Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీ మీద సవాల్ చేసి ఇంటికి వస్తుంది. విక్కీ పద్మావతినిబెదిరించి ఇంటికి వెళ్ళమని చెప్తాడు.పద్మావతి ఇంటికి వెళ్ళేది లేదు ఎలాగైనా సరే విక్కీతో నిజం చెప్పించాలి ఇంట్లో వాళ్లకి అని అనుకుంటుంది. ఆర్యా నీ కన్వెన్స్ చేసి అనుకి విడాకులు ఇవ్వకుండా చూడాలి అని అనుకొని ఆఫీస్ కి వెళ్తుంది.

ఈరోజు418 వ ఎపిసోడ్ లో, పద్మావతి ఆఫీసులో, విక్కీ క్యాబిన్ లో కూర్చుని, బాస్ లో ఫీల్ అవుతూ ఉంటుంది అదే టయానికి విక్కీ అక్కడికి వస్తాడు. విక్కీని చూసి పద్మావతి,నేనేం భయపడలేదు మీకు, అని అంటుంది. ముందు నా చైర్ లో నుంచి నీకు ఎంత ధైర్యం ఉంటే నా చైర్ లో కూర్చుంటావు అని అంటాడు విక్కీ. పద్మావతి ముందు మీరు మా ఇంటికి వచ్చి నిజం చెప్పండి నేను మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను అని అంటుంది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు పద్మావతి నేను చెప్పినట్టుగా నువ్వు ఇంకొక గంటలో ఇంటికి వెళ్ళాలి. లేదంటే నేను నీకు ఇంటికి పంపించిన డైవర్స్ పేపర్ మీద మారియా చేత సంతకం పెట్టిస్తాను. మీ అక్క ఇంకా శాశ్వతంగా ఇంట్లోనే ఉంటుంది అని బెదిరిస్తాడు పద్మావతి. వెంటనే పద్మావతి నేను ఆర్యభవతో మాట్లాడి అంత నిజం చెప్తాను అని బయలుదేరబోతూ ఉండగా విక్కీ పద్మావతిని క్యాబిన్లో పెట్టి తాళం వేసి బయటికి వెళ్లిపోతాడు.
Nuvvu Nenu Prema: పద్మావతిని బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ.. ఆర్యా,అనుకి విడాకులు ఇవ్వనున్నాడా?

ఆర్యతో సంతకం చేయించిన విక్కీ..
విక్కీ లాయర్ తో మాట్లాడి ఆర్య క్యాబిన్లోకి వెళ్లి ఆర్యతో పేపర్స్ మీద సంతకాలు పెట్టమని చెప్తాడు. ఆర్య ఇంకొకసారి ఆలోచించు అని అంటాడు. లేదు కచ్చితంగా నేను అనుకున్నది జరగాల్సిందే నువ్వు నన్ను నమ్మావు కదా సంతకం పెట్టు అని అంటాడు విక్కీ.పద్మావతి లోపల డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చి ఏంటి మేడం అని అడిగితే తాళం తీసి కింద తాళం వేసింది అని చెప్తుంది. ఆఫీస్ బాయ్ తాళం తీసిన తర్వాత పద్మావతి ఫాస్ట్ గా ఆర్య క్యాబిన్ కి పరిగెడుతుంది. అప్పుడే విక్కీ ఆర్య ని కన్విన్స్ చేసి సంతకం పెట్టిస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. విక్కీ పద్మావతిని చూసి చూసావా నేను అనుకున్నది సాధించాను అని సైగ చేస్తాడు పద్మావతికి పద్మావతి చాలా కోపంగా బాధగా ఆర్య దగ్గరికి వెళ్లి ఆర్యా అని అడుగుతుంది.

