Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి చనిపోవాలి అనుకొని నీళ్లలోకి దూకడం, విక్కీ కాపాడడం,కృష్ణ కావాలని విక్కీకి పద్మావతి మీద చెప్పడం. కృష్ణ అన్న మాటలు మీ మనసులో పెట్టుకొని పద్మావతిని ద్వేషించిన విక్కీ. ఇంట్లో అందరి ముందు పద్మావతిని అవమానించి వెళ్లిపోమంటాడు విక్కీ. అయినా పద్మావతి జరిగిన నిజం తెలిసింది కాబట్టి విక్కీని ఎలాగైనా మార్చుకోవాలి అనుకుంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి వికీ ఉన్న రూంలోనికి వస్తుంది. నిన్ను వెళ్లిపోమని చెప్పాను కదా మళ్లీ ఎందుకు ఈ ఇంట్లోనే ఉంటున్నావుఅని విక్కీ అంటాడు.చూడండి సారు మీరు ఎన్ని చెప్పినా నేను ఇకమీదట వెళ్ళను. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి అని అంటుంది. ఇలాంటి మాటలు చెప్పి నన్ను కన్వెజ్ చేయాలనుకోకు పద్మావతి నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు చేసినవి నేను మర్చిపోలేను అని అంటాడు. మీరు నాకు ఆరు నెలలు టైం ఇచ్చారు కాబట్టి ఆ ఆరు నెలలు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను అని అంటుంది పద్మావతి. సరే ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నాను ఇకమీదట ఇలాంటి పనులు ఏమీ చేయకు నేను ఈసారి మాత్రం నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో అని పద్మావతి మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి మనసులో మీకు నా మీద చాలా కోపం ఉందని నాకు అర్థమైంది కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను చెప్పే మాట మీరు వినిపించుకోవట్లేదు ఒకసారి నా మాట వింటే మీకే అర్థమవుతుంది ఎలాగైనా ఈ ఆరు నెలల్లో మిమ్మల్ని నేను మార్చుకొని నా మీద ఉన్న ప్రేమని బయటపెట్టి ఇస్తాను మీ చేతే అని అనుకుంటుంది.

అను ఆర్యాల సంతోషం..
అను రూమ్ లో ఉండగా ఆర్య అక్కడికి వస్తాడు. నువ్వు చాలా బాధపడుతూ ఉంటావ్ అనుకోని వచ్చాను నువ్వు సంతోషంగానే ఉన్నావు అని అడుగుతాడు ఆర్య. పద్మావతి అలా చేసుకున్నాన్ని ఆ తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను అండి కానీ పద్మావతి ఇంటికి వచ్చేసరికి నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది. అయినా పద్మావతి తన భర్త మీద చూపించే ప్రేమ ఎప్పటికైనా వాళ్ళిద్దరినీ కలుపుతుంది విక్కీ గారి కోపాన్ని పోగొడుతుంది అది పద్మావతి నాకు మాటిచ్చిందండి అని అంటుంది అను. అవునా ఇంత సంతోషకరమైన వార్త చెప్పావు అని అనుని ఎత్తుకుంటాడు ఆర్య. పద్మావతి కూడా మా విక్కి మీద కోపం ఉందేమో అనుకున్నాను వాళ్ళిద్దరు ఎప్పటి కలుస్తారు అని బాధపడ్డాను ఇప్పుడు నువ్వు మాట చెప్పిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది డియర్ అని అంటాడు ఆర్య.

విక్కీని ప్రేమిస్తున్న పద్మావతి..
