Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 316 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

Nuvvu Nenu Prema: ఆండాళ్ కు అడ్డంగా దొరికిపోయిన సిద్దు.. పద్మావతి ఎలా కాపాడనుంది..
ఈరోజు ఎపిసోడ్ లో ఆండాలు పద్మావతి రూమ్ ముందుకు వచ్చి ఉంటుంది. విక్కీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్న అని అడుగుతాడు.అవతల మా అత్త ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టేస్తుంది. నిజం చెప్పేస్తాను అని విక్కీ అంటాడు. నీకేంటి సారు నిజం చెప్పేసి వెళ్లిపోతారు ఆ తర్వాత మా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి. నా మాట విని మీరు మా అక్క లాగా మంచి మీద పడుకోండి. అని బలవంతంగా మంచం మీద పడుకోబెట్టి నిండా దుప్పటి కప్పేస్తుంది. విక్కీ పద్మావతి ఏం చేస్తున్నావు ఏంటిది అని అరుస్తూ ఉంటాడు. పద్మావతి ప్లీజ్ సార్ నేను చెప్పింది వినండి ముందు మీరు పడుకోండి అని అంటుంది.
తలుపు తీస్తుంది, ఆండాలు లోపలికి వచ్చి, ఇందాక ఇక్కడ ఎవరిదో ఫోన్ మోగి ఉండాలి. అయినా ఇది అడగడానికి వచ్చావా అత్త వెళ్లి పడుకో అంటుంది పద్మావతి. మనం ఇంత గొడవ చేస్తున్న లేవదేంటి అను అని ఆండాలకి డౌట్ వస్తుంది. చాలా కష్టపడి పనిచేసి అలసిపోయి పడుకున్నాది అత్త డిస్టర్బ్ చేయకు అని పద్మావతి అంటుంది.సరేగాని నువ్వు కూడా పడుకోవే నువ్వు పడుకుంటే గాని నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళొఅత్త నేను పడుకుంటాను. ఆండాలు లేదు నువ్వు పడుకున్నాకే నేను వెళ్తా నువ్వు పడుకో లేదంటే నేను కూడా ఇక్కడే పడుకుంటాను అంటుంది. చేసేది ఏం లేక పద్మావతి విక్కీ పక్కనే పడుకుంటుంది. అదేంటి మీరు పరాయి మనిషి పక్కన పడుకున్నట్టు పడుకున్నవ్ . అదేంటి పరాయి దా మీ అక్కయ్యగా సరిగ్గా పడుకో, ఆండాలు పద్మావతిని అరుస్తుంది. పద్మావతి పడుకుంటుంది మనసులో, శ్రీనివాస నాకేంటి పరిస్థితి తీసుకొచ్చావు అని అనుకుంటుంది. విక్కీ పద్మావతి అలానే చూస్తూ ఉంటాడు.. విక్కీ నేను వెళ్తాను అని అంటాడు, మళ్లీ మా అత్త వస్తుంది సారు, ఫోన్ లిఫ్ట్ చేయండి, విక్కీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆర్య పద్దు ని తీసుకొని రమ్మని విక్కి తో చెప్తాడు. విక్కీ పద్మావతి తో ఆర్యా మనకోసం ఎదురు చూస్తున్నారు పదా వెళ్దాం అని బయటికి వస్తారు.

