Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 323 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి నాన్న భక్త రికవరీ అయినందుకు అందరూ సంతోషపడుతూ ఉంటారు. భక్త ఎక్కడ నిజం చెప్తాడు అని కృష్ణ కూడా చాలా కంగారు పడతాడు. కానీ అరవింద గారి కోసం ఇంట్లో అందరూ నిజం చెప్పకుండా ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో
విక్కీ తనకి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం రాదని, అరవింద్ కి చెప్పిన అరవింద పంచ కట్టుకొని రమ్మంటుంది. విక్కీ పంచ కట్టుకుంటుండగా పద్మావతి వచ్చి హెల్ప్ చేస్తానంటుంది. మీరు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయినా పంచ కట్టుకోవడం రాదు నేను కడతాను అని పద్మావతి, విక్కీకి పంచ కడుతుంది. అది బయట నుండి కృష్ణ చూస్తాడు. వీళ్ళని నేను దూరం చేయాలనుకుంటే ఇంకా దగ్గరవుతున్నారు అని అనుకుంటాడు. అదే టైంకి కుచల బంటి వెతుకుతూ ఉంటుంది. కుచలతో కృష్ణ మీరు వెతుకుతున్న వాళ్లు విక్కీ రూమ్ లో ఉన్నారు వెళ్ళండి అని చెప్తాడు. సరే అని కుచల, విక్కీ రూమ్ కి వెళ్ళగా అక్కడ పద్మావతి విక్కి కి డ్రెస్ సరి చేస్తూ ఉంటుంది. కుచల పద్మావతి కి వార్నింగ్..
Nuvvu Nenu Prema: సంతోషంలో పద్మావతి కుటుంబం..కృష్ణ అరాచకాలకి అడ్డుకట్ట వేసినట్టేనా…
విక్కీ రూమ్లో పద్మావతిని విక్కీని చూసి కుచలకి చాలా కోపం వస్తుంది. కానీ విక్కీ ముందు చాలా ప్రశాంతంగా, డ్రెస్ వేసుకోవడం అయిపోయింది కదా నాన్న నువ్వు కిందకి వెళ్ళు అంటుంది. నేను పద్మావతి తో మాట్లాడి తీసుకొస్తాను అని పద్మావతిని ఉండమంటుంది. విక్కీ వెళ్లగానే కుచల, నీకు ఎన్నిసార్లు చెప్పాను విక్కీ తో క్లోజ్ గా ఉండదని, అయినా నువ్వు వినట్లేదు విక్కీకి దూరంగా ఉండు, నా సంగతి నీకు తెలియదు నాకు కోపం వచ్చింది అంటే ఇప్పటికిప్పుడే ఈ పెళ్లి ఆపేస్తాను అని పద్మావతికి వార్నింగ్ ఇస్తుంది కుచల, వెంటనే పద్మావతి వద్దండి, నేను అరవింద్ గారు చెప్పారని వచ్చాను. మా అక్క ఈ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంది దయచేసి మీరు పెళ్లి ఆపకండి అని ప్రాధేయపడుతుంది. ఇక సరే ఇదే చివరిసారి చెప్పడం మళ్ళీ ఇలా జరగకూడదు.అని కుచల వెళ్ళిపోతుంది.పద్మావతి మనసులోనేను అందరితో క్లోజ్ గా ఉండడం తప్ప, అయినా మా అక్క పెళ్లి జరగడం నాకు ముఖ్యం అని అనుకుంటుంది.

Brahmamudi may31st Episode: గర్భం దాల్చిన స్వప్న..రాహుల్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించిన కావ్య
పద్మావతి విక్కి ల కొంగుముడి
అందరూ బయట పందిరి గుంజ నాటడానికి వస్తారు. పంతులుగారు పూజ చేయిస్తూ ఉంటారు. అదే టైం కి పద్మావతి విక్కిల, డ్రస్ చివర్ల ముడి పడతాయి. అది చూసి పంతులుగారు, పెళ్లి కాకుండానే కొంగుముడి పడిందంటే ఇది దైవ నిర్ణయమే అని అంటాడు. ఈడు జోడు కూడా బాగున్నాయి వీళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందన్నట్టుగా అంటాడు. వెంటనే కృష్ణ కుచలకోపం గా చూస్తూ ఉంటారు. ఆ ముడి తీయడానికి పద్మావతి విక్కి లు ఎంత ట్రై చేసినా రాదు. వెంటనే కృష్ణ వచ్చి పద్మావతి గారు నేనున్నాను కదా. తీయడానికి అని ఆ కొంగునా పడిన ముడిని, విప్పతీస్తాడు. పద్మావతిని ఎవ్వరికీ దక్కనివ్వను నాది అని అనుకుంటాడు. కృష్ణ కోపంగా పంతులు గారితో ఏదో గాలికి ముడి పడితే మీరేందండి దేవుడి ముడి వేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి కాదు మీరు వచ్చింది అని అంటాడు. వెంటనే కుచ్చులందుకొని అవును మా విక్కిని చేసుకోవడానికి, అదృష్టంతో పాటు అర్హత కూడా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ మా వ్యక్తిని అందుకోలేరు. ఇక అందరూ ఇప్పుడు గొడవ ఎందుకు జరిగే కార్యక్రమాన్ని చూద్దాం అంటారు. పద్మావతి అక్కకి ఫోన్ చేసి వస్తానమ్మా మీరందరూ లోపలికి వెళ్ళండి అంటుంది.

