Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ మీద కోపంతో ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నిటికీ వికీ వచ్చి సమాధానం చెప్తాడు అని చెప్తుంది. అరవింద కూడా విక్కీతో పద్మావతిని ఇంటికి తీసుకొని రమ్మని చెప్తుంది. ఎలాగైనా అనుకున్నది పద్మావతి సాధిస్తుంది.

ఇక ఈరోజు 416 ఎపిసోడ్ లో,పద్మావతివాళ్ళ ఇంట్లో వాళ్ళు విక్కి ఇంకా రాలేదేంటి అని పద్మావతిని అడుగుతూ ఉంటారు. మా ఆయనే వచ్చి మీ అందరికీ సమాధానం చెప్పి తీసుకెళ్తాడు అని పద్మావతి ఆండాలు పార్వతి తో చెబుతుంది. ఇక అదే టయానికి విక్కీ అక్కడికి వస్తాడు.

పద్మావతిని బెదిరించిన విక్కి..
పద్మావతి ఆర్య ఇంటికి రాగానే మా వాళ్లందరికీ నిజం చెప్తే మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి అని అంటుంది. విక్కీ నాటకాలు ఆడింది చాలు ఇంకా బయలుదేరు అని అంటాడు. అసలు నాటకాలు మొదలుపెట్టిందే మీరు కదా అని అంటుంది పద్మావతి. విక్కీ పద్మావతినికాఫీ తీసుకు రమ్మని చెప్తాడు.పద్మావతి కాఫీ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్లగానే విక్కీ కూడా వంటింట్లోకి మంచినీళ్లు తాగి వస్తాను అని చెప్పి వెళ్తాడు.వెంటనే పార్వతి మీకెందుకు బాబు శ్రమ నేను తీసుకొస్తాను అని అంటుంది వద్ద అత్తయ్య గారు నేనే వెళ్లి తాగొస్తాను అని అంటాడు విక్కీ. ఆండాలు ఏంటి పార్వతి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అని అంటుంది. పార్వతికి చాలా టెన్షన్ గా ఉంటుంది ఏదో గొడవ జరిగిందేమో అని, విక్కీ వంటింట్లోకి వెళ్లి నువ్వు అనుకున్నది సాధించావు అనుకుంటున్నావు కదా పద్మావతి అని అంటాడు. అవును సారూ ఇప్పుడు మీరు మా వాళ్లతో నిజం చెప్పి నన్ను తీసుకువెళ్తారని మా ఇంట్లో వాళ్లకి చెప్పాను ఇప్పుడు మీరు ఈ కాఫీ తాగి మా ఇంట్లో వాళ్లకు నిజం చెప్తే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది.

నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెడితే నువ్వు తట్టుకోలేవు పద్మావతి అని అంటాడు. ఏంటి బెదిరిస్తున్నారా అని అంటుంది పద్మావతి. బెదిరించడం కాదు నిజం చెప్తున్నాను ఇప్పుడు గనక నువ్వు నేను ఆఫీస్ కి వెళ్లే లోపు మా ఇంటి దగ్గరికి వెళ్లకపోతే, మీ అక్క కూడా నీతో పాటు ఇదే ఇంట్లో శాశ్వతంగా ఉండాల్సి వస్తుంది అని అంటాడు. మా అక్క బావ సీతా రాము లాగా కలిసి ఉంటున్నారు మీరు వాళ్ళని ఏమి చేయలేరు అని అంటుంది పద్మావతి. అవునా మా ఆర్య కి ఇప్పుడు ఫోన్ చేసి, అను కి డైవర్స్ ఇచ్చే అంటే ఇచ్చేస్తాడు తెలుసా అని అంటాడు. నేను ఏది చెప్తే అది వింటాడు మా ఆర్య అని అంటాడు. నేను బెదిరిస్తున్నాననుకో ఏదైనా అనుకో నీకు నా గురించి పూర్తిగా తెలుసు, ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. నువ్వు కనక మా ఇంటికి వెళ్లకపోతే మీ ఇంట్లో నీ చేతిలో ఆర్య డైవర్స్ మీద సంతకం పెట్టిన పేపర్లు ఉంటాయి అని చెప్పి, వంటింట్లో నుంచి బయటికి వచ్చి వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పేసి విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్వతి ఆండాలు బాబు విక్కీ అని పిలుస్తూ ఉన్నా వెళ్లిపోతాడు పట్టించుకోకుండా, వీళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకున్నారు లోపల అని అంటుంది అండల్.

