Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ అరవింద ఇంట్లో నుంచి బయటికి పంపించినట్టు కలగంటాడు. అదంతా జరక్కకూడదు అనుకుంటే నేను ఆవేశపడకుండా ఆలోచనతో ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అవుతాడు. ఇక పద్మావతి అను ఇద్దరూ అరవింద చూపించే ప్రేమకుఎమోషనల్ అవుతారు.ఇక శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. శ్రీమంతానికి పద్మావతి కుటుంబ సభ్యుల్ని కూడా ఆహ్వానిస్తారు.

ఈరోజు 441 ఎపిసోడ్ లో శ్రీమంతానికి రెడీ అయ్యి పద్మావతి, విక్కీకి కూడా మంచి డ్రెస్ తీసి ఇచ్చి, ఇదే వేసుకుని మీరు కిందకి రావాలి అని అంటుంది. పద్మావతి ఇచ్చిన డ్రెస్ ని చూసి విక్కీ సంతోషపడతాడు. విక్కి కూడా మనసులో పద్మావతి అంటే ప్రేమ ఉంటుంది. కానీ పద్మావతి చేసింది గుర్తు చేసుకునిబాధపడతాడు.కానీ పద్మావతి ఇచ్చిన డ్రెస్ వేసుకుందాం అని డిసైడ్ అవుతాడు.

అరవింద ఇంటికి పార్వతి,భక్త..
ఇక భక్త పార్వతీ ఇద్దరు అరవింద శ్రీమంతానికి బయలుదేరుతారు. రెడీ అయ్యావా అని భక్త పార్వతిని అడిగితే,నేనెప్పుడో రెడీ అయ్యాను అరవింద్ గారికి ఇష్టమైన స్వీట్ లను కూడా పెడుతున్నాను అని అంటుంది. అరవింద మన పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది. అలాంటి మంచి మనసున్న అరవింద శ్రీమంతం అంటే మనకి కూడా పండుగ లాంటిదే అంటాడు భక్త.ఇక పార్వతి కూడా అరవింద గురించి మాట్లాడుతూ తను సంబంధం కలుపుకోక ముందు నుంచే మనమంటే చాలా అభిమానంగా ఉండేదండి అని అంటుంది. అలాంటి అరవిందకు శ్రీమంత అంటే పండంటి బిడ్డ కి జన్మనిచ్చి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటుంది పార్వతి. అప్పుడే అను ఫోన్ చేసి మీరు బయలుదేరారా అని అడుగుతుంది. బయలుదేరాము,దారిలో ఉన్నాము వస్తున్నాము అని, వదినకి పెట్టడానికి చీరలు గాజులు తీసుకున్నారు కదా అని అంటుంది. వెంటనే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని మీ అమ్మ రాత్రే అన్ని ఏర్పాట్లు చేసిందమ్మా, మర్చిపోతే నన్ను మర్చిపోవాలి కానీ పెట్టేవి తీసుకొచ్చేవి ఏమీ మర్చిపోదులే అని అంటాడు. ఇక పార్వతీ,బక్త ఇద్దరూ అరవింద ఇంటికి వెళ్తారు. సరే తొందరగా రండి అని ఫోన్ పెట్టేస్తుంది వెనకనుంచి ఆర్య వచ్చి అను అని కౌగిలించుకుంటారు.ఇక ఎప్పటిలాగానే ఆర్య అల్లరి, అను ముద్దు పెట్టి ఆర్యా కి ఇక మామూలు ఇచ్చేసాను కదా వెళ్లి స్నానం చేసి రండి అని అంటుంది.

