Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి ఇంట్లో అందరూ కూడా శ్రీమంతానికి రెడీ అవుతూ ఉంటారు. అరవింద శ్రీమంతానికి పద్మావతి చలివిడి చేస్తుంది. అందులో ఎవరికీ తెలియకుండా కృష్ణ విషయం కలుపుతాడు. పద్మావతిమీద నిందపడుతుంది నేను తప్పించుకోవచ్చు అని కృష్ణ కావాలని పద్మావతిని ఇరికించాలని చూస్తాడు.

ఈరోజు443 వ ఎపిసోడ్ లో అరవింద కు శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. పద్మావతి వదిన ఇక మీదట నీ బాధ్యత అంతా మేమే తీసుకోవాలి. ఎందుకంటే నీ కడుపులో పెరుగుతుంది నీ కూతురు మాత్రమే కాదు మా అత్తగారు కూడా, అందుకే ఇకమీదట నువ్వే పనులు చేయకూడదు అన్ని పనులు మేమే చేస్తాము అని అంటే అరవింద పద్మావతి చెప్పిన తర్వాత ఓకే అనకుండా ఎలా ఉంటాను అని అంటుంది. ఖర్చు ఏమో మాది హడావిడేమో మీది అని కుచల పద్మావతి తో అంటుంది.

అరవింద శ్రీమంతం..
ఇక కుచల హడావిడి చేసింది చాలు గానీ తప్పుకోండి అని అంటుంది. పద్మావతి సరే అని అక్కడనుండి పక్కకు వెళుతుంది ఇక కుచల నారాయణ ఇద్దరు అరవింద్ అని దీవిస్తారు. అది చూసి ఇంట్లో అందరూ మెరిసిపోతూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ లో సీత సీమంతం సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక విక్కీ వాళ్ళ అక్క కోసం ఒక బంగారు నగరం తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తాడు.మనకి జన్మనిచ్చిన అమ్మకు తిరిగి జన్మనివ్వబోతున్నవ్ అక్క నువ్వు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందానికి నేను అసలు వెల కట్టలేను కానీ నీకోసం ఒక చిన్న బహుమతి అనిగిఫ్ట్ ని అరవిందపీ ఇస్తాడు ఇది బహుమతి కాదురా మన మధ్య ఉన్న బంధం అని అంటుంది అరవింద.వాళ్ళిద్దరిని చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు. మన అమ్మ మళ్ళీ మనకోసం రాబోతుంది అక్క అని అంటాడు విక్కీ. మరి కాసేపట్లో మీ బంధం తెగిపోతుంది చూస్తూ ఉండండి కాదు నేనే దెబ్బ దెబ్బకొట్టి మీ బంధాన్ని తెంపబోతున్నాను అని కృష్ణ మనసులో అనుకుంటాడు. విక్కీ ఇచ్చిన అనగానే పద్మావతి అరవింద మెడలో వేస్తుంది అది చూసి అరవింద చాలా సంతోషపడుతుంది. మీ ఇద్దరి బంధం ఎప్పటికీ విడిపోకుండా ఇట్నే బలంగా ఉండాలి అని కోరుకుంటున్నా అంటుంది పద్మావతి. ఆర్య అను ఇద్దరూ అరవింద కు గిఫ్టుగా బంగారం బ్రాస్లైట్ ని ఇస్తారు. ఆ తర్వాత పార్వతి బక్త ఇద్దరు అరవింద అనే ఆశీర్వదించడానికి వస్తారు. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా అని అంటుంది పార్వతి. నేను ఇంటి మనసుతో అరవింద్ అని నువ్వు వచ్చి దీవించు అని శాంతాదేవి కృష్ణతో అంటుంది కృష్ణ అరవింద దగ్గరికి వచ్చే అక్షింతలు వేస్తూ మనసులో, సారీరాణమ్మ నీ ఆయుష్ వి శ్రీమంతంలో తీరబోతుంది నీకు నాకు ఈరోజు తో రుణం తీరిపోతుంది. నీ బిడ్డని నువ్వు చూడాలనుకున్న కోరిక నీకు మిగలకుండానే పోతుంది అని కృష్ణ మనసులో అనుకోని అరవిందకు అక్షింతలు వేసి అక్కడి నుంచి పక్కకు వస్తాడు.
Nuvvu Nenu Prema: అరవింద శ్రీమంతం..పద్మావతి చేసిన వంటలో విషయం.. అరవింద బలికానుందా?

