Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 310 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ కుట్రకు అను ఆర్యాలు బలికానున్నారా..
నిన్నటి ఎపిసోడ్లో అను ఆర్యాల పెళ్లిని ఎలా అయినా ఆపేయాలని ప్రయత్నం చేస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో కృష్ణ తన అనుకున్నట్లుగానే లగ్న పత్రికను తగలబెడతాడు,ఈ పెళ్లి ఇంక జరగదు అన్న ఆనందంలోవెళ్లి కూర్చుంటాడు. కుటుంబ సభ్యులందరూ లగ్నపత్రిక తగలబడడానికి చూస్తారు, అందరూ కంగారుపడుతూ భయపడుతూ ఉంటారు.

లగ్నపత్రిక తగలబడినందుకు ఏం అనర్ధం జరుగుతుందో ఆర్యకేమైనా కీడు జరుగుతుందేమోనని కుచల భయపడుతూ, పద్మావతి వాళ్ళతో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇప్పుడే ఇలా జరిగితే పెళ్లయిన తర్వాత నా కొడుక్కి ఏమైనా అవుతుందేమోఅని అంటుంది.విక్కీ కుచలకు నచ్చ చెప్పడంతో, పంతులుగారు దోష నివారానికి పరిహార పూజ చేయమని చెప్పడంతో, ఇంటికి వెళుతుంది కుచల.
పద్మావతికి కృష్ణ మీద అనుమానం రావడంతో కృష్ణను ఫాలో అవుతుంది. తన అనుమానమే నిజమై, అసలు నిజం పద్మావతికి తెలిసిపోతుంది.కృష్ణ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి పద్మావతిని దక్కించుకోవడానికినేను ఏమైనా చేస్తానని,అరవిందను అడ్డు తొలగించుకోవడానికి, అయినా అనుఆ ర్యాల పెళ్లి చెడగొట్టడానికైనా,నేను సిద్ధంగా ఉన్నానని, పద్మావతి ని ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరుతానని, తన ఫ్రెండుకి చెప్పడం పద్మావతి వినేస్తుంది.
పద్మావతి పట్టరాని కోపంతో,నేనుండగా మా అక్క పెళ్లి ఎలా ఆపుతావో చూస్తాను. అరవింద గారికి ఎవరూ లేరు అనుకున్నావా విక్కీ గారే కాదు నేను కూడా ఉన్నాను. తన మీద ఈగ కూడా వాళనివ్వను, నువ్వు ఎంత ట్రై చేసినా అరవింద గారికి ఏ అపాయము జరగనివ్వను అని కృష్ణకి పద్మావతి గట్టి వార్నింగ్ ఇస్తుంది.

విక్కీ ,పద్మావతి ని ఆటపట్టిస్తూ ఉంటాడు, అదే టైం కి సిద్ధూ వచ్చి, తన ఫ్రెండ్స్ వీడియో కాల్ చేశారని, అందరితో నువ్వు మాట్లాడు అని పద్మావతిని అడుగుతాడు, పద్మావతి అందరికీ నమస్కారం అని, వీడియో కాల్ లో మాట్లాడుతుంది. సిద్దు,వచ్చిరాని తెలుగుతోపద్మావతి,విక్కి లు సరదాగా నవ్వుకుంటారు.
Brahmamudi: రాజ్ ఆలోచనలో మార్పు వచ్చిందా.. స్వప్నని రాహుల్ శాశ్వతంగా వదిలించుకుంటాడా..
పద్మావతి అక్క జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది, ఆర్యకేమైనా కీడు జరుగుతుందేమో అని కుచల అన్నమాటలన్నీ తలుచుకుంటూ, భయపడుతూ ఉంటుంది. పద్మావతి,వాళ్ళ అక్కకు ధైర్యం చెప్పి, దోష నివారణ పూజ చేస్తే అన్ని సానుకూలంగా జరుగుతాయని, పంతులు గారు చెప్పారు కదా నువ్వేం దిగులు పడకు అక్క నీ పెళ్లి ఏ ఆటకం లేకుండా జరుగుతుంది. రేపు ఉదయం మనం షాపింగ్ కి వెళ్ళాలి ఇంక పడుకో అని చెప్పి వెళ్తుంది.
రేపటి ఎపిసోడ్లో విక్కీ, పద్మావతి ఇద్దరు షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్ లోఇరుక్కుపోతారు. బల్లిని చూసి పద్మావతి విక్కి ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఈ రొమాంటిక్ ఎపిసోడ్ ని చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే…