Nuvvu nenu prema: పద్మావతి, విక్కీ లు గుడిలో మొక్కు తీర్చుకొని ఇంటికి వస్తారు.. అప్పుడే అరవిందను అందరు జ్యూస్ తాగాలని బలవంతం చేస్తారు.. ఏంట్రా వచ్చేసారా.. మొక్కు తీర్చేశారా.. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగానే బాగా తీర్చేసాము అందుకు కారణం పద్మావతి అంటాడు విక్కీ.. దానికి అరవింద పద్మావతి అన్ని చేస్తుందనే తనను తీసుకెళ్లమని చెప్పాను.. సరే మీ బావగారు టైమ్ కు వచ్చాడా, మొక్కు తీర్చుకున్నాక వచ్చాడా అంటే లేదక్క ముందే వచ్చాడు.. ముగ్గురం కలిసి మొక్కు తీర్చాము అని విక్కీ అంటాడు.. అప్పుడే ఆర్య వాళ్ల అమ్మ ఏంటో కృష్ణ ఇంతకు ముందు ఇంట్లో ఉండేవాడు కాదు.. ఇప్పుడు ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నాడు.. పూజలు కూడా చేస్తున్నాడని అంటుంది.. దానికి కృష్ణ అయ్యో అత్తయ్య అంతా రాణమ్మ కోసమే చేస్తున్నాను అని అంటాడు.. అప్పుడే పంతులు కూడా వస్తాడు.. ఆర్య, అనుల జాతకాలు చూసారు కదా.. పెళ్లి ముహూర్తం చెప్పండి అని నానమ్మ అంటుంది..

ఆ చూసానమ్మ మే 25 న పెళ్లికి మంచిది ముహూర్తం అని చెబుతాడు.. ఆర్య డబ్బులు ఇచ్చి పంపిస్తాడు.. ఇక పద్మావతి వాళ్ల అక్కకు చెప్పాలని వెళ్తుంది.. అంతే కాదు ఫంక్షన్ ను ఏర్పాటు చెయ్యాలని అనుకుంటాడు విక్కీ.. అందరు చాలా సంతోషంగా ఉంటారు.. పద్మావతి పోతుంటే ఆర్య కూడా నేను వస్తున్నా అని వెళ్తాడు.. ఇక పద్మావతి కాసేపు అనును ఆడుకుంటుంది.. అక్కా నువ్వు బావతో ఎక్కడికో వెళ్లలేదంట అందుకే బావ నీతో పెళ్లి వద్దని అమెరికాకు వెళ్లాలని అనుకుంటున్నాడు అని ఏడపిస్తుంది.. ఆర్య బాధ పడుతున్నాడు.. అక్కా బావ తో నీ పెళ్లికి ముహూర్తం పెట్టారు.. మే 25 న మీ పెళ్లికి ముహూర్తం పెట్టారు.. అందరికి చెప్పు అంటుంది.. అలాగే అమ్మి అంటుంది.. అక్క ఇదిగో బావ మాట్లాడుతాడంట అని ఇస్తుంది.. అను అది మ్యాటర్ రేపు ఫంక్షన్ ఉంది ఇంట్లో అందరు రావాలి అంటాడు..

అను చాలా సంతోషంగా ఉంటుంది.. అది చూసి పార్వతి, అండాలు ఏందమ్మి అలా ఉన్నావు అంటారు.. మే 25 న నా పెళ్లికి ముహూర్తం పెట్టారు. పద్మావతి ఫోన్ చేసి చెప్పింది అంటే వాళ్లంతా సంతోషంగా ఉంటారు.. అవును అలాగే మా అత్త ఇంట్లో రేపు ఫంక్షన్ ఉందంట అందరిని రమ్మన్నారు ఆర్య గారు.. అప్పుడే పద్మావతి విక్కీ దగ్గరకు వచ్చి సారూ చాలా థ్యాంక్స్.. అంటే ఎందుకు అంటాడు విక్కీ.. మా అక్క పెళ్లికి ముహూర్తం పెట్టించారు.. అయితే నేను సంతోషంగా ఉండేలా ఏదైనా చెప్పొచ్చుగా అంటాడు.. అందుకే థ్యాంక్యూ అంటుంది.. ఇక చాక్లేట్ ఇస్తుంది.. రేపు ఎలాగైనా ఫంక్షన్ లో అందరికి నీ మనసులో ఉన్న నా మీద ప్రేమను చెప్పేలా చేస్తాను అంటాడు విక్కీ.. ఇక తరువాత భాగంలో విక్కీని పద్మావతి నీళ్లతో తడిపేస్తుంది.. విక్కీ కూడా పద్మావతి పై నీళ్లు వేస్తాడు.. నెక్స్ట్ ఎం జరుగుతుందో చూడాలి.
