Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి, అనులని పుట్టింటికి రమ్మని భక్తా చెప్పి వెళ్తాడు. ఇద్దరు అక్క చెల్లెలు పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతారు. అను ఆర్య ముందే కిందకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. పద్మావతి విక్కీ నీ ఒప్పిస్తూ ఉంటుంది. పద్మావతి ఎంత చెప్పినా విక్కీ వాళ్ళ ఇంటికి రావడానికి ఒప్పుకోడు. పద్మావతి మెడలో ఉన్న పసుపు తాడు తీసి బంగారపు తాళి కట్టించడానికి, కుటుంబ సభ్యులందరూ ఏర్పాట్లు చేస్తారు. ఆ విషయం విక్కీకి పద్మావతి చెప్తుంది. భార్యగా ఎప్పటికి నేను నిన్ను ఒప్పుకోలేను అని చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి తాళి కట్టించే ప్రయత్నం ఏంటి పద్మావతి అని విక్కీ కోప్పడతాడు. అరవింద విక్కీ పద్మావతి రూమ్ దగ్గరికి వస్తుంది. విక్కీ పద్మావతి తో మనది ఒప్పందం ప్రకారం చేసుకున్న పెళ్లి ఈ మూడు నెలలు గడవగానే నువ్వు వెళ్లిపోవాలి అని అంటాడు ఆ మాట విని అరవింద, ఒకసారి గా షాక్ అయి కళ్ళు తిరిగి పడబోతుంది.

ఈరోజు471 వ ఎపిసోడ్ లో అరవింద విక్కీ పద్మావతి తో గొడవ పడుతూ ఉంటుంది. మీరిద్దరూ ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకుంటే అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పమని బలవంతం చేస్తుంది. ఎక్కడ నిజం తెలిస్తే అరవింద ఇంకా బాధ పడుతుందో అని ఇద్దరు సైలెంట్ గా చెప్పకుండా ఉంటారు. కానీ అరవింద్ మాత్రం వదిలిపెట్టకుండా మీరు గనక ఇప్పుడు నాకు ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటుంది. శ్రీనివాస ఎందుకబ్బా ఇలా చేస్తున్నావు ఎవరికోసమైతే మేమిద్దరం మీ బాధ భరిస్తున్నాము ఇప్పుడు ఆవిడకే ఈ నిజం తెలిస్తే తను ఎట్లా బతకగలదు అయినా దేవుడా ఇప్పుడు ఎలా చెప్పాలి ఆమెకి అని అనుకుంటుంది. విక్కీ కూడా మనసులో నీ భర్త దుర్మార్గుడు అని నేను నీతో ఎలా చెప్పాల అక్క అని, మనసులో అనుకుంటూ ఉంటాడు.

అరవింద బెదిరింపు..నిజం చెప్పిన పద్మావతి..
ఇక అరవింద మీరిద్దరూ చిన్న పిల్లలు ఏం కాదు తెలియక ఏదో పెళ్లి చేసుకొని వచ్చారు అని అనుకోవడానికి ఇద్దరు పెద్ద వాళ్ళ ఇంటి పెళ్లి చేసుకొని వచ్చి ఇప్పుడు ఏమి తెలియదు అన్నట్టు సైలెంట్ గా ఇలా ఉంటే ఎలా, ఇప్పుడు నిజం కనుక నువ్వు చెప్పాల్సిందే విక్కీ లేదంటే నేను ఇక్కడికి ఇక్కడే చనిపోతాను అని బెదిరిస్తుంది. అరవింద్ అన్న మాటలకి విక్కీకి ఏం చెప్పాలో తెలీక చాలా బాధపడుతూ ఉంటాడు నిజం తెలిస్తే అరవింద్ అసలు తట్టుకోలేదు అలాగని నిజం చెప్పకపోతే వదిలిపెట్టేలా లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పద్మావతి