Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 345ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 346 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి, అరవింద ను కాపాడుతుంది. అరవింద్ కు అపాయం తలపెట్టింది కృష్ణ అని పద్మావతి తెలుసుకుంటుంది. ఇంకొకసారి ఇలా జరగకూడదు అని కృష్ణకు వార్నింగ్ ఇస్తుంది.

Nuvvu Nenu Prema: అరవింద ప్రాణాలు కాపాడిన పద్మావతి… కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..
కృష్ణ కూడ అరవింద్ అను ఎలాగైనా చంపాలి అని అనుకుంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి వాళ్ళ ఇంటికి విక్కీ పెళ్లి చీర తీసుకొని వస్తాడు. పార్వతి ఆండాలు ఇద్దరూ, పెళ్లి చీర రాలేదని అనుకుంటూ ఉంటారు. అదే టైం కి విక్కీ వస్తాడు. మీరు ఎందుకు వచ్చారు బాబు, ఎవరో ఒకరిని పంపిస్తే సరిపోయేది కదా అని అంటుంది అండాల్. ఆర్య పెళ్లికి ఈమాత్రమైనా నేను చేయాలండి అని అంటాడు విక్కి. పద్మావతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఎవరి కోసం బాబు వెతుకుతున్నారు అని అంటుంది పార్వతి. లేదండి ఎవరి కోసం కాదు కాస్త మంచినీళ్లు ఇస్తే వెళ్తాను అని అంటారు.

ఆర్య అను కి కాల్ చేస్తాడు.
అను ఇంకొక్క రోజులో మన పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి ఆగిపోతుంది ఏమో అనుకొని భయపడ్డాను అని అంటుంది,అను ఆర్య మా విక్కి ఉండగా అలా అసలు జరగదు. నువ్వేం భయపడకు అని అంటాడు. మనం మా విక్కీ చేసిన సహాయాన్ని,గుర్తుపెట్టుకుంటాను. మీరే కాదండి మా కుటుంబం మొత్తం కూడా విక్కీ చేసిన సహాయానికి జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది అని అంటుంది అను. ఆర్య వికీ మాత్రమే కాదు పద్మావతి కూడా, మా అక్క ప్రాణాలు కాపాడింది తనే కదా, అని అంటాడు ఆర్య. అవునండి పద్మావతి విక్కి ఇద్దరినీ మనం మర్చిపోకూడదు అని అనుకుంటారు. ఆర్య అనుతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. పెళ్లి జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలి. వెంటనే మనం హనీమూన్ వెళ్తున్నాం అని అంటాడు. అనుకి అను ఇంక చాలు అండి ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది. ఈలోపు అత్తయ్య పిలుస్తుంది. నేను వెళ్ళాలి అని ఫోన్ పెట్టేస్తుంది.

పద్మావతి కోసం విక్కీ చూపులు…
విక్కీ పద్మావతి కోసం వెతుకుతూ ఉంటాడు. పద్మావతి ఎక్కడ కనిపించకపోవడంతో బయటకు వెళ్లిందేమో అని అనుకుంటాడు. అదే టైం కి అక్కడ ఒక పెద్దావిడ వచ్చి వంటలు గురించి అడుగుతుంది. అవన్నీ మా పద్మావతి చూసుకుంటుంది. తను పెరట్లోనే ఉంది వంటలు చూసుకుంటూ, అని చెప్తుంది పార్వతి. వెంటనే విక్కీ పద్మావతి పెరట్లో ఉందా అని అనుకుంటాడు. సరే అండి నేను వెళ్లొస్తాను అని పార్వతి తో చెప్పి పెరట్లోకి వెళ్తాడు. విక్కీ రావడానికి పద్మావతి కనిపెడుతుంది. ఏంటి విక్కీ సార్ వచ్చినట్టు నా గుండె, వేగంగా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. సార్ ఇప్పుడు ఎందుకు వస్తారు ఇక్కడికి రాలేదు అని అనుకుంటుంది. అయినా గుండె వేగం తగ్గదు. ఇంకా ఎక్కువగా కొట్టుకుంటుంది నాకు దగ్గరలోనే ఉన్నారా, అని తలెత్తి పైకి చూడగానే విక్కీ కనిపిస్తాడు.విక్కీ దగ్గరికి వచ్చి నువ్వేంటి ఎక్కడున్నావ్ అని అంటాడు. వంటలు చూస్తున్నాను అని అంటుంది. వంటలు బాగా చేస్తేనే కదా మన గురించి చెప్పుకునేది పదిమంది అని అంటుంది. తొందరగా చూడండి ఆ గిన్నెదించండి, కూర మాడిపోతుంది అని హడావుడి హడావిడి చేస్తుంది. వంటలన్నీ టెస్ట్ చేస్తూ ఉంటుంది అవన్నీ విక్కీ చూస్తూ ఉంటాడు. మీరు కూడా టెస్ట్ చేయండి అని విక్కిని కూడా టెస్ట్ చేయమంటుంది. కూర తిని విక్కీ సైలెంట్ గా ఉంటాడు. కూర బాలేదా ఇంటికి ఇంత సైలెంట్ గా ఉన్నాడు అని అనుకుంటుంది. బాలేదా ఏంటి సారు అని అడుగుతుంది. సూపర్ గా ఉంది పద్మావతి అని అంటాడు. సరే నేను పని చేసుకుంటాను అని అంటుంది.

