Nuvvu Nenu Prema: పద్మావతి గబగబా రెడీ అయి కిందకు వస్తుంది. వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లాలా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు వంటగదిలో ఉన్నా అను పద్మావతి ను గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తీసుకువెళ్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది పద్మావతి. పద్మావతి అనుల ఆనందానికి కుచ్చుల తన మాటలతో కళ్ళం వేస్తుంది. కుచేల తన సూటిపోటి మాటలతో పద్మావతిని బాధపడుతూ ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకున్న అరవింద, వాళ్ళ నానమ్మ తన మాటలకు అడ్డుపడుతుంది. అలా మాట్లాడకుండా ఉండమని అందరూ కుచలను అంటారు.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
అసలు విక్కీ పద్మావతి ఎందుకు పెళ్లి చేసుకున్నారు మనకు తెలియాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి మరోసారి ఈ విషయంపై గొడవ చేస్తే మీరందరూ ఏం సమాధానం చెబుతారు అని కుచల అడుగుతుంది. ఈ పద్మావతినే మన విక్కిలి వలలో వేసుకుని పెళ్లి చేసుకొని ఉంటుంది అని కుచల అంటుంది. మరోవైపు కృష్ణ అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదన్న అనుమానం నాకు కలుగుతుంది అని అంటాడు. ఆ మాటకు విక్కి నేను నిజంగానే పద్మావతి మనలో తాళి కట్టాను అని విక్కీ అంటాడు. అయితే తనని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పమని అరవిందా అడుగుతుంది. మీరు సమాధానం చెబితేనే కదా వాళ్ళ అమ్మానాన్నలను మేము ఒప్పించడానికి వీలు పడుతుంది అని అరవిందా అంటుంది. కుచల అగ్నికి ఆహుతి పోసినట్టు ఇంకాస్త మాటలను మాట్లాడుతూ విక్కీ పద్మావతి లను రెచ్చగొడుతుంది. కచ్చితంగా ఈ పద్మావతినే ఏదో చేసి ఉండి ఉంటుంది అని అంటుంది. అయినా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నిన్ను మేం అందరం మాకు కూడా చేర్చుకున్నాం కదా పద్మావతి అసలు ఏం జరిగిందో చెప్పమని విక్కీ వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది.

Krishna Mukunda Murari: ముకుంద గుచ్చిన నల్లపూసలు కృష్ణ మెడలో వేసిన మురారి.. సూపర్ ట్విస్ట్..
విక్కీ వాళ్ళ నానమ్మ నీకోసం మేము ఎంతో చేశాము. కానీ నువ్వు ఈ పెళ్లి ఎలా జరిగిందో మాతో చెప్పడానికి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు అంటే మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని ఆమె అంటుంది. అయ్యో అలా ఏమీ లేదు అందరం బాగుండడమే నాకు కావాలి అని పద్మావతి అంటుంది. అయితే వీరిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పండి అంటూ కుచల అడుగు తుంది. అసలు ఏం గొప్ప చేసి మా వ్యక్తిని పెళ్లి చేసుకున్నావో చెప్పు అని కుచల నిలదీస్తుంది పద్మావతిని. అలా అనకండి అందులో ఏం కుట్రలేదు అని పద్మావతి అంటుంది. ఏం కుట్ర లేనప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పొచ్చు కదా అమ్మ ఎందుకు భయపడుతున్నారు అని విక్కి ఇవాళ బాబాయ్ కూడా అడుగుతాడు. చెప్పండి అసలు కారణం ఏంటి అని ఆర్య కూడా పద్మావతిని అడుగుతాడు. ఏయ్ మీ చెల్లెలే కదా నువ్వైనా చెప్పి అడుగు అని కుశల అనుని గట్టిగా అరుస్తుంది. మా ఇంటి క్షేమాన్ని బాబుని కోరుకునే వాళ్లయితే ఏం జరిగిందో చెప్పమని అడుగు అని అనూని నిలదీస్తుంది. అమ్మానాన్నల సంతోషాన్ని చూడాలని అనుకుంటున్నావు కదా అది నిజమైతే అసలు ఏం జరిగిందో చెప్పు అమ్మి అని పద్మావతిని అను అడుగుతుంది. అన్ని సమస్యలు సమసిపోయి సంతోషంగా ఉంటాము అనుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నావు కనీసం నాకైనా చెప్పు అమ్మ అని అను పద్మావతిని అడుగుతుంది.

నువ్వు ఇప్పుడు గనక ఈ విషయం చెప్పకపోతే ఈసారి నువ్వు శాశ్వతంగా అందరికీ దూరం అయిపోతావు అని అను పద్మావతి తో అంటుంది. నువ్వు నన్ను అక్క అని పిలవాలన్నా మన ఇంట్లో వాళ్ళందరూ నీతో బంధాలతో ఉండాలని అసలు ఈ పెళ్లి ఎందుకు జరిగిందో నువ్వు చెప్పాల్సిందే అని అను పద్మావతిని నిలదీస్తుంది. లేదు నేను చెబుతాను అని పద్మావతి పెదవి విప్పుతుంది.
పద్మావతి తనని విక్కీ బలవంతంగా మీ అక్క పెళ్లిని ఆపేస్తాను అని చెప్పి బెదిరించి చేసుకున్నాడు అని నిజం చెప్పేస్తుంది. ఇన్ని రోజులు నాలో నేను ఎంత బాధ పడుతున్నానో మీకు ఎవ్వరికీ తెలియదు అని పద్మావతి ఏడుస్తుంది. అప్పుడు అరవింద విక్కీని పిలిచి తన మీద ఒట్టు వేయించుకుని నిజం చెప్పమని అడుగుతుంది. నేను అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందటే నీ భర్త కృష్ణ మనిషి కాదు రాక్షసుడు, పద్మావతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, అందుకే నేను ఇలా చేశాను అంటాడు. అప్పుడు అరవింద కృష్ణ నీ పిలిచి నీలాంటి నీచుడికి భార్య గా ఉండలేను అంటూ కత్తి తీసుకొని పొడుచుకుంటుంది. ఆమె నిజంగానే పొడుచుకుందా లేదా ఇదంతా కలనా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

ఇక రేపటి ఎపిసోడ్ లో విక్కీ నీ పద్మావతి ఆట పట్టిస్తూ ఉంటుంది. నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను పదా త్వరగా రెడీ అవ్వు అని విక్కీ అంటాడు. నేను అక్కడికి రావాలి అంటే మనం ఇద్దరం ఆరు నెలల కోసమే ఈ పెళ్లి చేసుకున్నామని నువ్వు మా అమ్మ నాన్నలతో చెప్పాలని పద్మావతి కండిషన్ పెడుతుంది. ఇక ఆ కండిషన్కు విక్కీ ఒప్పుకుంటాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.