతూ ఉండగా వెనకవైపు నుంచి వెళ్లి ముందుకు తోసేస్తే మేడ మీద నుంచి కింద పడుతుందనుకొని అరవింద్ దగ్గరికి వెళ్తాడు. ముందుకి నెట్టగా తను ఫోన్ మాట్లాడుతూ పక్కకు జరగడంతో కాలు స్లిప్ అయ్యి కృష్ణ మేడ మీద నుంచి కిందకు పడబోతాడు. వెంటనే అక్కడున్న గోడని పట్టుకుంటాడు అది అరవింద చూసి ఏమైందండీ ఇలా ఇలా పడ్డారు రండి పైకి అని బలవంతంగా ఏడుస్తూ లాగుతూ ఉంటుంది. కొంచెం ప్రమాదం తప్పిపోయింది అని కృష్ణ, ఊపిరి పీల్చుకుంటాడు. అసలు అలా ఎలా జరిగిందండి మీరు ఎలా పడ్డారు అని అడుగుతుంది. కాలి స్లిప్ అయింది అరవింద నువ్వెక్కడున్నావని వెతుక్కుంటూ వస్తూ కంగారులో కాలు స్లిప్పే పడ్డాను. మీకేం కాలేదు కదా అది అంతే చాలు అని అంటుంది. రేపు ఉదయం మనం అను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ అంతా బాగున్నారట ఇప్పుడే ఫోన్ చేశాను రేపు నల్లపూసల కార్యక్రమం ఉంది మనల్ని రమ్మన్నారు అని చెప్తుంది అరవింద కృష్ణతో, సరే అని ఇద్దరు లోపలికి వెళ్తారు.

అను ఆర్యా, సరదా..
అను, ఆర్యతో భోజనం చేసిన తర్వాత ఏమైనా తింటారా అని అడుగుతుంది. మామూలుగా అయితే పాన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టైంలో అని అంటాడు. సరే మీకు పాన్ కావాలంతే కదా నేను తయారు చేస్తాను అని అంటుంది అను. ఇప్పటికి ఇప్పుడు బానే ఎలా తయారు చేస్తావని అని అంటాడు. చూస్తూ ఉండండి అని చెట్టుకున్న జామకాయలు అవి కోసి తను పాన్ లాగా తయారు చేసి ఇస్తుంది ఆర్య కి, అదంతా ఆర్య చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. దీని పానని అంటారా అని అంటాడు. మీరు తినండి ఇది బాగా కాకపోతే అప్పుడు అడగండి. ఆర్య పాంతిని చాలా బాగుంది. అదేంటి మీరు చిన్నప్పుడు ఇలాంటి పాన్ తినలేదా, మేము చిన్నప్పుడు ఇలాంటివే తినే వాళ్ళుము. ఈ పని చాలా బాగుంది అను ఇకమీదట నేను ఎప్పుడు అడిగినా ఇలాంటిదే ఇవ్వు అని అంటాడు ఆర్య. వాతావరణం చాలా చల్లగా ఉంది ఇద్దరం కలిసి కాసేపు అలా నడుచుకుంటూ వెళ్దామా అని అడుగుతాడు ఆర్య. ఇతరుల సరదాగా కాసేపు బయటకు వచ్చి నడుస్తూ ఉంటారు. హలో ఎప్పుడు నాతోనే ఇలానే ఉంటావా అని అడుగుతాడు ఆర్య. నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను.నా గుండెల్లో గుడి కట్టి కలుస్తాను అను అని చెప్తాడు. నా ప్రాణమే మీరండి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా బతుకుతాను, చావైనా బతుకైనా మీతోనే అని అంటుంది అను.

పద్మావతి మీద విక్కీ కోపం..
పద్మావతి పాటలు వింటూ డాబా మీద డాన్స్ వేస్తూ ఉంటుంది. అది చూసి విక్కీ చాలా కోపంగా నీకు ఎంత ధైర్యం,అందరి ముందు భోజనం దగ్గర నన్ను, ఇబ్బంది పెడతావా,అని అడగ్గా పద్మావతి ఏంటి అని అంటుంది. విక్కీ చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసి కింద పడేసి, ఇప్పుడు చెప్తే అర్థం అవుతుంది నీకు అందరిలో నన్ను ఎందుకు అలాగా ఇబ్బంది పెట్టావ్ అని అంటారు. అదే అందరి ముందు మీరే కదా భార్య భర్తలు నటించాలన్నారు. అందుకే అలా వచ్చేసాను అని సిగ్గు పడుతుంది,పద్మావతి. చిలకమ్మా పద్మావతి జ్యూస్ తీసుకురమ్మన్నారు ఎక్కడ అని వెతుక్కుంటూ డాబా మీదకు వస్తుంది.అప్పటికే పద్మావతివికీత గొడవ పడుతూ ఉంటుంది. వెంటనే చిలకమ్మా చూస్తుంది. చిలకమ్మ కంత తెలిసిపోయిందేమోనని ఇద్దరు కంగారు పడతారు. ఏంటమ్మా గారు మీ ఇద్దరు గొడవ పడుతున్నారా అని అడుగుతుంది చిలకమ్మా. ఏం లేదు చిలకమ్మా, వాతావరణం చల్లగా ఉంది కదా నేను పాటలు వింటుంటే మా ఆయన వచ్చి మాట్లాడదాం కాసేపు సరదాగా అని అడిగాడు నాకు ఇష్టం లేక అలా అన్నాను అంతే మేమేం గొడవ పడట్లేదు, అని అంటుంది పద్మావతి. అయ్యో నేను అనుకోకుండా వచ్చానా మీ మధ్యలోకి, నేను వెళ్తానులే అని అంటుంది చిలకమ్మా పర్వాలేదులే చిలకమ్మా మా వారు ఏమీ అనుకోరు ఇక్కడే ఉండు అని అంటుంది. సరేలే అమ్మగారు మీకోసం చూసి తీసుకొచ్చాను అని అంటుంది చిలకమ్మా.

Krishna Mukunda Murari: దూరమవుతున్న కృష్ణ మురారి లను ఒక్కటి చేయడానికి నందు, గౌతమ్ ప్లాన్..
రేపటి ఎపిసోడ్లో పద్మావతి కావాలని విక్కీని తలంటి పోస్తూ తల మీద గట్టిగా కొడుతుంది. పద్మావతి వేడివేడి నీళ్లు విక్కీ మీద ఓసి అయ్యో చూసుకోలేదు చన్నీళ్ళు పోసినట్టున్నాను అని అంటుంది. వికీ కావాలనేదంతా చేస్తున్నావ్ కదా అని అడుగుతాడు.లేదండి మీరే కదా నలుగురిలో ఉన్నప్పుడు మీ భార్యగా నటించమన్నారు అదే చేస్తున్నాను అని అంటుంది పద్మావతి.