Nuvvu nenu prema: పద్మావతి డ్రెస్సు వేసుకొని రాలేదని విక్కీ కోపంగా ఉంటాడు.. నా ప్రేమ ఎందుకు అర్థం కావడం.. ఎందుకు నన్ను భాధపెడుతున్నావు.. అసలు నీ మనసులో నేను కాక ఎవరైనా ఉన్నారా?.. చెప్పు అని విక్కీ పదే పదే అడుగుతాడు.. కానీ పద్మావతి మాత్రం సారూ అర్థం చేసుకోవడం అంటే ఇదేనా.. నా మనసులో ఎవ్వరు లేరు.. నన్ను వదిలెయ్యండి అని వెళ్ళిపోతుంది.. ఇక ఎదురుగా కృష్ణ వస్తాడు.. చూడు పద్మావతి నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను.. ఈ డబ్బులు ఉన్న వాళ్లంతా ఇంతే నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను అని అంటాడు.. సిగ్గులేదా ఆ మాట అనడానికి.. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా.. చాలా ఏళ్లకు తల్లి కాబోతుంటే ఆ సంతోషం లేకుండా చేస్తావా అని చెంప పగలకొడుతుంది.. ఇక అరవింద ఉంటేనే కదా నువ్వు నన్ను కాదనేది లేకుంటే నన్ను పెళ్లి చేసుకుంటావ్ కదా అంటూ మళ్ళీ చెంప పగలకొడుతుంది..

ఇక ఆర్య, అను మాట్లాడుకుంటుంటే సిద్దు వీడియో తీస్తాడు.. అది లైవ్ అవుతుంది.. అందరు చూస్తారు.. ఆర్య, అను ల రొమాంటిక్ సీన్ అందరిని ఆకట్టుకుంటుంది.. అదే విధంగా ఒక్కొక్కరి గురించి చెబుతాడు.. ఇక విక్కీ గురించి కాస్త ఎమోషనల్ అవుతాడు.. అది కాస్త అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.. ఇకపోతే అను కూడా పద్మావతి గురించి చాలా ఎమోషనల్ అవుతుంది.. అలాగే విక్కీ కూడా పద్మావతిని అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా అంటాడు.. ఇకపోతే అను, ఆర్యల దగ్గరికి వెళ్లి అందరు అంటారు.. ఇక సిద్దు అప్పుడే రోకలి దంచుతుంది టిఫిన్ చేద్దాం పదండీ అంటూ వెళతారు..

ఇక కృష్ణ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చొని అరవింద ఉన్నంతవరకు నన్ను పద్మావతి పెళ్లి చేసుకోదు.. ఎలాగైనా పద్మావతినీ పెళ్లి చేసుకోవాలి అరవిందను చంపాలి అంటాడు.. అందుకోసం ఏదైనా భారీగా ప్లాన్ చెయ్యాలి అంటాడు.. ఇక స్విమ్మింగ్ పూల్ లో కరెంట్ షాక్ ఇచ్చి నీటిలో వేస్తాడు..

Brahma Mudi: రాహుల్, స్వప్నల మ్యాటర్ రాజ్ కు తెలిసిపోతుందా? కోపంతో రగిలిపోతున్న రాజ్..
అప్పుడే అరవింద ఏమండి అంటూ వస్తుంది.. ఈయన ఎక్కడికి వెళ్ళాడో భోజనం చెయ్యకుండా అంటుంది.. అప్పుడే కృష్ణ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండటం చూసి అక్కడకు వెళతాడు.. అయితే కృష్ణ అరవిందను రొమాంటిక్ గా చూస్తాడు.. కాసేపు తనను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.. ఎలాగైనా అడ్డు తొలగించుకుంటే పద్మావతి నాదే అనుకుంటాడు.. ఇక పద్మావతి అప్పుడే టాబ్లెట్ తీసుకొని వస్తుంది. వీళ్ళను చూసి ఆగిపోతుంది.. అరవిందను చంపాలని కృష్ణ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ డౌట్ పడుతుంది.. అరవింద గారు అని నీళ్లల్లో పడిపోతుంది.. విక్కీ అప్పుడే అక్కడకు వస్తాడు.. పద్మావతికి ఏమైందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..