Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 313 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో అను ఆర్యాల పెళ్లి షాపింగ్ జరుగుతుంది. పద్మావతి కృష్ణకు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో అను పద్మావతి షాపింగ్ నుంచి తెచ్చిన బట్టలను చూసుకుంటూ ఉంటారు. పద్మావతి అనూతో అక్క రేపు ఏంటో నీకు గుర్తుందా అని అంటుంది. అను నాకేం గుర్తులేదు అమ్మి ఏంటో చెప్పు అంటుంది. నీకే గుర్తు లేకపోతే ఇంకా బావగారికి ఎలా గుర్తుంటుంది అక్క అంటుంది. అను రేపు ఏంటో చెప్పు అమ్మి అంటుంది. నీ పుట్టిన రోజు కదా అక్క మర్చిపోయావా, ఇక బావగారికి ఎలా గుర్తుంటుంది మర్చిపోయావుంటారు, అందుకే నీకు ఇంత వాడికి ఫోన్ చేయలేదు అని, పద్దు,అను ని ఆటపట్టిస్తూ ఉంటుంది.

ఇక ఆర్య ఇంట్లో టెన్షన్ గా తిరుగుతూ ఈరోజు అను పుట్టినరోజు 12 గంటలకు ఇంకా గంట మాత్రమే ఉంది. తనని కలిసి ఎలా విష్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.అక్కడికి సిద్దు వచ్చి ఎందుకు టెన్షన్ గా ఉన్నావు బ్రో అంటాడు. ఆర్య ఇవాళ అను పుట్టినరోజుఎలా విష్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటారు.ఏముంది బ్రో? ఫోన్ చేసి విష్ చెయ్ అని అంటాడు, ఫోన్లో కాదు తన డైరెక్ట్ గా కలిసి సప్రైజ్ చేయాలి బయటకు తీసుకెళ్లి అని అంటాడు ఆర్య. ఆ విషయం తనకి చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు అని, సిద్దు విక్కీ ఇద్దరు టెన్షన్ గా ఉంటారు.
Brahmamudi: స్వప్న కి కావ్య గురించి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టిన రాహుల్.. తర్వాత ఏమైందంటే!
అదే టైంకి అక్కడికి విక్కీ వస్తాడు విక్కీ తో ఆర్య నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఈరోజు అను పుట్టినరోజు తనని కలిసి విషెస్ చెప్పాలి అనుకుంటున్నా నువ్వు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి. అను ఫోన్ కలవడం లేదు తనని బయటికి రమ్మని ఎలా అడగాలి, నువ్వు ఏదో ఒకటి చెప్పు అని విక్కిని అడుగుతాడు. విక్కీ అను ఫోన్ కలవకపోతే పద్మావతికి ఫోన్ చెయ్యి అనుకి,ఇవ్వమని అడుగు అని అంటాడు.
ఆర్య నేను కాల్ చేస్తే పద్మావతి నాతో ఆడుకుంటుంది అందుకని నువ్వే కాల్ చేసి, పద్మావతి తో మాట్లాడు అని అంటాడు. నేనా నేను ఈ టైంలో ఫోను అని ఆలోచిస్తూ ఉంటాడు, విక్కీ. వెంటనే సిద్దు నువ్వు ఫోన్ చేయకపోతే నేను చేస్తాను,పద్దుకి అంటాడు. పద్దు కి కాల్ చేసి, అను కి ఒకసారి ఫోన్ ఇవ్వు ఈరోజు తన పుట్టినరోజు కదా మా ఆర్య తనతో మాట్లాడతాడు, అని అంటాడు. పద్మావతి విక్కి తో పుట్టినరోజు ఎవరిది, మా అక్కది, విషెస్ చెప్పేది ఎవరు బావగారు,మరి మీరు ఎందుకు కాల్ చేశారు? ఆయనే చేయమనండి అప్పుడు చూద్దాం అంటుంది.
అదేంటి పక్కనే ఉన్నాడు నువ్వు ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటాడు. చూడండి సారు పద్మావతి పద్మావతి ఇక్కడ తగ్గేదేలే, ఆయనే ఫోన్ చేయమనండి అప్పుడు చూసుకుందాం అని, అంటుంది. వెంటనే ఆర్య ఫోన్ తీసుకొని పద్మావతి, నేను ఎలాగైనా ఒకసారి ఆను తో మాట్లాడాలి, తనని బయటకు తీసుకెళ్లి, సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు. పద్మావతి సరే బావగారు మీరు ఇక్కడికి వచ్చాయండి నేను అనుతో మాట్లాడి బయటికి వెళ్లడానికి,అను ని ఒప్పిస్తా అని అంటుంది.

