Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 337 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 338 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి ని విక్కీ తన మనసులో మాట బయట పెట్టమని నిలదీస్తాడు. పద్మావతి వికీ నుండి తప్పించుకోవడానికి నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కృష్ణ, విక్కీ పద్మావతిని విడదీయడానికి ఆలోచన మొదలు పెడతాడు.

Nuvvu Nenu Prema: విక్కీ మనసు బాధ పెట్టిన పద్మావతి… ఇక ప్రేమకి ప్రపంచానికి దూరంగా విక్కి..
ఈరోజు ఎపిసోడ్ లో, కృష్ణ, అరవింద నిద్రపోయే వరకు, ఎదురుచూస్తూ ఉంటాడు. అరవింద నిద్రపోగానే, తేలు ఒక డబ్బాలో రాక్ లో దాచి పెట్టి ఉంటాడు. అరవింద్ అని చంపాలని, ఆ తేలున బాక్సుని బయటికి తీస్తాడు.

కృష్ణ ప్లాన్ రివర్స్..
ప్లాన్ ప్రకారం ఒక తేలును అరవింద బెడ్ మీద, అరవింద నిద్రపోయే టైంలో వేసి చూస్తూ ఉంటాడు.అరవింద ఎంతసేపటికి అరవకపోవడంతో, ఏమిటి నేను తేలు వేసాను కదా ఇంకా అరవదేంటి అని దుప్పటి అంతా తీసి చూస్తూ ఉంటాడు. ఎంత వెతికినా కనపడదు. కృష్ణ తేలు ఏమైంది అని అనుకునే టయానికి కృష్ణ వీపు మీద ఏదో పాకుతున్నట్టు కనబడుతుంది. ఏంటి నా వీపు మీద ఏదో పాకుతుంది అనుకొని తేలే అనుకొని కంగారు పడిపోతూ ఉంటాడు. పెద్ద పెద్దగా అరుస్తాడు. ఆరుపులకి అరవింద లేచి ఏమైందండీ అని చూస్తుంది. తేలు వీపు మీద ఉండడాన్ని చూసి వెంటనే షాక్ అవుతుంది. అరవింద కృష్ణ వీపు మీద ఉన్న తేరుని కింద పడేస్తుంది. కృష్ణ ఒకసారి గా ఊపిరి పీల్చుకుంటాడు. నాకేమైనా పర్వాలేదండి మీకేం కాలేదు నాకు అదే చాలు అని అంటుంది. నేనుండగా మీకేం కాదండి అని అంటుంది.

Krishna Mukunda Murari :ముకుంద మీద అలేఖ్య అనుమానం… ముకుంద ప్లాన్ కి హోమం ఆగినట్టేనా…
పద్మావతి, విక్కీ బాధ…
పద్మావతి ఒకటే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నేను విక్కీ గారికి ఇలా చెప్పడం కరెక్టా కాదా, విక్రమ్ ఆదిత్య గారికి మంచి మనిషికి, నేను అబద్దం చెప్పానని బాధ నాకు ఎక్కువగా ఉంది. దాంతో నా గుండెబరువెక్కి పోతుంది.నేను చేసిన దానికి,నా గుండె బద్దలైపోయినా పర్వాలేదు. ఆయన మాత్రం బాధపడకుండా ఉంటే అంతే చాలు. అని తనలో తాను బాధపడుతూ ఉంటుంది.
నా అంతట నేను ప్రశాంతంగా ఉంటున్న జీవితంలోకి నువ్వు వచ్చావు పద్మావతి. నాలో ప్రేమను కలిగించి ఇప్పుడు నన్ను కాదంటున్నావు. ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. ఎందుకు పద్మావతి ఎందుకు ఇలా చేసావ్. అనే విక్కీ కూడా బాధపడుతూ ఉంటాడు. పరిస్థితి వేశారు నా చేత అబద్ధం చెప్పిస్తూ ఉన్నాయి అయినా మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకునేది. నా సంతోషం సర్వస్వం నువ్వే అనుకున్నాను. నువ్వు వేరే వాళ్ళ సొంతం అని చెప్పిన తర్వాత గుండె పగిలి బాధ తప్పసంతోషం ఎలా ఉంటుంది పద్మావతి.జరిగిన తలుచుకుంటే బాధనిపిస్తుంది సారు. అలాగని నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు పద్మావతి. మనసుకి సంతోషం ఇచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి సారు. నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం చెప్పవు. ఎందుకని, నేను కాదు సారీ చెప్పేది అన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. మీ ప్రేమ పంది అదృష్టం నాకు లేదు అని ఇద్దరు ఒకరికొకరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. (బదులు తోచని ప్రశ్న) ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. పద్మావతి అలా చెప్పిందంటే, తను నిజంగా వేరే ఎవరిని ప్రేమించి ఉండొచ్చు. తను ఎవరు ఎందుకు చెప్పలేదు. పద్మావతి ప్రేమించిన పర్సన్ ఎవరో నేను తెలుసుకుంటాను. అని విక్కీ అనుకుంటాడు.