పద్మావతి కంగారు..
పద్మావతి వంటింట్లో నుంచి బయటికి కంగారుగా వస్తుంది. వెంటనే ఆండాలు ఏమైంది ఏం మాట్లాడుకున్నారు మీరు అని అడుగుతుంది. పద్మావతి ఏం చెప్పకుండా అలానే ఉంటుంది. ఈ టెంపర్ గాడు అనంతపని చేస్తాడా ఏంటి బావగారి దగ్గరికి వెళ్లి ఇప్పుడు డైవర్స్ ఇప్పిస్తాడా మా అక్కకి అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది. పార్వతి ఏమైందమ్మా మీ ఆయన వచ్చి ఏదో చెప్తాడు తీసుకెళ్తాడు అన్నావు మరేంటి అలా వెళ్ళిపోయాడు అని అడుగుతుంది పార్వతి పద్మావతి ని. ఉండమ్మా ఒకసారి నేను బావగారికి ఫోన్ చేయాలి అని అంటుంది ఆండాలు ఇప్పుడెందుకే ఆర్య కి ఫోను అని అంటుంది అయినా పద్మావతి ఆర్య కి ఫోన్ చేస్తుంది ఆర్య ఫోన్ లిఫ్ట్ చేయడు. వెంటనే పద్మావతి కంగారు పడి ఏంటి బావ గారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే ఈ టెంపరరీ వెళ్లి నిజం చెప్పేసాడా ఏంటి అని అనుకొని మనసులో వెంటనే ఇంట్లో వాళ్ళతో మీకు ఇప్పుడు నేను ఏం చెప్పలేనమ్మ నేను అర్జెంటుగా వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతీ చాలా కంగారుపడుతూ అసలు ఏమైంది ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు ఈ, తింగరిది చేసే పనుల వల్ల ఇంకా ఏమి అగచాట్లు పడాలో అని అంటుంది అండాలు.

కుచల అత్తగారి సాధింపు..
అను వంటింట్లో పాయసం చేస్తూ ఉండగా మంచినీళ్లు తీసుకురమ్మని, అనుని పిలుస్తూ ఉంటుంది. అను మంచినీళ్లు తీసుకురా, ఎన్నిసార్లు చెప్పినా వినపడదా నీకు అని పెద్దగా అరుస్తుంది.వెంటనే అను వస్తున్న అత్తయ్య గారు అని మంచినీళ్లు తీసుకొని వస్తుండగా పనిమనిషి మీరు పాయసం చేసుకోండి మంచినీళ్లు అని తీసుకువెళ్తుంది. వెంటనే కుచ్చులా నువ్వు వచ్చావ్ ఏంటి అనుని పిలిస్తే అని అంటుంది అమ్మగారు పనిలో ఉన్నారండి అందుకని నేను వచ్చాను అని అంటుంది పనిమనిషి.అంటే ఇప్పుడు మీ అమ్మగారు పనిలో ఉందని నిన్ను పంపించిందా? నువ్వు వెళ్ళు అనవసరంగా పెత్తనాలు చేయకు అని అరుస్తుంది పనిమనిషిని, కుచల. వెంటనే అను నువ్వు వస్తున్నావా నన్ను రమ్మంటావా అని అంటుంది అను మంచినీళ్లు తీసుకొని వస్తుంది ఏంటి అంత లెక్కలేనితనంగా ఉంటున్నావు నేను పిలిస్తే నువ్వు పాయసం చేసుకుంటూ పనిలో ఉన్నానని చెప్పి పనిమనిషిని పంపిస్తావా ఎంత ధైర్యం నీకు అని అంటుంది కుచల. వెంటనే అది కాదు అత్తయ్య గారు పాయసం చేస్తున్నానని అంటుంది. నీకు కళ్ళు నెత్తికెక్కినయి బాగా ఆస్తి ఉన్న ఇంట్లో కోడలుగా వచ్చావు కదా మా ఆర్యా కి వలేసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నావు.వెంటనే అక్కడికి ఆర్య వస్తాడు.ఏంటమ్మా ఎప్పుడూ అవే మాటలా ఇంక నువ్వు మారవా ఎప్పుడు తనని అర్థం చేసుకుంటావు అని అంటాడు. నేను మారకపోవడమేముంది మీ మీ ఆవిడ నిన్ను మార్చేసింది కదా అని ఆర్య అని కూడా అరుస్తుంది. ఇప్పుడు పని మీద ఉందని పనిమనిషిని పంపించింది రేపొద్దున నేనే అడ్డంగా ఉన్నానని నన్నే ఇంట్లో నుంచి పంపిస్తుందేమో మీ ఆవిడ అని అంటుంది. వెంటనే ఆర్య ఇంకా ఆపమ్మ అని అంటాడు ఇంతలో ఏంటి మాడిపోయిన వాసన వస్తుంది అని అంటుంది కుచల. అయ్యో పాయసం మాడిపోయినట్టుంది అత్తయ్య గారు అని లోపలికి పరిగెడుతుంది. అప్పటికే కంగారులో వేడిగా ఉన్న పాయసం గిన్నెని చేతితో పట్టుకోగా ఆ గిన్నె కిందపడి చేతులు కాలుతాయి అనుకి,లోపలికి వచ్చిన కుజుల అయ్యయ్యో చూసావా ఇది మీ ఆవిడ నిర్వాకం పాయసం చేయడం కూడా చేతకాదు, అని అనేసి వెళ్ళిపోతుంది వెంటనే ఆర్య అని తీసుకొని కూర్చోబెట్టి చేతులకి మందు రాస్తూ మా అమ్మ అన్న మాటలకి నువ్వు బాధపడకు అని అంటాడు. మీలా ప్రేమించే భర్త ఉంటే నేను ఎందుకు బాధపడతానండి అత్తయ్య గురించి నాకు తెలుసు కదా అని అంటుంది.