ఈ ఆర్య,విక్కీతో నువ్వు నాతో పాటు అను వాళ్ళ ఇంటికి రావాలి రా, అని అడుగుతాడు విక్కి సరే అని అంటాడు. కార్ దగ్గరికి వచ్చేటప్పటికి, సిద్ధూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆర్య సిద్దుతో నువ్వెక్కడికి నేను అను అను కోసం వెళ్తున్నాను విక్కీ నా కోసం వస్తున్నాడు నువ్వు ఎక్కడికి, ఎవరికోసం అని అంటాడు. సిద్దు నేను నా రోజ్,కోసం మీతో పాటు వస్తాను. నీ రోజా రోజు ఎవరు అని అంటాడు విక్కి, రోజ్ అంటే పద్మావతి నేను పద్మావతి కోసం మీతో పాటు వస్తాను అని అంటాడు సిద్దు. విక్కీకి కోపం వస్తుంది, పిచ్చిపిచ్చిగా ఉందా ఇక్కడే ఉండు నువ్వు అని అరుస్తాడు, సిద్దు ఎందుకు నీకు అంత ఆవేశం నేను జస్ట్ పద్మావతిని చూడడానికే వస్తున్నాను అని అంటాడు. అయినా విక్కీ ఒప్పుకోడు, ఆర్య విక్కీకి నచ్చచెప్పి తీసుకెళ్తాడు.
Brahmamudi: స్వప్న కి కావ్య గురించి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టిన రాహుల్.. తర్వాత ఏమైందంటే!
అను, పద్దు ఇద్దరు బట్టలు సర్దుకుంటూ ఉంటారు అక్కడికి వాళ్ళ అత్త వచ్చి, టైం ఎంత అవుతుంది ఇంకా పడుకోకుండా ఏంటే సర్దుతున్నారు వెళ్లి పడుకోండి అయినా ఇంత టైం అయితే తలుపు వేయకుండా అర్ధరాత్రి పూట ఏంటి మీరు, అని తలుపు వేయడానికి వెళ్ళబోతూ ఉంటుంది, పద్మావతి అత్త అని గట్టిగా అరుస్తుంది. ఏంటే అట్లా అరిచావు అని అంటుంది వాళ్ళ అత్త, అసలే ఎండాకాలం చల్లగాలి కోసం, నేను తలుపు తీసి పెడితే నువ్వు వేస్తావ్ ఏంటి నువ్వు వెళ్లి పడుకో అత్త మేము తలుపులు వేసుకొని పడుకుంటాంలే అంటుంది పద్మావతి. ఇక విక్కీ కారుని ఇంటికి కొంచెం దూరంగా ఆపుతాడు, ఇంకా పద్మావతి బయటికి రాదు అంటా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద్మావతి ఎలాగైనా వాళ్ళ అత్తని లోపలికి పంపించి, ఆర్య కి ఫోన్ చేయాలి అనుకుంటుంది.విక్కీ పద్మావతికి ఫోన్ చెయ్యి అని అంటాడు పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేయలేదు విక్కీ ఆర్యతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా ఇక డైరెక్టుగా నువ్వే వెళ్లి లోపలికి అని అంటాడు. ఆర్య సరే అని లోపలికి వెళ్లడానికి, గుమ్మం బయట నించు అని ఎవరైనా ఉన్నారా, వాళ్ళ అత్త అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అని తొంగి తొంగి లోపలికి చూస్తూ ఉంటాడు. సిద్దు కూడా ఆర్యతో పాటే వెళ్లాలని ట్రై చేయబోగా, విక్కీ ఎక్కడికి నువ్వు అని అడుగుతాడు. సిద్దు నేను ఆర్య కి హెల్ప్ చేయడానికి వెళ్తాను అని అంటాడు. ఏం అవసరంలా వాడి వల్ల వస్తాడు నువ్వు ఇక్కడే నాతోపాటు ఉండు అని అంటాడు. నీకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంగతి తెలియదు, వాళ్ళ అత్తకి కొంచెం అనుమానం వచ్చినా నేను చితక్ కొడుతుంది అని, సిద్దు ని భయపడతాడు విక్కి. అమ్మో అయితే వద్దులే ఇక్కడే ఉంటాను అని సిద్దు కారులోనే విక్కి తో పాటు ఉంటాడు.
పద్దు వాళ్ళ అత్తని లోపలికి పంపించడానికి, అన్ని విధాల ట్రై చేస్తూ ఉంటుంది…
రేపటి ఎపిసోడ్ లో,పద్దు కోసం విక్కీమిరపకాయ బజ్జీలు తెచ్చి ఇస్తాడు. పద్దు తినబోతూ ఉండగా, ఒక్క నిమిషం, ఇందాక నా గురించి నువ్వు అలా మాట్లాడినందుకు సారీ చెప్పి, బజ్జీ తిను అంటాడు.పద్మావతి అయితే ఇప్పుడు మనం ఒక పోటీ,పెట్టుకుందాం, ఐదు నిమిషాల్లో ఎవరైతే ఈ మిరపకాయ బజ్జీలని తింటారో, వాళ్లు గెలిచినట్టు అని అంటుంది. విక్కీ చాలా కారంగా ఉన్న బజ్జీని తింటూ ఉంటాడు, పద్మావతి మాత్రం కారం తట్టుకోలేక మంచినీళ్లు తాగుతుంది. పద్మావతి విక్కీతో సారు.. నేను ఏదో సరదాకి అన్నాను ఇంతకారం మీరు తినలేరు, వదిలేయండి సారు..అని అడుగుతుంది.
విక్కీ ఇష్టమైన వాళ్ళ కోసం కారం ఏంటి పద్మావతి,విషం ఇచ్చిన తింటాను. అని,పద్మావతి మీద తనకున్న ప్రేమనిమరోసారి బయట పెడతాడు.చూడాలి పద్మావతి ఏం చేయబోతుందో….