Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 343ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 344 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతిని రౌడీలబారి నుండి కాపాడి ఇంటికి తీసుకొస్తాడు విక్కి. అను ఇంతకుముందు ఒక సంబంధం కుదిరి, పీటలు దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయినందుకు, ఆ విషయాన్ని తనకు చెప్పలేదని పెళ్లి ఆపాలనుకున్న కుచల. విక్కీ, మొదటిసారి అను పెళ్లి ఆగిపోవడానికి తనే కారణం అని చెప్పి పెళ్లి, జరిపించండి అను ఆర్యాల ప్రేమ, ఓడిపోకుండా చూడండి అని కుచలకి చెప్తాడు.

Nuvvu Nenu Prema: విక్కీ చెప్పిన మాటలకు కుచల మనసు మారిందా.. అరవింద ను చంపడానికి కృష్ణ ప్లాన్..
ఈరోజు ఎపిసోడ్ లో,విక్కీ కుచలని, ఆర్యా బాధపపడటం నేను చూడలేను పిన్ని ఈ పెళ్లికి ఒప్పుకోండి అని అడుగుతాడు. సరే అని అంటుంది. ఇంక అప్పటిదాకా ఏడుస్తున్న అను,మిగిలిన వాళ్ళు ఒకసారి గా నవ్వుతారు. అను, అర్యాలు, ఇద్దరూ పద్మావతి విక్కి కి థాంక్స్ చెప్తారు.నేను అనుకున్నది జరగలేదని కృష్ణ కూడా బాధపడతాడు. అరవింద, హోమానికి వెళ్దాము పదండి ఇంకా అని అంటుంది. పద్మావతి నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది అని అడుగుతుంది పద్మావతి. రౌడీల దగ్గర ఫైటింగ్ జరిగేటప్పుడు డస్ట్ అయి ఉంటుంది. ఆ విషయాన్ని దాచి పెట్టి ఏమీ లేదండి ఇందాక ఏదో అయినట్టుంది అని అంటుంది. అరవింద సరే వెళ్లి మీరు, క్లీన్ చేసుకొని రండి అని హోమానికి వెళ్తుంది అరవింద.

Krishna Mukunda Murari: కృష్ణా మురారి లని విడగొట్టడానికి ముకుంద ప్రయత్నం, ఫలించినట్టేనా..
పద్మావతి కి గాజులు గిఫ్టుగా ఇచ్చిన విక్కి..
అరవింద చెప్పిన దానికి సరే అని పద్మావతి రూమ్ లోకి వెళుతుంది అప్పటికే రూంలో ఎవరో పద్మావతి అని రాసి ఒక గిఫ్ట్ పెట్టి ఉంటారు. ఓపెన్ చేసి చూస్తే అందులో గాజులు ఉంటాయి. ఆ గాజులు వేసుకొని చాలా బాగున్నాయి ఇంత మంచిగా నాకోసం ఎవరు తెచ్చారు అని అనుకునే, సమయానికి విక్కీ వస్తాడు. పద్మావతికి గాజులు తెచ్చిన విక్కీ అని అర్థమవుతుంది. అలా మనసులో అనుకోగానే విక్కీ కూడా పద్మావతిని చూసి, నేనంటే నీకు ఇష్టం ఉందని ఇంకా ఇంతకన్నా రుజువు ఏం కావాలి పద్మావతి. దూరం నుండి వీళ్ళిద్దరినీ కృష్ణ చూస్తూ ఉంటాడు. ఓ వ్యవహారం ఇంత దాక వచ్చిందా నేనింక అస్సలు ఉపేక్షించకూడదు అని అనుకుంటాడు. కాసేపు పద్మావతి విక్కీ ఒకరికొకరు చూసుకున్నాక విక్కీ, ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి ఆ గాజులను చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది.