చేసేదేం లేదు ఇప్పుడు అరవింద గారికి ఏదైనా చెప్పకపోతే తను మాత్రం మనల్ని వదిలి పెట్టేలా లేదు అని మనసులో అనుకొని ఏదైతే అది అయింది నింద నా మీద వేసుకుంటాను నిజం తెలిస్తే, విక్కీ గారు కూడా తట్టుకోలేరు అరవింద్ గారికి ఏమన్నా అయితే అని పద్మావతి వేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇంకొకసారి అడుగుతున్నా నిజం చెప్తారా లేదా అని అంటుంది అరవింద వెంటనే పద్మావతి నేను చెప్తాను వదిన అని అంటుంది. విక్కీ చాలా కంగారు పడతాడు ఎక్కడ నిజం చెబుతుందో అని కానీ పద్మావతి నిజం చెప్పదు. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం నేనే వదినా, నన్ను మా వాళ్ళని ఒకడు మభ్యపెట్టి నా తో ఎంగేజ్మెంట్ చేయించుకున్నాడు కదా మీకు గుర్తుందా అని అంటుంది. గుర్తుంది అని అంటుంది అరవింద ఆ నీచుడు, ఒకవైపు మా అక్క పెళ్లి జరుగుతుంటే మరోవైపు వచ్చి దాంతో తాళి కట్టించుకోవాలని చూశాడు నాకు చేసేదేమి పాలిపోక ఇక వెంటనే విక్కీ దగ్గరికి వచ్చి విక్కీతో బలవంతంగా తాళి కట్టించుకోవాలనుకున్నాను. అప్పుడు ఆ నీచుడు నాకు పెళ్లయిపోయింది కాబట్టి నన్ను వదిలి పెట్టేస్తాడు అని ఆలోచనతోనే ఇలా చేశాను ఇందులో విక్కీ గారు తప్పేం లేదు అంతా తప్పు నాదే నేనే బలవంతం చేసి విక్కీ గారితో తాళి కట్టించుకున్నాను అని చెప్తుంది.
Madhuranagarilo November 17 2023 Episode 212: శ్యామ్ ఏం నిర్ణయం తీసుకుంటాడు ఫారన్ కి వెళ్తాడా లేదా..

ఆ నీచుడు ఎవరు?
పద్మావతి చెప్పినదంతా అరవింద విని, అయితే నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ నీచుడెవరు అని అంటుంది. ఏం చెప్పాలో తెలియక పద్మావతి సైలెంట్ గా ఉంటుంది విక్కీ వైపు చూస్తుంది విక్కీ పద్మావతి తో చెప్పద్దు అని అంటాడు. ఇప్పుడు ఆ నీచుడు నీ భర్త అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు వదిన అని మనసులో అనుకోని, ఇప్పుడు ఆ నీచుడు నా మెడలో విక్కీ గారు తాళి కట్టిన తర్వాత నాకు అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడి గురించి ఎందుకు వదిన వాడు ఇప్పుడు నా జోలి రావట్లేదు అని అంటుంది. ఇప్పుడు మీరు ఇంత ఎమోషనల్ అవ్వద్దు అని అంటుంది పద్మావతి. ఆ నీచుడు వివరాలు నాకు ఇవ్వండి నేనే వాడి అంత తేలుస్తాను అని అరవింద అంటుంది చెప్తున్నాను కదా వదినా ఆ నీచుడు ఇప్పుడు ఇక్కడ లేడు వాడేటో వెళ్లిపోయాడు ఇప్పుడు నా దరిదాపిల్లో కూడా రావట్లేదు అని అంటుంది. ఇక విక్కీ కూడా అవునా అక్క నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అని అంటాడు.

విక్కీ తో ప్రామిస్ చేయించుకున్న అరవింద..