అను హల్దీ ఫంక్షన్…
అను మంగళ స్నానాలు,ఫంక్షన్ కి అందరూ, రెడీ అయ్యి అనుని రెడీ చేస్తూ ఉంటారు. అను నీ వైట్ డ్రెస్ లో తీసుకొచ్చి కూర్చోబెడతారు. పద్మావతి ఎల్లో కలర్ డ్రెస్ లో చాలా అందంగా రెడీ అయి వస్తుంది.అక్క నీకు కాపురం ఇంకా చల్లగా ఉండాలి. నీకు కాపురంలో ఎటువంటి చికాకులు ఉండవు అక్క. అందరూ అలానే దీవించండి మా అక్కని అని అంటుంది. భక్త నువ్వు ఉండగా అసలు అక్కకి ఏ కష్టం రాధమ్మ అని అంటాడు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా అను నీ మాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నావు. నువ్వుండగా తనకేం కాదని ఎప్పటికీ ఏ బాధ ఉండదు అని అంటుంది పార్వతి. మీ అందరి ప్రేమ ముందు నాది ఎంత చెప్పండి అని అంటుంది పద్మావతి. కానీయండి కానీయండి అవతల దుర్మోహత వస్తుంది అన్నిటి పసుపు రాయండి అని అంటుంది అండల్.అందరూ అనుకి పసుపు రాస్తూ ఉంటారు. ఏంటి అందరూ ఇలా సుకుమారంగా రాస్తున్నారు అని అంటుంది పద్మావతి. వెంటనే పసుపు బాగా తీసుకొని, పద్మావతి అను మొహానికి రాస్తుంది. అంతంత ఎవరైనా రాస్తారా అంటుంది అండల్. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పద్మావతి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి అందరికీ రాస్తుంది. నీకు కూడా రాస్తాను అని అంటే నాకు వద్దు అని అంటుంది. నాకొద్దు నేను రాసుకోను అని అంటుంది. అను నిన్ను ఎలా వదిలిపెడతాను నేను, నేనే రాస్తా నుండి వస్తున్నాను అని అంటుంది అను. పద్మావతి పద్మావతి ఇక్కడ నాలాంటి పీసోక్కే ఉంటారు నా డైలాగ్ చెప్పడం కాదు రాయి చూద్దాం అని అంటుంది పద్మావతి. నేను నీకు అక్కని నీకు ఎట్లా పసుపు రాయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు పసుపు రాయలేవు అని అంటుంది పద్మావతి. ఇద్దరూ పరిగెడితే పసుపు రాయడానికి చూస్తూ ఉంటారు. అను కింద పడిపోయి కాలు నొప్పిగా ఉంది అని అంటుంది. వెంటనే పద్మవతి అక్క ఏమైంది అని చెప్పి దగ్గరకు వస్తుంది. ఎక్కడ అక్క నువ్వు చెప్పు ఏమైంది అక్క అని అంటుంది. కాస్త చూసుకొని పరిగెత్తాల్సింది అక్క పడింది అని బాధపడుతుంది. నేనే అనవసరంగా నిన్ను పరిగెత్తించాను. ఏం కాదులే అక్క అని అంటుంది పద్మావతి.