Brahmamudi Serial జూన్ 22nd 129 ఎపిసోడ్: ఇంటికి వచ్చిన అప్పు ని దారుణంగా అవమానించిన రుద్రాణి
కుచల తరపున ఆర్య సారీ చెప్పడం…
అను,పార్వతి, ఆండాళ్ ముగ్గురు బాధపడుతూ ఉంటారు. అను ఏడుస్తూ ఉంటుంది. పార్వతి ఇప్పుడు కైతే గండం గడిచిపోయింది కదా అమ్మి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. ఇప్పటికైతే గండం గడిచిపోయింది పార్వతి కానీ రేపు ఆ సోకులాడి ఇంకేమన్నా అంటే, ఎప్పటికైనా ఆమెతో ప్రమాదమే కదా అని అంటుంది అండల్. అప్పుడు అదే టైంకి అక్కడికి ఆర్య వస్తాడు. మీరేం బాధపడకండి ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. మా అమ్మ తరపున నేను సారీ అడుగుతున్నాను. అయ్యో మీరు సారీ ఎందుకు చెప్తున్నారండి. మీ అమ్మకి నిజం చెప్పకపోవడం మాదే తప్పు అని అంటుంది పార్వతి. మీరు చెప్పకపోయినా నేనేనా చెప్పుండాల్సింది అను నాకు ఎప్పుడో ఈ విషయం చెప్పింది. తనకి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. తను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అని పార్వతికి మాటిస్తాడు ఆర్య. మా ఇంట్లో ఏది జరగాలన్న ఫైనల్ గా మా ఇంట్లో విక్కీని నిర్ణయం తీసుకుంటాడు. మా ఇంట్లో విక్కీ మాటే ఫైనల్ మా అమ్మ కూడా కాదనలేదు. ఇందాక మీ అంతట మీరే చూశారు కదా, అప్పుడైనా మీకు అర్థం అయి ఉండాలి కదా, ఇక మా అమ్మ అంటారా తను నోరు ఆలా ఉంటుంది. అత్తయ్య గారు, అనుకి నేనున్నాను, అనుని బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది. మా అమ్మాయికి నచ్చినవాడు వస్తున్నాడు అనుకున్నాను కానీ, ఇంత మంచి వాడు ఇంత బాగా అర్థం చేసుకునేవాడు వస్తాడని అనుకోలేదు బాబు. మీకు ధన్యవాదాలు అని అంటుంది పార్వతి. సరే అండి నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు ఆర్య. నువ్వెంత అదృష్టవంతురాలు వమ్మి భలే మంచి భర్త దొరికాడు నీకు, నీలాగే పద్మావతి కి కూడా, మంచి భర్త రావాలి అని పార్వతి ఆండాలు ఇద్దరు అనుకుంటారు.

కృష్ణ ప్లాన్ అమలుచేయటం…
కృష్ణ, ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టుగా ఈ కెమికల్ తో జాగర్త గా ఉండాలా , నిప్పు రాజుకుందంటే ఇక ఆగదు అంటావు అంతే కదా, బూడిదవ్వాల్సిందే, నిజంగా అలానే జరుగుతుందా అని అడుగుతాడు. ఆ స్ప్రే తో జాగ్రత్తగానే ఉంటాలే నేను అని అంటాడు. కృష్ణ ఆ స్ప్రే బాటిల్ ని తీసుకొని ఈ బాటిల్ ఇంత డేంజర, అయితే ఇప్పుడు ఇదంతా అరవింద్ కి, పెర్ఫ్యూమ్ అని చెప్పి స్ప్రే చేస్తాను. ఇక ఇదే నా దగ్గర ఉన్న దారి. హోమం నుండి నిప్పురవ్వలొచ్చి నీ వంటి మీద పడడం. నువ్వు పైకి పోవడం అన్ని ఒకేసారి జరగాలి. అని అనుకునే సమయానికి, అరవింద వస్తుంది అక్కడికి, కృష్ణ స్ప్రే బాటిల్ ని వెనకాల పెట్టుకుంటాడు. హోమం కింద జరుగుతుంటే మీరు పైనుంచి చేస్తున్నారు రండి వెళ్దాం అని అంటుంది అరవింద. ఎప్పుడూ తమ్ముళ్ల గురించి ఆలోచన అప్పుడప్పుడు ఈ భర్త గురించి కూడా ఆలోచించు అని అంటాడు.