Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 311 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి ముందు అడ్డంగా దొరికిపోయిన కృష్ణ, పద్మావతి ఏం చేయనుంది…
నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి తన అక్కకు ధైర్యం చెప్పి, లగ్నపత్రిక తగలబడినందుకు దోష పరిహార పూజ, చేయించుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయని ధైర్యం చెప్పి, మనం రేపు ఉదయం షాపింగ్ కి వెళ్ళాలి కదా పడుకో అక్క అని చెప్పి వెళ్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి సిద్ధార్థ అను ఆర్య అరవింద, షాపింగ్ మాల్ కి వస్తారు. ముందు అనుకి పెళ్లి చీర తీసుకుందామని అరవిందా అంటుంది. పద్మావతి కాదు కాదు ముందు మీరు తీసుకోవాలి ఆడపడుచుకు చీర తీసుకున్నాక పెళ్లి చీర తీసుకోమని మా అమ్మ చెప్పింది అని అరవింద్ కు చెప్తుంది. అరవింద కు చీర తీసుకోవడానికి ముందు వెళ్తారు.

Krishna Mukunda Murari: మురారికి శాశ్వతంగా దూరం కానున్న ముకుందా.? రేపటికి సూపర్ ట్విస్ట్
అక్కడ అరవింద ఒక చీరను చూసి ఇలాంటి చీర మా అమ్మ కూడా ఉంది నాకు ఇది బాగా నచ్చింది, ఈ చీరను తీసుకుందామంటుంది.
అరవింద సెలెక్ట్ చేసిన చీరను వేరే వాళ్ళు తీసుకున్నారు అని షాపు వాళ్ళు చెప్తారు. ఆ చీరని తన ముందే వేరే వాళ్లకు ఇచ్చేస్తారు. ఇంకా ఏ చీర మీద అరవింద మనసు వెళ్లదు ఆ చీరనే చూస్తూ ఉంటుంది.
ఇక విక్కీ ఎలాగైనా తన అక్కకు అదే చీర ఇవ్వాలని చీర తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్లి, ఈ చీర మా అక్కకి బాగా నచ్చింది మీకు డబ్బులు అమౌంట్ ఇస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు, ఎలాగైనా ఈ చీర ఇవ్వండి అని బతిమిలాడుతాడు. అయినా వాళ్లు ఆ చీర మా అమ్మాయికి నచ్చింది చెప్పి వెళ్ళబోతూ ఉండగా, పద్మావతి వచ్చి ఒక్క నిమిషం అని ఈసారికి వాళ్ళ అక్క మీద చాలా ప్రేమ తనకి వేరే చీర కొనే స్తోమత ఉన్న మిమ్మల్ని ఇంతలాగా ఎందుకు బతిమిలాడుతున్నాడు, తన అక్కంటే తనకు చాలా ఇష్టం, విక్కీకి తన అక్క మీద ఎంత ప్రేమ ఉందో చెప్పి ఆ చీర ను, విక్కీకి ఇప్పిస్తుంది పద్మావతి. విక్కి చాలా థాంక్స్ పద్మావతి నీవల్లే ఈ చీర మా అక్కకు వచ్చింది అనగానే, లేదు సారు మీ అక్క మీద మీ ప్రేమే ఈ చీరని మీకు దక్కేలా చేసింది అని పద్మావతి అంటుంది.