ఆఫీసులో పద్మావతి హడావిడి..
ఆఫీస్ కి పద్మావతి హడావిడిగా వస్తుంది ఆర్యా నికి కలవడానికి, అలాగే విక్కీ తో గొడవపడ్డనికి క్కూడా, ఆఫీస్ బయటే పద్మావతిని సెక్యూరిటీ ఆపేస్తారు. నేనెవరో మీకు తెలుసా అని అంటుంది పద్మావతి. తెలుసు మీరు విక్కీ గారి భార్య అయినా కానీ మిమ్మల్ని లోపలికి రానివ్వద్దని మా బాస్ ఆజ్ఞ అని అంటారు. నేను తలుచుకుంటే మీ ఉద్యోగాలే పోతాయి అని అంటుంది పద్మావతి. అప్పుడే అక్కడికి విక్కీ వచ్చి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటాడు. పద్మావతి తో విక్కీ నువ్వు ఇంటికి వెళ్లడం తప్ప నీ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు పద్మావతి అని అంటాడు. నేను వచ్చింది నేను వెళ్లడానికి కాదు మిమ్మల్ని తీసుకెళ్లడానికి మీరు వచ్చి మా అమ్మానాన్నలకి నిజం చెప్పేదాకా నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను అని అంటుంది పద్మావతి. ఇది ఆఫీసు ఇక్కడ న్యూసెన్స్ చేయకు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నువ్వు ఉండలేవు నీ మంచికే చెప్తున్నాను ఇకనుంచి వెళ్ళిపో అంటాడు. ఇప్పటికే మన పెళ్లి ఎట్లా అయిందో తెలియక మా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ల బాధని పోగొట్టి మా నాయన నాతో బాగుండాలంటే మీరు రావాలి నిజం చెప్పాలి అంతే అని అంటుంది. ఏంటి ఆర్డర్ వేస్తున్నావ అని అంటాడు విక్కీ. బలవంతంగా తాళి కట్టారు కదా ఆ భార్య అన్న ఆకుతోనే ఆర్డర్ వేస్తున్నాను అనుకోండి పదండి ఇంటికి వెళ్లి మా వాళ్లకు నిజం చెబుదాం అని అంటుంది పద్మావతి. వెంటనే సెక్యూరిటీ ని పిలిచి విక్కీ..నన్ను విసిగించకుండా ఇంటికి వెళ్ళు లేదంటే వీళ్లునిన్ను బయటికి పంపిస్తారు. అని సెక్యూరిటీ గార్డ్స్ ని చూపిస్తాడు విక్కీ. పద్మావతి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ని పక్కకు వెళ్ళమంటాడు విక్కి చూడు పద్మావతినా ముందు నిలబడి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అయినా పోనీలే ఏదో పాపమని ఊరుకుంటున్నాను,.ఇంకెప్పుడూ నీ స్థాయిని మర్చిపోయి నాతో మాట్లాడాలని ట్రై చేయకు ఐ సే గెట్ అవుట్ అని అరుస్తాడు అందరి ముందు. పద్మావతి అందరి ముందు అవమానాన్ని భరించలేక, నన్నే అంత మాట అంటారా అని నీళ్లు తీసుకొని విక్కీ మొహాన ఆఫీస్ లో అందరి ముందు కొడుతుంది. ఆఫీస్ లో అందరు విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇద్దరిని.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది.నాకు భయపడి ఈ టెంపరడు వచ్చాడా ఏంటి అని బయటకు వచ్చి చూస్తుంది అప్పుడే అక్కడ ఒక సెక్యూరిటీ ఒక కవర్ ఇచ్చి ఫోన్ తనకు ఇస్తాడు మాట్లాడమని, ఫోన్లో విక్కీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఎందుకంటే నువ్వు షాక్ అవుతావు నీకు వచ్చిన కవర్ ని ఓపెన్ చేసి చూడు, అందులో ఆర్య కి డైవర్స్ అగ్రిమెంటు ఉండి ఉంటుంది. అది చూసి పద్మావతి షాక్ అవుతుంది.