పద్మావతి రూమ్లో విక్కీ ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటుంది అప్పుడే విక్కీ ఫోన్ మాట్లాడుతూ వచ్చి తుముతూ ఉంటాడు అయ్యో నా వల్ల మీకు జలుబు చేసినట్టు ఉందండి ఆవిరి పట్టండి అని అంటుంది అకిలాంటివన్నీ ఇష్టం ఉండదు అని అంటాడు విక్కీ. ఇష్టం ఉన్న లేకపోయినా కొన్ని కొన్ని చేయాలి సారు మీరు ఆవిరి పట్టండి నేను వెళ్లి తీసుకొస్తాను వేడి నీళ్లు అని అంటుంది. ఏంటి నా మీద లేనిపోని అభిమానం అంతా చూపిస్తున్నావా ఇలాంటి మాయమాటలకి ఇలాంటి స్పెషల్ కి నేను నీకు ఎప్పటికీ క్షమించను. ఇలాంటి పనులన్నీ చేయడం మానేసి అని అంటాడు విక్కీ. నా మీద కోపం ఉంటే నన్ను అనండి అంతేకానీ మీ ఆరోగ్యం పారి చేసుకుంటారా ఏంటి అని వెళ్లి తీసుకొస్తాను అంతే అని అంటుంది. అయినా విక్కీ ఒప్పుకోడు అప్పుడు పద్మావతి అరవింద్ గారు అని పిలుస్తుంది అరవింద్ లోపలికి వస్తుంది. చూడండి మీ తమ్ముడికి జలుబు చేసింది నేను నీళ్ళు ఆవిరి పెట్టమంటే పట్టడం లేదు అని అంటుంది. విక్కీ పద్మావతి ఏం చెప్పినా నీ మంచికే కదా చెప్పేది ఆవిరి పెట్టొచ్చు కదా అని అంటుంది అరవింద. సరే అని ఒప్పుకుంటాడు విక్కీ. అరవింద వెళ్ళిపోతుంది. విజయ ఆవిరి పెట్టడం కోసం పద్మావతి ఏర్పాటు చేస్తుంది. ఇక విక్కి ఆవిరి పడుతూ ఉండగా పద్మావతి అలానే విక్కీని చూస్తూ ఉంటుంది. విక్కీకి పద్మావతి ఐ లవ్ యు సారు అని చెప్తుంది. ఒకసారిగా విక్కీ షాక్ అయ్యి ఏమన్నావ్ అని అంటాడు. ఏం లేదు ఆవిరి సరిగ్గా పట్టండి అని అంటున్నాను అంటుంది కాదు నువ్వు ఏదో అన్నావు నాకు వినిపించింది ఏంటి సరిగ్గా చెప్పు అర్థం కాలేదు అంటాడు. నేనే మల్లేశారు. మీకు అలా అనిపించి ఉంటుంది అని అంటుంది. నువ్వు నన్ను ఎంత ఇంప్రెస్స్ చేయాలని చూసినా నేను మాత్రం ఇంప్రెస్స్ అయ్యే పనేలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కి. పద్మావతి మాత్రం మనసులో ఎట్లాగైనా మిమ్మల్ని మారుస్తాను అని అనుకుంటుంది.

కుచలకి బుద్ధి చెప్పడం..