విక్కీ కన్ఫ్యూజన్..
ఇక విక్కీ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, నారాయణ వచ్చి కంగ్రాట్యులేషన్స్ అని చెప్తాడు. ఇంట్లో అందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చి విక్కీకి కంగ్రాట్యులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కుచల అను ఆర్య ఇలా వరుస పెట్టి అందరూ వస్తారు. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అని అడిగితే కంగ్రాట్యులేషన్స్ అంటే కంగ్రాట్యులేషన్స్ అంతే అని వెళ్ళిపోతారు. విక్కీకి ఏమీ అర్థం కాదు ఎందుకని అందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటాడు. కంగ్రాట్స్ దేనికి చెబుతున్నారు నువ్వైనా చెప్పురా అని ఆర్య అని అడుగుతాడు. కానీ ఆర్య కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు. అసలీ కంగ్రాట్స్ వెనక ఏదో ఉంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మన హీరోయిన్ పద్మావతి ఎంట్రీ ఇస్తుంది. మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నారా అని అంటుంది పద్మావతి వెంటనే నాకు తెలుసు ఇప్పుడు నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పడానికి వచ్చావు కదా అని అంటాడు విక్కీ, కాదు అని పద్మావతి హార్ది కంగ్రాట్యులేషన్స్ అని అంటుంది వెంటనే దేనికి నువ్వే నా చెప్పు అని అంటాడు విక్కీ ఆశ దోశ నేను ఎందుకు చెప్తాను అని అక్కడి నుంచి పారిపోతుంది వెంటనే విక్కీ పద్మావతి వెనకాలే పరిగెత్తి ఆపుతాడు. నాకు అందరూ కంగ్రాట్యులేషన్స్ చెప్తుంటే పిచ్చెక్కిపోతుంది కనీసం నువ్వైనా నిజం చెప్పు అని పద్మావతిని అడుగుతాడు. ఇక పద్మావతి సరే మీ బాధ చూస్తుంటే నాకు చెప్పాలని ఉంది అనిపద్మావతి నిజం చెప్తుంది.
Krishna Mukunda Murari: కృష్ణ మురారిని అడ్డంగా బుక్ చేసిన ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్..

విక్కీ సంతోషం..
ఇక పద్మావతి మీ బాధ చూడలేకపోతున్నాను ఎంతైనా మీరు నా భర్త కదా నేనే చెప్పాలి ఇంకెవరు చెప్తారు మీకు మాత్రం అని, మీరు ఎప్పటినుంచో మీ అమ్మ మళ్లీ పుట్టాలి అని అనుకుంటున్నారు కదా అరవింద్ గారు కి మీ అమ్మ పుడితే బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా అది నిజం అవుతుంది అని అంటుంది. మీ అమ్మే మళ్ళీ ఇంటికి రాబోతుంది, అది వందకి 100% నిజమైంది సారు అని అంటుంది. వెంటనే పద్మావతిని ఆనందంలో విక్కీ ఎత్తుకొని తిప్పేస్తాడు. ఆపండి సారు కిందకి దింపండి అని పద్మావతి అంటుంది. విక్కీ పద్మావతిని కిందకు దింపి చాలా థాంక్స్ పద్మావతి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త చెప్పావు అని,వెంటనే అరవింద్ దగ్గరికి వెళ్తాడు.అక్క నాకు మాటలు చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటే అరవింద కూడా నాకు అంతే ఉంది ఈ ఆనందం ఇలానే ఉంటే బాగుండు అని అంటుంది. అక్క అమ్మ కోసం ఎప్పటినుంచ ఎదురుచూస్తున్నాను ఇప్పుడు అది నిజమవుతుందంటే నాకు చాలా సంతోషంగా, ఉంది అమ్మ మళ్ళీ మనల్ని చూసుకోవడానికి మన ఇంటికి వస్తుంది అక్క అని ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఇదంతా కృష్ణ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. మీ అమ్మ రాకతో మీ ఇల్లు నందనవనం అవుతుంది మీ ఇద్దరినీ మళ్లీ ప్రేమగా చూసుకోవడానికి మీ అమ్మ వస్తున్నారు అని అంటుందిపద్మావతి.మీరందరూ ఆనందంగా ఉన్నారు కదా మీ ఆనందాన్ని త్వరలోనే దూరం చేస్తాను అని కృష్ణ మనసులో అనుకుంటాడు.