ఆర్యా కి మంగళ స్నానాలు…
ఆర్య వాళ్ళ ఇంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఆర్య వచ్చి, ఫంక్షన్ కి రెడీ అయి కూర్చుని ఉంటాడు. అరవింద్ అని మొదలుపెట్టమని వాళ్ళ అమ్మమ్మ చెబుతుంది. సరే అని అరవింద ఆర్య కుంకుమ పెట్టి మంగళ స్నానాలు చేయించడానికి హారతి ఇస్తూ ఉంటుంది. నూనె తలకి నూనె పెడుతుంది. ఎందుకు నూనె రాస్తున్నారు అని సిద్దు అంటాడు. అరవింద ఈరోజు ఆర్యని, పసుపు రాసి పెళ్ళికొడుకుని చేస్తున్నాం అని చెప్తుంది . అవునా అయితే హెల్తి ఫంక్షన్ అని అంటాడు.అందరూ సంతోషంగా ఉంటారు.ఈ పసుపు రాస్తే పెళ్లి కొడుకు అయిపోతాడా, అంటే పద్మావతి నా పెళ్లి ఫిక్స్ అయితే నాకు కూడా ఇలానే పసుపు రాస్తారు అన్నమాట అని సిగ్గు పడుతూ ఉంటాడు. విచ్చల నీలో నువ్వు నవ్వుకుంటావ్ ఏందిరా అని అంటాడు. రాణమ్మ నేను హెల్ప్ చేసిన అంటాడు కృష్ణ. అవసరం లేదు లెండి అని అంటుంది అరవింద. మన ఆచారం ప్రకారం వాళ్ళ అత్త ఇంటి నుంచి ముందు పసుపు రావాలి. అది రాసిన తర్వాతే మనం రాయాలి అని అంటుంది అరవింద. ఇక్కడ చాలా పసుపు ఉంది కదా అది రాయండి అంటాడు సిద్దు. పాపం పెళ్లి కొడుకు ఎంత సేపు అని ఎదురు చూస్తాడు అని అంటాడు. నేను రాస్తా ఉండు అని చెప్పి అక్కడ ఉన్న పసుపుని సిద్దు ఆర్య కి రాస్తాడు. లేట్ చేయడం ఎందుకని నేనే రాసేసా అని అంటాడు. బ్రో యువాజిట్ అని అంటాడు. పద్మావతి వాళ్ళ ఇంటి నుంచి పసుపు వచ్చాక రాయాలని చెప్పాను కదా, వాడు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయమ్మ అని అంటాడు. సిద్దు ఎలాగూ రాసేసాం కదా మొత్తం రాసేదం అని అంటాడు. హే బ్రో నువ్వు ఎంత చేక్కగా ఉన్నావు తెలుసా అని అంటాడు. అది చెక్కగా కాదురా చక్కగా అని అంటాడు ఆర్య. కావాలని ఆర్యలేచి సిద్ధికి రాయాలని చూస్తాడు. ఆగండి అని ఇంట్లో వాళ్ళందరూ చెబుతాడు. అరవింద హరి అని అరుస్తుంది సైలెంట్ గా కూర్చొ అని. అరవింద నాన్నమ్మ పద్మావతి ఇంటి నుంచి పసుపు పంపించారో లేదో కనుక్కో అమ్మ అని అంటుంది. ఇక్కడ పద్మావతి అను కాలికి నిజంగానే దెబ్బ తగిలింది అనుకోని బాధపడుతూ ఉంటుంది. వెంటనే అను పద్మావతికి పసుపు రాస్తుంది. పద్మావతి కోపంగాచూస్తుంటుంది..
రేపటి ఎపిసోడ్ లో విక్కీ బాధగా కూర్చొని ఉంటే, పద్మావతి వచ్చి ఏంటి బావగారు హల్డి ఫంక్షన్ లో పసుపు కదా రాసేది మీరేంటి, నాకు ఇష్టమే ఉండదు అని అన్నారట పద్మావతి, ఎట్లాగైనా ఈ పసుపు మీకు రాసే తీరుతుంది అని అంటుంది. అది నీ వల్ల కాదు అంటాడు విక్కి. ఎందుకు కాదో చూస్తాను అని పద్మావతి పసుపు తీసుకొని వీరికి రాయడానికి దెగ్గరికి వెళ్తుంది. వెంటనే వికీ లేచి పరిగెడతాడు అదే టైంకి సిద్దు వచ్చి పద్మావతి చేతిలో ఉన్న పసుపు పల్లాన్ని పైకి విసిరేస్తాడు. పసుపంతా పద్మావతి విక్కి ల మీద పడుతుంది. చూద్దాం ఫంక్షన్ రేపు ఎలా జరుగుతుందో,