Nuvvu nenu prema: పద్మావతి కోసం అందరు వెయిట్ చేస్తారు.. అప్పుడే పద్మావతి విక్కీ ఇచ్చిన డ్రెస్సును వేసుకొని వస్తుంది.. ఇక అందరు తనని చూసి షాక్ అవుతారు.. విక్కీ పద్మావతి వచ్చిన తర్వాత విక్కీ వాళ్ల ప్రేమ గురించి అనౌన్స్ చేస్తాడు.. నేను పద్మావతి ప్రేమించుకుంటున్నాం.. పెళ్లి కూడా మీ అనుమతితో చేసుకోవాలని చెబుతాడు.. అందరు సంతోషంలో ఇక నాయుడు కూడా చాలా సంతోషం అంటాడు.. పద్మావతి, విక్కీల పెళ్లి జరుగుతుందని అంటాడు.. ఇది అంతా కృష్ణ కల కంటాడు.. ఎలాగైనా వీరిద్దరినీ కలవకుండా చెయ్యాలని అంటాడు.. ఇక అప్పుడే కుచల రండి కేకు కట్ చేద్దాం అని అంటుంది.. ఇక సిద్దు పద్దు రాలేదు అని అంటాడు. తను విఐపి ఏం కాదు అంటుంది.. దానికి అందరు అంటారు.. ఇక కృష్ణ నాకు అర్జెంట్ ఫోన్ కాల్ అని పక్కకు వెళ్తాడా.. ఇక పద్మావతి నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటుంది..

అప్పుడే కృష్ణ అక్కడకు వచ్చి పద్మావతి డ్రెస్సును కాలుస్తాడు.. పద్మావతి డాన్ని చూసి బాధ పడుతుంది.. విక్కీ ఆలోచిస్తాడా.. ఎందుకు పద్మావతి రాలేదు అని అనుకుంటాడు.. అప్పుడే పద్మావతి అక్కడకు అదే డ్రెస్సుతో వస్తుంది.. విక్కీ మాత్రం నేనంటే తనకు లెక్క లేదా, నేనంటే ప్రేమ లేదా అంటాడు.. ఇక అరవింద ఏమైంది పద్మావతిని అడుగుతుంది.. కుచల ఏం అవసరం లేదు అని అంటుంది.. కేకు కట్ చేస్తారు.. కృష్ణా మాత్రం చాలా హ్యాపిగా ఫీల్ అవుతాడు.. విక్కీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. నైట్ విక్కీ ఒక్కడే కూర్చొని బాధపడతాడు.. అది చూసిన పద్మావతి ఆయనకు నిజం చెప్పాలని వస్తుంది.. సారూ అంటుంది.. ఏం మాట్లాడతావు.. నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలిసి ఇలా చేసావా అని కోపంతో ఊగిపోతాడు.. ఎందుకు నా ప్రేమను కాదాన్నావు అంటాడు.. నేను మిమ్మల్ని ప్రేమించాలి.. మీరే ఊహించుకున్నారు.. అంటుంది పద్మావతి..

అయితే, నీ మనసులో ఎవరైనా ఉన్నారా.. అయితే చెప్పు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటాను.. సారూ నన్ను అర్థం చేసుకున్నావు అంటావు ఇదేనా.. అందరు మంచిగా ఉండాలని అనుకున్న అది నన్నే బాధపెడుతుంది అంటుంది.. నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని బాధపడుతూ వెళ్ళిపోతుంది.. అయితే అప్పుడే కృష్ణ వస్తాడు.. ఏంటి పద్మావతి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాదా ఏందీ.. ఇలాంటి వాడిని ప్రేమిస్తే అంతే అంటాడు..

Brahma Mudi: రాహుల్, స్వప్నల మ్యాటర్ రాజ్ కు తెలిసిపోతుందా? కోపంతో రగిలిపోతున్న రాజ్..
ఛీ నువ్వు ఇంకా మారవా.. నువ్వంటే ఎప్పటికి ఇష్టం లేదు.. నువ్వంటే నాకు అసహ్యం ఒక్కటే ఉంది. నీకు అర్థం కాలేదా అంటుంది.. ఇక అప్పుడే కృష్ణ పద్మావతిని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తాడు.. తరువాత ఎపిసోడ్ లో కృష్ణ అరవింద ను చంపాలని చూస్తాడు.. అందుకోసం సిమ్మింగ్ పూల్ లో కరెంట్ షాక్ పెట్టి అక్కడకు తీసుకెళ్లి తోయ్యాలని చూస్తాడు.. అప్పుడే పద్మావతి అక్కడకు వెళ్లి అరవిందను కాపాడి నీళ్లల్లో పడిపోతుంది.. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి..