Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 324 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.
నిన్నటి ఎపిసోడ్ లో అను ఆర్య ల మెహందీ ఫంక్షన్ కి అరవింద బయలుదేరుతుంది. కృష్ణ అరవింద తీసుకెళ్లే మెహందీ లో కెమికల్స్ కలుపుతాడు. మెహందీ పెట్టుకోగానే చేయమంటేక్కేటట్టు, కాలిపోయేటట్టుగా, ప్లాన్ చేస్తాడు. అరవింద కే ఆ విషయం తెలియక ఆ మెహందీ పాకెట్స్ ని తీసుకొని పద్మావతి ఇంటికి వెళుతుంది.

Nuvvu Nenu Prema: అను పెళ్లి ఆపడానికి కృష్ణ ప్లాన్ ఫలించనుందా… పద్మావతి మనసులో మాట చెప్పినట్టేనా…
ఈరోజు ఎపిసోడ్ లో,అరవింద పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తుంది. కుచలకి అను,కాళ్ళకి నమస్కారం చేస్తుంది.నమస్కారాలు మాత్రమేనా ఏమన్నా తాగుతారా అని అడగరా అని అంటుంది కుచల, అను ఏం కావాలో అత్తయ్య గారు అని అడుగుతుంది. వెంటనే ఆండాలు వాతావరణ వేడిగా ఉంది కదా చల్లగా మంచిగా తీసుకురాను అని అంటుంది. కుచల నాకు మజ్జిగ వద్దు వేడివేడిగా కాఫీ తీసుకురా అని అంటుంది. అను కుశలకి కాఫీ తీసుకొస్తూ చేతులు వణికిపోతూ ఉంటాయి. అది చూసి కుచ్చుల నేనేమన్నా మరీ గేయ్యాలి దాన్ని అనుకుంటున్నావా, అని కాఫీ తీసుకొని నేను వేడిగా తీసుకురమ్మన్నాను కదా ఏంటి ఇలా తీసుకొచ్చావు అని అంటుంది. అక్కడికి ఆండాలు వచ్చి నేను చూసి చెప్తాను వేడిగా ఉన్నాయో లేదో అని గ్లాస్ తీసుకొని కాఫీ తాగి వేడిగా ఉన్నాయి అని అంటుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అని అంటుంది కుచల. వెళ్లి ఇంకో గ్లాస్ తీసుకురా అని అంటుంది. ఆండాలు కావాలని అయ్యో పాలు అయిపోయినాయి, నువ్వు మెహందీ ఫంక్షన్ కి వెళ్ళు అరవింద్ గారి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకాసేపటికి టిఫిన్ పెడతాను కదా అప్పుడు తాగుతారులే మీ అత్తయ్య గారు అని చెప్పి, అనుని పంపిస్తుంది. అను పక్కకు వచ్చి అత్తయ్య ఏమైనా అనుకుంటుంది పాలు ఉండి కూడా లేవని చెప్పావ్ ఏంటి అంటుంది. వెంటనే ఆండాలు మీ అత్తకి అలానే చెప్పాలి నేను చూసుకుంటాను ఆమె గురించి నువ్వు అరవింద గారి దగ్గరికి వెళ్ళు అని అంటుంది.

