Nuvvu nenu prema: అరవింద గర్భవతి అని అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. ఇక పద్మావతి ఆ విషయాన్ని విక్కీకి చెబుతుంది.. సంతోషంగా ఉందని ఎత్తుకొని తిప్పుతాడు.. విక్కీ వెళ్లి అక్కకు విషెస్ చెబుతాడు.. నువ్వు తల్లివి కాబోతున్నావని నేను చాలా సంతోష పడుతున్నాను.. మన అమ్మ మనతోనే ఉంటుంది.. అని ఇద్దరు ఎమోషనల్ అవుతారు.. ఇక అందరూ సంతోషంతో ఉబ్బితబ్బి అవుతారు.. పద్మావతి ఈ సంతోషంలో నోరు తీపి చేసుకోవాలి అని స్వీట్స్ తెస్తుంది.. అందరికి ఇస్తుంది.. ఇక కృష్ణ అరవింద గర్భవతి అవ్వడం నాకే మంచిది.. ఇక వీళ్ళు నా గురించి నిజం చెప్పరు ఇది అడ్డుపెట్టుకొని నేను అనుకున్నది సాధిస్తాను.. ఇక రాణమ్మ కంగ్రాట్స్ నాకు మాటలు రాలేదు అంటుంది.. కృష్ణ మాటలు విని అందరూ షాక్ అవుతారు.. ఇప్పుడు మన కల నెరవేరబోతుంది నిన్ను చాలా సంతోషంగా చూస్తాను..ఇక పద్మావతిని అరవింద ఆనందం కోసం నువ్వు కామ్ గా ఉండాలి.. ఇక పద్మావతి అరవింద గారిని అడ్డుపెట్టుకొని బయటపడ్డావ్ లేకుంటే నీ పని అయిపోయ్యేది..

Nuvvu nenu prema: అరవింద గర్భవతి అవ్వడంతో షాక్ లో కృష్ణ.. విక్కీకి పద్మావతి నిజం చెప్తుందా?
ఇక పార్వతి, అండాలు కృష్ణను తిట్టుకుంటారు.. ఇక విక్కీ ఆర్య అనుల పెళ్లి జరిపించాలని అంటాడు. త్వరలోనే ముహూర్తం పెడతాము అని చెబుతారు.. అందరూ వెళ్ళిపోతారు.. వాళ్లంతా బయటకు రాగానే అండాలు ఏందే ఇలా జరిగింది.. అని కృష్ణను అందరూ తిడతారు.. నిజం తెలిస్తే అరవింద గారు తట్టుకోలేదు.. తన గుండె ఆగిపోతుంది.. ఇక ఎలా వాడి గురించి చెప్పాలి అని ఆలోచిస్తారు.. మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని చెప్పింది.. వాడు నిన్ను ఏం చేసిన మాతో చెప్పు అని అందరూ పద్మావతికి దైర్యం చెబుతారు.. ఇక విక్కీ అరవిందకు సర్ ప్రైజ్ అని అరవిందను బయటకు తీసుకెళతాడు.. పార్టీని ఏర్పాటు చేస్తాడు.. చిన్న పిల్లోళ్ల ఫొటోలతో బయట నింపేస్తాడు.. నేను ముందే చెబుతున్నాను నువ్వు ఎలాంటి పనులు చెయ్యకు అంటాడు.. కాసేపు సరదాగా ఉంటారు.. విక్కీని పెళ్లి చేసుకోమని అరవింద చెబుతుంది.. సరే అక్క అంటాడు..

Brahmamudi: కావ్యను భార్యగా ఒప్పుకొని రాజ్.. రాజ్, కావ్యల తో వ్రతం చేయయించనున్న ఇంద్రాదేవి…
కృష్ణ, పద్మావతికి ఫోన్ చేసి అడుగుతాడు.. ఏంటి పద్మావతి నీకు కాబోయే భర్తను ఇలా వెయిట్ చేయిస్తావా తప్పు కాదు.. అప్పుడే పద్మావతి ఇంకో తురి ఆ మాట అంటే ఊరుకోను.. ఎక్కడున్నావు చెప్పు నిన్ను చూడాలని అంటాడు.. అవునా అయితే రారా.. నేను గుడిలో ఉన్నాను అంటుంది.. ఇక కృష్ణ పద్మావతిని కలవడానికి గుడికి వెళ్తాడు..

అలా వెళ్తున్న పద్మావతిని చెయ్యి పట్టుకొని లాగుతాడు..పద్మావతి షాక్ అవుతుంది.. అతని నుంచి విడిపించుకోవాలని ట్రై చేస్తుంది.. ఆ పక్కనే విక్కీ వస్తాడు.. వీళ్ళను చూస్తాడు.. కృష్ణ పద్మావతి చెయ్యి వదిలేస్తాడు.. ఏమైంది అంటూ పద్మావతిని అడుగుతాడు.. ఇక పద్మావతి కృష్ణ గురించి నిజం చెబుతుందా.. లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..