నేను మీ మీద ప్రేమ చూపించట్లేదు అంటారా అని అంటుంది. నువ్వు అలిగితే చాలా అందంగా ఉంటావ్ రాణమ్మ అందుకే అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాను.మీరు మాటలతోనే,మాయ చేసేస్తారు అని అంటుంది అరవింద. ఏంటి వెనకాలేదు దాచారు చూపించండి అని అంటుంది. కృష్ణ ఇది పెర్ఫ్యూమ్ రాధమ్మ మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. కావాలంటే చూడు ఒకసారి వాసన అని స్ప్రే చేస్తాడు. చాలా బాగుందండి అని అంటుంది అరవింద. నేను స్ప్రే చేస్తానులే రానమ్మ నీకెందుకు శ్రమ అని కావాలని చీర మొత్తాన్ని స్ప్రే చేస్తాడు. ఇంక చాలు ఆపండి మొత్తం చీరంతా స్ప్రే చేస్తున్నారు బాటిల్ అంతా అయిపోగొట్టాలా, అప్పుడే కదా ఎక్కువ మంట వస్తుంది అని అంటాడు. ఏమన్నారు అని అంటుంది అరవింద. ఎక్కువ స్మెల్ వస్తుంది అని అంటాడు కృష్ణ.సరే అని ఇద్దరు కిందకి వస్తారు.సిద్దు వచ్చి పద్మావతి ఇంతకీ నువ్వెలా వచ్చావు అని అడుగుతాడు. విక్కీ సిద్దు తో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని అంటాడు. ఈ సిటీ కొత్త కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అని అంటాడు సిద్దు. కన్ఫ్యూజ్ అయిన ఇంటికి వచ్చావు కదా అని అంటుంది అరవింద.

హోమం ప్రారంభం.. అరవింద కు అపాయం..
అమ్మ హోమం ప్రారంభిస్తున్నాను అని అంటారు పంతులుగారు. హోమం ప్రారంభించగానే కృష్ణ, దూరంగా ఉన్న అరవింద అని చూసి, రాణమ్మ ఏంటి దూరంగా ఉన్నావు దగ్గరగా రా, ఈ హోమం దగ్గరికి వచ్చి నిలబడు అని అంటాడు. అరవింద ఏంటి అన్నట్టుగా చూస్తుంది. అనుమానం రాకుండా అదే రానమ్మ, అను ఆర్యా ల పెళ్ళి చేయాలన్నావు కదా, అందుకని ముందుకు రమ్మంటున్నాను అని అంటాడు. సరే అని హోమం దగ్గరికి వచ్చి నిలబడుతుంది అరవింద. కృష్ణ అందర్నీ గమనిస్తూ ఉంటాడు. ఏమాత్రం చిన్న నిప్పు రవ్వ నీ మీద పడ్డ నువ్వు అగ్నికి ఆహుతి అయిపోతావ్ అరవింద, అని మనసులో కృష్ణ అనుకుంటాడు. సిద్దు జరిగేవన్నీ వీడియో తీస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు. రౌడీల నుంచి విక్కీ కాపాడినవన్నీ పద్మావతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ కృష్ణ చూస్తాడు. ఈరోజుతో అరవింద్ అడ్డు తొలగిపోతుంది రేపటి నుండి నువ్వు నా దానివి పద్మావతి, అని మనసులో అనుకుంటాడు కృష్ణ. హోమం పెద్ద మంట వస్తూ ఉంటుంది. కృష్ణ ఆ మంటని అరవిందని చూస్తూ ఉంటాడు. గాలికి అరవింద, పైటా నిప్పురవ్వ దగ్గరికి వస్తూ ఉంటుంది. పంతులుగారు పూజ అయిపోయిందమ్మా ఇక పూర్ణాహుతితో మొత్తం కంప్లీట్ అవుతుంది. నవధాన్యాలు తీసుకొని అందరూ, హోమంలో వేసి నమస్కారం చేసుకోండి అని అంటారు పంతులుగారు. అందరూ నవధాన్యాలు తీసుకొని, హోమంలో వేసి నమస్కారం చేస్తూ ఉంటారు. అందరూ కళ్ళు మూసుకున్న టైంలో, కృష్ణ కూడా అరవిందతో కలిసి నవధాన్యాలు వేస్తున్నట్టుగా నటిస్తూ కృష్ణ పైటకొంగుని, మంట దగ్గరికి తీసుకొచ్చి అంటిస్తాడు. వెంటనే ఏమీ తెలియనట్టు వెనక్కి వెళ్తాడు.