ఇక పద్మావతి చెప్పింది అంతా విని అరవిందా ఒక నిర్ణయానికి వస్తుంది. పద్మావతి విక్కీ తో మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒప్పందం ప్రకారమే జరిగిందో ఎవరి బలవంతంగా జరిగిందో అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. పెళ్లి జరిగింది కాబట్టి అది అగ్నిసాక్షిగా నువ్వు తాళి కట్టావు కాబట్టి, మనం ఆ తాళికి విలువ ఇవ్వాల్సిందే, లేదంటే ఆ వివాహ బంధానికి అర్థం ఉండదు. ఏం చెప్తుందో ఇద్దరికీ అర్థం కానట్టు చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు మీరిద్దరూ ఏం చేసినా అది మన రెండు కుటుంబాల క్షేమం కోసం చేశారని నాకు అర్థమైంది. ఇక మీదట కూడా మన రెండు కుటుంబాల సంతోషం మీ ఇద్దరి మీదే ఆధారపడి ఉంది అని అంటుంది అరవింద. కాబట్టి జరిగిందాని గురించి కాకుండా ఇక ముందు జరగబోయే దాని గురించి కూడా ఆలోచించండి అని అంటుంది అరవింద. మీ భార్యాభర్తల బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటుంది దానికి విక్కీ షాక్ అవుతాడు పద్మావతి సంతోషిస్తుంది. అక్క అది అని విక్కీ ఏదో చెప్పబోతుంటే నువ్వే మాట్లాడకు విక్కీ అని అంటుంది అరవింద. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నువ్వు పద్మావతి కలిసిమెలిసి ఉండాలి అని అంటుంది అరవింద. ఒకరంటే ఒకరు ప్రాణంగా బతకాలి ఇష్టం లేనట్టు ఇలా ఇంకొకసారి నా ముందు కనిపించకూడదు. అలాగని నాకు ఇప్పుడే ఇక్కడే నువ్వు మాట ఇవ్వాలి విక్కీ అని అడుగుతుంది. విక్కీ సైలెంట్ గా ఉంటాడు అరవింద ఏంటి చూస్తూ ఉన్నావ్ మాట ఇవ్వవా అని అంటుంది. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు మాటిచ్చి తీరాలివికి అని అంటుంది అరవింద్ కానీ విక్కీ చాలా ఆలోచిస్తాడు అసలు ఈ పద్మావతి జీవితాంతం ఎలా భరించాలి అని, ఇక వాళ్ళ అక్క కోసం వాళ్ళ అక్క చేసిన త్యాగాలు అన్ని గుర్తు చేసుకుని నీకోసం మాటిస్తున్నాను అక్క పద్మావతి అంటే ఇప్పటికి నాకు ఇష్టం లేదు నీ సంతోషమే నాకు ముఖ్యం అని మనసులో అనుకొని మాట ఇస్తాడు. అరవింద చాలా సంతోషపడుతుంది పద్మావతి కూడా సంతోషపడుతుంది.

మళ్లీ పెళ్లి చేసుకోవాలి అన్న అరవింద..
ఇక విక్కీ మాట ఇచ్చిన తర్వాత అరవింద సంతోషపడుతుంది పద్మావతిని కూడా మీరు కూడా మాట ఇవ్వండి అని అంటుంది సరే అని పద్మావతి కూడా సంతోషంగా మాటిస్తుంది. విక్కీ నీకోసమే ఇదంతా చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. ఇక పద్మావతి మాత్రం మా ప్రేమ నిజమైనది. ఆ దేవుడే ఇలా చేయించాడు అని అనుకొని మాట ఇచ్చి సంతోషపడుతుంది ఇక అరవింద,ఇప్పుడు నువ్వు ఇంకో పని కూడా చేయాలి విక్కీ ఏ రోజైతే నీ తులాభారం ఇప్పుడు పద్మావతి పసుపుతాడు కట్టుకుందో ఇప్పుడు అందరి సమక్షంలో నువ్వు ఆ పసుపుతాడు తీసేసి, బంగారపు తాలిని కట్టాలి అని అంటుంది. అప్పుడు అందరి కుటుంబ సభ్యుల ముందు మీ పెళ్లి జరిగినట్టు ఇక ఈ ఒప్పందం పెళ్లిని పక్కన పెట్టేసి ఇదే నిజమైన పిల్లనుకొని మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి అని అరవింద్ చెప్తుంది. తాళి కట్టిన తర్వాత నువ్వు పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్లి రావాలి అని కూడా చెప్తుంది అన్నిటికి అరవింద సరే అంటాడు. ఇక పద్మావతి చాలా సంతోషించి మీరిద్దరూ మధ్యలో ఎప్పుడైనా సరే వదిలిపెట్టుకొని ఒకరికొకరు విడిపోవాలనుకున్న ఈ ఒప్పందం ప్రకారం మళ్లీ మీ మధ్య టాపిక్ వచ్చినా కానీ, ఇద్దరూ చనిపోతారు జాగ్రత్త అని అంటుంది. ఇద్దరు ఎవరు చనిపోతారు అని పద్మావతి వికీ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అరవిందవైపు, ఒకటి నేను ఇంకొకటి నా కడుపులో పెరుగుతున్న మన అమ్మ అని అంటుంది అరవింద వెంటనే విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాంటి మాటలు అనొద్దక్క అని అంటాడు. నేను అలా అనకుండా ఉండాలన్నా అలా జరక్కుండా ఉండాలన్న అది మీ చేతుల్లోనే ఉంది అని అంటుంది అరవింద. ఇక ఇద్దరినీ తీసుకొని కిందకి వస్తుంది తాళి కట్టించడానికి.