విక్కీ కోసం నా ప్రాణమైన ఇస్తాను అన్న ఆర్య..
పద్మావతి ఆర్య దగ్గరికి వెళ్లి బావగారు మీరు చేస్తున్నది నాకు అసలేం నచ్చట్లేదు అని అంటుంది. ఏమైంది పద్మావతి ఇప్పుడు అని అంటాడు మీరు సంతకం పెట్టడం ఏంటి అని అంటుంది. విక్కీ చెప్పాడు పెడుతున్నాను అని అంటాడు.ఆయన ఏది చెప్తే చేస్తారా మీరు? మీకంటూ ఒక ఆలోచన ఉండదు అని అంటుంది. విక్కీ చెప్పాడు అంటే అది నా మంచి కోసమే అయ్యుంటుంది. విక్కీ కోసం నా ప్రాణమైన ఇస్తాను పద్మావతి అని అంటాడు. మా అక్క గురించి ఏమన్నా ఆలోచించారా అని అంటుంది.విక్కీ ఏది చేసినా అది నాకోసం ఆ అన్న కోసమే చేస్తాడు మా ఇద్దరి మంచి కోసమే చేస్తున్నాడు ఇప్పుడు చేసేది కూడా మేమంతా ఆలోచించాం పద్మావతి నువ్వేం మాట్లాడకు అని సంతకం పెట్టేస్తాడు ఆర్య. పద్మావతి చాలా బాధగా ఆర్యా అని కోపంగా చూస్తూ ఉంటుంది. మీరు చేస్తున్నది నాకేం నచ్చలేదు బావగారు అని అంటుంది. వెంటనే లాయర్ గారు బయటికి వెళ్తాడు ఫోన్ మాట్లాడుకుంటూ, ఆర్ అవి ఆర్య నువ్వు వెళ్లి లాయర్ గారితో తర్వాత ప్రాసెసర్ గురించి అడిగి పని చూడు అని అంటాడు.ఆర్య సరే అని వెళ్ళిపోతాడు పద్మావతి ఆగండి బావగారు మీతో మాట్లాడాలి అంటుంది ఇప్పుడు టైం లేదు పద్మావతి తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతాడు ఆర్య.

పద్మావతిని బెదిరించిన విక్కీ..
విక్కీ చూసావా పద్మావతి నేను అనుకుంటే ఏదైనా చేస్తాను ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా అని అంటాడు.మీరు చేస్తున్నది చాలా తప్పు మా అక్కని బావని విడదీస్తున్నారా అని అంటుంది. ఇప్పటికైనా మించి పోయింది లేదు పద్మావతి ఇంకా అరగంట టైం ఉంది నీకు. నువ్వు ఈ లోపు ఇంటికి వెళితే మీ అక్క సంతకం పెట్టడం ఆపచ్చు లేదంటే మీ అక్క చేత కూడా సంతకం చేయిస్తాను అని అంటాడు. అది మీ వల్ల కాదు అని అంటుంది నాతో పంతం నికి పోకు ఎందుకంటే ఆల్రెడీ చూశావు కదా ఆర్య జాతకం పెట్టించాను ఇప్పుడు అనుజాత సంతకం పెట్టించడం నాకు చాలా తేలిక పని, నువ్వు ఇంకొక అరగంటలో వెళ్లిపోవాలి మీ వాళ్ళకి నిజం చెప్పాలంటే నువ్వు ఒక ఆరు నెలలు ఆగాలి నీకు ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాను ఆరు నెల తర్వాతనేను నిన్ను పూర్తిగా వదిలేస్తాను అప్పుడు నీ ఇష్టం అప్పుడు మీ వాళ్లకు చెప్పాల్సింది కూడా చెప్తానుఅప్పటిదాకా నన్ను విసిగించకు నువ్వు ఎంత అనుకున్నా ఏమి చేయలేవు.నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది ఎప్పుడైనా నువ్వు అనుకున్నది జరగనివ్వని పద్మావతి నా గురించి నీకు పూర్తిగా తెలుసు,ఇకనుంచి ముందు ఇంటికి వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే పద్మావతి ఆర్య కి ఫోన్ చేసి ఎలాగైనా అక్క చేత సంతకం పెట్టించకుండా ఆపాలి అని అనుకోని ఆర్య కి ఫోన్ చేస్తుంది ఆర్య ఫోను విక్కీ దగ్గర ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఆర్య అనుకొని పద్మావతి మాట్లాడుతుంటే మీ బావగారు ఎప్పుడు వెళ్ళిపోయారు మాట్లాడుతుంది విక్కీ అని అంటాడు. పద్మావతి షాక్ అవుతుంది వెనక్కి తిరిగి చూసేటప్పటికి విక్కీ వచ్చి నిలబడి ఉంటాడు. పద్మావతి తో విక్కీ నేను ఆర్య ఫోను మార్చేశాను నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావని నాకు తెలుసు కదా అని అంటాడు. ఇప్పుడు నీ దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి పద్మావతి ఒకటి మీ ఇంటికి వెళ్లి మీ అక్క జీవితం పాడు చేస్తావో లేదంటే మా ఇంటికి వెళ్లి మీ అక్క జీవితం నిలబడతావో నీ ఇష్టం అరగంటే టైం ఉంది నిమిషం ఆలస్యమైనా జరగాల్సింది జరిగిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు.