కుచల మీద కోప్పడిన ఆర్య..
ఇక శ్రీమంతా నీకే ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి అను కింద హాల్లో ఏర్పాట్లు అని పరిశీలిస్తూ అన్ని సర్దుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య ఫొటోస్ తీస్తూ ఉంటాడు అను ని, అబ్బాయి ఏం చేస్తున్నారండి ఎవరైనా చూస్తే ఏమన్న అనుకుంటారు ఇప్పుడు ఫొటోస్ తీయకండి అని అంటుంది. కంటికి కనిపించే అందాన్ని బంధిస్తున్నాను ఫోన్లో అని అంటాడు ఆర్య వద్దండి ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది. ఇక కుచలా అద్దం ముందు నుంచు అని రెడీ అయిన అంత అందంగా ఎవరూ ఉండరు అని అనుకుంటుంది. అలా అనుకోని వస్తూ ఉండగా, ఆర్య అను కి ఫోటోలు తీయడం అను ఆర్యా దగ్గరికి వెళ్లడం, ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇదంతా కుచల చూసి వెంటనే అక్కడికి వచ్చి అను ని అరుస్తుంది. నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు కదా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా అని అంటుంది. ఇంట్లో అందరూ ఉన్నారు అన్న ఇగ్నీతజ్ఞానం కూడా నీకు లేదా ఇలా బరితెగించావేంటి అని అను అని కోప్పడుతుంది.అమ్మ తననే మనకు అంటాడు ఆర్య తన తప్పేం లేదు అని అంటాడు. దాని తప్పేముంటుంది దాని అదుపులో పెట్టుకొని ఈ అత్తకు ఉండాలి. పర్వాలేదు వచ్చినా కొన్ని రోజుల్లోనే మా వాడిని బాగా కంట్రోల్ లో పెట్టుకున్నావు అని అంటుంది. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు తనని అనవాకు అంటే తననే ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు తనను అసలు డిస్టర్బ్ చేసింది నేను అని అంటాడు ఆర్య. ఓ కొత్తగా తల్లి మీద కోప్పడుతున్నావా అంటుంది.అయినా నువ్వు డిస్టర్బ్ చేస్తే దాని బుద్ధి ఏమైంది శ్రీమంతం జరుగుతుంది ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అలాంటిది, అది మానేసి ఈ వ్యాపారాలు ఏంది అని అంటుంది. ముందు వచ్చిన చెవులు కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అని నా కొడుకు నన్ను అంటుంటే, మీ అమ్మ కదా నీకు ఆ బొమ్మ ఎక్కువైంది అని, కుశల ఆర్యా ని అరిచేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

కృష్ణ కొత్త ప్లాన్..
కృష్ణ ఇంట్లో నా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇంట్లో అందరూ ఒకరికొకరు కంగ్రాట్యులేషన్స్ చెప్పుకుంటున్నారు గానీ నాకు మాత్రం ఎవరూ చెప్పలేదు. ఇంట్లో నేనంటే అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు ఉదయం ఆ బిడ్డ బయటికి వస్తే ఆస్తి మొత్తం బిడ్డ పేరు మీద రాస్తారు. ఇక నాకేమీ మిగులుతుంది అందుకే అరవింద తో పాటు బిడ్డని కూడా చంపేయాలి. అని డిసైడ్ అయిపోయి ఎవరికో ఫోన్ చేసి నేను ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను అరవింద తో పాటు తన కడుపులో బిడ్డను కూడా చంపేద్దాం అనుకుంటున్నాను అలా చేస్తేనే ఆస్తి నాకు వస్తుంది లేదంటే ఆస్తి రాదు. అరవింద చనిపోయినట్టు ఇంట్లో ఎవరికీ నేను చంపినట్టు అనుమానం రాకుండా చంపేయాలి అని అంటాడు అప్పుడే అక్కడికి అనుకోకుండా అరవింద్ వస్తుంది.కృష్ణ ఫోన్ మాట్లాడి పక్కకు తిరిగేటప్పటికీ అక్కడ అరవింద ఉంటుంది వెంటనే మొత్తం వినేసిందేమోనని కృష్ణ భయపడతాడు. కానీ అరవింద ఏంటండీ చావు చంపడం అని మాట్లాడుతున్నారు అని అంటుంది.అంటే పూర్తిగా వినలేదని కృష్ణకు అర్థం అవుతుంది ఏం లేదురా క్లైంట్ గురించి ఒక ప్లైన్ టు తన ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు దాని గురించి మాట్లాడుతున్నాను లే అని అంటాడు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ రేపు నా బిడ్డ కూడా కావాలండి మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటుంది అరవింద అని నీ ప్రేమతోనే నిన్ను పైలోకానికి పంపిస్తాను. అని కృష్ణ మనసులో అనుకుంటాడు.

అరవింద ఇంటికి పార్వతి వాళ్ళు రావడం..
ఇక పద్మావతి కిందకు వచ్చి అక్క ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా అని అంటుంది. ఏం లేవమ్మి అన్ని పనులు పూర్తయ్యాయి అని అంటుంది ఇంకా అమ్మ వాళ్ళు రాలేదేంటి అని అనుకుంటారు అప్పుడే అక్కడికి పార్వతి వాళ్ళు వస్తారు. ఎలా ఉన్నారు అమ్మ మీ ఇద్దరూ అని అంటాడు భక్త. మేము బానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు.నేనైతే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నాయన అని అంటుంది పద్మావతి నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది అమ్మ మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే అని అంటుంది పార్వతి. ఇలా అందరూ వచ్చి వాళ్ళని పలకరిస్తారు.