Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, భక్త అనుని తీసుకెళ్లడానికి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేస్తాడు. అను పద్మావతిని కూడా ఇంటికి వెళ్లడానికి రెడీ అవ్వమంటుంది. నాన్న వస్తున్నాడు అన్న సంతోషంలో పద్మావతి చాలా ఆనందంగా ఉంటుంది. భక్త అను వాళ్ళ ఇంటికి వచ్చి, అనుని పుట్టింటికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వమని శాంతాదేవిని అడుగుతాడు.

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి వాళ్ల నాన్న వచ్చాడని తెలిసి కిందకి వస్తుంది. వాళ్ళ నాన్నని చూసి చాలా ఆనందంతో ఎట్లా ఉన్నారు నాయనా అని అడుగుతుంది. ఎన్ని రోజులు నామీద కోపం ఉందనుకున్నాను ఇప్పుడు ఆ కోపం పోయిందా అని అడుగుతుంది.

Nuvvu Nenu Prema: పద్మావతిని నిజం చెప్పమని అడిగిన అను… భక్తా రాకతో పద్మావతి బాధ రెట్టింపు..
భక్త కోపం..
పద్మావతి ఎంత అడుగుతున్నా కానీ భక్త ఏం సమాధానం చెప్పకుండా ఉంటాడు. ఏంటి నాయనా నా మీద ఇంకా కోపం పోలేదా అని అంటుంది. నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇంట్లో అందరూ నా మీద ఇంకా కోపం పోయినట్లు లేదు. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు నాయనా అని అడుగుతుంది. పద్మావతి ఎంత మాట్లాడినా భక్తా మాత్రం అలానే సైలెంట్ గా కూర్చొని ఉంటాడు. నన్ను తీసుకుపోవడానికి వచ్చిన వానైనా ఇంకా ఈరోజు తో నా కష్టాలు అన్ని తీరిపోయినట్లే అమ్మని చూసి ఎన్నో దినాల అయింది. ఇప్పుడు వచ్చి అమ్మని కూడా చూస్తాను అమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది. భక్త ఏం సమాధానం చెప్పకుండా అలానే ఉంటాడు. అందరికీ మా నాయన వచ్చాడు నన్ను తీసుకెళ్లడానికి అని ఇంట్లో వాళ్లకు చెప్తుంది పద్మావతి. బావగారు మా నాయన వచ్చాడు నన్ను తీసుకెళ్లడానికి, తీసుకెళ్లడానికి ఇక ఈ రోజు నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు మా నాయన నాతో మాట్లాడతాడు అని అంటుంది.

Brahmamudi 29 జూలై 161 ఎపిసోడ్: అందరి ముందు రాజ్ కి స్వప్న చేత స్వారీ చెప్పించిన కావ్య..
అను మాత్రమే తన కూతురిని చెప్పిన భక్త..
సరే నాయన నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి బట్టలు సర్దుకొని వస్తాను అక్క పదం బట్టలు సర్దుకొని వద్దాము అని అంటుంది. అను చాలా సంతోషంగా రూమ్ లోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇకనుంచి నేను అమ్మానాన్న ఆయనతో మాట్లాడొచ్చు. అనుతో కూడా మాట్లాడొచ్చు ఇక నేను అనాధని అన్న ఫీలింగ్ నాకు లేదు. మా నాయనని బాగా చూసుకుంటాడు. అత్త కోప్పడుతుంది అంతే కదా తర్వాత తనే మామూలుగా ఉంటుంది.ఇలా పద్మావతి అనుకొని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. భక్త అనుని తీసుకెళ్లడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు శాంతాదేవి. విక్కీ ఇద్దరినీ తీసుకెళ్తున్నాడు కావాలా అనుకోని పైకి వెళ్ళబోతూ ఉండగా, భర్త మాత్రం విక్కీని పలకరించకుండానే ఉంటాడు. సరే అమ్మ అని వచ్చింది ఇక తీసుకెళ్తాను అని అంటాడు శాంతాదేవి తో వెంటనే విక్కీ ఆగిపోతాడు అదేంటి అనుని మాత్రమే తీసుకెళ్తున్నాడు అని అట్టుగా చూస్తాడు. శాంతాదేవి అదేంటండీ అరుణ్ తీసుకెళ్లడం పద్మావతి కూడా వస్తుంది ఉండండి అని అంటుంది. లేదమ్మా నేను అనూని మాత్రమే తీసుకెళ్లడానికి వచ్చాను తను మాత్రమే నా కూతురు పద్మావతి కాదు. అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అదేంటండీ పద్మావతి మీరు వచ్చారని చాలా సంతోషపడుతుంది ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోతే ఎలాగో రెండు నిమిషాలు ఉండండి పద్మావతి కూడా వస్తుంది అని అంటుంది అరవింద. ఏరోజైతే నేను గుండెల మీద పెట్టుకొని పెంచిన కూతురు నా పరువు తీసేసిందో, ఆ రోజే నాకు ఆ కూతురు లేకుండా పోయింది. మా కోసం పెళ్లి కూడా వద్దు అనుకున్నాను మాత్రమే మా కూతురు. నాకు ఇంకెవరూ కూతుర్లు లేరమ్మ అని అంటాడు. మీరేదో కోపంలో మాట్లాడుతున్నట్టున్నారు రెండు నిమిషాలు శాంతించి మాట్లాడండి అని అంటుంది. కోపంలో కాదమ్మా పద్మావతి చేసిన పనికి మేమంతా ఎప్పుడో చనిపోయి ఉండాలి కానీ మేము ఇంకా బతికే ఉన్నామంటే దానికి కారణం అను మీద ఉన్న ప్రేమ మాత్రమే,అనుని చూడ్డానికి అనుని మాట్లాడడానికే మేము ఇంకా ఉన్నానట్టుంది అని అంటాడు.దానికి విక్కీ చాలా బాధగా చూస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన కృష్ణ మురారి.. సూపర్ ట్విస్ట్..
భక్తాకు నచ్చ చెప్పాలని చూసిన శాంతాదేవి..
అను మాత్రమే నా కూతురు నేను తను తీసుకెళ్తాను అని భర్త చెప్పిన తర్వాత శాంతాదేవి, మీరే అలా అంటే ఎలాగా పెద్దవాళ్లు, చిన్నపిల్లల ఏదో చేశారు వాళ్ళు తెలియక చేసిన దానికి మనం, సరి చేయాలి కదా మనం కూడా అలానే ఉంటే ఇక అర్థం చేసుకుంటారు అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు మీరు కొంచెం శాంతించండి అని అంటుంది. లేదమ్మా నేను మీలాగా పెద్ద మనసు చేసుకోలేను మీ అంత, మంచి మనసు పెద్ద మనసు నాకు లేదు అని తేల్చి చెప్తాడు భక్త. అరవింద అలా కాదండి ఒకసారి నేను చెప్పేది కూడా వినండి అని అంటుంది. చెప్పాను కదా అమ్మ మీ అంత పెద్ద మనసు నాకు లేదు. నేను అనుని మాత్రమే తీసుకెళ్లడానికి వచ్చాను అను పదా వెళ్దాం అని అంటాడు. నాయనా అక్కని కూడా తీసుకొని వెళ్దాం అని అంటుంది. నీకు అక్క ఎవరూ లేరమ్మ నువ్వు ఒక్కదానివే నువ్వు మాత్రమే నా కూతురువి పదం వెళ్దామని బలవంతంగా అను ని తీసుకొని వెళ్ళిపోతాడు భక్త.

తండ్రి కోసం పద్మావతి వేదన..
బట్టలన్నీ సర్దుకొని కిందకు చాలా సంతోషంగా వస్తుంది పద్మావతి. అప్పటికే అను ని తీసుకుని భక్తా వెళ్ళిపోతాడు.అందరూ చాలా బాధగా ఉంటారు.అక్క తొందరగా రా నాయన బయట ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు మనం వెళ్దాం పద అని అంటుంది. ఏంటి అక్క ఎంతసేపటికి రావు అని అంటుంది. ఏంటి బావగారు మీరు ఎలా ఉన్నారు మా అక్కఇంటికి పోతుందని మీరు ఎలా డల్ గా ఉన్నారా అని అంటుంది. అక్క ఎంతసేపు, నాయన మనకోసం బయట ఎదురు చూస్తున్నాడు తొందరగా రా అని అంటుంది. ఆర్య అను వెళ్లిపోయింది అని అంటాడు.లేదు అను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది అక్క తొందరగా వెళ్దాం పద అని మళ్ళీ అంటుంది. సిద్దు లేదు మీ నాయన అను తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తాడు.పద్మావతి ఒకసారిగా షాక్ అవుతుంది బ్యాక్ కింద పడేసి ఏడవడం మొదలు పెడుతుంది.మీరంతా అబద్ధం చెబుతున్నారు మా నాయన ఎక్కడికి పోదు నాకోసమే వచ్చాడు నన్ను కూడా తీసుకెళ్తాడు అని అంటుంది. లేదు అను మీ నాయన ఇప్పుడే అన్నం తీసుకొని బయటికి వెళ్ళాడు మేము ఎంత చెప్పినా ఆగలేదు అని అంటాడు ఆర్య. వెంటనే పద్మావతి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి చూస్తుంది. ఇప్పటికీ భక్త అని తీసుకొని ఆటో ఎక్కబోతు ఉంటాడు. నాయనా ఆగు అక్క ఆగు అని చెప్పి పద్మావతి వెనకాలే పడుతుంది. పద్మావతి గుమ్మం దగ్గర నుంచి ఆటో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆటో బయలుదేరి రోడ్డు మీదకు వచ్చేస్తుంది.పద్మావతి ఆటో వెనకాలే పరిగెత్తుకుంటూ ఏడుస్తూ నాయన ఆగండి నేను కూడా వస్తాను నన్ను తీసుకెళ్లండి అని బాధపడుతూ ఉంటుంది. ఆటో ఆక్కుండా వెళ్ళిపోతుంది పద్మావతి రోడ్డు మీద కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది.ఇక్కడే మనకి బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. పద్మావతి తిరిగి ఇంటికి వస్తూ చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నతో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ వస్తుంది.తిరిగి ఇంటికి వస్తుంది పద్మావతి. అప్పటికే పద్మావతి కోసం శాంతాదేవి అరవింద్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.విక్కీ అప్పుడే బయటికి వెళ్లబోతూ ఉండగా పద్మావతి ఎదురు వస్తుంది.పద్మావతిని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. పద్మావతి చాలా బాధగా ఇంట్లోకి వచ్చి బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ విక్కి వైపు ఒక బాధగా చూసి వెళుతుంది. శాంతాదేవి పద్మావతి వెళ్లగానే విక్కీని చూసి చూసావా నువ్వు చేసిన ఒక తప్పుకి ఎంతమంది బాధపడాల్సి వస్తుందో, అందుకే చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని ఉండాల్సింది అని చెప్పేసి వెళ్ళిపోతుంది.