కుచల కాఫీ తాగుతూ కావాలని కాఫీ ని కింద పోసి అనుని పిలుస్తుంది. ఏ అను ఎక్కడున్నావ్ ఇట్రా అని అంటుంది. చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది అను ఇక్కడ కాఫీ కింద పోయాయి వచ్చి చూడు అని అంటుంది అను సరే అని వెళ్లి మోప్ తీసుకొని వస్తుంది.ఇదంతా పైనుంచి పద్మావతి గమనిస్తూ ఈ అత్తకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వినదు ఈసారి కొంచెం గట్టిగా చెప్పాలి అని డిసైడ్ అయ్యి కిందకి దిగుతుంది. అక్క నువ్వు ఎందుకు కష్టపడతావు పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి తుడుస్తారులే అని అంటుంది పద్మావతి వెంటనే కుచల కోపంతో మీ అక్క చెల్లెలు ఇద్దరికీ బాగా ఏసీలు అలవాటయి ఒళ్ళు వంగట్లేదు కాస్త ఇలాంటి పనులైనా చేయండి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అని అంటుంది. అను ఎందుకులే అమ్మి గొడవ చేస్తాను అని అంటుంది. కుచల నువ్వు వెళ్లి కాపీ పట్టుకురా పో అని అంటుంది పద్మావతిని. మా చెల్లి కాఫీ తీసుకొస్తుంది ఇక్కడ నేను క్లీన్ చేస్తాను అని పంపించేస్తుంది పద్మావతి. పద్మావతి కావాలని నీళ్లు ఎక్కువ పోసి తుడుస్తూ ఉంటుంది ఈ పద్మావతి నాకు భయపడినట్టు ఉన్నది అందుకనే నేను చెప్పిన పని చేస్తుంది ఎలాగైనా ఇదే మంచి టైం దీన్ని గ్రిప్ లో పెట్టుకోవాలి అని అనుకుంటుంది కుచల మనసులో, కానీ పద్మావతి మాత్రం ఎలాగైనా ఇప్పుడు ఈవిడ కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది.పక్కనే ఉన్న అరటిపండు ని తీసేసి తొక్కని కుచల కాలు దగ్గర వేస్తుంది. అత్తయ్య గారు మీరు వచ్చి కూర్చోండి నేను తుడుస్తాను కదా అని అంటుంది. కుచల ఫోన్లో పాటలు వింటూ చూసుకోకుండా అరటి తొక్క మీద కాలేసి జారి సోఫాలో పడుతుంది. అమ్మో నా నడుము విరిగింది అని పెద్దగా అరుస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. కుచలనూ లేపి ఏమైంది అని అడుగుతాడు నారాయణ. ఇక్కడ అరటి తొక్క ఎవరేసారండి అని అంటుంది. నువ్వే మొహానికి రాసుకొని తొక్క అక్కడ పడేసి ఉంటావు నీకు వయసుతో పాటు బుద్ధి కూడా ఉండట్లేదు అని అంటాడు నారాయణ. నాకు బాగా గుర్తుంది అండి ఈ తొక్క నేనయితే పడే లేదు అని అంటుంది. నువ్వు తప్పితే ఇంకెవరు తినే వాళ్ళు ఉండేది ఇంట్లో అని అంటాడు నారాయణ. అరవింద చూసుకోవాలి కదా పిన్ని అని అంటుంది. పద్మావతి ఈసారి చూసుకో నడవండి లేదంటే పళ్ళు రాలుతాయి అని అంటుంది. కుశల ఏమన్నావ్ అని అంటుంది అదే చూసుకొని నడవండి లేదంటే మీ నోట్లో ఉన్న పళ్ళు రాలి కింద పడతాయి అని జాగ్రత్త చెప్తున్నాను అంటుంది పద్మావతి. అరవింద బాబాయ్ పిన్ని లోపలికి తీసుకెళ్ళు రెస్ట్ తీసుకోండి అని అంటుంది. సరే నీకు చాలా అయ్యో అమ్మ అనుకుంటుండు లోపలికి వెళ్తుంది అను పద్మావతి వైపు చూసి ఇదంతా నీ పనే కదా అని అన్నట్టుగా సైగ చేస్తుంది పద్మావతి నవ్వుతుంది.
Krishna Mukunda Murari: ముకుందా మురారిని అలా చూసేసిన రేవతి ఏం చేసిందంటే.?

అరవింద అనుమానం..