పద్మావతిని బెదిరించిన కృష్ణ
పద్మావతి అను కి ఫోన్ చేద్దామని బయటికి వచ్చి, ఫోన్ చేస్తూ ఉండగా అక్కడ అని కూడా పద్మావతి ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. పద్మావతి తో అను ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే ఫోన్ చేశావు అని అంటుంది. ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతుంది. ఇక్కడ ఇప్పుడే పూజా కార్యక్రమాలు అవుతున్నాయి అక్క అవంగానే బయలుదేరుతాను నాన్న రికవరీ సంతోషపడుతున్నారు. నువ్వు ఉంటే బాగోలేదు అని అంటుంది పద్మావతి. ఈలోపు పద్మావతి వాళ్ళ నాన్న పిలుస్తారు. సరే అక్క నేను ఉంటాను నాన్న పిలుస్తున్నారు వెళ్లాలి అంటుంది. పద్మావతి ఫోన్ పెట్టేసి రెండు అడుగులు ముందుకు వేయగానే కృష్ణ వచ్చి ఉంటాడు. అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి అంటుంది. నేను తప్పుకుంటే వెళ్లి విక్కీ ని తగులుకుంటావా అని అంటాడు కృష్ణ, విక్కీ నా బావ నేను అతనితో అలానే ఉంటాను నీకేంటి మధ్యలో అని అంటుంది పద్మావతి. నేనుండగా నిన్ను విక్కీ నీ కలవనివ్వను. నేను ఎలాంటి వాడిని నీకు తెలుసు, నేను నీకోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను అని కృష్ణ పద్మావతి తో అంటాడు.ఏంటి బెదిరిస్తున్నావా? నీకు చేత నేను చేసుకో అని అంటుంది పద్మావతి కృష్ణ పద్మావతి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. పద్మావతి ఎంత వదిలించుకున్నా గాని వదిలించుకోలేకపోతుంది. అదే టైంకి భర్త పద్మావతిని కృష్ణ పట్టుకోవడం చూస్తాడు. ఇక భక్త వచ్చి అరే పద్మావతిని వదిలిపెట్టు ఇది నా కూతురు నీకు ఎన్నోసార్లు చెప్పాను నా కూతురు జోలీ రావద్దు అని, అప్పుడంటే నేను వీల్ చైర్ లో ఉన్నాను కాబట్టి ఏదైనా చేశావు ఇప్పుడు నాకు బాగు అయింది. నువ్వేం చేస్తున్నావ్ నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు భక్త.

తృటిలో తప్పించుకున్న కృష్ణ
కృష్ణ భక్త తో మామయ్య మీరు నువ్వు అర్థం చేసుకోండి. పద్మావతి నేను ప్రేమిస్తున్నాను. తను నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఈ గొడవలు అంతా ఎందుకు అని అంటాడు కృష్ణ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా రా అని, భక్త ఇలా కాదమ్మా వీడి గురించి ఇంట్లో అందరికీ చెప్పాలి అప్పుడే వీడికి బుద్ధి వస్తుంది, పదరా నీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను అని కాలర్ పట్టుకుని, కృష్ణని లాకెళ్తాడు పద్మావతి నాన్న, వద్దు నాన్న వద్దు అని పద్మావతి ఎంత చెప్తున్నా వినడు. పద్మావతి వద్దు నాన్న అరవింద గారు తట్టుకోలేరు ఈ నిజం బయటపడితే, నావల్ల ఈ ఇల్లు ముక్కలు కూడా నాకు ఇష్టం లేదు. అక్క పెళ్లి కూడా ఆగిపోతుంది అక్క కోసమైనా వదిలిపెట్ట నాన్నా ఈ నీచున్ని అని అంటుంది పద్మావతి. సరే అని భక్త వదిలేస్తాడు.అప్పుడే అక్కడికి అందరూ వస్తారు.. ఏమైంది పద్మావతి మా బావగారు అంత సీరియస్గా మాట్లాడుతున్నావ్ అని అంటాడు విక్కి, ఏముంది ఆ నీచుడు కనిపిస్తే, ఈసారి ఎలా హ్యాండిల్ చేయాలా అని బావగారు లాయర్ కదా అడుగుతుంది అని అంటుంది అరవింద. ముందు నాకే చెప్పు పద్మావతి బావకి కాదు అని అంటాడు విక్కి. ఆర్య సాఫ్ట్ గా డీల్ చేయడం కాదు నాకు చెప్పు అని అంటాడు. పద్మావతి ఇక సరే మేము ఇంటికి వెళ్లి వస్తామండి అక్క ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటుంది. ఓకే నీ పెళ్లి అయ్యేలోగా పద్మావతి నీ మనసులో మాటని తెలుసుకుంటాను అని అనుకుంటాడు..

రేపటి ఎపిసోడ్ లో
అను, ఆర్యాల మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికి ఆడవాళ్లు మాత్రమే అనడంతో విక్కీ, ఆర్య ఇద్దరు చీరలు చుట్టుకొని ఎవరికీ తెలియకుండా కిటికీ దగ్గర నిలబడి ఫంక్షన్ చూస్తూ ఉంటారు.. ఫంక్షన్లో పద్మావతిని నీ లవ్ స్టోరీ చెప్పమని అరవింద అడుగుతుంది. పద్మావతి నేను ఒకరిని ప్రేమించాను అతను అంటే నాకు చాలా ఇష్టం అతను నా పక్కన అన్ని విషయాలు తోడుగా ఉంటాడు అని అంటుంది. అది ఎవరు అని అడుగుతుంది అరవింద.. పద్మావతి కిటికీ వైపు చూపించి అతని అని చెబుతుంది… ఇక రేపు చూడాలి పద్మావతి విక్కీ ని చూపించి చెప్పిందా, లేదా….