Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న ‘నువ్వు నేను ప్రేమ’ డైలీ సీరియల్ ఇప్పుడు 329 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Nuvvu Nenu Prema: విక్కీ ప్రేమని తెలుసుకున్న పద్మావతి.. మనసులో మాట బయట పెట్టనుందా…
గోరింటాకు ని చూసి మురిసిపోయిన అను :
పద్మావతి పరిస్థితులు ఎటు నుండి ఎటు దారి తీసి , మా అక్క పెళ్లి కి అడ్డం పడుతుందో అని భయంగా ఉందంటూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది. అను గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చూడండి అంటూ అరవింద అందరికీ చూపిస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు పద్మావతి, సూపర్ అక్కా!, మా బావ చాలా మంచి వాడు, అందుకే ఈ గోరింటాకు అంత ఎర్రగా పండినాది, ఇక నీ జీవితం కూడా ఇలాగే పండుటాది. ఇంత ఈ గోరింటాకు వేసింది మరెవరో కాదు, విక్రమాదిత్య గారే అని చెప్పగా, అప్పుడు అరవింద నిజామా, నీకు అంత తీరిక ఎక్కడిది రా, ఇంత బాగా వేశావు అని పొగుడుతుంది అరవింద. అలా మాట్లాడుకుంటూ ఉండగా రేపు సంగీత్ ఫెస్టివల్ ఉంది. ఈ సందర్భంగా చాలా పోటీలు ఉంటాయి , ఏర్పాట్లు చెయ్యాలని చెప్తుంది అరవింద.

పద్మావతి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా:
ఇక రేపు సంగీత్ లో జరగబొయ్యే డ్యాన్స్ పోటీలో ఎలా అయినా మేమే గెలవాలి అంటూ పద్మావతి ప్రతీ ఒక్క దేవతకి పూజలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె అత్త వచ్చి ఏమైంది నీకు అని అడగగా, రేపు జరగబొయ్యే డ్యాన్స్ పోటీలో ఎలా అయినా మనమే గెలవాలని అందరి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాని అంటుంది.పోటీలో గెలవాలంటే దేవుళ్ళకు మొక్కితే సరిపోదు,డ్యాన్స్ చెయ్యాలి అంటుంది అను.

మనల్ని మించిన డ్యాన్సర్ ఇక్కడ ఎవరు ఉన్నారు, షూటింగ్స్ లో ప్రభుదేవా చెప్పిన స్టెప్పులు ఎవ్వరూ వెయ్యలేకపోతే నేను వేసి చూపించిన, మొన్నీమధ్యనే సాయి పల్లవి ఒక స్టెప్పు వెయ్యడం మర్చిపోతే నేనే వేసి చూపించాను అని ఇలా డప్పు కొట్టుకుంటూ ఉంటుంది పద్మావతి. రేపు మనతో పోటీ పడే వాళ్ళు కూడా డ్యాన్స్ ఎలా వెయ్యబోతున్నారు అనేది తెలియాలి కదా, ఒక్కసారి ఆ ఇంటికి వెళ్లి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూసి వస్తా అని వెళ్తుంది పద్మావతి.

Nuvvu Nenu Prema: విక్కీ ప్రేమని తెలుసుకున్న పద్మావతి.. మనసులో మాట బయట పెట్టనుందా…
విక్రమాదిత్య చెంప పగులగొట్టిన పద్మావతి:
`పద్మావతి విక్రమాదిత్య ఇంటికి వస్తుంది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫారిన్ అబ్బాయిని చూసి ఈరోజు రాత్రి సంగీత్ లో ఎవరెవరు ఏ పాటకి డ్యాన్స్ వెయ్యబోతున్నారు అని అడుగుతుంది. ఎవ్వరూ ప్రాక్టీస్ చెయ్యడం లేదు, అందరూ నేరుగా స్టేజి మీదనే డ్యాన్స్ వేస్తారు అని చెప్తాడు. అప్పుడే ఒక దోమ పద్మావతి చెవిలో జోరీగ లాగ చేరి తెగ విసిగిస్తూ ఉంటుంది. దానిని పట్టుకొని చెంపే క్రమంలో తనని తాను మర్చిపోయి అడ్డుగా వచ్చిన విక్రమాదిత్య చెంప పగలగొడుతుంది పద్మావతి. అయ్యయ్యో చూసుకోకుండా కొట్టేసానే, మిమ్మల్ని కావాలని కొట్టలేదు, దోమని చంపే ప్రక్రియ లో పొరపాటున నా చెయ్యి మీకు తగిలింది అని అంటుంది పద్మావతి. అప్పుడు విక్రమాదిత్య కి కోపం వచ్చి, ఈరోజు ఎటువంటి సంగీత్ కార్యక్రమం జరగడంలేదు, పెళ్లి వరకు ఇలాంటివి ఏమి ఉండవు, కేవలం పెళ్లి మాత్రమే ఉంటుంది అంటూ కోపగించుకొని లోపలకు వెళ్ళిపోతాడు విక్రమాదిత్య. ఈరోజు సంగీత్ లో గొప్పగా కనిపించాలని స్పెషల్ మేకప్ కిట్ కూడా తెప్పించుకున్నాను, మొత్తం నాశనం చేసావు కదే అంటూ పద్మావతి పై మండిపడుతుంది కుచేలా.