Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి మనసు గెలుచుకోవడానికి, తనకి పాద పూజ చేస్తుంది. విక్కీ మాత్రం పద్మావతిని అసహ్యించుకుంటూనే ఉంటాడు. అందరి ముందు పద్మావతికి మాట ఇవ్వమని అరవింద చెబుతుంది. మనసులో విక్కి నాకైతే ఇష్టం లేదు మా అక్క చెబుతుంది కాబట్టి పద్మావతికి మాట ఇస్తాను అని అందరి ముందు పద్మావతికి జీవితాంతం తన భర్తగా ఉంటానని మాట ఇస్తాడు ఆ మాటకి పద్మావతి నిజం అనుకొని పొంగిపోతుంది. కృష్ణ మాత్రం వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఈరోజు 448 వఎపిసోడ్ లో కృష్ణ పద్మావతి వికీ పూజ చేసిన సామాన్లను పరిటిలో పెట్టి వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న కృష్ణ వాటిని కాల్తో తంతాడు. అది చూసి పద్మావతి అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఏమన్నా బుద్ధుందా అని అంటుంది. ఎందుకు పద్మావతి నా ముందు నటిస్తారు నువ్వు విక్కి కలిసి ఉండటం లేదన్న విషయం నాకు తెలుసు మీరు నటిస్తున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు నువ్వంటే విక్కీకి ఇష్టం లేదని కూడా నాకు తెలుసు అని అంటాడు.
కృష్ణతో పద్మావతి చాలెంజ్..
పద్మావతి నీలా పని మానేసి పచ్చని సంసారంలో నిప్పులు పోసే అలవాట్లు మాకు లేవు, అలాంటి పగటి కలలే మేము కనట్లేదు అన్నయ్య అని అంటుంది కృష్ణని, పద్మావతి అన్నయ్య అని పిలవగానే కృష్ణకి చాలా కోపం వస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏ బంధం లేదని నేను నిరూపిస్తాను అని అంటాడు కృష్ణ. ఏ ప్రేమ లేదని మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఉన్నావు ఆయన అందరికి మాది జన్మజన్మల బంధం అని చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అని కృష్ణ తో ఛాలెంజ్ చేస్తుంది పద్మావతి. అది జరగని పని అంటాడు కృష్ణ పద్మావతి పద్మావతి ఇక్కడ ఒకసారి అనుకున్నాను అంటే జరిగి తీరాల్సిందే నీలాంటోళ్లు ఎంతమంది అడ్డొచ్చినా తాట తీసి జరిగేలా చేస్తాను అని పద్మావతి కృష్ణతో ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య నేనంటే ఏంటో అంటుంది పద్మావతి వెంటనే కృష్ణ ఇంకొకసారి అన్నయ్య అని పిలిచావంటే అని అంటాడు. అన్నయ్య వరసయ్య వాళ్ళని అన్నయ్య అని కాకుండా ఏమని పిలవాలి అన్నయ్య అని అంటుంది. చూస్తా నీ సంగతి అని అంటాడు కృష్ణ, నా సంగతి కాదు చూడటం అరవింద వారిని చూసుకో తనని బాగా చూసుకుంటే నీకే మంచిది లేదంటేనువ్వే ఇబ్బంది పడతావ్ అని అంటుంది పద్మావతి. మిమ్మల్ని విడదీయడానికి నేనున్నాను పద్మావతి అంటాడు ఎంతమంది వచ్చినా గాని నన్ను విక్కీని విడదీయలేరు అని అంటుంది పద్మావతి. చూద్దాం అని అనుకుంటాడు.
శాంతాదేవి ప్రయత్నం..
శాంతాదేవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి అరవింద వచ్చి ఏంటి నానమ్మ ఆలోచిస్తున్నావు అని అంటుంది.విక్కీ పద్మావతి ల మధ్య సఖ్యత లేదు వాళ్ళని ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది శాంతాదేవి. అప్పుడే నారాయణ వచ్చి ఊటీకి టికెట్లు తీసుకొచ్చానమ్మా అని అంటాడు. వెంటనే కుచల ఊటీకి టికెట్స్ తీసుకొచ్చావా, థాంక్స్ అత్తయ్య నా గురించి మీరు ఇంత ఆలోచిస్తారు అనుకోలేదు.పద నారు వెళ్లి మనం బట్టలు సర్దుకొని వద్దాం అని అంటుంది. కాస్త ఆగుతావా నువ్వు అని అంటాడు నారాయణ ఇది మన కోసం కాదు అని అంటాడు. అత్తయ్య కోసం తీసుకొచ్చావా పర్వాలేదు అత్తయ్యకి తోడుగా నేను వెళ్తాను. బట్టలు సర్దుకొని వస్తాను అని అంటుంది కుచల కాస్త చెప్పేది వినుకు జల ఆగలేవా చెప్పేదాకాఅని అంటుంది శాంతాదేవి.మరి ఎవరి కోసం అత్తయ్య ఈ టికెట్లు అని అంటుంది.పద్మావతి విక్కీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించడానికి ఈ టికెట్స్ బుక్ చేశాను అని అంటుంది శాంతాదేవి. ఎందుకు మొన్నట్లాగానే మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అని అంటుంది కుచల. అందుకే ఈసారి వాళ్లతో పాటు ఆర్య అను లని కూడా పంపిస్తున్నాను అని అంటుంది. అక్కడికి అప్పుడే అను పద్మావతి వస్తారు. మిమ్మల్ని హనీమూన్ కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అని అంటుంది అరవింద.అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ ఎందుకు ఇదంతా అని అంటాడు. అదేంటి కృష్ణా అలా మాట్లాడుతున్నావు అని అంటుంది శాంతాదేవి. ఏం లేదు క ఒకసారి ఇలాంటి ప్లానే వేసి ప్లాప్ అయ్యింది ఇప్పుడు మళ్లీ ఇలాంటి ప్లాన్లు అవసరమా, పద్మావతికి ఫ్లైట్ అంటే భయం ఆ మాట తనే చెప్పింది కదా మరి ఇప్పుడు మాత్రం ఫ్లైట్ కి ఊటీ ఎలా వెళ్తారు అని అంటాడు కృష్ణ. అన్నయ్య ఎప్పుడూ ఒకలాగే ఉండవు కదా పరిస్థితులు, అప్పుడు అలా ఉంది ఇప్పుడు అలా ఉండాలని లేదు కదా అని అంటుంది పద్మావతి కృష్ణ తో, అయినా మా సంగతి మేము చూసుకుంటాము. ఎలా చెడగొట్టాలని కృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు.

ఊటీ ప్లాన్ క్యాన్సిల్ చేసిన విక్కీ..
ఇక శాంతాదేవి మీరు వెళ్లి మీ భర్తలతో చెప్పి రెడీ చేసి కిందకి తీసుకురండి అని టికెట్స్ వాళ్ళ చేతిలో పెడుతుంది. పద్మావతి అను ఇద్దరూ చాలా సంతోషంగా, సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్తారు. ఇక పద్మావతి వికీ రూమ్ దగ్గరికి వెళ్లి సారు ఆఫీస్ కి రెడీ అవుతున్నారా అని అంటుంది. విక్కీ ఏం మాట్లాడకుండా ఉంటాడు ఇప్పుడు మీరు ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు సార్ అని అంటుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. వాట్ అని అంటాడు విక్కీ అవును సారూ మనం ఇప్పుడు ఊటీ వెళ్లడానికి రెడీ అవ్వాలి అని అంటుంది పద్మావతి ఏంటి మాట్లాడుతున్నావు అని అంటాడు విక్కీ. మనల్ని ఊటీ వెళ్లడానికి టికెట్స్ బుక్ చేశారు. మనం సంతోషంగా గడపడానికి అమ్మమ్మ గారు ఊటీ టికెట్స్ ఇచ్చి రెడీ అయ్యి కిందకి రమ్మన్నారు అని చెప్తుంది పద్మావతి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సారు మనతోపాటు ఈసారి అను ఆర్యాలు కూడా వస్తున్నారు. సంతోషానికి సంతోషం కాలక్షేపానికి కాలక్షేపం అని అంటుంది పద్మావతి. వెంటనే విక్కీ చేతిలో ఉన్న టికెట్స్ తీసుకొని, ఓపెన్ చేసి చూసి నిజమే పద్మావతి చెప్పేది అనుకొని అయినా నువ్వు ఎలా నమ్మావు పద్మావతి నేను ఎలా వస్తాను అనుకున్నావు అని అంటాడు. అదేంటి సారూ అని అంటుంది. అవును పద్మావతి నువ్వు చేసిన మోసం నేను ఇంకా మర్చిపోలేదు ఆ మోసానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మారను. అందర్నీ నమ్మిస్తావు కానీ నన్ను మాత్రం నమ్మించలేవు నీ నాటకాలు ఇంక చాలు, నేను మాత్రం నీతో ఊటీకి వచ్చి సంతోషంగా ఎలా గడుపుతాను అనుకున్నావు అని అంటాడు విక్కీ. మా అక్కని నమ్మించినంత సులభం కాదు అయినా మన లెక్క ప్రకారం నువ్వు ఇంకో మూడు నెలలు మాత్రమే ఇక్కడ ఉండి తర్వాత నీ దారి నువ్వు చూసుకోవాలి అనవసరంగా నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ అన్నీ ఉపయోగించకు నేను మారను నీ దారి నువ్వు చూసుకోవాల్సిందే అని అంటాడు. అలా మాట్లాడకండి సారు నేను నాకు మీరంటే చాలా ఇష్టం మీరు కూడా నేనంటే చాలా ఇష్టం అందుకే కదా అందరి ముందు ప్రమాణం చేశారు అని అంటుంది పద్మావతి. అదంతా మా అక్క కోసం చేశాను. మా అక్కకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నీకు ప్రమాణం చేశాను కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు విక్కి. మరి ఇప్పుడు మీ అక్క వాళ్లకు ఏమని చెప్తారు అని అంటుంది నిజమే చెప్తానులే అని టికెట్స్ ని చింపేసేసి పద్మావతి ముఖాన విసిరేసి కిందకి వెళ్తాడు.

అందరి ముందు నిజం చెప్పాలనుకున్న విక్కీ..
ఇక పద్మావతికి అందరికీ నిజం చెప్తాను అని కిందకి వస్తుంటే టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మావతి విక్కీ ఎక్కడ అందరికీ తన గురించి చెప్పేస్తాడు అని,ఇక అప్పటికే అను వాళ్ళు బ్యాక్ సర్దుకుని రెడీగా ఉంటారు.నారాయణ ఏంటి విక్కీ బ్యాక్ తో రాకుండా ఇలా వచ్చారు అన్ని షాపింగ్ అక్కడే చేసి, బట్టలన్నీ అక్కడే కొనుక్కుందాం అనుకుంటున్నారా ఏంటి అని అంటాడు.విక్కీ నానమ్మ నేను ఇప్పుడు ఊటీ వెళ్లట్లేదు అని అంటాడు.ఒకసారిగా అందరూ షాక్ అయి లేస్తారు. వెంటనే కృష్ణ నేను అనుకున్నదే జరుగుతుంది. ఇప్పుడు అందర్నీ ఎలా కన్వెజ్ చేస్తాడో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు.అప్పుడే విక్కీ ఇంట్లో అందరికీ నేను ఆఫీస్ పని మీద వెళ్లాలి. ఇప్పుడు ఊటీ వెళ్లడం కుదరదు అని అంటాడు అందరూ నచ్చ చెప్పాలని ట్రై చేస్తారు కానీ విక్కీ మాత్రం వాళ్లకి ఇది నా పర్సనల్ విషయం కాదు కదా ఆఫీస్ లో అందరితో సంబంధం ఉన్న విషయం మనం ఊటీ వెళ్తే కుదరదు అని అంటాడు. ఇక ఎవరూ ఏమీ మాట్లాడకుండావికీ కావాలనే,మేము తర్వాత అయినా ఊటీ వెళ్లొచ్చు నానమ్మ ఆఫీసు ముఖ్యం అని అంటాడు ఇక పద్మావతి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్య నిజం చెప్పలేదు అనుకుంటుంది కృష్ణ మాత్రం ఏదో ఒక విధంగా నేను అనుకున్నది జరిగిందని సంతోషిస్తూ ఉంటాడు. ఇక ఆర్య కూడా మీరు కావాలంటే వెళ్ళండి అని అంటే విక్కి వద్దు నువ్వైతే ఆఫీస్ కి వెళ్లడం నేనైతే నీకు సహాయం చేయకుండా ఊటీ ఎలా వెళ్తాను అనుకున్నావు కదా ఇద్దరం ఆఫీస్ కి వెళ్దాము అని అంటాడు. ఇక ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత శాంతాదేవి ఇప్పుడు మీకు ఆశ పెట్టి నేను చెయ్యలేకపోయాను అమ్మ అని అంటుంది పర్వాలేదండి వాళ్లు బాధ్యతగా ఆఫీస్ కి వెళ్తుంటే మేము కూడా వాళ్ళతో ఆలోచనకి తగ్గట్టుగానే ఉండాలి అని అంటుంది అను ఆ మాట చెప్పి వాళ్ళు ఇద్దరూ లోపలికి వెళ్తారు ఇక శాంతాదేవి మళ్ళీ ఆలోచనలో పడుతుంది.