అనుతో సంతకం పెట్టించిన విక్కీ
పద్మావతి విక్కీ వెళ్ళిపోగానే ఆలోచిస్తూ శ్రీనివాస ఇప్పుడు నా కన్నా మా అక్క జీవితమే ముఖ్యం నేను తొందరగా ఇంటికి వెళ్లి మా అక్క తో సంతకం పెట్టించకుండా ఆపాలి, అని అనుకుంటుంది. అప్పుడే అను పద్మావతికి ఫోన్ చేస్తుంది పద్మావతి ఏంటక్కా బావగారి ఇంటికి వచ్చారా అని అడుగుతుంది అది సరే అని నువ్వేంటి పొద్దున్నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లావు నువ్వు ఎక్కడికి వెళ్లావు నేను చాలా టెన్షన్ పడుతున్నాను అని అంటుంది నువ్వేం టెన్షన్ పడకు అక్క నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పద్మావతి. తొందరగా ఆటో ఎక్కిపో పద్మావతి వెళ్లాలి అనుకుంటుంది ఆటో వాడిని తొందరగా పోనివ్వు తొందరగా పోనివ్వని, అని టెన్షన్ పడుతూ ఈ తింగరోడు అన్నంత పని చేస్తాడు మా అక్క చేత కూడా సంతకం పెట్టిస్తే మా అక్క జీవితం నాశనం అయిపోతుంది. ఎలాగైనా నేను వెళ్లి మా అక్క జీవితాన్ని కాపాడాలి నేను ఇంత కష్టపడుతుంది మా అక్క కోసమే కదా అని అనుకుంటూ ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది. ఈలోపే విక్కీ ఆర్య లాయర్ తో సహా ఇంటికి వెళ్లి అనుని మాట్లాడి అను చేత సంతకం పెట్టిస్తూ ఉంటారు. అను ఇంకొకసారి ఆలోచించండి బావగారు అని అంటుంది ఏం పర్వాలేదు నన్ను నమ్మావు కదా సంతకం పెట్టు అని అంటాడు అనుతో విక్కి, వెంటనే అను బాధపడుతున్నట్టుగా సంతకం పెడుతూ ఉంటుంది అదే టైం కి ఆటో దిగి పద్దు లోపలికి వస్తుంది. పద్మావతి లోపలికి వచ్చేటప్పటికి అను సంతకం పెడుతూ ఉంటుంది అది చూసి పద్మావతి షాక్ అవుతుంది ఇంకేముంది విడాకులు కాగితం మీద మా అక్క చేత కూడా సంతకం పెట్టి చేశాడు అని బాధపడుతూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే విక్కీ పద్మావతిని చూసి చూసావా మీ అక్క కూడా సంతకం పెట్టింది అన్నట్టుగా పద్మావతికి సైగ చేస్తాడు. పద్మావతి కోపంతో అను దగ్గరికి వెళ్లి అక్కను వీ సంతకం పెట్టడానికి వీల్లేదు అని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఎందుకు వద్దంటున్నావు పద్మావతి విక్కీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే అందరూ కట్టుబడి ఉంటాము మా అందరికీ తెలుసు విక్కీ ఏం చేస్తున్నాడు నువ్వు అడ్డు చెప్పకు అని అంటారు.పద్మావతి నేను ఇంటి కోడలనే కదా నాకు నచ్చకుండా ఈ పని ఎలా చేస్తారు అయినా మా అక్క జీవితం ఇలా ఇప్పటికే నేను చూస్తూ ఊరుకోలేను నాకు ఇష్టం లేదు మా అక్క సంతకం పెట్టడం అని అంటుంది. కుచల పద్మావతిని అరుస్తుంది నువ్వు మా విక్కిని ఇలా కూడా ప్రశాంతంగా ఉంచవా అని అంటుంది మీ అందరికీ ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు ఈ సంతకం పెట్టడం ఇష్టం లేదు అని అంటుంది అను మళ్లీ సంతకం పెట్టబోతుంటే పెన్ను తీసి విసిరేస్తుంది పద్మావతి.
రేపటి ఎపిసోడ్లో విక్కీ పద్మావతి తో నన్ను మోసం చేసి మా అక్క చేత విడాకులు ఇప్పిస్తున్నట్టు నాటకమాడి నన్ను ఇంటికి రప్పించారు కదా అని అంటుంది.చూడు పద్మావతి నీకు నా గురించి పూర్తిగా తెలియాలనే ఇలా చేశాను ఇప్పుడు నేను అనుకుంటే ఈ విడాకులు పేపర్ మీద నిజంగానే సంతకం పెట్టిస్తాను అనూ చేత అని విడాకులు పేపర్ చూపిస్తాడు అవి పద్మావతి తీసుకొని వీటిని ఇప్పుడే చింపేస్తాను అని అంటుంది పద్మావతి పేపర్స్ఇవ్వు అని అంటాడు విక్కి. పద్మావతి ఇవ్వదు పద్మావతిని పేపర్స్ తీసుకోబోతుండగా జారి పడబోతుంది విక్కీ పట్టుకుంటాడు.