అరవింద చీరకి నిప్పు అంటుకోవడం..
అరవింద నవధాన్యాలు వేసి లేస్తూ ఉండగ, బయటకి నిప్పు అంటుకున్నట్టు అనుకుంటుంది. ఒకసారిగా నిప్పును చూసి, పెద్దంగా అరుస్తూ ఉంటుంది అరవింద. ఒక కృష్ణ అది చూసి అయ్యో, అని పైకిఅంటూ,ఇంకా అయిపోయింది నీ పని అనుకుంటాడు మనసులో, పద్మావతి వెళ్లి వాటర్ నిఒక పెద్ద గిన్నెతో తీసుకొచ్చి, పైటని అందులో, ముంచి ఆ మంటల్ని ఆపేస్తుంది. ఆ మంటలు, ఆరిపోయిన తర్వాత, ఇప్పుడు మీకు అంతా బానే ఉంది కదండీ అని అడుగుతుంది పద్మావతి. ఏమి కాదు టెన్షన్ పడకండి అని అంటుంది. పార్వతి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది అరవింద కు, అందరూ అరవింద్ అని ఇప్పుడు బానే ఉంది కదా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు బానే ఉంది అని చెప్తుంది అరవింద. అంత దగ్గరగా మంటకి ఎందుకు నించున్నావ్ అక్క, అని విక్కీ అడుగుతాడు. నీకేమైనా అయితే అని అంటాడు విక్కీ. తనకు ఏమన్నా అయితే నేను బతకలేను అని కృష్ణ వెనక నుండి అంటాడు. రాణమ్మ ఆ నిప్ప ఏదో నాకంటూ బాగుండేది అని అందరి ముందు యాక్టింగ్ చేస్తూ నేను నిన్ను బాగా చూసుకుని ఉండాల్సింది తప్పంతా నాదే రానమ్మ అని అంటాడు కృష్ణ. మీరేం బాధపడకండి నాకేం కాలేదు కదా అని అంటుంది అరవింద. విక్కీఊరుకో బావ ఇప్పుడు ఏం జరగలేదు కదా అనిఅంటాడు.పంతులుగారు మీకు అంతా మంచే జరుగుతుంది, కంగారు పడాల్సిందేమీ లేదు, వధూవలిద్దరూ వచ్చి ఈ పూర్ణాహుతిని హోమంలో వేయండి. అంతటితో హోమం పూర్తవుతుంది. నేను బాగానే ఉన్నాను జరగాల్సింది చూడండి అని అంటుంది అరవింద. అను ఆర్య ఇద్దరు హోమాన్ని పూర్తి చేస్తారు.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి ఇంటికి వచ్చి, ఆ గాజులు చూసుకుంటూ విక్కిని గుర్తు చేసుకుంటుంది. కొత్తగా ఇదేమిటి విక్కీ గారిని అనుకోగానే, నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని అంటుంది. విక్కీ కూడా ఇదే ప్రేమంటే పద్మావతి నా మనసు నాకెప్పుడూ, నిన్ను ప్రేమిస్తున్నట్టుగా చెప్తూనే ఉంటుంది అని అనుకుంటాడు విక్కీ. నేనుమిమ్మల్ని క్షమించండి అని అడగడం తప్ప,నేను ఇప్పుడు మీకు ఏమి చెప్పలేను అని అనుకుంటుంది పద్మావతి.