శాంతాదేవి మరో ప్లాన్..
ఇక శాంతాదేవి మరొక ప్లాన్ వేస్తుంది. విక్కీ పద్మావతిని కలపడానికి ఊటీ పంపించడానికి ప్రయత్నించినప్పుడు ఇలా జరిగింది అని అంటే కృష్ణ నేను చెప్పాను కదా నానమ్మ మీకు అందరికీ వాళ్ళు ఇద్దరు ఊటీ పంపించడానికి ముందే వికీని కనుక్కోవాల్సింది ఎందుకంటే విక్కీ చాలా బిజీగా ఉంటాడు మీరు టికెట్స్ బుక్ చేసిన తన కాన్సిల్ చేస్తాడు ఒకసారి పంపించాలని చూస్తే అది రివర్స్ అయింది అందుకని ఏదైనా ప్లాన్ చేసే ముందు ఆలోచించాలి విక్కీ చాలా బిజీ పర్సన్ కదా అందుకని అని అంటాడు కృష్ణ వెంటనే శాంతాదేవి మనసులో ఇంకో ఆలోచన వస్తుంది. అయితే మనం ఇక్కడే ఊటీని తయారు చేద్దామని అంటుంది అదేంటి అని అంటాడు నారాయణ అవును నారాయణ వాళ్ళిద్దర్నీ కలపడానికి మనం ఇక్కడే ఊటీ లాగా ఏర్పాటు చేద్దాము ఇదంతా కృష్ణ ఇచ్చినా ఐడియా నే అని అంటుంది నేను ఒకలా చెప్తే వీలు ఇంకోలా ఆలోచిస్తున్నారు అనుకుంటాడు కృష్ణ ఇక శాంతాదేవి విక్కీ ఆర్య ఇద్దరు వచ్చేటప్పటికి ఇల్లు నే ఊటీ లా మార్చేస్తుంది.

రేపటి ఎపిసోడ్లో విక్కి ఆర్య ఇద్దరు ఇంటికి వచ్చేటప్పటికి అను పద్మావతి ఇద్దరు రెడీ అయ్యి కళ్ళజోళ్ళు పెట్టుకొని ఫ్యాషన్ గా తయారయ్యి విక్కీ దగ్గరికి వస్తారు. ఏంటిరా మన ఇల్లే మారిపోయింది అనుకుంటే వీళ్ళు కూడా ఇలా మారిపోయారు అని అనుకుంటారు. లోపలికి వెళ్తే శాంతాదేవి నారాయణ అరవింద అందరూ ఊటీలో ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. విక్కీ ఏంటి అక్క ఇదంతా అని అంటాడు మీరు ఎటుకూడి ఊటీ వెళ్లడానికి ఇష్టపడట్లేదు కదా అందుకే ఇక్కడే ఊటీ లాగా ఏర్పాటు చేసాం ఇక ఈరోజు మీరు ఇక్కడే ఉండబోతున్నారు. మీ అందరినీ సంతోష పెట్టడానికి నానమ్మ చేసిన ఐడియా ఇది అని అంటుంది.