పద్మావతి విక్కి,అను, ఆర్యా ఉన్న ప్లేస్ కి వచ్చేస్తారు. ఇక పుట్టినరోజు వేడుకలు చాలా సంతోషంగా జరుగుతూ ఉంటాయి. ఆర్య పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఒక మంచి ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తాడు. కాబోయే శ్రీమతికి నా తరపు నుంచి ఒక చిన్న బహుమతి ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో చేసుకోవాలి అని విషెస్ చెప్తాడు. హ్యాపీ బర్త్డే అక్క అని పద్మావతి విష్ చేస్తుంది. ఇంకా కేక్ కటింగ్స్,అయిపోగానే, అను పద్మావతి తో నా పుట్టినరోజు ఆర్య కి గుర్తుండదు అన్నావుగా చూసావుగా ఎలా సెలబ్రేట్ చేశారో అని అంటుంది. ఆర్య ఏంటి పద్మావతి ఇప్పటికైనా ఒప్పుకుంటావా మీ అక్క మీద నాకు ప్రేమ ఉందని, ఒప్పుకోవడం ఏంటి బావ మీ అంత బాగా చూసుకునే వాడు మా అక్కకి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్య క్రెడిట్ అంతా విక్కిది అని అంటాడు. పద్మావతి వెంటనే ఏంటి ఫోన్ లిఫ్ట్ చేసింది, మిమ్మల్ని మా ఇంటికి వచ్చేలా చేసింది నేను, మా అత్తకు అనుమానం రాకుండా చేసింది కూడా నేనే, అంతెందుకు మీ ప్రేమ పెళ్లి దాక రావడానికి కారణం కూడా నేనే కదా, ఇంత చేస్తే నేను అన్నీ మీ అన్నయ్య అంటున్నావ్. వెంటనే విక్కీ పద్మావత్ నువ్వు ఏది ఒప్పుకోవు నీ మనసులు చెప్పిందైనా ఒప్పుకోక పద్మావతి. అందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు. ఈలోపు సిద్దు వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు. ఇప్పటికే చాలా లేట్ అయింది రేపు పూజ కోసం అందరం బయటికి వెళ్లాలి కదా ఇంకా ఇంటికి వెళ్దాం పదండి అంటుంది అను.

Brahmamudi: వచ్చిన పెళ్లి సంబంధం ని చెడగొట్టిన స్వప్న..ఏ ఆడది చెయ్యని పని చేసేసింది!
పద్దు వాళ్ళ ఇంట్లో హడావుడి మొదలవుతుంది. పద్మావతి వాళ్ళమ్మ చాలా టెన్షన్ గా పనులన్నీ అవుతాయో లేదో అనుకుంటూ ఉంటుంది. పద్మావతి టెన్షన్ పడకమ్మా, వాళ్ళ అమ్మకి ధైర్యం చెబుతుంది. ఇక విక్కీ వాళ్ళందరూ పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తాడు. దోషము పోవడానికి పూజ చేసుకోవడానికి, అందరూ విలేజ్ కి వస్తారు. సిద్దు వావ్ ఈ పిల్లి అంతా మందంగా ఉందో కదా అంటాడు. పిల్లి కాదురా పల్లె, మందం కాదురా అందం, అని అంటాడు విక్కీ.
అను ఆర్య కి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇస్తూ ఉంటుంది, అక్క బావ గారికి మర్యాద చేయాల్సింది నేను కదా నేను చేస్తాను అని పద్మావతి, వేడి వేడి నీళ్లు సిద్దుకి ఆర్యా కి విక్కి కి ఇస్తుంది. నీళ్లు కాళ్ళ మీద పోసుకొని అమ్మో అయ్యా అని అరుస్తారు అందరూ.. నీ పని నువ్వే చేసావు కదా అంటాడు విక్కీ, పద్మావతి ని చూసి.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి తో కృష్ణ ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని అంటాడు. వెంటనే పద్మావతి పక్కన అరవింద గారు, విక్కీ ఉన్నారు, నిజం చెప్తే నీ పరిస్థితి ఏంటి అని బెదిరిస్తూ ఉంటుంది. అయినా కృష్ణ ఎవరు ఎంతమంది ఉన్నా, నీ మెడలో తాళి కట్టేది నేనే కదా అని అంటాడు. దాంతో పద్మావతి కోపంగా చెయ్యెత్తుతుంది కొట్టడానికి, విక్కీ దూరం నుంచి పద్మావతి అని అరుస్తాడు. ఏంటి మా బావగారు ని కొట్టడానికి చెయ్యొత్తవ్ అని అడుగుతాడు. పద్మావతి రీజన్ నాకు తెలియాల్సిందే అని గట్టిగా అరుస్తాడు. ఇక చూడాలి పద్మావతి విక్కీ తో నిజం చెప్పనుందా.