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న వెన్నెల మరియు అరుంధతి..తర్వాత ఏమి జరిగిందంటే!
మెహందీ ఫంక్షన్
ఇక ఆడవాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్య విక్కీ సిద్దు ఆడవాళ్లు లాగా చీర కట్టుకొని పద్మావతి ఇంటికి రావడానికి, ట్రై చేస్తూ ఉంటారు. విక్కీ అరే ఈ చీర నావల్ల కాదు నేను రాను అని అంటాడు. నువ్వు సగంలో వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు రావాల్సిందే అంటాడు ఆర్య. ఇక సిద్దు నువ్వు సూట్ లో కన్నా ఈ చీరలోనే చాలా బాగున్నావు బ్రో అని అంటాడు. విక్కీ కోపంగా ఇంక చాలా ఆపు అని అంటాడు. ముగ్గురు పద్మావతి వాళ్ళు ఉండే రూము దగ్గర కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. ఇక పద్మావతి ఇప్పుడు మనందరం కలిసి, ఎవరెవరి జీవితాలు వారి వారి ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాలి అని ఉంటుంది. ఎటువంటి ఇప్పుడే కదా మనందరం ఒకచోట కలిసింది. అరవింద బాగుంది చాలా బాగుంది నాకు నచ్చింది ఈ గేమ్ అని అంటుంది.పద్మావతి ఫస్ట్ ఆండాల్ ని అడుగుతుంది. అత్త నీ మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పు అని అడుగుతుంది.కుచల ఆవిడ నోటి దూలకి ఒక్కలు కూడా ఆమె వైపు చూసే వాళ్ళు కాదు, అనగానే ఆండాలు నేను నీలాగా సోకులు చేసుకొని ఉండేదాన్ని కాదు, అందంగా ఉండేదాన్ని మా వీధిలో గుర్రాలు అంతా నా వెనకే పడేవాళ్ళు, పద్మావతి అవునా తర్వాత ఏమైంది అని అడుగుతుంది. ఆండాలు నాకు మాకు మీలాగా థియేటర్స్ ఉండేవి కాదు, మేము వారానికి ఒకసారి అందరం కలిసి టూరింగ్ టాకీస్ కి వెళ్లేవాళ్ళం. అక్కడ ఒక అబ్బాయి టూరింగ్ టాకీస్ దగ్గరికి వచ్చేవాడు. నన్ను మాత్రమే చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏమైంది పర్లేదు అత్త నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అని అంటుంది పద్మావతి. చెప్పేది పూర్తిగా వినండి అని అంటుంది అండల్. ఒకరికొకరం చూసుకుంటూ ఉండే వాళ్ళమే కానీ ధైర్యం చేసి ఎప్పుడూ చెప్పలేదు. నాకోసం ఇంటర్వెల్లో అన్నీ కొని తీసుకొచ్చి ఇచ్చేవాడు. తర్వాత ఏమైంది అంటుంది అను. ఏముంది నేను ఆర్య బాబు లాగా, ధైర్యం చేయలేదు అందుకని మీ మావయ్య నుంచి పెళ్లి చేశారు. అయినా మీ మామయ్య కూడా నన్ను బాగా చూసుకునే వాళ్ళు. అని తన స్టోరీని చెబుతుంది అండల్.

Krishna Mukunda Murari: ముకుంద కి రేవతి వార్నింగ్.. ముకుంద తర్వాతి ప్లాన్ అమలు చేయనుందా….
కుచల లవ్ స్టోరీ
ఇక కుచల నీ చెప్పమంటారు అందరూ తన లవ్ స్టోరీ. నేను చెప్పను అంటుంది కుచల. మీరు చాలా అందంగా ఉంటారు కదా మిమ్మల్ని, చూసి ఎంతమంది పడిపోయారో అని అంటుంది పద్మావతి. ప్లీజ్ మీ అందమైన స్టోరీ గురించి చెప్పండి అని అడుగుతుంది. కుచల సరే అని ఆ రోజుల్లో, నన్ను చూసి అందరూ, క్యూ కట్టేవాళ్ళు, నేను వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయేది. ఆండాలు అవును మేకప్ లేకుండా చూసి ఉంటారు అని అంటుంది. కుచల కోపంగా చూస్తుంది.సిద్దు కిటికీ దగ్గర నుంచి ఈ విషయం అంకుల్ కి తెలిస్తే చచ్చిపోతాడు రా అని అంటాడు. కుచల నన్ను కథలు చాలా బాగా ప్రేమించేవాడు. నేను కూడా అతని ప్రేమించాను అని చెప్తుంది.ధైర్యం చేసి ఇంట్లో వాళ్లకి చెప్పమని నేనే చెప్పాను. రోజు ఒక ఫ్లవర్ తీసుకొని వీది చివర నిలబడి ఉండేవాడు. ఎన్ని రోజుల నిలబడతావు ఇంట్లో వాళ్లతో మాట్లాడు అని చెప్పాను. తర్వాత ఏమైంది అంటుంది అరవింద ఏమవుతుంది ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు తను మాట్లాడేసాడు నా పెళ్లి జరిగిపోయింది అని అంటుంది. అంటే మీరు ప్రేమించింది పెళ్లి చేసుకుని ఒకరిని ఏనా నువ్వు ఒకరిని వాళ్ళు ఎవరో తెలుసా నానారు అని అంటుంది కుచల. పాపం మీ కలర్ చూసి మోసపోయాడేమో అని అంటుంది పద్మావతి. ఏంటి అని అంటుంది కుచల అందరూ నవ్వుతూ ఉంటారు. పద్మావతి వాళ్ళ అమ్మని అడుగుతారు అందరూ, మాకు మీలాగా ఇళ్లలో నుంచి బయటికి వచ్చేవాళ్ళం కాదు, చదువులకు కూడా మా నాన్న బయటికి పంపించలేదు. మొదటిసారి మీ నాయన పెళ్లి చూపులు కోసం పిలిపించారు. అంతే పెళ్లి అయిపోయింది అని చెప్తుంది పద్మావతి వాళ్ళ. పద్మావతి వెంటనే ఇదే లవర్ ఫస్ట సైట్ అంటేఅంటుంది.అందరూ కలిసి అరవింద్ అని అడుగుతారు మీ మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పండి అని.

