Nuvvu nenu prema: విక్కీని కలవడానికి పద్మావతి వెళ్తుంది.. ఎదురుగా విక్కీ వస్తాడు.. అంతలోనే ఒక కారు స్పీడ్ గా వెళ్లడంతో పద్మావతి కిందపడుతుంది..కాలు బెనికింది.. అయితే నా కారులో వెళ్దాం అని విక్కీ చెబుతాడు.. ఇక కృష్ణ కూడా తన ప్లాన్ లో తాను ఉంటాడు.. మరో నాటకానికి తెర లేపుతాడు.. అసలేం జరిగిందో చెప్పు లేకుంటే టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాం అంటారు పద్మావతి అమ్మ.. విక్కీ మాయల ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణం ఎవరో కాదు.. పద్మావతినే.. అదేంటి అంటుంది అదే నిజం అంటాడు కృష్ణ.. ఇక పద్మావతి విక్కీ కారులో ఇంటికి బయలు దేరుతుంది.. ఇక కృష్ణ తన ప్లాన్ లో ఉంటాడు.. పద్మావతి వాళ్ల అత్త, అమ్మకు నిజం చెబుతాడు.. విక్కీ, మాయల ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి అసలు కారణం ఎవరో తెలుసా?..ఎవరో కాదు పద్మావతినే అంటాడు..

అదేంటి వీరిద్దరి పెళ్లికి అన్ని చేసింది పద్మావతి.. ఒక రకంగా వారిని పెళ్లికోసం రెడీ చేసింది పద్మావతినే.. నువ్వెంటి ఇలా అంటున్నావ్ అంటారు.. అదే మీకు తెలిసింది.. కానీ విక్కీకి మాయ కంటే ఎక్కువ పద్మావతి అంటే ఇష్టం అందుకే క్యాన్సిల్ చేశారు అంటాడు.. పద్మావతి, విక్కీ కలిసి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. అంతేకాదు పద్మావతి ని ఎత్తుకొని ఇంట్లోకి వస్తాడు.. పద్మావతి వాళ్ల అమ్మ ఏమైంది అంటుంది.. యాక్సిడెంట్ అయ్యింది.. కాలు బెనికింది.. మందులు వాడితే తగ్గిపోతుంది.. అంటాడు.. జాగ్రత్త పద్మావతి అని విక్కీ చెబుతాడు.. ఇక వెళ్లి రెస్ట్ తీసుకొనని చెబుతాడు.. విక్కీ దానికి పద్మావతి ముందుకు కదిలి పడబోతుంది విక్కీ పట్టుకుంటాడు.. అది చూసిన పద్మావతి అత్త చూడు నీ కూతురు ప్రేమ ఎలా ఉందో అంటుంది.. మురళి బాబు చెప్పింది ఇప్పటికైనా నమ్ము అంటుంది..

ఇక పద్మావతిని జాగ్రత్త అని చెబుతాడు విక్కీ.. అప్పుడే అను వస్తుంది.. ఏమైంది అంటే విక్కీ నిజం చెబుతాడు.. దానికి అను నేను తీసుకెళతాను అంటుంది.. విక్కీ నానమ్మ, అరవింద మాట్లాడుకుంటారు.. విక్కీ, మాయలతో పాటు అను ఆర్యాల పెళ్లి చేద్దామని దానికి కానీ ఆగిపోయింది కదా అంటుంది నానమ్మ..దానికి పద్మావతి వాళ్ల అమ్మకు ఫోన్ చేస్తుంది.. అను ఆర్యల గురించి పెళ్లి ఏంటో మాట్లాడాలి.. రేపు ఒకసారి రండి మాట్లాడుదాం.. అంటుంది.. అప్పుడే కృష్ణ వస్తాడు..పద్మావతి చేసినడానికి ఏమో.. అందుకే నేను వచ్చినప్పటి నుంచి పద్మావతిని అక్కడికి పంపించొద్దు అంటే వినలేదు.. అను పెళ్లి ఆగిపోతుంది..అందుకే మా పెళ్లి జరిపించండి అంటాడు.. తర్వాయి భాగంలో పద్మావతి, కృష్ణల పెళ్లి కోసం గుడికి తీసుకెళ్తాడు.. నెక్స్ట్ ఎపిసోడ్ లో కృష్ణ, పద్మావతి పెళ్లి జరుగుతుందా? విక్కీ అరవిందలకు నిజం తెలుస్తుందా చూడాలి.