పద్మావతి పొరపాటు..
ఇక అరవిందకు అందరూ గాజులు వేస్తూ ఉంటారు.అందరూ వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అన్నీ కూడా అరవింద్ కు పెడుతూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత పార్వతి పద్మావతి తో చలివిడి చేశావు కదా మీ తీసుకొని రా పో అని అంటే అంటుంది. పద్మావతి వెళ్లి చలివిడి తీసుకొని వస్తుంది ఆల్రెడీ అప్పటికే కృష్ణ అందులో విషయం కలిపి ఉండడంతో, చాలా కంగారుగా కృష్ణ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి చలివిడి తీసుకొచ్చి ఇందులో ఒక ప్రత్యేకత ఉంది ఇది నేనే స్వయంగా చేశాను. నీకోసం నీ కడుపులో బిడ్డ కోసమే చేశాను వదిన అని అంటుంది. ఇది తింటే నీ కడుపులో బిడ్డకు నీకు ఆయుష్షు కూడా పెరుగుతుంది వదిన అనిపద్మావతి తన చేతులతో అరవింద నోట్లో పెడుతుంది.తను పెట్టింది కాక ఇంట్లో అందరుని కూడా వచ్చి చలివిడి పెట్టమంటుంది అందరూ వచ్చి ఆ విషయం కలిపిన చలివిడ్ని అరవిందాక పెడుతూ ఉంటారు. అందరూ కలిసి తనని పైకి సాధనంపుతున్నారు. పాపం అరవిందా పెళ్లి పోసుకోకుండానే పైకి పోతుంది అనికృష్ణ మనసులో అనుకుంటాడు.అప్పుడే శాంతాదేవి కృష్ణ నువ్వు కూడా వచ్చి తినిపించు చలివిడి అని అంటుంది సరే అని కృష్ణ కూడా వచ్చి అరవింద కు చలివిడి నోట్లో పెడుతూ మనసులో, ఇక ఇదే చివరి రోజు అని అనుకుంటూ ఉంటాడు.

అపాయంలో అరవింద..
ఇక శాంతాదేవి అను పద్మావతి ఇద్దరూ కలిసి హారతి ఇవ్వండి అని అంటుంది. పద్మావతి హారతి ఇస్తుండగా అరవింద కు కడుపులో నొప్పి వస్తుంది. వెంటనే కృష్ణ తను అనుకున్న పని జరుగుతున్నందుకు సంతోషిస్తాడు. కడుపులో నొప్పి అని పెద్దగా అరవిందా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది శాంతాదేవి వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్దాం పదండి అని అంటుంది.అందరూ కలిసి అరవింద్ హాస్పిటల్ కి తీసుకు వస్తారు ఎంతసేపు లేపిన అరవింద్ స్ట్రక్చర్ మీద అలానే పడుకొని ఉంటుంది విక్కీ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక్కడ డాక్టర్ గారు వచ్చి నేను టెస్ట్ చేసి చెప్తాను ఏమైందో అని ఐసియులోకి తీసుకువెళ్తుంది బయటకి ఏడుస్తూ ఉంటాడు విక్కీ. మీరేం కంగారు పడకండి అరవిందకేమీ కాదు అని పద్మావతి నచ్చ చెప్తూ ఉంటుంది కానీ విక్కీ మాత్రం ఏడుస్తూనే ఉంటాడు కృష్ణ ఇక పద్మావతి మిగలదు, అస్తంతా నాదే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నా బిడ్డకు ఏమవుతుందో ఏంటో అని కుచల కంగారు పడుతూ ఉంటుంది. మీరంతా కంగారు పడకండి తనకేమీ కాదు అంటాడు నారాయణ. పద్మావతి శ్రీనివాస తనకేమీ కాకుండా చూడబ్బా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని అనుకుంటుంది.