అరవింద లవ్ స్టోరీ
అందరూ అరవింద్ అని తన లవ్ స్టోరీ చెప్పమని అడుగుతారు.తను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు, రోజు నన్ను చదువులో బీట్ చేయడానికి చూస్తూ ఉండేవాడు, కానీ అది తనకి సాధ్యపడేది కాదు. కాలేజీ చివరి రోజులకి వచ్చిన తర్వాత ఒకరోజు ఫ్లవర్ తీసుకొచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. నేను నా విడతనం గురించి తనకి చెప్పాను. అంతే తను మళ్ళీ కనపడలేదు అని అరవింద బాధపడుతుంది. ఇటువంటి నే పద్మావతి అయ్యో ఇట్లా అని మాకు తెలియదు కదా, లేదు పద్మావతి తను వెళ్ళిపోవడం వల్లే నా జీవితంలోకి ఒక మంచి మనిషి వచ్చాడు. నన్ను నన్నుగా చూసి నా అంతస్తు నన్ను కాకుండా నా మనసును చూసి, ప్రేమించి పెళ్లి చేసుకుని కృష్ణ వచ్చాడు అని కృష్ణ గురించి చెబుతుంది. దానికి పద్మావతి వాళ్ళింట్లో వాళ్ళందరూ ఒకసారిగా ఒకరు ముఖాలు చూసుకుంటారు. అరవింద కృష్ణ చాలా మంచి వాడిని చెప్తూ ఉంటుంది.పద్మావతి మనసులో వాడు శ్రీరామచంద్రుడు అని మీరు అనుకుంటున్నారు. కానీ పరాయి స్త్రీని చూస్తున్న రావణాసురుడని మీకు చెప్పలేను. ఆ నిజం మీకు తెలిస్తే తట్టుకోలేరని నేను సైలెంట్ గా ఉంటున్నాను అని అనుకుంటుంది. అరవింద నా లవ్ స్టోరీ చెప్పి మీ అందరిని మూడ్ ఆఫ్ చేశాను సారీ అని ఉంటుంది. ఇక ఇప్పుడు అను చెప్తుంది అని అంటుంది అరవింద.అని త లవ్ స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. నేను మొదటిసారి చూసింది ఆర్య ని, తనకి ఎక్కిళ్ళు వస్తుంటే కొలను దగ్గర మంచినీళ్లు ఇద్దామని, చూశాను అదే ఫస్ట్ సారి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది మా ప్రయాణం అని చెప్తుంది. ఓ మంచినీళ్లు చేసే మా వాడిని పడేసావా అని అంటుంది కుచల. అందరూ ఇప్పుడు పద్మావతి అని పద్మావతి వైపు చూపిస్తారు. రేపటి ఎపిసోడ్ లో పద్మవతి లవ్ స్టోరీ అని చెప్పడం చూద్దాం…

రేపటి ఎపిసోడ్ లో,సంగీత్ కి ఎవరెవరు డాన్స్ వేస్తున్నారు అని అడుగుతుంది పద్మావతి సిద్దు. సిద్దు వెంటనే నేను, మాత్రమే వేస్తున్నాను అని చెప్తాడు. సిద్దు కి డాన్స్ మూమెంట్ నేర్పించే టైంలో, పద్మావతి వికీ చంప మీద కొడుతుంది. విక్కీ కోపంతో సంగీతం లేదు ఏం లేదు అని పెట్టంగా అది చేసి వెళ్ళిపోతాడు…. చూడాలి విక్కి సంగీత్ కి వస్తాడా రాడా..