Brahmamudi: పూజ గదిలోకి కావ్య ని పంపినందుకు అత్తయ్య కి చివాట్లు పెట్టిన అపర్ణ
ఈ చీరలు మీ అక్కకి చూపించి తన కళ్ళల్లో ఆనందం చూద్దాము అని అంటుంది. ఆ చీరను చూసి అరవింద ఎక్కడికి చీర వేరే వాళ్ళు తీసుకున్నారు కదా అని అడుగుతుంది. వెంటనే విక్కీ పద్మావతి అని, తను ఇప్పించినట్లు చెప్పబోతుంటే, పద్మావతి క్రెడిట్ అంతా విక్కీ ది అని చెప్పేస్తుంది. అసలు మీకు ఇలాంటి తమ్ముళ్లు ఉండడం చాలా అదృష్టమని మీ కళ్ళలో బాధని విక్కీ చూడలేరని అందుకే ఈ చీరను తీసుకొచ్చారని చెప్తుంది పద్మావతి. అరవింద అవును పద్మావతి నాకు తమ్ముడైన తండ్రి అయిన విక్కినే అని అంటుంది.
ఇక అను నేను సారీ సెలెక్ట్ చేస్తూ ఉంటాను ఈలోపు, నువ్వు మీ వాళ్లకు తీసుకో అని అరవింద పద్మావతికి చెప్తుంది. ఇక సిద్దు పద్మావతికి ఒక మంచి చీరను గిఫ్ట్ గా ఇద్దామని చీరను చూస్తూ ఉంటాడు. తనకి ఎంత సేపు చూసిన, ఏ చీర సెలెక్ట్ చేయాలో తెలియదు. అటుగా వెళుతున్న విక్కీని పిలిచి ఒక చీరను సెలెక్ట్ చేయమంటాడు, విక్కీ ఎవరికి చీరా అని అడుగుతాడు, ముందు చీరలు సెలెక్ట్ చేయి తర్వాత చెప్తాను అని సిద్దు అంటాడు.
విక్కీ ఒక చీరను సెలెక్ట్ చేయగా వెంటనే విక్కీ మీ అమ్మకి మీ పిన్నికా మీ ఫ్రెండ్ గా అని అడుగుతాడు. సిద్దు ఎవరికీ కాదు నువ్వు ఎవరికీ చెప్పను అంటే నేను నీకు ఈ చీర ఎవరికో చెప్తాను అని, ఆ చీర పద్మావతి కోసం తీసుకున్నట్లు చెప్తాడు. బిక్కి వెంటనే వాట్ అని అరుస్తాడు. సిద్దు పద్మావతి నాది ఒకటే టెస్ట్ అందుకే, పద్మావతి నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటాడు. విక్కీ పట్టరా ని చిరాకుతో ఏంటి పద్మావతి,నువ్వు, చి, నువ్వు వేరు పద్మావతి వేరు, నువ్వు చేస్తున్న పిచ్చి పని వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఊరుకోరు జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సిద్దు వెంటనే బిగ్ బ్రో ఏంటి ఇలా అరిచి వెళ్ళాడు, తను పద్దు ని లైక్ చేస్తున్నాడా.. అని, అయినా ఎవరు ఏమన్నా పద్దు కి చీర ఇస్తాను, తను నాది అని అనుకుంటాడు.

అరవింద ఏ చీర చూపించిన అను నచ్చలేదు అని చెప్తుంది. వెనుక నుండి ఆర్య కి నచ్చలేదు అని చెప్పిన చీరలు,తను కూడా నచ్చలేదు అని చెప్తుంది.అరవింద చాలా చీరలు చూపించిన తర్వాత కూడా నచ్చలేదు అని చెప్తుంది.దీంతో ఇంకా నా వల్ల కాదు మీకు చీర సెలెక్ట్ చేయడం అని అరవింద అంటుంది. అక్కడికి వచ్చిన పద్మావతి మా అక్కకు ఎన్ని చీరలు చూపించినా నచ్చలేదా, తను ఇలా చేయదే అని అనుకుంటుంది, ఇప్పుడు నేను చూపిస్తాను మా అక్కకి అని తను ఒక్కొక్క చీర మీద వేసుకొని వాళ్ళ అక్కకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా వెనక నుండి ఆర్య చీర నచ్చలేదు అని, అనుకి చెప్తూ ఉంటాడు. అది గమనించిన పద్మావతి వెంటనే లేచి అను వెనుక ఆర్యవైపు మీద నచ్చలేదు అని రాస్తుండడం చూసి, ఏం బావగారు ఏం రాస్తున్నారు అని అడుగుతుంది.ఆర్య వెంటనే నేనేం రాయట్లేదు, ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉంటే,చూస్తున్నాను అని అంటాడు. పద్మావతి చూసారా అరవింద్ గారు ఇప్పటిదాకా బావగారు వద్దని చెప్పిన చీరల్ని మా అక్క కూడా వద్దు అని చెప్తుంది. మీ తమ్ముడు కి చీర నచ్చనిది మా అక్కకి కాదు అని అంటుంది. ఇప్పటిదాకా నచ్చినది నీకా ఆర్య అను కి కాదా అని అంటుంది. ఆర్య నవ్వుతూ పెళ్లి చీర కదా అక్క అందుకని అంటాడు..
రేపటి ఎపిసోడ్ లో పద్మావతి, విక్కీ ఇద్దరు ట్రయిలర్ రూమ్ లో ఇరుక్కుపోతారు. బల్లి ని చూసి పద్మావతి, విక్కీని గట్టిగా హాగ్ చేసుకుంటుంది… ఈ రొమాంటిక్ ఎపిసోడ్ చూడ్డానికి రేపటి దాకా ఆగాల్సిందే..