Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 342ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 343 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

నిన్నటి ఎపిసోడ్ లో,అను ఆర్యతో, మాట్లాడుతూ ఉండగా కుచల ఆ మాటలన్నీ వింటుంది. ఆ మాటల్ని అడ్డం పెట్టుకొని పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా పద్మావతి ఫ్యామిలీని, తిడుతూ ఉంటుంది కుచల.

Nuvvu Nenu Prema: అను,ఆర్యా ల పెళ్లి కుచల ఆపనుందా..ఇక పద్మావతి, అను ల పరిస్థితి ఏమిటి?
ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి ని రౌడీల నుండి కాపాడి విక్కి, నీకేమైనా బుద్ధుందా ఒక్కదానివే ఇలా వచ్చేయడమేనా, సిద్దుకి ఈ ఊరంతా కొత్త, వాడితో వెళ్లకపోతే నేను అక్కడ ఉన్నాను కదా అని అరుస్తూ ఉంటాడు. ఏమన్నా అంటే సైలెంట్ గా ఉంటావు. సారు ఇంకా ఆపుతారా అని అంటుంది పద్మావతి. హోమం కి లేట్ అవుతుంది వెళ్దాం పదండి అని గబగబా వెళ్లి కారు ఎక్కి కూర్చుంటుంది పద్మావతి.

పెళ్లి ఆపాల్సిందే అన్న కుచల హ్యూమన్ ఈ హోమం జరగడానికి వీల్లేదు, అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇప్పటికే అదే మాట చెప్తున్నాను అని అంటుంది కుచల. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు పిన్ని అని అంటుంది అరవింద. మీరేం మాట్లాడరేంటండి అని అరవింద కృష్ణతో అంటుంది, నేను ఎలా మాట్లాడుతాను రానమ్మ అంతా అయిన వాళ్లే కదా ఎవరి వైపు మాట్లాడిన ఇంకొకరు బాధపడతారు. చూడండి మీరు ఎవరు ఎంతమంది చెప్పినా, వీళ్ళు అబద్దాన్ని నిజం చేయాలనుకున్నారు నా ముందు నిజం చెప్పలేదు. పీటలు దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది అంటే ఏం జరిగిందో వీళ్ళు ఏం తప్పు చేశారో అని అంటుంది కుచల. ఇంక అక్కడితో మాట్లాడడం ఆపేయండి అని అంటుంది అండల్. నా కోడలు నిప్పు తప్పుడు మాటలు మాట్లాడమాకండి అని అంటుంది అండల్. కాలుస్తున్నారు అని అంటుంది కుచల.అమ్మ ఇంకా ఆపు అని అరుస్తాడు ఆర్య.ఇన్నాల పరిచయంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలియదాదీన్ని ఇక్కడితో ఆపేసేయి అని అంటుంది కుచల అత్తగారు. అవునమ్మా అని అంటాడు ఆర్య. ఒకసారి పెళ్లి ఆగిపోయిన ఈ అమ్మాయిని చేసుకుంటే మన ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోతుంది. నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను అని వెళ్లి సోఫాలో కూర్చుంటుంది కుచల. అను ఏడుస్తూ ఉంటుంది పార్వతి అందరూ బాధపడుతూ ఉంటారు.

Krishna Mukunda Murari: ముకుంద తన పగతో రేవతిని కూడా భయపెట్టిందా…
పద్మావతి చేతికి గాయం..
సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు పద్మావతిని విక్కి.పద్మావతి నిన్నే అని అరుస్తాడు. అప్పటికే పద్మావతి పెట్టుకొని ఉంటుంది అందుకని, నవ్వుతూ ఉంటుంది. బెల్టు పెట్టుకున్నట్టుగా చూపిస్తుంది. ఎప్పుడు అరవడం కాదు సారు అవతలి వాళ్ళని చూసి మాట్లాడాలి అని అంటుంది. పద్మావతి, గాజులు తీసుకొని చూసుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ గాజులు కొన్నావా అంటాడు విక్కి. కోనలేదు,ఇచ్చారు అని అంటుంది పద్మావతి.ఎందుకిచ్చారు అని అంటాడు విక్కీ.అడిగి చెప్తానులే అంటుంది పద్మావతి. నీ రాజు సైజు వాడికి తెలిసి ఉండదు అని అంటాడు విక్కీ. పద్మావతికి గాజులు పట్టవు వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సైజు తెలీకపోయినా నా చేతి గాజులు లేవని తీసుకొచ్చాడు కదా అది చాల్లే అని అంటుంది. అలా మాట్లాడితే గాజులు వేసుకుంటూ ఉండగా ఒక గాజు పగిలి పద్మావతి చేతికి గుచ్చుకుంటుంది. పద్మావతికి గాయం అవుతుంది. వెంటనే విక్కీ కార్ ఆపి పద్మావతి చేతికి ఉన్న గాజు ముక్కల్ని తీసివేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు పర్వాలేదు అని అంటుంది పద్మావతి.