ఆర్య అనుమానం..
పద్మావతి విక్కిలని చూసి ఆర్య ఏంటి మీరిద్దరూ ఇలా ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా లేరు అని, అడుగుతాడు ఆర్య, నారాయణగూడ ఏంటి ఇద్దరూ అలా ఉన్నారు అని అరవింద్ అని అడుగుతాడు ఇప్పుడు అరవింద్ కానీ నిజం చెప్తుందేమోనని విక్కీ పద్మావతి ఇద్దరూ భయపడతారు. ఇప్పుడు పైన జరిగినదంతా అక్క అందరితో చెప్పేస్తే ఎలా అని విక్కీ భయపడుతూ ఉంటాడు. పద్మావతి కూడా ఈ విషయం ఇప్పుడు అనుకి తెలిస్తే వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పేస్తుందని భయపడుతుంది. కానీ అరవిందా ఏమి చెప్పదు, వీళ్ళిద్దరికీ ఒకరుంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసింది బాబాయ్ అని అంటుంది అరవింద. అక్కడికి వెళ్తే విక్కీకి ఆఫీస్ వరకు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని వెంటనే వచ్చేద్దామని, పద్మావతి అక్కడే కొన్ని రోజులు ఉందామని గొడవ పడుతున్నారు నేను వెళ్లేసరికి, అని అరవింద కవర్ చేస్తుంది. ఇద్దరికీ సర్ది చెప్పేప్పటికి ఈ టైం అయింది అందుకే ఆలస్యంగా కిందకి వచ్చాము అని అంటుంది అరవింద. మనం కంగారు పడడమే గాని వాళ్ళిద్దరి మధ్య ఏముంది ప్రేమ,అభిమానం తప్ప అని కవర్ చేస్తుంది అరవింద.అక్క కోసం తాళి కట్టిన విక్కీ..
ఇక జరగాల్సిన కార్యక్రమం చూద్దామమ్మ ముహూర్తం దాటిపోతుంది అని పంతులుగారు అంటారు. అప్పటికే విక్కీ పద్మావతికి మళ్లీ పెళ్లి చేయడానికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరిగి ఉంటాయి. విక్కీ చాలా ఆలోచిస్తాడు పంతులుగారు వచ్చి కూర్చోమంటే కానీ పద్మావతి మాత్రం చాలా సంతోషిస్తుంది మన ప్రేమ నిజమైంది కాబట్టే మళ్లీ మీరు నా మెడలో తాళి కట్టి నన్ను మీ భార్యగా జీవితాంతం ఉండడానికి ఒప్పుకుంటున్నారు అని, ఇక అరవింద్ కి నచ్చ చెప్పాలని చూస్తుంది. చూడు విక్కి మీ పెళ్లి ఆల్రెడీ ఒకసారి గుడిలో జరిగిపోయింది దైవ సాక్షిగా అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లి ఎప్పటికీ విడిపోదు. ఆ బంధం శాశ్వతంగా అలానే ఉంటుంది. నువ్వు ఎంత కాదన్నా ఎంత అవునన్నా పద్మావతి నీ భార్య ఇప్పుడు పద్మావతిని పసుపుతో వాళ్ళ ఇంటికి పంపించడం మనకి గౌరవంగా ఉండదు అందుకోసమే ఇప్పుడు నిన్ను తాళికట్టమని చెప్పేది అని అంటుంది. కుచల కూడ పద్మావతిని అలా పంపిస్తే మన పరువు పోతుంది విక్కీ అని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ బలవంతం చేస్తారు. ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అని అంటాడు విక్కీ అయినా వాళ్ళు ఒప్పుకోరు ఇక అరవింద కోసం, తన సంతోషం కోసం, తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో అరవింద తాళి తీసి విక్కీకి ఇస్తూ, ఒప్పందం ప్రకారం విడిపోవాలనుకున్న మీకు ఈ తాలిబంధంతో జీవితాంతం ముడిపడి ఉంటారు అని ఆశిస్తున్న, ఇప్పటికైనా మీ మధ్య ఉన్న అపార్ధాలు అన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఈ తాలిని నీకు ఇస్తున్నాను విక్కీ అని అనుకొని అరవింద ఇస్తుంది. విక్కీ అరవింద వైపు చూస్తూ, నీకోసమే ఇదంతా చేస్తున్న అక్క అని అనుకుంటాడు.