ఇక అరవింద విక్కీ పద్మావతికి గొడవపడిన విషయాన్ని తలుచుకుంటూఆలోచిస్తూ వంటగదిలోనికి వస్తుంది.అప్పుడే పద్మావతి అక్కడ విక్కీ కోసం కాఫీ క్యారేజీ రెడీ చేసుకుని ఉంటుంది. అది చూసి అరవింద పద్మావతి ప్రేమా విక్కి ని మారుస్తుంది అనుకుంటుంది. పద్మావతి కాఫీ క్యారేజీ తీసుకొని విక్కీ రూమ్ కి వెళుతుంది. అరవింద కూడా పద్మావతి వెనకాలే వెళ్తుంది. విక్కీ అరవింద వచ్చిన సంగతి గమనించుకోకుండా పద్మావతి మీద అరుస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించొద్దని అంటాడు విక్కీ. నేను మీకోసమే కాఫీ టిఫిన్ తీసుకొచ్చాను తీసుకెళ్లండి ఆఫీస్ కి అని అంటుంది. వేడిగా ఉన్నాయి కాఫీ తాగేసేయండి అని అంటుంది పద్మావతి. కాఫీ కప్పుని నేలకేసి కొట్టి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించదు నీ మీద నా ద్వేషం నాకు ఎప్పటికీ పోదు అసలు నువ్వంటేనే నాకు అసహ్యం నిన్ను కళ్ళ ముందు ఇట్లా చూస్తున్నా నాకు చాలా కోపంగా ఉంది కానీ అని ఆపేస్తాడు.చూడండి సారు నామీద కోపం ఉంటే నన్ను కానీ మీ కడుపు మార్చుకోవాల్సిన పనిలేదు ఇక బాక్స్ తీసుకెళ్లండి అని అంటుంది. విక్కీ కోపంగా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి అరవింద గమనిస్తుంది విక్కీకి పద్మావతి మీద ఇంత ద్వేషం ఉందా అని చాలా బాధపడుతుంది. ఇదంతా దూరం నుంచి కృష్ణ కూడా గమనిస్తాడు పగిలిన ఈ కప్పు లాగానే మీ మనసులు కూడా ఎప్పటికీ అతుక్కోవు అదే నాకు కావాల్సింది అనుకుంటాడు మనసులో, ఇక పద్మావతి మాత్రం ఎప్పటికైనా మిమ్మల్ని మారుస్తాను అనే డైలాగ్ తోనే ఉంటుంది.

కృష్ణ కొత్త ప్లాన్..
ఎలాగైనా పద్మావతి విక్కి లని విడగొట్టాలని కృష్ణ అనుకుంటాడు. అరవింద రూమ్ లో బాధపడుతూ ఉంటుంది. టైం అయింది రా అన్నమాట టాబ్లెట్లు వేసుకోవా అని అంటాడు కృష్ణ. నాకేం పర్లేదండి కానీ నా మనసే చాలా బాధగా ఉంది అంటుంది అరవింద. అదేంటి రానమ్మ నావల్ల ఏమైనా తప్పు జరిగిందా అంటాడు. మీ మీద కాదండి విక్కీ గురించే ఆలోచిస్తున్నాను. తను పద్మావతిని చాలా బాధ పెడుతున్నాడు విక్కీ వల్ల పద్మావతి బాధపడుతుంది అది నేను కళ్ళారా చూశాను అని అంటుంది. వెంటనే కృష్ణఇదే మంచి ఛాన్స్ అనుకోని నేను ఎప్పటినుంచో చెప్తున్నాను కదా రానమ్మ మీకు ఎవరికీ అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ నటిస్తున్నారు వాళ్ళ మధ్యలో ప్రేమ లేదు. అని నేనెంత చెప్పినా మీరు వినరు అయిన వాళ్ళని కలపాలి అనుకుంటారు అయినా ప్రేమ లేకపోతే ఎలా కలుస్తారు రానమ్మ అని అంటాడు.
రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి బట్టల సర్దుకుంటూ ఎవరైనా భార్య భర్తలు హనీమూన్ కి వెళ్తుంటే ఇలా డల్లుగా కూర్చుంటారా కాస్త నవ్వండి సారు అని అంటుంది. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదు అలాంటిది నీతో హనీమూన్ అంటే నవ్వు ఎలా వస్తుంది అని అంటాడు విక్కీ. దీనిని బట్టి కృష్ణ అన్న మాటలకి ఎలాగైనా విక్కీ పద్మావతిని కలపాలని అరవింద ప్లాన్ అయి ఉంటుంది