కుచల ని ఒప్పించడానికి కుటుంబం ప్రయత్నం..
అందరూ కుచల దగ్గరికి వెళ్లి ఎలాగైనా ఒప్పుకోవాలని అడుగుతూ ఉంటారు. పార్వతి వదిన ఇంతకుముందు జరిగింది మీకు చెప్పకపోవడం మా తప్పే, అలాగని ఇప్పుడు మీరు ఇలా చేస్తే నా కూతురు పెళ్లి ఇప్పుడు కూడా ఆగిపోతుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని బతిమిలాడుతూ ఉంటుంది. అమ్మఒప్పుకొమ్మ అని ఆర్య కూడా అడుగుతూ ఉంటాడు. కుచల మీరు ఎవరేం చెప్పినా నేను వినను అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఈ పెళ్లి జరిగేలా లేదు, పద్మావతి తో నా పెళ్లి జరగడం ఖాయం అని అనుకుంటాడు కృష్ణ మనసు లో,అరవింద పిన్ని,ఒకసారి అను చూసి మాట్లాడండి. ఆర్య చెప్తున్నారు కదా అని తప్పేం లేదని, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు మీరు ఈ పెళ్లి ఆపివాళ్ళు ఇద్దరినీ బాధ పెడతారా, మీరేనా చెప్పండి అని, కృష్ణ ని మాట్లాడమంటుంది అరవింద. ఇంతమంది చెప్తే విననప్పుడు నేను చెప్తే వింటుందా రానమ్మ అని అంటాడు కృష్ణ. మీరు ఎంతమంది చెప్పిన ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు అని కుచల చెబుతుంది.నాకు కావలసింది కూడా అదే అని కృష్ణ మనసులో అనుకుంటాడు.

విక్కీ కుచలకు సర్ది చెప్పడం..
ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కుచల ఒప్పుకోకుండా, ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని చెప్తుంది. అదే టైం కి పద్మావతి వికీ ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి కృష్ణ అదేంటి పద్మావతి ని విక్కీ తీసుకొస్తున్నాడు.అంటే నేను పంపిన రౌడీలు, విక్కీ చేతులో తన్నులు తిన్నారా అని అనుకుంటాడు కృష్ణ మనసు. పద్మావతి ఏంటి అందరూ ఇలా ఉన్నారు ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంది. విక్కీ కూడా ఏమైంది అక్క అని అడుగుతాడు. అరవింద అను కి ఇంతకుముందే ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోయిందని పిన్నికి తెలిసింది. నిజం దాచారని పిన్ని అను,ఆర్యా ల పెళ్ళి జరగడానికి వీల్లేదు అని అంటుంది అని అరవింద. దానికి దీనికి సంబంధం ఏమున్నది. అమ్మ నువ్వు చెప్పలేదా అని అంటుంది పద్మావతి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని అంటుంది కుచల. అను పద్మావతి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో అక్కఎడవ కు అంటుంది పద్మవతి. నీ పెళ్లిఆర్యా బావ తో నే జరుగుతుంది ఏడవకు అని అంటుంది. వెంటనే కుచల లేచి ఏం మాట్లాడుతున్నావ్ ఒకసారి పెళ్లి ఆగిపోయిన దాన్ని మా వాడికి ఇచ్చి పెళ్లి చేసే అవసరం నాకు లేదు అంత కర్మ మాకు పట్టలేదు. వెళ్ళండి ఇక నుంచి అందరు వెళ్లిపోండి అని అరుస్తుంది కుచల. ఇట్లా అనుమాకండి కావాలంటే నేను కాళ్లు పట్టుకుంటాను అని అంటుంది పద్మావతి. మా అక్కయ్య తప్పు చేయలేదు తనకి ఏం తెలియదు.మా అక్క చాలా మంచిది.ఇప్పటివరకు చాలా బాధలు పడింది.ఆర్య గారి పరిచయం అయిన తర్వాత తన సంతోషంగా ఉంటుంది.దయచేసి మా అక్కని పెళ్లి చేసుకోండి. మా అక్క కోరుకున్న వాడిని చేసుకుంటున్నందుకు,అందరం సంతోషపడుతున్నమ్, ఇప్పుడు మీరు ఈ పెళ్లి అపి అ సంతోషాన్ని దూరం చేయకండి అని పద్మావతి, కుచలను వేడుకుంటుంది.