పుట్టింటికి వచ్చిన అను..
ఆండాలు, అను కోసం వంటలని చేస్తూ ఉంటుంది.పార్వతి చెల్లెలు,ఆండల్ కి హెల్ప్ చేస్తాను అని అంటుంది. వద్దులేమ్మా మీ అక్క నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది అని వస్తే చూసుకోవడానికి మాత్రమే,అంతేకానీ అన్ని పనులు నేను చేయమని కాదు కదా వద్దులే నేను చేసుకుంటాను అంటుంది. పర్వాలేదు వదిన నేను చేస్తాను మా అక్క నన్ను వదిలిపెట్టి వెళ్ళింది హెల్ప్ చేయడానికి కదా,అయినా ఇంకా రాలేదు ఏంటి అను అని అంటుంది. వస్తారులే తీసుకురావడానికి వాళ్ళ ఆయన పోయి ఉన్నాడు కదా అని అంటుంది. ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది పార్వతి వాళ్ళ చెల్లెలు. భర్త ఆటో దిగి అను ని తీసుకొని ఇంట్లోకి వస్తాడు.అనుని చూసి పార్వతి చెల్లెలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.ఎన్ని దినాలైనాదో అమ్మి నిన్ను చూసి అని ఆండాలు కూడా అంటుంది.అను ఎట్లా ఉన్నారు పిన్ని ఎట్లా ఉన్నారు అత్తయ్య అని పలకరిస్తుంది. నువ్వు ఒక్కదానివే వచ్చావ్ ఏంటి మీ పద్మావతి రాలేదు అని అడుగుతుంది అను పిన్ని.దానికి అను ఏం సమాధానం చెప్పకుండా ఉంటుంది. అదేంటి బావగారు మీరు అనుని మాత్రమే తీసుకొచ్చారు పద్మావతి తన ఎక్కడ తర్వాత వస్తానని చెప్పిందా అని అంటుంది.చూడు లక్ష్మి,మీ అక్క నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది అనుని చూసుకోవడానికి మాత్రమే కదా పద్మావతి గురించి ఎందుకు, నా పరువు తీసేసిన వాళ్ళు గురించి ఇంట్లో మాట్లాడడానికి వీల్లేదు.అను మాత్రమే నా కూతురు తనని మాత్రమే నువ్వు చూసుకోవాలి అని అంటాడు భక్త..

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి అన్ని సామాను విసిరేస్తూ కోపంగా ఉంటుంది. విక్కీ వచ్చి ఎందుకు అంత కోపం నీకు మాత్రమే బాధ ఉందా అని గట్టిగా అడుగుతాడు. బిక్కిని చూసి పద్మావతి అవును నాకు మాత్రమే బాగుంది అని అంటుంది. బాధ అంటే నీది కాదు నాది నువ్వు నేను ఎంతో ప్రేమించిన, తరువాతనన్ను మోసం చేసి నాకు నమ్మకద్రోహం చేశావు అని అంటాడు. కృష్ణ అరవింద ని తీసుకొని పద్మావతి విక్కి లు తగాదాడుకునే ప్లేస్ కి తీసుకొచ్చాడు. అరవింద నీ చూసి విక్కి, పద్మావతి షాక్ అవుతారు.