పద్మావతి మీద అనుమానం..
ఇక డాక్టర్లు అరవింద్ అని టెస్ట్ చేసి బయటికి వచ్చి, విక్కీ అడిగే ప్రశ్నలకు సైలెంట్ గా ఉంటుంది. మా వదినకి ఏం కాలేదు కదా అని పద్మావతి అనగానే, ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు తన కండిషన్ నేను బాలేదు క్రిటికల్ గా ఉంది అని చెప్తుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక విక్కి అలా ఎలా జరుగుతుంది అని అంటాడు. ఏంటి మీరు అనేది అని అంటాడు. ఇంతకీ తన ఏం తిన్నది అని అడుగుతుంది డాక్టర్ వెంటనే తన శ్రీమంతమని అందరం కొంచెం కొంచెం చలివిడి తినిపించాము అంతేనండి అంటాడు నారాయణ, అయితే దానివల్లే తనకి ఫుడ్ పాయిజన్ అయింది అని అంటుంది. దానివల్లే తనకి తన కడుపులో బిడ్డకి ఎఫెక్ట్ అయింది అని అంటుంది డాక్టర్. అందరూ షాక్ అవుతారు. ఇక అందరూ పద్మావతి వైపు చూస్తారు ఎందుకంటే పద్మావతి చలివిడి చేసి తీసుకొస్తుంది కాబట్టి, విక్కీ పద్మావతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇదంతా చలివిడి వల్లే జరిగిందనిమీరు ఎలా చెప్తారు అంటుంది శాంతాదేవి. మేము టెస్ట్ చేసాము అండి దానివల్లే జరిగింది అని అంటుంది డాక్టర్.మీరు కంగారు పడకండి మాకు చేతనయింది చేస్తాము అని డాక్టర్ లోపలికి వెళ్తుంది. వెంటనే కుచల ఏం పాపం చేసిందే మారవింద ఇలా చేశావు నువ్వు అని అంటుంది.నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంది కదా,అలాంటి దానికికడుపు పోవాలని ఇలాంటి కుట్ర చేస్తావా అని అంటుంది పద్మావతి తో,నువ్వు అసలు మనిషివేనా,అని కుచల ఏడుస్తూ అంటుంది. మీరందరూ డాక్టర్ చెప్పింది విన్నారు కదా చలివిడి తినడం వల్ల ఇలా జరిగిందని, ఆ చలివిడి చేసింది ఎవరు ఈ మహాతల్లి కదా అని అంటుంది కుచల.
రేపటి ఎపిసోడ్ లోఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే,కడుపులో బిడ్డకి గ్యారెంటీ చెప్పలేము అని అంటారు డాక్టర్స్, వెంటనే విక్కీ పద్మావతి తో, పాముకి రోజు పాలు పోసిన అది కాటేసే తీరుతుంది నువ్వు అలానే అని అంటాడు. పద్మావతి ప్రమాణస్పూర్తిగా చెప్తున్నాను నేను అందులో ఏమీ కలపలేదు అని అంటుంది. మా అక్క క్షేమంగా ఉండాలంటే నీ చూపు కూడా తన మీద పడడానికి వీల్లేదు గెటవుట్ అంటాడు విక్కీ. పద్మావతి అమ్మవారి గుడికి వెళ్లి, పద్మావతికి తన కడుపులో బిడ్డని కాపాడాలని మొక్కుకొని మెట్ల మీద మోకాళ్ళతో నడుస్తుంది.