Nuvvu nenu prema: పద్మావతికి నచ్చ చెప్పే పనిలో ఉంటారు..అయితే ఈ పెళ్లి చేసుకుంటే అంతా తలక్రిందులు అవుతుంది.. నాకు వద్దు అని పద్మావతి చెబుతుంది.. అంతలోనే కృష్ణ అక్కడికి వస్తాడు.. అత్తయ్య ముహూర్తనికి టైమ్ అవుతుంది రండి అంటాడు.. ఇక పద్మావతి అతన్ని చూసి రెచ్చిపోతుంది.. హే నీకు ఎంత ధైర్యం నన్ను పెళ్లి చేసుకుంటావా ఇక్కడి నుంచి పో అంటుంది.. నువ్వు ఎంత మోసగాడివో అందరికి తెలియదు.. తెలిస్తే తట్టుకోలేవు.. అంటుంది పద్మావతి.. ఎందుకు పద్మావతి గారు నేనంటే మీకు అంత కోపం.. ఇలా మాట మారుస్తున్నారు.. మీరంటే ఇష్టం అని చెప్పాను కదా.. హే నోరు ముయ్యి.. అమ్మా వీడు మోసగాడు..నా మాట విను.. ఈ పెళ్లి జరిగితే అంతా బాగుంటుంది అనుకుంటున్నారు.. కానీ ఆ తర్వాతే పెద్ద సమస్య మొదలవుతుంది.. అమ్మా నన్ను కొట్టు, తిట్టు, కానీ ఈ నీచుడును మాత్రం పెళ్లి చేసుకోమని చెప్పకండి.. అంటుంది పద్మావతి.. దానికి పార్వతి నోరు ముయ్యి నన్ను అలా పిలవాలి అంటే ఈ పెళ్లి జరగాలి ముందు బాసికం కట్టు అంటుంది.. ఇక కృష్ణ కూడా పెళ్లి అయ్యాక కూర్చొని అన్ని మాట్లాడుకుందాం అంటాడు..

Nuvvu nenu prema : పద్మావతి పెళ్లి కృష్ణ తో జరుగుతుందా..విక్కీకి కృష్ణ బాగోతం తెలిసిపోతుందా?
ఇక విక్కీ పద్మావతికి ఎదో జరిగింది అంటూ టెన్షన్ పడుతూ వస్తాడు..ఎందెయ్.. పదే పదే అతన్ని మోసగాడు అని అంటావు.. అని పార్వతి అంటుంది.. నీకు తెలియదు అమ్మా.. ఎందుకంటే వీడు అని పద్మావతి ఆగి పోతుంది.. చెప్తే ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకుంది అందుకే చెప్పలేదు.. ఇది అడ్డుపెట్టుకొని ఒక ఆట ఆడుకుంటాను చూడు అంటూ కృష్ణ మనసులో అనుకుంటాడు.. ఎందుకు అంటారు నేను చేసిన తప్పంటి.. నా కుటుంబం అని మీ కుటుంబాన్ని అనుకోవడం తప్పా.. మిమ్మల్ని నా వాళ్ళు అనుకోవడం తప్పా అంటాడు..అంతకు మించి నేను చేసిన మోసం ఏంటి.. ద్రోహం ఏంటి అని కృష్ణ అంటాడు.. చెబితే అక్క పెళ్లి ఆగిపోతుంది అందుకే చెప్పలేదు.. ఇక అండాలు నీ మనసులో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేయ్.. ఇప్పుడు మురళి బాబును పెళ్లి చేసుకో అంటుంది..

Krishna Mukunda Murari: ఈ పెళ్లోద్దన్న నందిని మురారి ఆపెస్తాడా.? కృష్ణ గౌతమ్ నందిని పెళ్లి చేసిందా.? సూపర్ ట్విస్ట్..
ఇక పార్వతి అమ్మి పెళ్లి చేసుకో అంటుంది.. దానికి పద్మావతి అమ్మా ఇప్పుడు నేను ఏది చెప్పే పరిస్థితిలో లేను.. ఈ పెళ్లి వద్దమ్మా.. నీ కాళ్లు కూడా పట్టుకుంటాను అని పద్మావతి అంటుంది.. అప్పుడే నోరు ముయ్యి.. ఈ పెళ్లి ఆపడానికి ఎంత నీచనికి దిగజారావు అని అండాలు అంటుంది.. మొత్తానికి అనాధవు అనిపించావు..చూసావా పార్వతి నీ కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసావు.. కానీ అది నువ్వు ఏమైనా పర్వాలేదు.. చివరికి తన అక్క జీవితం ఏమైనా పర్వాలేదు అనుకుంది..దాని స్వార్థం అది చూసుకుంది.. పాముకు ప్రేమగా పాలు పోసిన చివరికి కాటే కదా వేస్తుంది..

అత్తయ్య నేనేదో కావాలని చేసినట్లు ఏంటి ఇదంతా.. పద్మావతి అంటే ప్రేమతో ఇలా చేసిన నాకు ఇది అవసరమా.. ఎంగేజ్మెంట్ అయితే బాగుంటుంది అని అంటాడు మురళి.. ఇక పద్మావతి అతన్ని నమ్మకు మోసాలు చెబుతున్నాడు అని అంటుంది.. ఇక ఆండాలు మాత్రం ఇది తెగించేసింది.. అందరూ ఈ పెళ్లి చేసుకొని తీరాలి అని తెగేసి చెబుతారు.. వాళ్ల అమ్మకు ఎదురు చెబుతుంది..చివరకు ఒప్పుకుంటుంది.. ఇక విక్కీ పద్మావతి ఇంటికి వెళతాడు.. తాళం వేసింది ఏంటి అంటూ టెన్షన్ పడతాడు..గుడికి వెళతాడు..ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి.
Bramhamudi : స్వప్న చెప్పిన మాటతో షాక్ లో రాజ్.. కావ్యను వదిలేస్తాడా?