Nuvvu Nenu Prema: అరవింద వాళ్ళ నాన్నమ్మ పద్మావతి వాళ్ళ ఇంటికి వెళతారు. భర్త వాళ్ళని చూసి సాదరంగా లోపలికి ఆహ్వానిస్తారు. ఇంట్లో అను ఆర్యలు సంతోషంగా ఉండటం లేదు అని చెబుతుంది. అందుకు కారణం పద్మావతిని మీరు యాక్సెప్ట్ చేయకపోడమే. ఒకే ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగి నవ దంపతులు ఇద్దరు సంతోషంగా లేకపోతే మేము కూడా సంతోషంగా ఉండలేము కదా.. అందుకే పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చామని అరవిందా అంటుంది. మీరు మీ కూతురుని యాక్సెప్ట్ చేస్తే వాళ్లు సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటామని అరవిందా అంటుంది. కానీ మీరు కోరుకున్నట్టు నేను చేయలేను అని ఆయన అంటారు 16 రోజుల పండగ సాంప్రదాయ బద్దంగా మీ ఇంట్లో జరగాలి. మీ ఇద్దరి కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళతో ఇక్కడే చేయండి అని అరవింద అడుగుతుంది..

Krishna Mukunda Murari: అలేఖ్యతో ముకుంద మాస్టర్ ప్లాన్.. కృష్ణకి పట్టాభిషేకం చేసిన భవాని..
కానీ భక్త అందుకు ఒప్పుకోడు. మేము ఇంత దూరం మీ ఇంటికి రావడానికి కారణం అదే మా నానమ్మ వచ్చినా కూడా మీరు మాకు గౌరవంగా లేనందుకు చేసినందుకు మాకు చాలా బాధగా ఉంది అని అంటుంది అరవింద. అంతలో అరవింద వాళ్ళ నానమ్మ నేను ఓ నిర్ణయం తీసుకుంటాను అది భవిష్యత్తులో మిమ్మల్ని బాధ పెట్టవచ్చు అని అంటుంది. ఆ మాటకు మిగతా వాళ్ళందరూ భక్తని ఒప్పిస్తారు. వాళ్ళ అక్క భక్తతో మాట్లాడగానే ఆయన సరే అంటాడు. మొత్తానికి అను పద్మావతి లను 16 రోజుల పండక్కి ఇంటికి తీసుకురావడానికి భక్త ఒప్పుకుంటాడు. సంతోషంగా అరవిందా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు.

విక్కీ రూమ్ లో ఏసీ బాగా పెంచుతాడు. పద్మావతి ఏసీ తగ్గించమని అడుగుతుంది. కానీ విక్కీ తగ్గించకుండా ఇంకా ఏసీ పెంచుతాడు .పద్మావతి కోపంగా చూస్తూ కింద పడుకుంటుంది. పద్మావతి నోటికి తాళం వేయాలని విక్కీ ఇంకాస్త ఏసి పెంచుతాడు. ఇక విక్కీ దగ్గర నుంచి ఏసీ రిమోట్ తీసుకుంటుంది పద్మావతి .ఆ రిమోట్ లాక్కోవడానికి విక్కీ ప్రయత్నిస్తాడు. మొత్తానికి విక్కీ రిమోట్ అయితే లాక్కుంటాడు. కానీ అందులో సెల్స్ మాత్రం పద్మావతి దగ్గర ఉంటాయి. ఇప్పుడు పెంచండి ఎలా ఏసి పెంచుతారో చూద్దాం అని పద్మావతి విక్కిని ఆట పట్టిస్తుంది

ఇద్దరూ అలా ఉండగా ఎవరో తలుపు డోర్ కొడతారు. అరవింద వాయిస్ గుర్తుపట్టిన వ్యక్తి గబగబా కింద ఉన్న పక్క దుప్పటి తీయమని చెబుతాడు. పద్మావతి కింద వేసిన దుప్పట్లు తీసి మంచం మీద పెడుతుంది .ఇక తను వెళ్లి తలుపు డోర్ తీస్తాడు అరవింద లోపలికి వచ్చి పద్మావతిని చూస్తుంది. ఏమైంది అక్క ఈ టైంలో వచ్చావు అని విక్కీ అడుగుతాడు. పద్మావతి నువ్వు ఈ ఇంట్లో బాధగా ఉన్నావు కదా, మీ నాన్న నీతో మాట్లాడటం లేదని అందుకే నీకోసం పొద్దున నేను నానమ్మ వెళ్లి మీ నాన్నని ఒప్పించాము. రేపు మీ నాన్న వచ్చి నిన్ను తీసుకు వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా నిన్ను మీ అక్కని మీ ఇంటికి తీసుకువెళ్లడంతో పాటు 16 రోజుల పండగ వాళ్ళింట్లో చేయడానికి కూడా ఆయన ఒప్పుకున్నారు అని చెబుతోంది. నిజమేనా మీరు చెప్పేది అని పద్మావతి అరవింద్ అని అడుగుతుంది. అవును అనడంతో సంతోషంగా పద్మావతి అరవింద బుగ్గ మీద ముద్దు పెడుతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని పద్మావతి అరవిందతో అంటుంది.

ఇక ఉదయం నిద్ర లేచి పద్మావతి గబగబా రెడీ అయి కిందకు వస్తుంది వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లాలా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు వంటగదిలో ఉన్నా అను పద్మావతి ను గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తీసుకువెళ్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది పద్మావతి. పద్మావతి అనుల ఆనందానికి కుచ్చుల తన మాటలతో కళ్ళం వేస్తుంది.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
రేపటి ఎపిసోడ్ లో పద్మావతి తనని విక్కీ బలవంతంగా మీ అక్క పెళ్లిని ఆపేస్తాను అని చెప్పి బెదిరించి చేసుకున్నాడు అని నిజం చెప్పేస్తుంది. అప్పుడు అరవింద విక్కీని నిలదియ్యగా, నేను అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందటే నీ భర్త కృష్ణ మనిషి కాదు రాక్షసుడు, పద్మావతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, అందుకే నేను ఇలా చేశాను అంటుంది. అప్పుడు అరవింద నీలాంటి నీచుడికి భార్య గా ఉండలేను అంటూ కత్తి తీసుకొని పొడుచుకుంటుంది. ఆమె నిజంగానే పొడుచుకుందా లేదా ఇదంతా కలనా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.