విక్కీ కుచల తో పెళ్లి జరగాల్సిందే అని చెప్తాడు…
అందరూ మాట్లాడుతున్న కుచల ఒప్పుకోదు. మీరెవరు ఎన్ని చెప్పినా నేను వినను అందరూ బయటికి వెళ్ళండి అని అంటుంది. నువ్వు ఎంత చెప్పినా ఈ పెళ్లి జరగాల్సిందే, అది కాదు టీవీ లందరూ అబద్ధాలు ఆడి నిజాన్ని దాచి పెట్టారు.అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోమంటావా అని అంటుంది కుచల. నిజం దాచింది వాళ్ళు కాదు పిన్ని నేను అని అంటాడు విక్కీ. అందరూ షాక్ అవుతారు.విక్కీ నువ్వు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నావ్ కదా అని అంటుంది. లేదు పిన్ని ఒకసారి నా వల్ల ఆగిపోయిన అను పెళ్లి, ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే ఇంకోసారి కూడా ఆగిపోతుంది.

నీవల్ల ఆగిపోయిందా అని అంటుంది కుచల. అవును అని అంటాడు విక్కి. నీవల్ల ఆగిపోవడం ఏంటి అని అంటుంది అరవింద. లాస్ట్ ఇయర్ తిరుపతిలో, మన కంపెనీ ప్రమోషన్ కోసం కండక్ట్ చేసిన వెడ్డింగ్ కలెక్షన్ కి, అనుకోకుండా పద్మావతి వాళ్ళ షాప్ డాక్యుమెంట్స్ తో సహా వస్తుంది. అని పెళ్లి వాళ్ళు మాట్లాడడం. నావల్ల, పద్మావతి రూమ్లో బంధించడం. నేను కోపంతో తనని అడ్డుకున్నాను. తను చాలాసార్లు మా అక్క పెళ్లి ఆగిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళకపోతే, అని పద్మావతి చెప్పిన నేను వినకుండా బంధించాను. అప్పుడు పెళ్లి వాళ్ళు, అపార్థం చేసుకొని వెళ్ళిపోయారు. డబ్బులు ఇవ్వలేదని, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.(చిన్న కూతురికి పత్రాలు ఇచ్చి పంపి జాక్పాట్ కొట్టేదాకా రామాకండి అని అన్నారు కదా) గతంలో జరిగినవి చూపిస్తారు. వారు క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయారు నా వల్లే, ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే, అని విక్కి అందరి ముందు చెప్తాడు. ఆ పెళ్లి ఆగిపోవడం వల్ల మంచి జరిగింది. ఆర్య కి తనని అర్థం చేసుకునే మంచి మనసున్న అను దొరికింది. పిన్ని నువ్వు నిజంగా ఆర్య సంతోషం కోరుకునేటట్టయితే, ఆర్య ని అను కి ఇచ్చి పెళ్లి చేయండి. మనసులో ఉన్న వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించడం చాలా కష్టం, పిన్ని, ఆ బాధ ఆర్య కి వద్దు. ఆర్య బాధపడడం నేను చూడలేను ఈ పెళ్ళికి ఒప్పుకోండి పిన్ని అని అడుగుతాడు విక్కి. విక్కి తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు నువ్వు ఒకసారి ఆలోచించుకో అంటుంది,ఆర్య నాయనమ్మ.సరే ఒప్పుకుంటున్నాను. అని పెళ్లికి ఒప్పుకుంటుంది కుచల. అందరూ ఒక్కసారిగా సంతోషపడతారు.

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ, హోమం జరుగుతూ ఉండగా, అరవింద్ ను కొంచెం ముందుకు వెళ్లి నిలబడదాం, వాళ్ల పెళ్లి మనమే కదా చేసేది అని అంటాడు. సరే అని అరవిందా హోమం దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. వెంటనే కృష్ణ వెనక నుండి అరవింద పైట ని హోమం మంటల్లో తగిలేటట్టు పెడతాడు. వెంటనే చీరకు నిప్పు అంటుకుంటుంది. సైలెంట్ గా వెనక్కి వచ్చేస్తాడు. ఒకసారిగా అరవింద పెద్దగా అరుస్తూ మంట,మంట అంటుంది. అందరూ చూసి షాక్ అవుతారు పద్మావతి అరవింద గారు అని పరిగెడుతుంది. చూడాలి రేపు ఎపిసోడ్ లో అరవింద అని ఎవరు కాపాడతారో..