కార్ కి బ్రేకులు తీసేసిన కృష్ణ..
అరవింద గుడికి వెళ్దాం అనుకుంటుంది.కృష్ణ ఎలాగైనా అరవింద్ అని చంపాలి అని, కారుకి ఎవరు చూడకుండా బ్రేకులు తీసేస్తాడు.అరవింద కృష్ణ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది. కృష్ణ కార్లు బ్రేకులు తీసే పనిలో ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయరేంటి, ఎక్కడున్నారు అని అనుకుంటూ మళ్లీ ఫోన్ చేస్తుంది. అరవింద్ రావడానికి కృష్ణ గమనిస్తాడు. అరవింద వచ్చేలోపు తొందరగా పని పూర్తి చేయాలని, ఫోన్ పట్టిచ్చుకోకుండా, బ్రేక్ తీసేస్తాడు. అరవింద అదే టైంకి అక్కడికి వస్తుంది. మీరేంటండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇక్కడ ఉన్నారు అని అంటుంది. ఫోన్ పనిలో ఉండి సైలెంట్ లో పెట్టాను,అంటాడు కృష్ణ. కృష్ణ మొహానికి ఆయిల్ అయి ఉంటుంది. ఏంటి మీ మొహానికి ఏదో రంగ్ అయింది అని అంటుంది. ఏం లేదే అని కృష్ణ తుడుచుకుంటాడు. కృష్ణ ఒక గులాబీ పువ్వు అరవిందకు ఇచ్చే ఐ లవ్ యు రానమ్మ అని అంటాడు. ఏంటి ఈరోజు శ్రీవారికి ఇంత ప్రేమ పొంగుకు వచ్చింది.ఇప్పుడు నువ్వు నన్ను వదిలి ఒంటరిగా వెళ్తున్నావు కదా,ఈ జన్మలో నువ్వు నా మీద చాలా ప్రేమ చూపించావు.వచ్చే జన్మలో అయినా నీ మీద నేను ప్రేమ చూపిస్తాను అని అంటాడు. అదేంటి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది అరవింద. అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి గుడికి వెళ్తున్నావ్ కదా ఒంటరిగా, వచ్చిన తర్వాత నీ మీద ప్రేమ చూపిస్తాను. అని అంటాడు, కృష్ణ. కోర్టులో పని లేకపోయినట్లయితే నేనే వచ్చేవాణ్ణి అని అంటాడు. ఏం పర్వాలేదు లేండి. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు భర్తగా రావాలి. నాకు మాత్రం పద్మావతి రావాలి అని మనసులో అనుకుంటాడు కృష్ణ. సరే రానమ్మ నీకు టైం అవుతుంది త్వరగా వెళ్ళు అని అంటాడు. డ్రైవర్ని పిలిచి అరవింద్ అని గుడికి పంపిస్తాడు. ఎప్పుడు వెళ్ళింది నువ్వు ఇక ఎప్పటికి తిరిగి రావు అరవింద ఇక నేను పద్మావతి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాడు.

పద్మావతి హెల్ప్ చేసిన విక్కి..
పద్మావతి ఇప్పుడే ఈ క్యాటరింగ్ వాళ్లు హ్యాండ్ ఇవ్వాలా, ఇప్పుడు పట్టించడానికి ఎవరూ లేరే అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పట్టించాలి అనుకునే టయానికి, విక్కీ వస్తాడు. అయ్యో సారు మీరేంటి అని అంటుంది పద్మావతి. ఏం పర్వాలేదులే పద్మావతి నేను కూడా వడ్డిస్తాను అని అంటాడు. వదిలేసారు నేను ఒట్టించుకుంటాను అని అంటుంది. ఇష్టమైన వాళ్ళు కష్టపడుతుంటే చూడలేని పద్మావతి అని అంటాడు. పద్మావతి వికీ ని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఈసారి ఏంటి నాకు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు అని అంటుంది. విక్కీ పద్మావతి ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు. భోజనంలో కూర్చున్న ఒక పెద్ద ఆవిడ, ఏంటి పద్మావతి నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడ ఉంది అని అంటుంది. అక్క పెళ్లి కదా పెద్దమ్మ అన్ని పనులు చూసుకుంటున్నాను కదా అని అంటుంది. మీరంతా తృప్తిగా భోజనం చేయండి చాలు అని అంటుంది. అదే టైం కి విక్కీని వెయిటర్ అని పిలుస్తుంది భోజనాల్లో ఉన్న ఒక ఆవిడ. సరే అండి తీసుకొస్తాను అని అంటాడు.పద్మావతి ఆవిడ దగ్గరికి వెళ్లి ఆయన వెయిటర్ కాదు, ది గ్రేట్ బిజినెస్ మాన్ విక్రమాదిత్య గారు. స్వయానా మా అక్కకు బావగారు అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,విక్రమాదిత్య కు పద్మావతి జ్యూస్ తీసుకుని, వస్తుంది. భోజనం వద్దన్నారట జ్యూస్ ఎక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నారు అని అడుగుతుంది. నేను ఒంటరిగా ఎందుకు కలవాలి అనుకుంటున్నాను నీకు తెలియదా పద్మావతి అని అంటాడు. నీ మనసులో ఉన్న మాటని చెప్పు పద్మావతి అని అడుగుతాడు. పద్మావతి కూడా ఇప్పుడే నా మనసులో ఉన్న మాట మీకు చెప్పేస్తాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.. చూడాలి పద్మావతి ఏం చెప్పనుందో..